Wednesday, 19 October 2011

నా స్థితి (MY STATE OF BEING)

  • నా జీవితం గురించి చెప్పాలంటే ఎవరో ఒకరి జీవతం గురించి చెప్పినట్లవుతుంది. ఇక్కడ బంధం, సెంటిమెం ట్, భావోద్యేగాలు నాకు ఉండవు. దీంతో నా గతం గురించిన సొంత అనుభూతులు,ఆలోచనలుదాస్తున్న ట్లు   ఉండడం వల్ల నీకు నా మీద తప్పుడు భావం పడుతుంది. నా స్థితి
  •  ప్రజలు  నన్ను భౌతికవాది అంటారు.నాస్తికుడని కూడా అంటారు. వాళ్లెటువంటి ముద్రలు వేసిన వాటిపై నాకేఆసక్తి లేదు.వాటి ప్రభావం నా మీద ఇసుమంత కూడా ఉండదు.ఏ విషయంలోనూ నిన్ను ఒప్పించడాని కి లేదా నా మాటలు  నెగ్గించుకోవడానికి ప్రయత్నించను.ప్రజలు వారికుండే సొంత కారణాలవల్ల నన్ను ఏదో చట్రంలో ఇమడ్చడానికి ప్రయత్నిస్తారు . నేను అతి సామన్యుడనని చెప్పినా నన్ను ప్రత్యేకంగా చూస్తారు.
    • నా ఆసక్తి అంతా ఇతరులు చెప్పినదాన్ని తోసేయడం కాదు. (అది చాలా సులభం ). నేను చెప్పిన దాన్ని  తోసేయడం . 

స్పూర్తి (INSPIRATION)

  • స్పూర్తి  అనేది అర్ధం లేనిది. పోగొట్టుకున్నవాళ్ళు , నిరాశామయులు `స్పూర్తి` కోసం  ఒక మార్కెట్ ను సృష్టించారు. స్పూర్తితో చేసే చర్యలన్నీ చివరికి నిన్ను , నీ స్వభావాన్ని ధ్వంసం చేస్తాయి.

Saturday, 15 October 2011

లైంగికత్వం (SEX)

  • సంరక్షించు కోవడం వల్ల లైంగిక శక్తిని నిన్ను నీవు ఏ విధంగాను అభివృద్ధి చేసులోలేవు. అది చాలా హాస్యాస్పదం. అర్ధం లేనిది. ఎందుకు దాని మిద అంత వత్తిడి పెడతారు. పరిత్య జించడం, ఇంద్రయ నిగ్రహం, బ్రహ్మ చర్యం...ఇవేమీ నీ సహజ స్థితికి సహాయం చేయవు. 
  • సెక్స్ మనిషి ప్రాధమిక అవసరం కాదా?. సెక్స్ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. సహజ స్థితిలో అక్కడ ఆలోచన నిర్మాణం ఉండదు. ఆ నిర్మాణం లేకపోతే సెక్స్ అసాధ్యం. ఈ దేహానిది మమూ లుగా చాలా శాంతియుతమైన నడక. నీవు ఇచ్చే విషయమే ఎక్కడ లేని  వత్తిడికి కారణం. అవి సంతోష క్షణాలుగా  అనుభుతిస్తావు,. నిజానికి అది దేహానికి బాధాకరమైంది. అలా అని అణిచివేత లేదాసెక్స్ ను ఉత్కర్ష్ణ పరిచే ప్రయత్నాల ద్వారానో  నీవు  సహజ స్థితికి రాలేవు. 
  • దేవుడి గురించి అలోచించి నంత కాలం సెక్స్ ఆలోచనలు ఉంటాయి. రాత్రి పుట స్త్రీ గురించి కల గనడం లేదా అని ఏ ఆధ్యాత్మికవాదినైన లేదా బ్రహ్మచర్యం  సాధన చేసే వారినైనా అడిగి నీవు తెలుసుకోవచ్చు.  దీని చుట్టూ అనేక నిషేధాలు, భావనలు ఎందుకు అల్లుకున్తున్నావు. ఎందుకు లైంగిక ఆనందాన్ని నాశనం చేస్తున్నావు. నేనేమి  దీన్ని అమోదించ మనో , లేదా విభేదించ మనో బోధించడం లేదు. కానీ పరిత్య జించడం  లేదా లేదా ఇంద్రియ నిగ్రహం ద్వారానో నీవు ఏమీ సాధించలేవు. 
  • మన చర్యలను ప్రశ్నించు కోవడం నిజంగా నైతిక సమస్య అయింది. మనకు కొత్త నైతిక ప్రవర్తన అవసరం. లేకపోతే మనం మనుగడ సాగించలేం. పాత నిబంధనలకు కాలం చెల్లింది. అరాచకంగా ఉంటున్నాం. వాటి శకం ముగిసింది. సెక్స్ ను ఎవరు  కేర్ చేస్తున్నారు. ఇప్పుడు చాల ఈజీ అయింది.
  • లైంగికానందం కోసం మనం చాలా పుస్తకాలు రాసుకున్నాం,. జాయ్ ఆఫ్ లివింగ్, కామసూత్ర .. ఇలా అనేక పుస్తకాలు రాసుకున్నాం ...మనలో ఆసక్తి కలిగించడానికి. ఏ సమయంలోనైనా లైంగికానందాన్ని పొందడం జంతువులకు సాధ్యం కాదు. దాని ప్రయోజనం పునరుత్పత్తి. ఇక్కడ ఉపయోగం కాదు. సహా జాతి పునరుత్పత్తి వాటి ఉద్దేశ్యం. వాటి విషయంలో ఆనంద క్షణాలు కాదు. నేనేమి ఆనందానికి వ్యతిరేకం కాదు. 
  • జీవరాశికి ఇది మామూలు విషయం. మత పెద్ద దాన్ని పెద్దది చేసి దాన్ని అదుపు చేసుకోవడానికి ఏకాగ్రత అవసరం అంటున్నాడు. మానసిక శాస్త్ర వేత్తలు దానికి   ఒక ప్రత్యేకతను ఆపాదించారు. సెక్స్ లో వ్యాపారాత్మక దోరణి జతకలిసింది. అది తగిన స్థానంలో ఉండడానికి ఎలా ఆలోచిస్తావు. నీవు చెబుతున్న ప్రేమ వ్యక్తి కరణలో నాకేమి  అర్ధం కనిపించడం లేదు . 
      • ప్రేమకు సెక్స్ కు ఏమాత్రం సంబంధం లేదనడం దారుణ మంటున్నావు. ప్రపంచమంతా సెక్స్ లేని  ప్రేమను పవిత్రతగా భావిస్తోంది అంటున్నావు. ఆ క్రమంలో ఉంచడం మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది. సెక్స్ కేవలం భౌతిక ప్రయోజనం కోసమేనని చెప్పడం వాస్తవంగా వినాశకర పరిస్థితి కాదు. దాని మానాన దాన్ని వదిలేస్తే ఏ మాత్రం ఇబ్బందికరం  కాదు. అది సరైన స్థానంలోనే ఉంటుంది. దేవుడు,  సత్యం, వాస్తవం అంటూ ... వీటన్నింటిని ఎందుకు కనుగొన్నాం . అవేవి పరమ సంతోషాన్ని ఇవ్వవు.  
  • ఇక్కడ, రష్యాలో మరెక్కడైనా సరే ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా సంతోషం లేకుండా ఉండకూడదు. పూర్తికాలం సంతోషంగా ఉండాలి . దుఖం లేకుండా సుఖం మాత్రమే ఉండాలి అని ప్రతి ఒక్కరు  కోరుకుంటారు. ఇది అసాధ్యం. కారణం  జివ  రాశులకు ఏది సుఖమో ఏది సంతోషమో తెలియదు. సుఖం శాశ్వితంగా ఉండాలనే కోరికే నిరాశా నిస్పృహలకు కారణం.

Friday, 7 October 2011

అభిప్రాయాలు (COMMENTS -2)

  • యూజీనీ, యూజీ బోధనలను  అర్ధం చేసుకోవడమంటే  నీ  అర చేతిలో గాలిని పట్టుకోవడమే. అయనా అవి సేద  తీరుస్తాయి. తాజా గాలిని , పరిమళాన్ని ఇస్తాయి. కారుచిచ్చులా నిన్ను ద హించి వేస్తాయి కుడా. నిస్సందేహంగా యూజీ బోధనలు , కారు మబ్బులా కమ్మిన  భ్రమల నుంచి మనలను భూమి మీదకు తీసుకువస్తాయి. దీంతో మనం తిరిగి ఘర్షణ లేని ,  వై రుద్యం లేని మామూలు జీవితం లోకి  వస్తాం. 
  • యూజీనీ, అతని జీవితాన్ని గురించి సంభాషించ కుండా అతని బోధనలు అంచనా వేయడం కష్టం. జీవించడం ... జివించ కుండా  ఉదాహరణగా చెప్పడానికి అతను ముందుంచిన సాధ్యాలు అనిశ్చితంగా ఉంటాయి.  తనకు ఏమి జరిగింది, తాను ఎలా జీవిస్తుంది తనకు తానుగా బోధనలుగా యూజీ నుంచి  వ్యక్తమౌతుంది. వాటి ప్రభావం లేకుండా, వాటితో  తనకు తాను సంబంధం లేకుండా యూజీ గురించి మాట్లాడడం, అధ్యయనం చేయడం  కష్టం. అయనప్పటికీ కొన్ని ప్రశ్నలకు సంబంధించి విస్మయాన్ని యూజీ బోధనలు పాఠకుడికి మిగులుస్తాయి. ఈ ప్రశ్నలకు  అక్కడ ఏ సమాధానం ఉండక పోవచ్చు. జివితమైనా అంతే... యూజీ దృష్టిలో అర్ధం చేసుకోవడం అసాధ్యం. 
  • నారాయణమూర్తి, రిటైర్డ్  ఫిలాసఫీ  టీచర్, యూ ఎస్

Thursday, 6 October 2011

పునర్జన్మ (RECORNATION)

  • పునర్జన్మ  లేదా కర్మను నేను వ్యతిరేకించడం  లేదు.  నేను నమ్మకం మూలాన్ని ప్రశ్నిస్తున్నాను . విశ్వసించే  వారికి పునర్జన్మ ఉంది. విశ్వ సించని  వారికి లేదు. గురుత్వాకర్షణ, లేదా ఇతర ప్రకృతి  సూత్రాల ప్రకారం అటువంటిది ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తే  లేదనే సమాధానం చెబుతాను. పునర్జన్మ  మీద నీకు నమ్మకం ఉందా లేదా అనేది విషయం కాదు. మనకు తరచుగా ఎదురయ్యే `పునర్జన్మ  ఏ మైనా ఉందా `అనే ప్రశ్నకు సమాధానం పొందాలంటే, ఆ సమస్యకు తెరపడాలంటే ఎవరికీ వారు తెలుసుకోవడానికి ఆసక్తి చూపాలి. పునర్జన్మ ఉందా? మనస్సు ఉందా? నేను ఉన్నానా ? ... ఇలా ఏ అంశాన్నైనా చుడండి. అదంతా కేవలం జ్ఞానం సృష్టి. నీవు అదృష్ట వశాత్తూ వీటన్నింటి తాలుకు మొత్తం జ్ఞానం నుంచి విముక్తి అయితే , ఏ మైనా కేంద్రం, నేను, ఆత్మ, స్వభావం అనే అనుభవం ఏ మైనా ఉంటుందా?. అందుకే `నేను` అనేది కేవలం  మొదట నామవాచకం. నాకు అక్కడ కేంద్రం లేదా ఆత్మా ఏ మీ కనిపించవు. అందువల్ల పునర్జన్మ అనే భావనంతా కేవలం నమ్మకాల పునాధి మీద నిర్మితమైంది. 
  • మనం ఈ రోజు అంతు లేని బాధలు, దారిద్ర్యం ఆకలి, హీనమైన పరిస్థితులలో ఉన్నాం . పునర్జన్మ పాపాలవల్లె  ఈ బాధలు అనే నమ్మకం ఈ పరిస్థితుల్లో మనకు సౌకర్యవంతంగా ఉటుంది. ఉన్న స్థితిని నేరుగా చూడకుండా ఈ నమ్మకం సేద తీరుస్తుంది. ఆధ్యాత్మిక , మరే విశ్వాసాలు కాని తోటి మనుషుల కు మనం ఏదో ఒకటి  చేయాలనే  తలంపుతో  చేసేదంతా అమానవీయ కార్యాలె. 
  • మరణం తర్వాత జీవితం కొనసాగాలి అనే  కోరిక నుంచే  పునర్జన్మ మీద విశ్వాసం వచ్చింది. మరణం  తరువాత ఏ మి జరుగుతుందనే కోరిక కుడా  ఈ మెకానిజం నుంచే వచ్చిందే.

