జ్ఞానోదయం (ENLIGHTMENT)
- `జ్ఞానోదయం` అంటూ ఏమీ లేదు. గురువులు, సాధువులు, జ్ఞానులు, లోకరక్షకులు వందల సంవత్సరాలుగా అక్కడ జ్ఞానోదయం ఉందని నొక్కి చెబుతూన్నారు. `వారు జ్ఞానోదయం పొందారు` అని నీవు చెప్పవచ్చు. వాళ్ళందరిని కట్టకట్టి ఓ నదిలో తోసేయి. అక్కడ ఏమీ జ్ఞానోదయం లేదని గ్రహించడమే జ్ఞానోదయం.
- స్వేచ్చ, జ్ఞానోదయం పొందిన మనిషి ఎవరికీ స్వేచ్చ, జ్ఞానోదయం కలిగించడానికి ఆసక్తి చూపడు. ఎందుకంటే స్వేచ్చ, జ్ఞానోదయం పొందినవాడినని తెలుసుకునే మార్గం అతనికి లేదు. ఇది ఎవరితోనైనా పంచు కునేదికాదు. ఎందుకంటే ఇది అనుభవం పరిధిలోకి రాదు.
- నాకు తెలిసి ఉన్నదంతా భౌతిక క్రమం, ఇందులో మార్మికత,ఆధ్యాత్మికత ఏమీ లేదు
No comments:
Post a Comment