యూజీ కృష్ణమూర్తి ఏమీ బోధించరు. ఆయనకు అనుయాయులు లేరు. పబ్లిక్ టాక్ ఏమీ లే దు. వేదికలు లేవు. పుస్తకాలు ఏమీ రాయలేదు. సాదన, శిక్షన అంటూ ఏమీ చెప్ప డు. సమస్యలకు పరిష్కారం చూపడు. ఒక సామాన్య మానవుడిలా జీవించాడు. అయినా తననొక ఆత్మ జ్ఞానం పొందిన వాడిగా భావిస్తూ అనేక దేశాల నుంచి అతని వద్దకు వచ్చి ఎడతెగని సంభాషణలు జరిపేవారు. శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, రచయితలు, విద్యావేత్తలు, జర్నలిస్టుల నుంచి సామాన్యుల వరకు తనపై పరంపరగా ప్రశ్నలు సంధించే వారు. తాను కేవలం ప్రశ్నల మూలాల్లోకి తీసుకెల్లెందుకు ప్రయత్నించేవారు. ఈ క్రమంలో ప్రశ్నలే అదృశ్యమై వచ్చిన వారు దిగ్బ్రమకు లోనయ్యే వారు. తను మాత్రం `నా జీవితం, నామాటలు నీటిమీద రాతలు. మీ లాగ (సారీ మీరు కాదు) మర్యాద, మప్పితంగా మాట్లాడ లేను` అంటారు. అయినా ఆ యిన మాటలు తూటాల్లా పేలాయి. ఆయన జీవితం సంచలనాత్మకమైంది. ఆయన సంభాషణలు, పుస్తకాలు సీడీల రూపంలో ప్రపంచాన్ని చుట్టాయి.
No comments:
Post a Comment