Thursday, 22 September 2011

సమయం, స్థలం (TIME, SPACE)

  • సమయం, స్థలం అంటూ అక్కడ లేవు. అవన్నీ మేధోపరమైన భావనలు. అక్కడ పదార్థం (థింగ్) లేదా నీవంటున్ననాలుగు కొలతల స్థలం,( ఫోర్ డైమన్షన్ స్పేస్ ), సమయం కొనసాగడం(టైం కంటిన్యుఎషన్)  అంటూ ఏమి ఉండదు. ఈ స్థితి స్థలం, సమయం ప్రకారం నడవదు. ఎందుకంటే ఇక్కడ కొనసాగింపు ఉండదు. 
  • ఆలోచనే సమయం. ఆలోచన లేకపోతే సమయం ఉండదు. ఎక్కడ కేంద్రం ఉండదో అక్కడ స్పేస్, స్థలం ఉండదు . ఎక్కడ కేంద్రం ఉండదో అక్కడ మొత్తంలో నీవు భాగస్వామివి అవుతావు. ఇది ప్రతి దాన్ని కదిలిస్తుంటుంది. దీంట్లో మార్మికమైన అర్ధం లేదు.

ప్రశ్నలే లేవు (NO QUESTIONS)

  • నీ సమస్యలన్నీ కొనసాగుతుంటాయి. కారణం తప్పుడు పరిష్కారాలను కనుగొన్నావు. అక్కడ సమాధానాలు లేకపోతే ప్రశ్నలే ఉండవు. అవి ఒక దానిమీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. తత్వవేతలు, రాజకియవేత్తలు, సైకాలజిస్టులు, ఆద్యాత్మిక గురువులు అనేక పరిష్కారాలు చూపారు. అవి సమాధానాలు కాదు. అది మనకు స్పష్టమైంది. ఆ పరిష్కరాల్లో  నిర్దిష్టత ఉంటే సమస్యలే ఉండవు. 
  • మన ప్రశ్నలన్నీ మన లక్ష్యాలు , నమ్మకాలు, తలంపులు, జ్ఞాపకాల నుంచే వస్తాయి. వాస్తవ స్థితి నుంచి కాదు. ఇక్కడ నీవు స్వేచ్చను పొందవలసి ఉంది. 

Wednesday, 14 September 2011

సంబంధం (RELATIONSHIP)

  • నీ చుట్టూ ఉన్న దానితో, నీ దగ్గర సమీపంలోని వారితో నీవు అనుకున్నట్టుగా సంబంధాన్ని ఏర్పరచు కోవ డం సాధ్యం కాదు. మన చుట్టూ జీవితం నుంచి, మానవాళి నుంచి విడిపోయాం. వేరుపడి పోయాం. ఇతర సృ ష్టి నుంచి మనం  విడిపోయాం. మనం ఏవరికి వారు ప్రత్యేక చట్రంలో జీవిస్తున్నాం. సంబంధాల కోసం ప్రయ త్నిస్తున్నాం. దీన్ని ఎవరో పూరించాలనుకుంటున్నాం. ఫలితంగా మనం విడిపోతు న్నాం.  ఈ ఖాళీ ని నింప డం కోసం మన చుట్టూ ఉన్న ప్రజలు అన్ని రకాల సంబంధాల  కోసం సర్వదా  ప్ర యత్ని స్తుంటారు. ఇది నిజం గా  పెద్ద సమస్య. ఇతరులతో సంబధాల కోసం అన్ని రకాల అస్త్రాలు ఉపయోగిస్తాం. సంబంధాలు లేకపోతే నష్టపోతాం. అర్ధం, పరమార్ధం కనబడదు. సంబంధం
  • అర్ధవంతమైన, ప్రయోజనపుర్వకమైన సంబంధాల కోసం ఆసక్తి ప్రదర్శిస్తుంటాం. అందువల్ల వాస్తవ ప్రపంచా న్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది.కాని అర్ధం చేసుకోవడానికి   ఏమీ లేదు. వాస్తవం అంటూ ఏమీ లేదు. వాస్తవ ప్రపంచం అంటూ నేను అంగీకరిచడం అంటే అది సమాజం నన్ను నిర్దేశింహిందే.నిన్ను స్త్రీ అనో, పురుషుడనో, అది బెంచీ, ట్రే అనో చెబుతాను. అంతకుమించి ఈ ప్రపంచంలో వివేకంతో, తెలివితో నడవలేను. వాస్తవ ప్రపం చాన్ని అర్ధం చేసుకోవడమంటే అర్ధంకోసమో, సహాయం కోసమో, ప్రయోజనం కోసమో కాకుండా ఉండాలి.
  • మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మనం విడిగా లేం. ఇదంతా ఒకే సమాహారం. చైతన్యం, ఆత్మ అంటూ మొత్తం నుంచి విడిపోయాం.

Tuesday, 13 September 2011

నిస్వార్థం (SELFLESS)

  • నేను నిస్వార్ధంగా  ఉండాలి అనుకొంటావు. ఎప్పుడు ...రేపు...తర్వాత రోజు, అంటే తర్వాత జీవితంలో... కాని ఈ రోజే,ఇప్పుడే బయటపడటం ఎందుకు సాధ్యపడటం లేదు.నిజంగా స్వార్ధం నుంచి బయట పడాల నుకొంటు న్నావా?  కానప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడతావు.   స్వార్ధం లేని స్థితి, ప్రశాంతత అనేది చెప్పుకోవడానికే దాని విలువ. నేను చెప్పడం లేదు నివు స్వార్థ పరుడవని. దానికి వ్యతిరేకంగా నీవు ఆలో చిస్తున్న `స్వార్థరహిత స్థితి`కూడా అర్ద్థం లేనిదే.ధ్యానం ద్వారా స్వార్ధాన్ని అంత మొందించాలనుకొంటావు.  నిజాని కి ధ్యా నం ఏమీ లేదు.స్వార్థరహిత  స్థితి  గురించి ఆలోచనే తప్ప.ఇందుకు నీవు చేసేదేమీ లేదు. స్వా ర్ధం నుంచి స్వేచ్చను పొందాలను కోవడం లేదనే పచ్చి నిజాన్ని నీవు అంగీకరించి తీరాలి.ఆలోచనలను అణుచుకోవడం, అదుపు చేయడంలోనే నీ శక్తంతా నిర్విర్యమైపోతుంది. నీ ఆకాంక్ష ఏదైనా నీ శిక్షణ,నీ ఉపా యాలు,అన్వేషణకు నీ శక్తినంతా ధారపో స్తావు. జీవించడానికి అవసరమైన శక్తిని కోల్పోతావు.జీతానికి అర్ధం వెతకడం ఒక వ్యసనంగా,ఒక వేదనగా మారు తుంది.
    • నిస్వార్థంగా ఒకటి చేయలనుకున్నంత కాలం నీకు నీవు కేంద్రంగా తయరవుతావు. 

Sunday, 11 September 2011

అర్ధంచేసుకోవడం (UNDERSTANDING)

  • అర్ధవంతమైన, ప్రయొజనపూర్వకమైన సంబధాలకోసం ఆసక్తి ప్రదర్సిస్తుంటాం. అందు వల్ల వాస్తవ ప్రపం చాన్నిఅర్ధం చేసుకోవాల్సి ఉంది.కాని అర్ధం చేసుకోవడానికి ఏమీ లేదు. వాస్తవం అంటూ ఏమీ లేదు. వాస్త వ ప్రపంచమంటూ నేను అంగీకరించడం అంటే అది సమాజం నన్ను నిర్దేసించిందే.వాస్తవ జగత్తును అర్ధం చేసుకోవడమంటే అర్ధం కోసమో, సహాయం, ప్రయోజనం కోసమో కాకుండా ఉండాలి.
  • నిన్ను నీవు అర్ధంచేసుకోవడం అనేది అతి పెద్ద జోక్స్ లో  ఒకటి . ఆధ్యాత్మిక మనిషి , సనాతన జ్ఞానులే కాకుండా ఆధునిక శాస్త్రవేత్తలు కుడా ఈ భావనకు అగ్ర స్థానం వేసారు.ఇక మానసిక శస్త్ర వేత్తలు అయితే ఆత్మ జ్ఞానం, స్వీయ వాస్తవికత, ఏ  క్షణానికి ఆ క్షణం జీవించడం ...ఇలా చెత్తను  మాట్లాడడానికి  ఎంతో ఇష్టపడ తారు .
  • మనిద్దరి  మధ్య ఏమైనా భావప్రసారం ఉందా? మనం దాన్ని పెంచి పోషిస్తున్నామా?  భావప్రసారాన్ని ఒక సాధనంగా ఇద్దరం ఉపయోగించు కుంటున్నాం  అంతే.అర్ధం చేసుకోవడం అసాధ్యం. నా ప్రతి మాట నీ జ్ఞాన చట్రంలో అనువాదమై పోతుంది . నేను చెప్పేది నీకు రిఫరెన్సు పాయింట్ అవుతుంది.

    సంగీతం కవిత్వం, కళలు (MUSIC,POETRY, ARTS)

    • సంగీతం  కవిత్వం, భాషను కీర్తించడం అనేదంతా నాగరికత నిర్దేసించిందే. ఇదంతా ఆలోచన సృష్టి. ఇది తెచ్చి పెట్టుకున్న అభిరుచి. పిల్లి కూతలకంటే బెతోవిన్ తొమ్మిదో సింఫనీ అత్యంత సుందరంగా ఉంటుందని అది నీకు చెబుతుంది. రెండూ ఒకే రకమైన సంచలనాలు కలిగిస్తాయి.
    • అత్యంత ప్రముఖులైన సంగీతకారులు, గాయకులకంటే కుక్కల అరుపుల పల్లవిలో ఎంతో జీవం ఉంటుంది.

    Saturday, 10 September 2011

    అమెరికా

    •   అమెరికా అంతటా అంత్రాక్స్  దాడుల భయం చుట్టుముట్టింది. ఈ నిజాన్ని  తోక్కిపెట్టేందుకు అన్ని చర్యలు తిసుకుంటోంది. అమెరికన్లు ఉన్మాదులు అని చెప్పడం అంటే ఇంకా గౌరవంగా మాట్లాడినట్లవుతుంది. `శాశ్విత మైన స్వేచ్చ` కోసం పోరాటం చేస్తున్నానని ఈ  దేశం చెప్పే మాటలు ఇక్కడ వర్తించవు. ఇది వీర భూమి కాదు. ఇది స్వేచ్చగా ఉండే వాళ్ళ ఇల్లుకాదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పోలీస్ స్టేట్ గా  మా రింది.  సాధ్యమైనంత  వరకు ఒక్క వారంలో ఇక్కడ నుంచి బయటపడతాను.తర్వాత ఎక్కడికి వెళతానో తెలి యదు. ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను. భారత దేశంలో అడుగు పెట్టను. ఎందుకో మీకు తెలుసు. మీరు అమెరికాకు ద్వారాలు తెరిచారు. వాళ్ళు  పాకిస్తాన్లో   అంతర్యుద్ధం మొదలుపెట్టారు. తర్వాత కాశ్మీర్ ని మధ్య ప్రాచ్యంగా చేస్తారు. మీరు గర్వపడే మీ గొప్ప వారసత్వం సృస్టించిన వెన్నుముక లేని నాయకులకు పశ్చిమ దేశాలను `వెళ్ళిపొండి` అనే దమ్ము లేదు. 
     అమెరికా నుంచి  mahesh భట్ తో ఫోన్లో

    Saturday, 3 September 2011

    గురువులు, ఆధ్యాత్మిక వ్యాపారం (GURUS - HOLY BUSINESS)

    •  మొత్తం అధ్యాత్మిక వ్యాపారమంతా నైతిక ప్రవర్తన తప్ప మరేమీ లేదు. ప్రవర్తన ప్రణాళికను సమాజం  తన ప్రయోజనాలకోసం నిర్దేశిస్తుంది. మతానిది కుడా ఇదే దారి. నీలో అదుపు కోసం పూజారిని నియమిస్తుంది. బయట పోలిస్ మాన్  సంస్తాగతమయ్యాడు అలా.
    •   జ్ఞానం కోసం, ఆత్మ చైతన్యం కోసం ఎంతో చదివి జీవితాన్ని అంకితం చేశారనే వారి మీద ఆధారపడటం అనివార్యమైంది. వారు చెబుతున్న తత్వాలను దేహానికి ఉన్న వాస్తవ జ్ఞానంతో పోల్చలేవు.ఈ శరీరం అత్యం త తెలివైంది. ఈ దేహం ఉనికిని తాజాగా ఉంచడానికి శాస్త్రీయమైన లేదా వేదాంతపరమైన బోధనలు యేమీ  అవసరం లేదు. వారివి కేవలం మాటలు. ఏమాత్రం నిర్దిష్టత ఉండదు. గుడ్డి నమ్మకాలు. గురువులు, మత గ్రంధాలు చెప్పేదాన్ని నీవు చాలా తెలివిగా హేతుబద్దం చేస్తావు. నీ నమ్మకాల ఫలితమే ఆధిపత్యాన్ని గుడ్డిగా అంగీకరించడం. ఇదంతా రెండో తరగతి జ్ఞానం. నీ నమ్మకాల నుంచి నీవు విడిగా లేవు. నీ నమ్మకాలు, నీ  భ్రమలు తొలిగితే నీవు మిగలవు. 
    •      నీ మేడిటేషన్లు, సాధనలు, పద్దతులు, చిట్కాలు అన్ని అర్ధం లేనివి. వాటన్నిటి అర్ధం నీలో మార్పు తీసుకురావడం. అసలు పరివర్తన, మార్పే లేదు. అక్కడ మార్పుందని అంగీకరించడం నీ విశ్వాసం. అసలు ఎవరు మారాలనేది నీవు ఎప్పుడూ ప్రశ్నించవు.నీలో పరివర్తన కోసం రూపుదిద్దుకున్న భావనే మొత్తం `మిస్టిక్ ఆఫ్ ఎనలైట్ మెంట్`.
    •   వాళ్ళు నిన్ను హెచ్చరిస్తుంటారు. బాగా కష్టపడాలి.అధ్యయనం చేయాలి.ధ్యానం చేయాలి అంటూ నిర్దేసి స్తుంటారు. టీచరు, గురువు, నాయకుడు ...వాళ్ళు చూపేవి తప్పుడు మార్గాలు. అతడే నిజాయతీగా పనిచే యడు. చవక రకం ,నాశిరకం వస్తువులను అమ్ముకొంటూ తనను తానే అమ్ముకొంటాడు.వీరి మీద నీ ఆశలు తోసేయగలిగితే వాళ్ళు నీ దగ్గర ఈ వ్యాపారం చేయరు. 
    •      ధ్యానం ఒక యుద్ధం. యుద్ధం ముగిసిన తర్వాత శాంతి లభిస్తుందని స్వాములు వాగ్దానం చేస్తారు. నీకు కేవలం బాధాకరమైన అనుభవమే మిగులుతుంది.మెడిటేషన్ మోక్షం అనే లక్ష్యమే గాకుండా సాంస్కృతిక చట్రంలో నిన్ను బందీని చేస్తారు. చివరకు పొందేదేమీ లేదు.బాధ తప్ప.చిత్రమైన అనుభవాన్ని పొందితే పొంద వచ్చు. అది నీకయినా మరేవరికయినా  విలువయింది కాదు. 
    •      నీ ఆలోచనలు వలె నీ కోరికలు ...ఏమైనా సరే అదుపు చేయాలి, అణిచివేయాలి. పవిత్రుడిగా ఔన్యత్యాన్ని అందుకోవాలి.నరకప్రాయమైన ఈ స్థితిని కోరిక లేని స్థితిగా పిలుస్తావు .ఎందుకోసం ఇదంతా.నేను ఖచ్చితం గా చెప్పగలను. నీకు కోరిక లేకపోతే నిన్ను శవంగా భావించి శ్మశానానికి తరలిస్తారు.
    • ఆధ్యాత్మికం, మతం పొల్యూషన్ కంటే వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదం కాదు.ఇది ప్రపంచాన్ని చుట్టిన భయంకరమైన అంటు రోగం.
    • ఈ ప్రపంచంలో సంక్షోభానికి గురువుల బోధనలే  కారణం.  ఈ బోధకులందరూ చేసింది ఏమీ లేదు.గందరగో ళం తప్ప.ఈ సంస్కృతికి రాజకీయ నాయకులు వారసులు. వీరిని దుర్నీతిపరులని నిందించి ప్రయోజనం లేదు.మత  గురువులు దుర్నీతిపరులు. ప్రేమను ఎవరు బోధిస్తారో ఆ మనిషి ఈదుర్నీ తికి కారణం.ఎందు కం టే మనవ చైతన్యంలో అతడు  విభజనను సృస్టించాడు. ప్రపంచంలో ఈ రోజున్న భీబచ్చానికి  ఈ మనిషి చెబుతున్న`నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు` అనే సూక్తే కారణం.ఈగురు వులనువదలొద్దు.  వీరి భోదన లు ఏమీ చేయలేవు. కాని ప్రపంచంలో గందరగోళాన్ని తీసుకువచ్చాయి .కేవలం మనుషులను నాశనం చేసే దిశలో ముందడుగు వేయడం కాదు.ఈ రోజు ఈ ప్లానెట్ మీద ఉన్న ప్రతి జీవిని నాశనం చేస్తున్నా యి.
      • నీకు నీ అనుయాయులకు  మనిషి భవష్యత్తు గురించి ఏమాత్రం ఆసక్తి లేదు. కేవలం మీకున్న కొన్ని దగ్గరి లక్ష్యాలు ఎరవేర్చు కోవడం కోసమే ...ఇదంతా  కేవలం ఒక తంతు. మానవాళి , ప్రేమ అంటూ గంటలు గంటలు మాట్లాడుతుంటారు. నీకు నిజంగా ఆసక్తి ఉందా? మానవాళి భవిష్యత్తుపై శ్రద్ధ ఉందా? కోపోద్రేకమైన నీ వ్యక్తిత్వం, నిష్కపటం, శ్రద్ధ అర్ధం లేనివి. అదంతా ఒక కర్మకాండ . నీవు కూర్చో... మాట్లాడు... అంతే  ఆవేశ పడొద్దు. ఆవేశ పడితే ప్రశ్నించ లేవు . నీ గురించి కుడా. కూర్చో. కోపం గురించి నిరంతరాయంగా మాట్లాడుతుంటారు. దేహం పని అయిపోయింది.  కోపాన్ని అది తీసుకుంది. దాన్ని చాలా ఎక్కువగా తీసు కుంటున్నావు. అది నిన్ను ఒత్తిడికి లోను చేస్తే స్వాముల దగ్గరకు వెళ్లొద్దు. మాత్రలు వేసుకో... ఏమైనా  చేయి. ఆ పవిత్రమైన, పరిశుద్దమైన వ్యాపారం నీకేమీ సహాయపడదు. సమయం వృధా చేసుకోవద్దు. 
      • మామూలు అర్థంలో హిందూఇజం మతం కాదు. ఇదంతా కలగాపులగం. అనేక విషయాల కలయిక. వందలాది దుకాణాలున్న బజారు లాంటిది. 

    Thursday, 1 September 2011

    సంతోషం (HAPPYNESS)

    •     ప్రపంచంలో మనుగడకు ఆలోచన అనివార్యం. అయితే మన ఎదురుగా ఉన్న లక్ష్యాలను సాధించడానికి అది ఏ మాత్రం మనకు సహాయపడదు. ఆలోచన ద్వారా లక్ష్యాలను సాధించడం అసాధ్యం. నీవు చెబుతున్న సంతోషం అనే దాని కోసం నీవు చేసే శోధన కూడా అసాధ్యం.ఎందుకంటే అక్కడ శాశ్విత ఆనందం అంటూ ఏమీ లేదు. అక్కడ ఉన్నదంతా ఆనంద క్షణాలు, సంతోషం లేని క్షణాలు. శాశ్వత ఆనందం అనే స్థితి నీ  దేహానికి శత్రువు. ఇంద్రియాల స్థితి (పర్సెప్షన్)ని, నరాల వ్యవస్థను సునిశితంగా ఉంచడానికే ఈ శరీరం ఆశక్తి చూపి స్తుంది. అది ఈదేహం అస్తిత్వానికి తప్పనిసరి. శాశ్విత ఆనందం అనే అసాధ్యమైన  లక్ష్యాన్ని సాధించేందుకు ఆలోచననే ఆయుధాన్ని ప్రయోగిస్తే ఈ శరీరానికి ఉండే సునిసితత్వం ధ్వంసమౌతుంది. మనకు ఆసక్తి కరమైన  శాశ్వత ఆనందం, శాశ్వత సుఖం అనే  వాటిని ఈ దేహం  తోసేస్తుంది. ఇందు కోసం మనం చేసే ప్రయత్నం ఏదీ సఫలం కాదు. 
    •   నా ప్రత్యేకమైన ఆనందం కోసమే ఈ విశ్వమంతా రూపుదిద్దుకుంది అనే మనిషి నిశ్చితాభిప్రాయమే మొత్తం సమస్యకు నాంది అవుతుంది.  అవరోధాలు లేని సంతోషం , ఆనందానికి అత్యున్నతదశ దేవుడు ...అటువంటి వి ఉనికిలో లేవు. ఉనికిలో లేనిది కోరుకోవడమే నీ సమస్యకు మూలం. పరివర్తన, మోక్షం , స్వేచ్చ ...ఇవన్నీ భిన్నమైనప్పటికి ఒకే చట్రంలోకి వస్తాయి. 
    • నీవు అనుకుంటున్న శాశ్విత ఆనందాన్ని దేహం మాత్రం తీసుకోదు. ఉదాహరణకు లైంగికానందం అనేది సహజంగా తాత్కాలికమైంది. దీర్ఘకాలికంగా, నిరంతరాయంగా అనుభూతి చెందలేదు. శాశ్విత ఆనందమంటూ శరీరం మీద ప్రయోగిస్తే తీవ్రమైన మానసికమైన సమస్యలు తలెత్తుతాయి. 
    • సంతోషం అనేది నాగరికత సృష్టి. అటువంటిది ఏదైనా ఉందా అంటే ...నేను లేదంటాను. సంతోషం కోసం  నీ  అన్వేషణ నాగరికతలో నుంచి వచ్చిందే. ప్రపంచంలో ఎక్కడైనా ఇది మామూలు కోరికగా ఉనికిలో ఉన్న విషయమని మనకు తెలుసు. మానవాళికి ఇది ప్రధానమైన కోరిక. సతోషం... ఈ పదాన్ని మీరు ఉపయోగించడమంటే  ఇంత కంటే వేరే సంచలనం ఉండదు. ఆ క్షణంలో నీ  ఆలోచన  మనం సంతోషం అనుకుంటున్న సంచలనం నుంచి విడిపోతుంది. తన సహజస్థితి కంటే ఎక్కువ సమయం ఆ సంచలనాన్ని నిలుపుకోవాలనే డిమాండ్ కుడా దాంతో ఉటుంది. ఈ దేహం మాత్రం ఎటువంటి సంచలనా న్నైనా, ఎంత ప్రత్యేకమైన  కోరిక నైనా తిరస్కరిస్తుంది. ఆ సంచల నాన్ని సుదీర్ఘ కాలం ఉంచుకోవాలనే భావన  నీకున్న జీవితాన్ని, సునిసితత్వాన్ని నాశనం చేస్తుంది. సంతోషం అంటే తెలియకపోతే ఎప్పుడూ సంతోషం లేకుండా ఉండవు .

    కార్యకారణసంబధం(CAUSE AND EFFECT)

    •        `కార్యకారణసంబధం` అనే సూత్రీకరణ ప్రకారం ప్రతి ఆలోచన లేదా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అది తక్షణంలో కాకపోయినా ఆ తర్వాతయినా ఉంటుంది  అంటాం. కార్యకారణసంబధం అనేభావన ఆలోచన (సంస్కృతి)  సృష్టి. అసలు కారణం అనేది ఎక్కడా ఉండకపోచ్చు. ప్రతిసంఘటన పత్యేకమైంది. స్వతంత్రమైంది. అయితే ప్రతి సంఘటనను మనం కలుపుతూ మన జీవితానికి అన్వయించుకుంటాం. కథను అల్లుకుంటాం. నిజానికి ప్రతి సంఘటన స్వతంత్రంమయింది. మనం దీన్ని అంగీకరిస్తే మన గుర్తింపునకు ఎక్కడలేని సమస్య వచ్చి పడుతుంది. మన జీవితాల్లో గుర్తింపు అనేది ప్రధానమైంది. నిరంతరాయం జ్ఞాపకాలను తవ్వుకుంటూ గుర్తింపును నిలుపుకుంటూ ఉంటాం. ఇదికూడా ఆలోచనే. ఈ గుర్తింపు, లేదా జ్ఞాపకం ఏదయినా అనండి.వీటి లౌల్యంలో పడి ఎక్కడలేని శక్తులన్నింటిని నిర్వీర్యం చేసుకుంటుంటాం.జీవన సమస్యలను ఎదుర్కోవడానికి అక్కడ ఏమాత్రం శక్తి ఉండదు. ఈ గుర్తింపు నుంచి స్వేచ్చను పొందే మార్గం ఏదయినా ఉందా?  నేను చెప్పేది ప్రధానంగా ఆలోచనే సమస్యలను సృష్టిస్తుంది. వాటి పరిష్కారానికి మనకు సహాయ పడదు. ఆలోచనకు సంబంధించిన గతితార్కిక ఆలోచన కూడా మన ఆయుధాన్ని పదునెక్కిస్తుంటుంది. అన్ని తత్వాలు చేసే పని కూడా ఇదే.

      Tuesday, 30 August 2011

      దేహం (BODY)

      •      జీవితం, మరణం, స్వేచ్చ గురించి మీరు  కల్పించుకున్న మహోన్నత భావాలను తోసేయండి. అప్పుడు ఈ దేహం యధా స్థితిలో ఉంటుంది. సామరస్యతతో పనిచేస్తుంది. దానికి నీ సహాయం ఏమీ అవసరం లేదు. నీవు ఏమీ చేయొద్దు . శాశ్వితత్వం, పునర్జన్మ, మరణం గురించి... ఇలా ఎప్పుడూ పనికిమాలిన, బుద్దితక్కువ ప్రశ్నలు వేయొద్దు. శరీరం శాశ్వితమైంది. మరణించినా రూపం మారుతుంది . తర్వాత జీవితం,  శాశ్వితత్వం వంటివి  శరీరానికి పట్టవు. శాశ్వితత్వం కోసం పరితపించే ఆలోచనే శరీరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దృష్టిని చెదరగొడుతుంది. 
      •      ఈ దేహానికి ఏది మంచిదో తెలుసనుంటాం. అదే మనకు సమస్యలను సృష్టిస్తోంది. దేహానికి తెలుసు దానికి   ఏమి  కావాలో. ఈ మామూలు సంబంధం  మనకు అర్ధమైతే దేహం దాని మానాన అది ఉండటానికి ఆమో దిస్తాం . నెప్పి ఉన్నా డాక్టర్ దగ్గరకు వెళ్ళకూడదనే క్రైస్తవ సన్యాసులు  భావిస్తున్నట్లు నేను చెప్పడం లేదు. 
      •     ఈ దేహానికి నీ ధ్యానం చిట్కాలు ఏమీ అవసరం లేదు. నిజానికి అవి ప్రశాంతతను చెడగొడతాయి. ప్రశాంతత ఆల్ రెడీ అక్కడ ఉంది. ఇది ఒక అపూర్వమైన ప్రాణి (అర్గానిజం). ప్రశాంతంగా ఉండేందుకు ఈ దేహానికి ఏమీ అవసరం లేదు.
      •      జ్ఞానం కోసం, అత్మచైతన్యం  కోసం ఎంతో చదివి జీవితాన్ని అంకితం చేసారనే వారి మీద ఆధారపడటం అనివార్యమైంది. వారు చెబుతున్న తత్వాలకు దేహానికి ఉన్న వాస్తవ జ్ఞానంతో పోల్చలేవు. వాళ్ళు చెబు తున్న మానసికమైన, భావోద్వేగమైన, ఆత్మ సంబంధమైన కార్యకలాపాలన్నీ ఏకోన్ముఖంగా సాగు తుం టాయి. 
      •  ఈ శరీరం అత్యంత తెలివైంది. ఈ దేహం ఉనికిని తాజాగా  ఉంచడానికి శాస్త్రీయమైన, లేదా వేదాంతపరమైన బోధనలు ఏమీ అవసరం లేదు.
      •    దానంతటది తాజాగా ఉండటానికి ఈ దేహానికి అత్యద్బుతమైన నడక ఉంది. ఇది తప్పనిసరి. ఎందుకంటే ఇంద్రియాలన్నీ  ఎప్పుడూ సజ స్థితిలో సునిసితత్వంతో పని చేస్తుంటాయి. 
      • .            `నేను` లేకుండా ఈ దేహాన్ని ఏమని పిలుస్తావు. ఇది కేవలం దేహం. కాని ఇది భిన్నమైన దేహం. దీని పనితీరు భిన్నమైన మార్గంలో ఉంటుంది. భిన్నమైన శక్తిని కలిగివుంటుంది. నైతిక జీవితానికి సంబంధించిన వత్తిళ్ళు పోతాయి. అంటే దీనర్థం నీవు చేసే నైతిక చర్యలు అపసవ్య మైనవో, మరొకటో  కాదు. నీకు సమాజంతో ఘర్షణలు ఉండవు. ఎందుకంటే నీ లోపల ఘర్షణ లేదు. ఆలోచిస్తే అటువంటి  వ్యక్తి నుంచి  ప్రేమ, కరుణ, దయ ప్రవహిస్తుంటాయి.
      •   దేహం నుంచి మనస్సును వేరు చేయలేవు. మనస్సు కేవలం మానసికమైన కార్యకలాపాలకే  పరిమితం కాదు. ప్రతి కణంలో ఆలోచన ఉంది. నీ దేహంలోని ప్రతికణంలో `నేను ` భావం   పని చేస్తుంటుంది. వేరు చేయడం అంత  సులభం కాదు

      దారి లేదు (NO WAY)

      •  నేను ఏ మార్గాన్ని  సూచించడం లేదు. ఎందుకంటే అక్కడ దారి లేదు. నేను ఈ స్థితిలోకి కాలుజారిపడి ఇతరుల మార్గాల నుంచి స్వేచ్చను పొందాను. 
      • నన్ను నమునాగా ఉపయోగించుకొమనో , లేదా నా అడుగుజాడల్లో నడవమనో నేనెప్పుడూ చెప్పను. 
      •   సరైన మార్గం అంటూ ఏదీ లేదు. నేను నీకు రూట్ మ్యాప్ ఇవ్వలేను. కాని నేను ఒకటి చెబుతాను. అక్కడ స్వర్గం లేదు. కొత్త జేరూసలెం  లేదు. ఇది కేవలం జీవించడం. కేవలం ఈతకొట్టడం. అంతకుమించి ఏమీ లేదు. 
      •   నేనేమి చెప్పినా సాహిత్యంగా తీసుకోవద్దు. అలా తీసుకొని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి దాన్ని, ప్రతి వాఖ్యాన్ని పరీక్షించు. నీ  నడకకు దానికి ఏమైనా సంబంధం ఉందేమో  చూడు. నీవు తప్పకుండా పరీక్షించాలి. నీవు దీన్ని అంగీకరించే స్థితిలో లేవు. నీవు అంగీకరించినా, అంగీకరించక పోయినా ఇది నిజం.
      • ఎవరకీ చెప్పడానికి  నాకేదారి లేదు. వస్తారు. వింటారు. అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎటువంటి అంతరాయం లేకుండా వినడం తప్ప వేరే మార్గం లేదు. కానీ అంతరాయం చేసే వాడే ప్రధాన అవరోధం. అది నివే. నీ ఎదురుగా ఉన్న జీవితం నుంచి వచ్చే ఆలోచనలు, నమ్మకాలు, అనుభూతుల  సృస్టివి నీవు .  ఈ యధా స్థితిని కొనసాగించడానికే  నీ ఆలోచన ఆసక్తి చూపుతుంది. అదే మార్పును కోరదు. అయితే మార్పు ఆగదు. అది దేన్నీ అంగీకరించదు. నీ యధా స్థితిని కూడా డిస్టర్బ్ చేస్తుంది. నేను చెప్పేది అంతరాయం కలిగిస్తున్న నీ రిఫరెన్స్ పాయంట్  నిన్ను బలాడ్యుడిని చేస్తుంది. రక్షిస్తుంటుంది అని.  
      • రాబోయే భవిష్యత్ చర్యలను, పరిస్థితులను కాచుకునేందుకు సిద్ధంగా ఉండాలనే దిమాండ్ మన సమస్యలకు కారణం. ప్రతి సందర్భం విలక్షణంగా ఉంటుంది. మనకున్న జ్ఞానంతో పరిస్థితులను ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధంగా  ఉంటాం. మన పరిష్కారానికి, ఎదుర్కోవడానికి పరిస్థితులు ఏ మాత్రం సహాయపడవు.

        జ్ఞానోదయం (ENLIGHTMENT)

        • `జ్ఞానోదయం`  అంటూ ఏమీ లేదు. గురువులు, సాధువులు, జ్ఞానులు, లోకరక్షకులు వందల సంవత్సరాలుగా అక్కడ  జ్ఞానోదయం ఉందని నొక్కి చెబుతూన్నారు. `వారు జ్ఞానోదయం పొందారు`  అని నీవు చెప్పవచ్చు. వాళ్ళందరిని కట్టకట్టి ఓ నదిలో తోసేయి. అక్కడ ఏమీ  జ్ఞానోదయం లేదని గ్రహించడమే   జ్ఞానోదయం.  
        •   స్వేచ్చ,  జ్ఞానోదయం పొందిన మనిషి ఎవరికీ  స్వేచ్చ,  జ్ఞానోదయం కలిగించడానికి  ఆసక్తి చూపడు. ఎందుకంటే స్వేచ్చ,  జ్ఞానోదయం పొందినవాడినని తెలుసుకునే మార్గం అతనికి లేదు. ఇది ఎవరితోనైనా పంచు కునేదికాదు. ఎందుకంటే ఇది అనుభవం పరిధిలోకి రాదు. 
        • నాకు తెలిసి ఉన్నదంతా భౌతిక క్రమం, ఇందులో మార్మికత,ఆధ్యాత్మికత  ఏమీ లేదు




        ప్రేమ (LOVE)

        •              ప్రేమ  గురించి చెప్పమని పదే పదే అడుగుతున్నావు. ప్రేమంటే ఇద్దరు వుండాలి. నీకు తెలుసు. నేను ఒకరిని ప్రేమిస్తాను.  నిన్ను మరొకరు   ప్రేమిస్తారు. ఎక్కడ విభజన వుంటుందో  అక్కడ ప్రేమ వుండదు. మనం ఈ లోటును పూరిం చడానికి ప్రయత్నిస్తుంటాం . ఇది మనకు దారుణమైన పరిస్థితి. ఇది అర్ధం లేనిది. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలనే ఫాన్సీ ఇడియా మనలోనించి డిమాండ్ చేస్తుంటుంది. మధ్య... అంటే నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. నా కుక్కను  ప్రేమిస్తాను. నా  భార్యను ప్రేమిస్తాను. ఎవరిని ప్రేమించినా ఏమిటి భిన్నత్వం. నా  మాటలు  చాలా వైరాగ్యంగా కనిపించవచ్చు . వాస్తవానికి  ఏమీ ప్రత్యేకత లేదు. నీవు నీ దేశాన్ని ప్రేమిస్తావు. నేను నా  దేశాన్ని  ప్రేమిస్తాను. అక్కడ యుద్ధం వుంటుంది. 
        •     నా నుంచి  సానుకూల సమాధానాన్ని కోరుకుంటున్నావు. నేను దాన్ని తప్పించు కోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇది  రాజకీయ ఇంటర్య్వు కాదు. నేను మోసం చేయడం లేదు. నాకేమీ తెలివిగల, డిప్లొమాటిక్  సమాధానం ఇవ్వాలని లేదు. నిజంగా ఈ  ప్రశ్న ప్రతి ఒక్కరూ అడుగుతారు. మన సంబంధాల్లో ప్రేమ లేదు. వాటిని ప్రేమ పూరిత సంబంధాలుగా చేయాలనుకొంటున్నాం.  ఇందు కోసం ఎంతో శక్తిని దారపోస్తుంటాం. ఇది ఒక యుద్ధం. శాంతి... శాశ్వితమైన శాంతి పొందుదామనే ఆశతో మొత్తం సమ యాన్నంతా యుద్ధం చేసేందుకు మనకు మనం సన్నద్దులమౌతుంటాం. ఈ యుద్ధంలో అలసిపోతావు.  చివరకు ప్రేమ రాహిత్య సంబందాలలోనే  సెటిల్ అయిపోవడం ఇక్కడ విషాదం. 
        •   ఇద్దరు వ్యక్తుల మధ్య సంపూర్ణమైన, ఆదర్సవంతమైన సంబంధం నేరిపే క్రమంలో ప్రేమ విఫలమైతే  అక్కడ ద్యేషం చోటుచేసుకుంటుంది. లేదా విరోధ భావం, విరక్తి ఏదైనా పదాలు ఉంటే...నేను పదాల్లో చాలా  పూర్...అనేక భావాలు చోటుచేసుకుంటాయి.
        •    `నీకు మల్లె  నీ పొరుగువాడిని ప్రేమించు`.  ఈ పేరుతో ఇటివల జరిగిన  యుద్దాలను పరిశీలిస్తే మనం ఎన్ని లక్షల మందిని చంపేశాం. నీ వలే నీ పొరుగువాడిని ఎలా ప్రేమిస్తావు.? ఇది అసాధ్యం. లేకపోతే అనేక మంది ప్రజలు, మహిళలు, పిల్లలు, నిస్సహాయులు ఎందుకు నరమేదానికి  గురౌతున్నారు. 
        • ప్రేమ, ద్వేషం ఒకే నాణానికి వ్యతిరేక దిశలో లేవు. రెండూ ఒకటే. ఒకే విషయం . 

        Sunday, 28 August 2011

        సంస్కృతి (CULTURE)

        •         నీకు నీవుగా  వుండాలి. కాని దిగ్బ్రాంతికలిగించే విషయం ఏమిటంటే నీవు ఆధారపడిన మొత్తం మానవాళి వారసత్వం అంతా అపస్యమైంది. దీన్ని నీవు చూడాలి. ఈ గ్రహింపే నీకు మేలుకొలుపు. దృచ్చంగా కానీ, యాదృచ్చకంగా గాని ఇది జరిగితే  నీలో ఈ పరిస్థితికి కారణమైన ఈ సంస్కృతి  లేదా నాగరికత మీద నీకున్న పరా ధీనతపై మెరుపులా ఈ గ్రహింపు నిన్ను తాకుతుంది.
        •     నీవు వారసత్వ భారం నుంచి  స్వేచ్చను పొందితే నీవు మొదటిసారిగా ఒక వ్యక్తిగా  తయారవుతావు. ఈ వ్యక్తి ప్రభావం మానవ చైతన్యంపై  ఖచ్చితంగా వుంటుంది. 
        •        తన సహజ మార్గంలో  ఈ దేహం మొత్తం రసాయనచర్యల్లో  మార్పులు మొదలౌతాయి. దీని అర్ధం ఏమంటే నాగరికత ద్వారా కలుషితమైన, విషతుల్యమైన మొత్తం ఈ వ్యవస్థ  నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడైతే  బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఈ   చైతన్యం , లేదా  జీవితం ...నీవు ఏమైనా పిలువు  దాని వ్యక్తీకరణ, నడక తనదైన శైలిలో వ్యక్తమౌతుంటుంది. ఇటువంటి వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం వుండదు. ఇతడు ఒక ప్రమాదికారిగా తయారౌతాడు. ఇదే వైరుధ్యం. ఇతడు ప్రపంచాన్ని సంస్కరించడానికి కొంత శక్తి కావాలని కోరుకోడు. తను రక్షకుడిననో, స్వేచ్చా జీవిననో, ఆత్మ జ్ఞానం పొందినవాడిననో అనుకోడు.
        •    నీకు నీవుగా, వ్యక్తిగతంగా ఉండాలంటే నీవు  చేయడానికి ఏమీ లేదు. నీవు ఉన్న స్థితి కంటే  భిన్నంగా ఉండాలని సంస్కృతి నిన్ను డిమాండ్ చేస్తుంటుంది.  అలా ఉండడానికి  చేసే  ప్రయత్నంలో మన సర్వ శక్తులూ వృధా అవుతుంటాయి. ఆ శక్తి ఉంటే జీవించడం చాలా సాధారణంగా ఉంటుంది.
        • నీవు సాధారణ మనిషిగా, మామూలు మనిషిగా ఉండాలనుకోవడంలేదు. అదే నిజంగా సమస్య. నీవు ఉన్న దానికన్నా భిన్నంగా ఉండాలని నాగరికత నిర్దేశిస్తోంది.
        • ఈ దేహానికి ఏమీ తెలుసుకోవాలని ఉండదు. దాని రక్షణకు కావలసిన తెలివి అక్కడ ఉంది, పోగేసుకున్న దానిని మేధోతనం అంటాం. ఆలోచనకు కొత్తదనం ఇవ్వడం అనే నిరంతర  ప్రక్రియ కోసం మనం ఈ మేధో సంపత్తిని పోగేసుకుంటాం. దీని సహాయంతో ఇతర జీవ రాసులకంటే ఎక్కువ కాలం జీవించడానికి ప్రయత్నిస్తుంటాం . మొత్తం వ్యవస్థ నాశనానికి ఇదే కారణమౌతోంది.  మేధో సంపత్తిని పోగేసుకోవడమనే వాస్తవం నుంచి మనం తప్పిచుకునే మార్గం లేదు.  జంతువులు  ఏవీ మార్పు కోసం ఏ మాత్రం ప్రయత్నిచవు. దీన్ని మనం అర్ధం చేసుకోవాలి. మనలో మార్పు రావాలనే డిమాండ్ నాగరికత సృష్టి. ఏమి మరాలనేది మౌలిక ప్రశ్న. విప్లవాత్మకంగా గాని మరేదైనా గాని మార్పు చెందాల్సింది ఏ మైనా ఉందా? ఏముంది అక్కడ.? ఏదైనా ఉందా? ఆత్మ ఉందా?  `నేను` ఉన్నానా? ...నా సమాధానం ఏమీ లేదనే. నేను చూసేది, అనుభూతి చెందేది అంతా జ్ఞాన సృష్టి . జ్ఞానమే నేను. ఆ జ్ఞానం ఉనికే తరతరాలుగా వస్తోంది. అదే నాగరికత.

        Saturday, 27 August 2011

        జ్ఞానం (KNOWLEDGE)

        •    నీవు ఇంకా, ఇంకా జ్ఞానాన్ని, అనుభవాన్ని సాధించాలనుకుంటావు.ఈ క్రమంలో  విషయాలను బాగా అర్ధం చేసుకోచ్చు ననుకుంటావు. కాని నేను చెప్పేదేమిటంటే నీ జీవన  ప్రయాణం ఎప్పటికీ నీ జ్ఞానంలో భాగస్వామ్యం కాదు. నీవే ప్రవాహం అవ్వాలని ఏదో ఒకటి చేస్తుంటావు. ఈ దిశలో నీకు  నీవు ప్రవాహం నుంచి విడిపోతుంటావు.

        సృజనాత్మకత (CRIEATIVITY)

        •   సృజనాత్మకత అనేది ఏమీ లేదు. భాష ఆలోచన సృష్టి. జీవితం సృజనాత్మకం అంటే దాన్ని నమునాగా ఉపయోగించడానికి వీలు లేదు. మన  సృజనాత్మకత అని చెప్పుకునేదంతా అనుకరణ. అక్కడ ఉన్న దానికి నకలు. నాకేమి అక్కడ బ్లూప్రింట్ అనేదేమీ కనబడదు.

        జీవితం ( LIFE)

        •  జీవితం పవిత్రమైనది. మన పిల్లలను, పరిసరాలను మరో యుద్ధం రాకుండా ఎలా రక్షించుకోవాలంటున్నారు. మీరందరూ మానసిక వ్యాధిగ్రస్తులు. బాంబులతో, ఆకలితో, దారిద్ర్యంతో, టేర్రరిజంతో వేల లక్షల మందిని చంపేస్తూ మరో వైపు భావి జీవితం, బర్త్ కంట్రోల్, జీవన మాధుర్యం, జీవిత విలువల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంటారు.
        •  నివు చెబుతావు. జీవితం ప్రవాహం. దానితోపాటే నేను కదులుతుంటాను అని. కాని నిజానికి ప్రవాహా న్నిచదరగొడుతుం టావు. జీవితం కదలిక ఎప్పుడూ భిన్నంగా  వుంటుంది. 
        •  జీవితం అద్బుతమైన క్రమం. ఆలోచన చట్రంలో దాన్ని ఎప్పటికీ అందుకోలేవు.
        •  జీవితం అనుకుంటున్న దానికి భౌతికంగా దాని అర్ధం దానికుంది. దాన్ని తోసేసి ఆధ్యాత్మిక అర్ధం కల్పించడానికి ప్రయత్నిస్తున్నావు. ఏదైనా అర్ధం ఎందుకుండాలి. జీవించడం కోసం  జీవితం వుంది. నీవు ఆధ్యాత్మిక అర్ధం వెతకడంలోనే సమస్య వుంది.
        • అర్దవంతం, ప్రశాంతం, సంపూర్ణం, ఆదర్సవంతంమైన జీవితం...ఇలా పేరుకుపోయిన భావనలు తొలగిపోవాలి. అసలు జీవితం కన్నా వీటి గురించి ఆలోచనకే నీ శక్తులన్నీ వ్యర్ధం అవుతుంటాయి.
        •   నీవు జీవితం మొదలు పెడితే ఏమి ఆలోచిస్తున్నావు  అనేది విషయం కాదు. జీవితం దానంతట అదే  సాగుతుంది. ఎలా జీవించాలి అనే ప్రశ్న జీవితానికి ఒక సమస్య అయింది. ఎలా జివించాలనేది జీవితానికి అర్ధం లేనిది. ఎలా అనే ప్రశ్న వచ్చిన మరుక్షణం సమాధానం కోసం ఎవరో ఒకరి మీద ఆధార పడతావు. దీంతో నీమీద స్వారీ చేయడానికి ఆవకాశం తీసుకుంటారు.
        •   జీవితానికి ఎందుకర్ధం ఉండాలి. ఎలా జీవించాలి అనేది జీవి నడకకు పూర్తిగా సంబంధం లేనిది. అది జివిస్తుంటే ఎలా,  ఎప్పుడు అని  ప్రస్నించదు.  ఎలా అనేది నీవు నిర్దేసిస్తున్నావు. 
        •   జీవితం ఏమిటి? ఎవరికీ తెలియదు. మనం చెప్పేదంతా ఊహాజనితం. జీవితం నుంచి, అనుభవం నుంచి అర్ధం చేసుకున్నది జ్ఞానం సహాయంతో చెబుతావు. మన చుట్టూ ఉన్న ప్రజలతో, ప్రపంచంతో మనకున్న సంబంధమే జీవితంఅనుకుంటాం. మనకు తెలిసింది అదే. వాస్తవానికి అది సంబంధం కాదు. 
        •   జీవితం ఏమిటనేది నీవు ఎప్పటికీ తెలుసుకోలేవు. జీవితం గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు. నీవు  నిర్వచనాలు ఇస్తావు. అవి అర్ధం లేనివి. దేన్నీ అర్ధం చేసుకోడానికి అది నీకు సహాయం చేయదు. అ ప్రశ్న దానంతట అది దగ్ధమైతే  అక్కడ శక్తి వుంటుంది. ఆ శక్తి గురించి నీవు ఏమీ చెప్పలేవు. అది అల్ రెడీ దానంతట అది వ్యక్తమౌతూ ఉంటుంది.దానికి సరిహద్దులు లేవు. పరిమితులు లేవు. అది, నీది నాది కాదు. అది  అందరకీ సంబంధించినది.దానిలో నీవు  ఒక భాగం.నీవు దాని  వ్యక్తీకరణవు. కేవలం పూవు ఒక జీవిత వ్యక్తీకరణలా నీవు మరో జీవితపు వ్యక్తీకరణవు.








        Friday, 26 August 2011

        ఒంటరితనం (LONLYNESS)

        •        నీకు నీవు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావో అప్పుడు నీవు ఈ సమాజపు నడకకు ప్రమాదం. పొరుగువారికి ప్రమాదం. ఎందుకంటే ప్రపంచపు వాస్తవాన్ని వాస్తవంగా వాళ్ళు  అంగీకరిస్తున్నందున ...,మరో గమ్మత్తైన విషయం... నీకు మల్లే వాళ్ళు ప్రశాంతత కోసం వెతుకుతున్నందున ...వాళ్ళ ఉనికికి నీవు ప్రమాదమౌతావని వాళ్లకు తెలుసు. దాన్ని వాళ్ళు అనుభవించి వున్నారు. అందువల్ల నీవు ఎప్పుడూ ఒంటరివి. వాళ్ళు ఒంటరితనాన్ని కోరుకోవడం లేదు.

        చైతన్యం (CONSCIOUSNESS)

        •         నీవు ఎప్పుడూ పరిపూర్ణంగా, పవిత్రంగా ఉండాలనుకుంటావు. ఆ చైతన్యంలోనే అపరిశుద్ద్యం ఉంది. అపరిసుద్ద్యం అనే పదాన్నే నీవు ఇష్టపడవు. నీవు పవిత్రమైన, దైవికమైన, సంపూర్ణమైనదని భావించేదంతా అపరిసుద్దమే. నీవు చేయగలిగేదేమీ లేదు. అది నీ చేతిలో లేదు
        •  మానవ చైతన్యం స్థానాన్ని నీకోసం  నీవు కనుగొనే మార్గం లేదు. ఎందుకంటే నీవు చైతన్యం నుంచి విడిగా లేవు. 
        •    సొసైటీ నీ బయట లేదు. నీ లోపల ఉంది. నాగరికత మానవ చైతన్యంలో ఉంది. నీ ముందు తరం మనిషి  ప్రతి అనుభవంలో  అది ఉంది.
          •  నేను చైతన్య స్థితిని ప్రశ్నిస్తున్నాను.ఎందుకంటే మనం అనుకొంటున్నచైతన్య స్థితి కుడా జ్ఞాపకమే. నీకున్న జ్ఞానం సహాయంతో నీవు చైతన్యంగా ఉంటావు.ఆ జ్ఞానం నీ జ్ఞాపక చట్రంలో భద్రంగా ఉంటుంది. నీవంటున్న కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్ కాన్షియస్ లు  అన్నీ ఆలోచన వ్యవస్థ సృష్టించిన సూక్ష్మ రూపాలే. ఈ చాతుర్యం, ఆవిష్కరణ ద్వారా ఆలోచన తన యధాతద స్థితిని కొనసాగిస్తుంది.


        Thursday, 25 August 2011

        ఆలోచన (THOUGHT)

        •  ఎక్కడైనా ఆలోచన అవసరం. కాని అది ఇప్పుడు మనిషికి శత్రువుగా మారింది. ఎందుకంటే శక్తివంతమైన పరిణామక్రమాన్ని వెనక్కి తోసేసి పరిపుర్ణమైన మనిషి, ఆధ్యాత్మిక మనిషి, పెద్దమనిషి... ఇలా రక రకాల భావనలను నాగరికత సృష్టించింది. ఇక్కడున్న స్వభావానికి అదంతా పూర్తి విరుద్దం.
        •    ఆలోచనలు ఏమీ స్వయంప్రకాశం కావు. తక్షణంలో ఉండవు అని నేను పదే,పదే చెబుతుంటాను. ఇంకొక అడుగు ముందుకేసి అడుగుతున్నాను. అసలు ఆలోచన అనేది ఒకటి ఉందా?. ఈ ముఖ్యమైన ప్రశ్న ఎందుకొస్తుందంటే అక్కడ ఆలోచన అనేది ఒకటి ఉందని మనం దాన్నుంచి విడిపోయ దాన్ని చూస్తుంటాం.కాని  మనం అనుకొంటున్న ఆలోచన చూసినప్పుడు మనం చూసేది ఆలోచన గురించి భావనను.  ఆలోచనను కాదు.
        •      మన ఎదురుగా ఉన్న వాస్తవాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్ధం చేసుకోడానికి మన ఉపయోగించే ఆయుధం విషయంలో ఈ `దేహం` భాగస్వామ్యం కాదు. ఆలోచనలు స్వయం ప్రకాశం,  తక్షణంలో  ఎందుకుండవనే దానికి నేను చెబుతున్న కారణం ఇదే. మొత్తం ఆలోచన గురించి నీవు అనుకున్నదంతా `ఆలోచన` కాదు. ఆలోచన నాగరికత సృష్టి.  మనం దేని నుంచయినా స్వేచ్చ పొందడానికి మనకు ఆలోచనే ప్రధానమనే భావన మన ముందుంది. నా ఆసక్తంతా అది ఆయుధం కాదని, మరో ఆయుధం కూడా లేదని  చెప్పడమే. ఇది నీకు అర్ధమైతే ఆలోచన నీ అస్త్రం కాదు. వేరే ఆయుధం కూడా నీకు అవసరం ఉండదు.   మనం ఈ స్థితిలో ఉండేందుకు వివేకం, అంతరంగిక జ్ఞానం, అంతర్ దృష్టి, అదీ, ఇదీ...అంటూ అనేక మార్గాలను కనుగొన్నాం. ఇవన్నీ  నీకు ఆటంకాలే. అంతర్ దృష్టి ఎంత ప్రత్యేకమైనా అవన్నీ ఏ మాత్రం విలువ లేనివి. అంతర్ దృష్టి అని చెప్పుకునేదంతా ఆలోచన సృష్టే. ఆలోచన తన యధాస్థితిని కొనసాగించడమే ఇది.
        •     ఈ ఆలోచనను నిర్మాణాత్మకంగా, సానుకూలంగా  సంస్కరిచాలేమా? అని అడుగుతున్నావు. సమాజం, సంస్కృతి ...నీవు ఏమైనా పిలువు...అవి నిర్దేశించిన లక్ష్యాలు వేటినీ సాధించడానికి ఆలోచన ఉపకరణం కాదు. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. నాగరికత సృష్టి, లేదా సమాజం మన ముందుంచిన లక్ష్యాలు చేరడం, పొందడం అనేది మన సహజ స్థితికి శత్రువు. ఆలోచన సమస్యలను సృష్టిస్తుంది. పరిష్కరించదు. నేను ఆలోచన రహితస్థితి గురించి మాట్లాడడం లేదు. లక్ష్యాలు చేరేందుకు అనేక మంది ఆధ్యాత్మిక గురువులు మనముందుంచిన ఆలోచనారహితస్థితి కూడా ఆలోచన సృష్టే. ఆలోచనా రహితస్థితిని అనుసరించడం ద్వారా ఆలోచన తన యధా స్థితిని కొనసాగిస్తుంటుంది. అందువల్ల ఆలోచనరహి త స్థితి  అనే  లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనకు వచ్చే అనుభవం ఏదయినా ఉంది అంటే అది ...స్వేచ్చ పొందడానికి మనం చేసే ప్రయత్నాన్ని శక్తివంతం చేస్తుంటుంది.

        దేవుడు (GOD)

          `అవతల` ఏ మైనా ఉందా?. ఎందుకంటే నీకు రోజువారి విషయాలు, నీ చుట్టూ ఏమి జరుగుతుంది అనే దాని మీద ఆసక్తి ఉండదు.`అవతల` అని పిలుస్తున్నదాని మీద, లేదా దేవుడు, సత్యం, వాస్తవం, బ్రహ్మం, ఆత్మజ్ఞానం, లేదా మరోటో కనుగొన్నావు. దాని  కోసం నీ అన్వేషణ  అంతా. అక్కడ ఏ  `అవతల` ఉండకపోవచ్చు. `అవతల` గురించి నీకు విషయం తెలియదు. దాన్ని గురించి నీకేమి చెప్పారో అదే నీకు తెలిసింది. అందువల్ల ఆ జ్ఞానాన్నే ఆవిష్కరిస్తుంటావు.` అవతల` గురించి నీకున్న జ్ఞానమే నీవు పిలుస్తున్న `అవతల`ను  సృష్టించింది. `అవతల గురించి నీకున్న  జ్ఞానమే నీ  అనుభవం  అవుతుంది . ఆ అనుభవం నీ  జ్ఞానాన్ని  పదునేక్కిస్తుంటుంది. నీకేమి తెలిసినా అది  అవతలకు వెళ్ళదు. ఏ అనుభవమైనా అవతలంటు  ఏమీ ఉండదు.  ఏదయినా  అవతల అంటూ ఉంటే `నీవు` కదలిక అదృశ్య మైనప్పుడే  ఉంటుంది. ఆ కదలిక  లేకపోవడమే బహుశా `అవతల ` అని  అనుకొవచ్చు. కాని `అవతల` అనేది ఎప్పటికీ అనుభవంలోకి  రాదు. అనుభవంలోకి రానిదాని కోసం అనుభవంలోకి తెచ్చుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తావు .

                      దేవుడి నుంచి మనిషి రక్షింపబడాలి. అది చాలా అవసరం. నేననేది నీవు అంటున్న దేవుడు  అనే అర్ధంలో కాదు. నా దృ ష్టిలో దేవుడు దేవుడుగానే లేదు. దేవుడు అనే భావన చుట్టూ కర్మ, పునర్జన్మ, మరణం తర్వాత... ఇలా  మొత్తం విషయమంతా, గొప్ప భారతీయ వారసత్వమని నీవు చెప్పేదంతా...మొత్తం ప్రహసనాన్ని నీవు చూడాలి. మనిషి భారతీయ వారసత్వం నుంచి బయట పడాలి. ప్రజలే కాదు మొత్తం దేశం కూడా ఈ వారసత్వం నుంచి విముక్తి పొందాలి.    
        •      కలగాపులగమైన మనస్సు చాలా విధ్వంసకర విషయాలను సృష్టించింది. అన్నింటిలో దేవుడు అనే భావన అత్యంత విధ్వంసకరమైంది. నాదృష్టిలో దేవుడికి  సంబందించిన ప్రశ్న చాలా అసంబద్ద మైంది. అభౌతికమైంది. దేవుడి వల్ల మనకే మాత్రం ప్రయోజనం లేదు.రెండు ప్రపంచ  యుద్దాలకంటే దేవుడి పేరుతో జరిగిన  హింసాకాండలో ఎక్కువ మంది చనిపోయారు.పవిత్ర  బుద్దభగవానుడి పేరు మీద జపానులో లక్షలాది మంది మరణించారు. ఇదే వరుసలో క్రిస్టియన్లు, ముస్లింలు ఉన్నారు. భారత దేశంలో కూడాఒక్క రోజులో ఐదు వేల మంది జైనులను ఊచకోత కోశారు. నీది కుడా శాంతియుత దేశం కాదు. నీ చిరిత్ర  చదువుకో. మొదటి నుంచి హింసే కనబడుతుంది.
        •            మనిషి కేవలం భౌతిక జీవి. (భయోలాజికల్ బీయింగ్ ). స్వాభావికంగా  అతనికి ఆద్యాత్మిక పార్శ్వం లేదు. అన్ని సద్గుణాలు, మార్గదర్సికాలు, నమ్మకాలు , భావాలు, ఆద్యాత్మిక విలువలు, కేవలం డాంబికాలు, అసహజమైనవి. అవేమి నీలో మార్పు తీసుకురాలేవు. నీవిప్పటికీ  క్రూరుడవే. `నీవలె నీ పొరుగువాడిని ప్రేమించు`  అనే తత్వం  వల్ల నీవు జరిపే విచక్షణారహిత  హత్యా కాండ ఆగదు. నీ పొరుగువాడిని చంపితే నీకూ అదే గతి పడుతుందనే భయంకరమైన  నిజం వల్ల నీవు నరమేధాన్నిఆపుతావు.





        Wednesday, 24 August 2011

        సహజ స్థితి ( NATURAL STATE)

        • అక్కడ నీలో ఎప్పు డూ అద్బుత మైన  ప్రశాంతత ఉంది. అదే నీ సహజ స్థితి.  దాన్నినీవు ఎప్పటికీ అర్ధం చే సుకోలేవు. నీవు ప్రశాంతమైన మానసిక స్థితిని సృస్టించు కోవడానికి ప్రయత్నిస్తుంటావు. నిజానికి అదే నీలో గందర గోలానికి దారితీస్తుంది. నీవు కేవలం శాంతి గురించే మాట్లాడుతావు. ప్రశాంతమైన మనస్సును సృష్టించుకుంటావు. అంతా ప్రశాంతంగా ఉన్నట్లు నీకు నీవు చెప్పుకుంటావు. కానీ అదంతా హింస. శాంతిని సాధన చేయడం వల్ల, నిస్సబ్దం  కోసం నీవు చేసే ప్రయత్నం ఏ మాత్రం ఉపయోగం లేనిది . నిజమైన నిశ్సబ్దం విస్పోటనం. ఆద్యాత్మికవాదులు చెబుతున్న సమాధి స్థితి   ( డెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ )కాదు .అది మెరుపు స్థితి. అదినీటి బుగ్గ. ఆదిశక్తి . అదే  జీవితం. అదే   దాని ప్రయాణం. అదే  సహజ స్థితి.
          • >అఫెక్షన్  అంటే ప్రతిదానికి కదిలిపోవడం. అది ఒక దాని వైపు ఉద్యేగంగా వెళ్ళడం  కాదు.సహజ స్థితి  అనేది గొప్ప సునిశితమైన  స్థితి. ఇంద్రియాలకు సంబందించిన  భౌతిక సునిసితత్వం ఇది. ఇది నాపట్ల ఇతరుల పట్ల ఉద్వేగ పరంగా కరుణ, లేదా దయగా ఉండడమనే ప్రక్రియ కాదు. ఇక్కడ విభజన ఉండదు. 
          • నీ సహజ స్థితికి ఆద్యాత్మిక స్థితులైన  ఆనందం, బ్రహ్మానందం, ఆనందప్రవాహం ...వంటి వాటితో ఏ మాత్రం సంబంధం లేదు. అవన్నీ అనుభవం పరిధిలోకి వస్తాయి. నాకు తెలిసి ఉన్నదంతా  స్వచ్చమైన భౌతికక్రమం . ఇందులో మార్మికత, అద్యాత్మికత ఏమీ లేదు. 
          • సత్యం, వాస్తవం, అంటూ నీవు చేసే వెతుకులాట  అంతా నీ సహజ స్థితికి నిన్ను దూరం చేస్తుంది. ఆ స్థితి అక్కడ  ఉంది. నీ  ప్రయత్నాలతో పొందేది కాదు. సాధించడం, ఫలితాలు రావడం అనేది ఉండదు. అసలు అక్కడ దానంతట అదివ్యక్తమౌతూ ఉంటుంది. నీవు చేసేవన్నీ అసాద్యమైనవి. 
          • >సహజ స్థితి అంటే ఆత్మ చైతన్యం , దైవత్వం పొందడం కాదు, ఇది సాధించేది, పొందేది కాదు. ఇది ఉనికిలోకి తెచ్చేది కాదు. అది అక్కడ ఉంది. అది జీవన స్థితి. `జీవితం` అంటే అది  అమూర్తమైందనే అర్ధం కాదు. ఆలోచనతో సంబంధం లేకుండా ఇంద్రియాలు పనిచేయడం. ఆలోచనకు లాభాపేక్ష ఉంటుంది. ఆలోచన తాననుకున్న విధంగా కొనసాగడానికి ఇంద్రియాల కదలికలను నిర్దేసిస్తుంటుంది. 
          • నీ  సహజ స్థితికి,  ఆధ్యాత్మిక ఆనందం, బ్రహ్మానందానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇటువంటివన్నీ అనుభవం పరధిలోకి వస్తాయి. అవన్నీ వందల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక అన్వేషణ దిశగా మనిషిని నడిపించాయి. అదంతా ఆలోచన సమ్మతమైన స్థితి. అది వస్తుంటుంది . పోతుంటుంది. దాన్ని ఎవరూ అందుకోలేరు. గ్రహించలేరు. వ్యక్తికరించలేరు. అది దెబ్బతిన్న రహదారి. అది నిన్ను ఎక్కడికీ తీసుకెళ్లలేదు .అక్కడ ఎండ మావుల్లో చలమ ఏమీ లేదు. వెళితే అక్కడ బురదలో చిక్కుకు పోవడమే.

          సమాజం (SOCIETY)

          •      సంపూర్ణమైన మనిషి అనే ఆదర్శాన్ని సమాజం నీ ముందుంచింది. ఏ నాగరికత నుంచి వచ్చావనేది ఇక్కడ ప్రశ్న కాదు. నీకు ఆద్యాత్మిక ఉద్గ్రందాలు, సంస్కృతులు ఉన్నాయి.నీవు  ఎలా ఉండాలనేది అవి నిర్దేసిస్తుంటాయి.సాధన ద్వారా సహజ స్థితిని పొందడం సాధ్యమని  కూడా యోగులు, జ్ఞానులు, నీకు చెప్పారు. అందువల్ల  నీవు నీ ప్రవర్తనను, ఆలోచనను అదుపు  చేస్తుంటావు. ఇదంతా అసహజంగా మారుతుంటుంది. జీవితాన్ని అదుపు   చేసే ప్రయత్నం నీలో రెండో నడకకు దారితీస్తుంది. దాన్నే నీవు పిలిచే `నేను` ( సెల్ఫ్).
          •  సమాజంలో నేను భాగస్వామినని చెబుతావు. అయినా భిన్నంగా ఉన్నానని  నీవే భావిస్తుంటావు. సమాజ చైతన్యం నుంచి నీవు విడిగా లేవు.  గుంపులో ఉన్న వ్యక్తికి, లేదా చర్చికి వెళ్ళని కమ్యూ నిస్టుకు నీకు తేడా ఏమిటి? 
          •   నీకు నీమీద  విశ్వాసం లేదు. నాగరికత మీద విశ్వాసం ఉండాలంటూన్నావు . నీకు  సమాజం  ఏమి చెప్పిందో దానిమీదే  నమ్మకం. అది మౌలిక సమస్య. సమాజం నీ  బయట లేదు. నీ లోపల ఉంది. నాగరికత మానవ చైతన్యలో భాగం. నీ ముందు తరం ప్రతి మనిషి అనుభవంలో, అన్ని చోట్లా ఇది భాగమై ఉంది.   
          •    నీ ఆలోచన నడక నీలోని  జీవీ నడకకు సమాంతరంగా  ఉంటుంది. కాని నిన్ను అది ఐసోలేట్ చేస్తుంటుంది. అది జీవితాన్ని  ఎప్పటికీ  స్పర్శించలేదు. నీకు నీవు జీవితం నుంచి విడిపోతావు. ఇది చాల అసహజం. అలా అని ఆలోచనారహిత స్థితి సహజ స్థితికాదు. వందల సంత్సరాలుగా పాతుకుపాయిన అతి పెద్ద మోసాలో ఇదొకటి. ఆలోచన లేకపొతే  నీవుఉండవు. మనుగడకు ఆలోచన తప్పనిసరి.  దాన్ని ఆపితే ఊపిరి ఆడదు. దాని సహజ నడకలో అది వెళ్ళాలి. మొత్తం సమస్యకు ఇదే సంక్లిష్టమైంది.
          • సమాజం ఘర్షణ పునాధి మిద నిర్మితమైంది.నీవే సొసైటీ.అందువల్ల సమాజంతో ఎప్పుడూ ఘర్షణ పడా ల్సిందే.


          Tuesday, 23 August 2011

          బోధన (TEACHING)

          •  నేనేమీ బోదించను. మూలాలను కట్ చేయడంపైనే నా ఆసక్తి. విత్తనం కుళ్ళిపోయింది. అది వెళ్లి పోవాలి. చెట్టును ట్రిం చేయడం కాదు. అది నా మార్గం కాదు.
          •     నా బోధన అంటూ ఏమీ లేదు. ఎప్పుడూ ఉండదు. బోధన అనేది పదం కాదు. జీవితంలో మార్పు కోసం, నూతన ఆలోచనా మార్గాన్ని, లేదా చిట్కాను, పద్దతిని, లేదా వ్యవస్థను, `బోధన` ఇస్తుంది. నేను చెబు తున్నది బోధనేతర అంశం. నేను  ఎలా ఉన్నాననేది మామూలుగా వివరించడం.
          • నేనేమి చేయాలి. నీవు వస్తావు. నేను మాట్లాడతాను. `నేను నిన్ను విమర్శించాలి.రాళ్లువేయాలి`. ఇదంతా నిష్ప్రయోజనం. నీ చుట్టూ దుర్బేద్యమైన కోటను నిర్మించుకున్నావు.  నీవేమి చెదరవు. అనుభూతి చెందవు. నీ స్థితిని అర్ధం చేసుకోవడం కష్టం. నీ చర్యలన్నీ గతించిన జ్ఞాపకాలనుంచి సాగుతుంటాయి. నీ చర్యల నుంచి నిన్ను నీవు విడి పోతుంటావు. ఈ క్షణంలో సంతోషం, అనుభూతి గురించి మాట్లాడవు. నీ చర్యలను, భావోద్యేగాలను నిరంతరాయంగా విశ్లేషిస్థూ, అదుపు చేస్తుంటావు. ఇలా అనుభూతి చెందాను...అలా వుండాలి అనుకుంటూ ఎప్పుడూ భవిష్యత్తులోకి  పారిపోతుంటావు. నీ సమస్యకు నీ భవిష్యత్తుకు  సంబంధం వుండదు. నీ సమస్యలన్నింటిని  భవిష్యత్తులోనుంచి ఆలోచిస్తావు. అదంతా వ్యర్ధం. ఏదయినా  జరిగితే ఈ క్షణంలో జరగాలి.  
          •  

          Monday, 22 August 2011

          అభిప్రాయాలు (COMMENTS)

          •       ఇతని పదాలకున్న శక్తిని `ఏ మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. ఇంతవరకూ ఎక్కడా తటస్థ పడని వరిజినల్ థింకర్ ఇక్కడ ఉన్నాడు. ఆధ్యాత్మికం, మనోవైజ్జ్ఞానికం, స్వయం సహాయం మీద అనేక వందల, వేల  పుస్తకాలు ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తున్నాయి. అవన్నీ, ఆ ఆకర్షణలన్ని ఇప్పటికే నీ దగ్గర ఉన్నవే. యూజీ  చెప్పేది  నీకు తెలిసినదాన్ని బద్దలు కొట్టడమే . కొత్త దానితో భర్తీ  చేయడం కాదు . కొత్త చిట్కాలు, క్రమ శిక్షణా మార్గాలు కాదు. కొత్త తగులాటంలోకి  వెళ్ళకుండానే నీ నమ్మకాలు చెదిరి పోవడానికి,  నీకు నీవు ముక్కలు కావడానికి నీవు సిద్దంగా    ఉన్నావా ? ఉంటే ఈ   పుస్తకాన్ని  చదువు.
                                                                 లారీ మోరీస్,  `నాచురల్ స్టేట్`   సంపాదకుడు 
          •   విభిన్నమైన తత్వవేత్తలకు సంబంధించిన అనేక పుస్తకాలు చదివా. నా కరవు  తీరలెదు. వారిలో ఎవరూ పూర్తిగా, అసంపూర్తిగా గాని జీర్ణం కాలేదు. ఇక్కడ యూజీ మొదటి పుస్తకం చదవడంలోనే మొత్తాన్ని నేను అంగీకరించడం నాకు ఆశ్చర్యకరం. అంతే...ఇక అతన్ని ఆసాంతం చదివా. అతను మాట్లాడినదంతా  ప్రచురిం చాలని నిర్ణయానికి రావడానికి ఇదే కారణం.`నాచురల్ స్టేట్`నా ఎనిమిదో పుస్తకం.ఇంకా రావాలని ఆశిస్తు న్నా.
            పబ్లిషర్,  `నాచురల్ స్టేట్`
          •      యూజీ మాటల్లో - `యుజీ ఫినిష్డ్ మాన్ `. ఇక అన్వేషణ లేదు. ప్రస్తానం లేదు. అయితే ఈ `ఫినిష్డ్ మాన్` సంబాషణలలో సైన్స్, మతం, రాజకీయాలు, తత్వశాస్త్రంలోని డొల్లతనాన్ని చెప్పడమే గాక, నేరుగా మూలాలలోకి వెళ్లి ఎవరినీ వప్పించే ప్రయత్నం చేయకుండానే చాలా సాధారణంగా, నిర్భయంగా, మొఖం మీద గుద్దినట్లు చెప్పడం కొంత ఆశ్చర్యం.  
          టెర్రీ న్యులాండ్ , మైండ్ ఈజ్ మిత్  సంపాదకుడు   
          •     యూజీ ప్రస్తుత విలువల వ్యవస్థ స్థానంలో ప్రత్యామ్నాయాన్ని చూపడు.కానీ మానవ విశ్వాసాల మూలాలలోకి వెళ్లి అతను విశ్లేషించే తీరును నీవు చూడగలిగితే జీవితం గురించి నీవనుకొంటున్న మహోన్న త భావాలు బలవంతంగా నయినా వదిలించుకునేందుకు ప్రయత్నిస్తావు .ఇలా నీవు కొంత వరకు  వెళ్ళగలిగితే,నీ  జీవితాన్ని ఏ ప్రయత్నం లేకుండా సాధారణంగా ఎలా ఉండవచ్చో తెలుసు కోవడానికి అవకా శం ఉంటుంది. ఎందుకంటే విలువల  చట్రాన్ని ఎక్కువకాలం మోయలేవు. 
          • కొత్త నమ్మకాల వైపు. మతాల వైపు నిన్ను మళ్ళించడానికి యూజీ ఏమాత్రం ఆసక్తి చూపడు. అపూర్వమైన దృస్టికోణాన్ని ఇస్తాడు. తనను తాను వ్యక్తీకరించుకొంటాడు.తీసుకో, లేకపోతే లేదంటాడు.  నిన్ను     సరైన వ్యక్తిగా తయారు చేయడానికి ఏమాత్రం ప్రయత్నించడు.నిజానికి నీలో మార్పే అవసరం లేదంటాడు. మారాల ని ఎడతెగని ప్రయత్నం   చేయడం  నీ  విషాదం అంటాడు. చాలా సహజంగా జ్ఞానులు, . సాధువులు, మానవాళి రక్షకులుగా ... ఇలా ఎవరో నమూనాగా నీవు ఉండాలనుకొంటావంటాడు.
            లారీ మోరీస్,  `నాచురల్ స్టేట్`   సంపాదకుడు 
          •         యూజీ  చెప్పేదంతా నీవు అగీకరించు లేకపోతే లేదు.అతన్ని వినడానికి  ప్రయత్నించడంలో చాల విలువ ఉంది. మన రిఫరెన్స్ పాయింట్  లోకి బాంబులు విసిరినట్లు అతని మాటలు దూసుకువస్తాయి. మన విశ్వాసాల  పునాధులు కదిలిపోతాయి. దూసుకువచ్చే  అతని మాటల ప్రవాహానికి మూలం ఎక్కడ అని నీవు ఆశ్చర్య పోతావు.
                                  ఆంటోని పాల్  ప్రాంక్ నోరోన్హా ,`థాట్ ఈజ్ యువర్ ఎనిమీ` పుస్తకం ముందు మాటలో
          • నిజం చెప్పాలంటే డెబ్బైలో నేను మొదటిసారి యూజీని విన్నప్పుడు చాలా కోల్పోయాను.అప్పుడు జేకేనే అంతిమం, సంపూర్ణ మైన ధార్మికం(ఎక్స్ట్రీంస్పిరుత్యువాలిటి), దాన్నిదాటిఎవరూవెళ్ళలేరు`.అనేభావనలో   ఉన్నాను.మళ్లీయూజీని(రెండోకృష్ణమూర్తిని)కలిసినపుడుఅతను జేకే చెప్పిందిమొత్తం`రొమాంటిక్ హగ్వాష్`, కేవలంకల్తీలేనికల్పన(అన్ఆడాల్ట్రేటెడ్ ఫాంటసి),అంతకుమించి ఏమీ లేదు ` అనికొట్టేయడం  నన్నుదిగ్బ్రమ కు, అత్యంత భయానికి గురిచేసింది. నాతలమండుతున్నట్టు,మొత్తందేహంనిప్పులకొలిమిలోఉన్న అను భూతిని జేకే కలుగ జేస్తే .యూజీనా తలనే మాయంచేసినట్టు, ఏ మాత్రం పసలేని ఆలోచనా పరుడిగా, ఒక జీరో ననే భావను కలిగించాడు. 
                                                                                   ముకుందరావు  `దిఅదర్ సైడ్ ఆఫ్ బిలీఫ్` 
          •  అతడు గురువు కాదు.మత బోధకుడు కాదు. ప్రీస్ట్ కాదు.పండితుడు కాదు. నిస్సందేహంగా టిచ ర్ మాత్రం కాదు.నీలో పరివర్తన తీసుకు రావాలనే ఆసక్తి అతనికి ఉండదు.నిజం చెప్పాలంటే  అ తను ఏమి చేయడానికి ప్రయత్నించడు.ప్రయోజనం ఏమి లేకుండానే అతడు ప్రేమోద్వేగంతో  దహి స్తుంటాడు .
          • నీవు ప్రతిఫలించక పోతే అతని వెలుగు నీ మిద ప్రసరిస్తుంది.
          • దేవుడు లేడు. బోధన లేడు. ఆద్యాత్మిక పరష్కారం లేదు. ఆశ లేదు. ...యూజీ వీటిలో దే న్నీ నికివ్వడు.దీనికి విరుద్దంగా నీవెక్కడా  నిలబడటానికి వీలు లేకుండా మొతాన్ని కుల్చివేస్తాడు.
                  మహేష్ భట్ తో  యూజీనీ పరిచయం చేసిన మిత్రుడు.

          •  యూజీ అత్యంత సంపూర్ణమైన మనిషి.నా జీవితంలో ఇటువంటి వ్యక్తిని చూడలేదు. అక్కడ అసాధారణంగా బయటకు  ఏమీ కనిపించడు. అతనితో కొంత సమయం గడిపితే ఆ సంపూర్ణ నడకను నీవు చూస్తావు. నేను యూజీతో  కలిసి జీవించాను, ప్రయాణించాను. యూజీతో ఉన్న నిర్దిష్టమైన సమయం తరువాత నేను గ్రహించింది...యూజీ ఎవరినైనా తనతో సమానంగా చూస్తాడు. గౌరవిస్తాడు. పరిగణిస్తాడు. అర్ధం చేసుకుంటాడు. ప్రేమిస్తాడు. మరో విషయం ... చిన్న. పెద్ద, పేద, ధనిక ఎవరినైనా తనతో సమానంగా చూస్తాడు. మనందరం బందుత్వాలు, మన పైన, కింద అంటూ చూస్తాం. మనతో సమానంగా చూడం. అతని ప్రవర్తన అతని సహజ స్వభావం నుంచి వచ్చిందే. ఇలా ఉండడం  అతను ప్రయత్నించేది కాదు. లేదా ప్రత్యేకమైన వ్యక్తిగా అతను, అతని ప్రవర్తన ఉండదు. 
          • మరో ముఖ్యమైన లక్షణం ... ఏ ఒక్కరినీ తనస్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోడు. మాములుగా తాను తీసుకోవడంకంటే ఇచ్చేదే ఎక్కువగా ఉంటుంది. ఏమీ ఆశించకుండా అతను తిరిగి ఇస్తాడు. చాలా సందర్బాల్లో తీసుకునే వ్యక్తి గ్రహించలేనంతగా నిశ్శబ్దంగా, నిస్వార్ధంగా ఇస్తుంటాడు. తన స్వప్రయోజనా లకోసం ఎవరినీ అవకాశంగా తీసుకోవడం, మోసం చేయడం, తప్పుదారి పట్టించడం, ఉపయోగించు కోవడం, వ్యక్తిని, లేదా పరిస్థితులను అవకాశంగా తీసుకోవడం నేనెప్పుడు చూడలేదు. నిస్సహాయ స్థితిలో కుడా యూజీ అలా ప్రవర్తించలేదు. ఇలా ఎవరి గురించి అయినా చెప్పడానికి ప్రపంచంలో ఎవరూ తారసపడలేదు.  
          పర్వీన్ బాబీ బెంగులురులోని చంద్రశేఖర్ కు ఇచ్చిన మెయిల్ నుంచి 
          • మహేష్ ... సానుకూల దృక్పధానికి సంబంధించిన విషయం ఈ ప్రపంచంలో చాలా ఉంది. రియల్ ఫిలాసఫీ అక్కడ చాలా ఉంది. కానీ యాంటి ఫిలాసఫీ అక్కడ లేదు. ూజీని నిజంగా ఇలా పిలవ వచ్చు. ఎంతమంది నీ ఆశను నీ నుంచి తీసుకెళ్ళారు.నీ కాలి కింద పట్టాను ఎంత మంది లాగేశా రు. ఎవరూ ఆ పని చేయలేరు. యూజీ తరచు చెప్పేది అక్కడ ఆశ లేదు. కాని అది హోప్ లెస్ కాదు.   
          • యూజీ మీద నీవు ప్రేమను వ్యక్తం చేయలేవు. అది నిజంగా అతన్ని బాధపెడుతుంది. అతను చాలా సహజంగా దాన్ని అనుమతించడు. నా ప్రేమ వ్యక్తీకరణను కేవలం అతి సెంటిమెంటల్ నాన్సెన్స్ గా అతనెప్పుడూ గౌరవంగా తోసేస్తాడు.అది నిజం కావచ్చు. కానీ నా హృదయం దాన్ని నమ్మలేదు. ఈ ప్రపంచం ఒక ఏకాంత ప్రదేశం. నా జీవితం మీద అత్యంత తీవ్ర ప్రభావం చూపిన  యూజీ కృష్ణమూర్తి లేకుండా నేను ఎదుగుతాను. మరణిస్తాను. కాని ఈ నిజాన్ని నేను అంగీకరించ లేను. 
          స్కాట్ ఎస్కర్స్ లే, డైరెక్టర్, ఓక్ స్కూల్ ఒషై, కాలిఫోర్నియా
          • యూజీ టిచర్ కాదు. నీ సొంత టిచర్ నీకు శత్రువు అయినపుడు ఇతడు నీకు స్నేహితుడు అవుతాడు.
          • మన జీవితాలు సమస్యల్లోకి వెళ్ళినపుడు ...మేధోపరమైన సమస్యలు కాదు, భావోద్వేగమైనవి ఎదురైనపుడు ఆ సమస్యలను నీవు ఎదుర్కోలేని క్షణాలు ఎదురవుతాయి. నీకు ఏ సహాయం అందదు. నీకు నీవుగా ఏమీ చేయలేవు. అప్పుడు ఖురాన్, బైబిల్, గీత వంటి ఆధ్యాత్మిక  పుస్తకాల వైపు చూస్తావు. అకస్మాత్తుగా అవి కొంత స్వాంతన ఇస్తాయి.  కానీ అవి తాత్కాలికం. నీవు మళ్లీ అవే పుస్తకాలు చదువుతావు. అవి నిన్ను కొంత సేపు బయట పడేస్తాయి. ఇలా జరుగుతుంటుంది. ఈ క్రమలో చివరకు ఈ పదాలు కూడా మృత ప్రాయంగా కనిపిస్తాయి. ఈ పుస్తకాలు కూడా ఎందుకు పనిచేయడం లేదనే ప్రశ్న వస్తుంది. ఎప్పుడైతే ఈ పుస్తకాలు ఫెయిల్ అయ్యయో అప్పుడు టిచర్ కోసం చూడడం మొదలవుతుంది. వృత్తిలో ఇబ్బంది ఎదురైతే ఒక నిపుణుడి దగ్గరకు వెళతాం. ఆరోగ్య సమస్య అయితే డాక్టర్ దగ్గరకు వెళతాం. ఇటువంటి సమస్య ఎదురైనపుడు రజనీష్, డీ ఫ్రీజాన్, జె.కృష్ణ మూర్తి వంటి వారి దగ్గరకు వెళతాం. ప్రారంభంలో వారి సహాయాన్ని గుర్తిస్తావు. వారు నీకు జీవన మార్గాన్ని ఇస్తారు. కొంత ధ్యానం, కొంత తాత్వికత..., ఇవన్నీ తాత్కాలికంగా నీ ఖాళీలను పురిస్తాయి.ఒక సమాధానం దొరికిందని భావిస్తావు. ఈ ధ్యానం చేసినంత కాలం సందిగ్దం తొలగిపోతుంది. ఎప్పుడైతే ఇది ఆగిపోతుందో నీకు నివే మిగలిపోతావు. మళ్లీ సమస్య దగ్గరకే వస్తావు.  అందువల్ల నిజంగా నీకు సమాధానం కనబడదు. నీకు నీవు ఎంత కష్ట పడినా ఇంకా చేయాలని  ఇక్కడ టీచర్  చెబుతాడు. దీంతో రెండింతలు నీవు కష్ట పడటానికి ప్రయత్నిస్తావు. ఇదంతా పడగడుపులా అవుతుంది. నీకు నీవు నిజాయతీగా ఉంటే ఎక్కడా ఏమీ పొందలేమని గ్రహిస్తావు. దీంతో నీవు ఆగిపోతావు. అప్పుడు నీవు యూజీని కలుస్తావు. 
          విజయ్ ఆనంద్, ఫిలిం డైరెక్టర్ 
          •   నాజీవితంలో యూజీ చాలా విలువైన విషయాలు బోధించాడు. కాని వాటన్నింటి సారాంశం రెండు ముక్కల్లో చెప్పాలంటే `సింప్లీ స్టాప్`. 
          • స్పిర్త్యువాలిటి ఒక మల్టిమిలియన్ డాలర్ల పరిశ్రమ. కొత్త మాస్టర్స్, కొత్త గురువులు, టెక్నిక్కులు, పద్దతులు, బోధనలతో ఎదుగుతున్న పరిశ్రమ. ఎవరికివారు ఎనలైట్ మెంట్, మోక్షం, నిర్వాణ స్థితిని సాధించేందుకు నేరుగా వెళ్ళే దగ్గరి దారి ఇదే నంటూ చెప్పుకుంటారు. వీరు చెప్పే సత్యం, వాస్తవం వాళ్ళ  రోజువారి జీవితంలో కనిపించవు. ఆశలో, హింసలో జీవించే ప్రజల జీవితాల కంటే ఈ ఆధ్యాత్మిక దేవుళ్ళు ఏ మాత్రం భిన్నంగా ఉండరు. మరో వైపు ఈ మొత్తం ప్రహసనానికి అవతల యూజీ వంటరిగా నిలబడి ఇలా ప్రకటిస్తాడు...`అమ్ముకోవడానికి నా దగ్గర ఏమీలేదు.నిరూపించు కోవడానికి ఏమీ లేదు. నూరడానికి కత్తి లేదు.ఎందుకు యూజీ ఇలా అంటారంటే `నివు నీడను పట్టుకోవడానికి పరుగెడు తున్నావు. చాలా మాములుగా నీవు కోరుకునేది అక్కడ ఉనికిలో లేదు.`
          • అరుణ్ బాబాని, `యూజీ సేస్...` ఎడిటర్, ముంబై    

          Sunday, 21 August 2011

          యూజీ కృష్ణమూర్తి (UG KRISHNAMURTHY)

                                                         యూజీ   కృష్ణమూర్తి ఏమీ బోధించరు. ఆయనకు అనుయాయులు లేరు. పబ్లిక్ టాక్ ఏమీ లే దు. వేదికలు లేవు. పుస్తకాలు ఏమీ రాయలేదు. సాదన, శిక్షన   అంటూ ఏమీ చెప్ప డు.  సమస్యలకు పరిష్కారం చూపడు. ఒక సామాన్య మానవుడిలా  జీవించాడు. అయినా తననొక ఆత్మ జ్ఞానం పొందిన వాడిగా భావిస్తూ అనేక దేశాల  నుంచి అతని వద్దకు వచ్చి ఎడతెగని సంభాషణలు జరిపేవారు. శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, రచయితలు, విద్యావేత్తలు, జర్నలిస్టుల నుంచి సామాన్యుల వరకు తనపై పరంపరగా  ప్రశ్నలు సంధించే  వారు. తాను కేవలం  ప్రశ్నల  మూలాల్లోకి  తీసుకెల్లెందుకు ప్రయత్నించేవారు. ఈ క్రమంలో ప్రశ్నలే అదృశ్యమై వచ్చిన వారు  దిగ్బ్రమకు లోనయ్యే  వారు. తను మాత్రం  `నా జీవితం, నామాటలు నీటిమీద రాతలు. మీ  లాగ  (సారీ మీరు కాదు) మర్యాద, మప్పితంగా మాట్లాడ లేను` అంటారు. అయినా ఆ యిన  మాటలు తూటాల్లా పేలాయి. ఆయన జీవితం సంచలనాత్మకమైంది. ఆయన సంభాషణలు, పుస్తకాలు సీడీల  రూపంలో ప్రపంచాన్ని చుట్టాయి.