Tuesday, 30 August 2011

ప్రేమ (LOVE)

  •              ప్రేమ  గురించి చెప్పమని పదే పదే అడుగుతున్నావు. ప్రేమంటే ఇద్దరు వుండాలి. నీకు తెలుసు. నేను ఒకరిని ప్రేమిస్తాను.  నిన్ను మరొకరు   ప్రేమిస్తారు. ఎక్కడ విభజన వుంటుందో  అక్కడ ప్రేమ వుండదు. మనం ఈ లోటును పూరిం చడానికి ప్రయత్నిస్తుంటాం . ఇది మనకు దారుణమైన పరిస్థితి. ఇది అర్ధం లేనిది. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలనే ఫాన్సీ ఇడియా మనలోనించి డిమాండ్ చేస్తుంటుంది. మధ్య... అంటే నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. నా కుక్కను  ప్రేమిస్తాను. నా  భార్యను ప్రేమిస్తాను. ఎవరిని ప్రేమించినా ఏమిటి భిన్నత్వం. నా  మాటలు  చాలా వైరాగ్యంగా కనిపించవచ్చు . వాస్తవానికి  ఏమీ ప్రత్యేకత లేదు. నీవు నీ దేశాన్ని ప్రేమిస్తావు. నేను నా  దేశాన్ని  ప్రేమిస్తాను. అక్కడ యుద్ధం వుంటుంది. 
  •     నా నుంచి  సానుకూల సమాధానాన్ని కోరుకుంటున్నావు. నేను దాన్ని తప్పించు కోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇది  రాజకీయ ఇంటర్య్వు కాదు. నేను మోసం చేయడం లేదు. నాకేమీ తెలివిగల, డిప్లొమాటిక్  సమాధానం ఇవ్వాలని లేదు. నిజంగా ఈ  ప్రశ్న ప్రతి ఒక్కరూ అడుగుతారు. మన సంబంధాల్లో ప్రేమ లేదు. వాటిని ప్రేమ పూరిత సంబంధాలుగా చేయాలనుకొంటున్నాం.  ఇందు కోసం ఎంతో శక్తిని దారపోస్తుంటాం. ఇది ఒక యుద్ధం. శాంతి... శాశ్వితమైన శాంతి పొందుదామనే ఆశతో మొత్తం సమ యాన్నంతా యుద్ధం చేసేందుకు మనకు మనం సన్నద్దులమౌతుంటాం. ఈ యుద్ధంలో అలసిపోతావు.  చివరకు ప్రేమ రాహిత్య సంబందాలలోనే  సెటిల్ అయిపోవడం ఇక్కడ విషాదం. 
  •   ఇద్దరు వ్యక్తుల మధ్య సంపూర్ణమైన, ఆదర్సవంతమైన సంబంధం నేరిపే క్రమంలో ప్రేమ విఫలమైతే  అక్కడ ద్యేషం చోటుచేసుకుంటుంది. లేదా విరోధ భావం, విరక్తి ఏదైనా పదాలు ఉంటే...నేను పదాల్లో చాలా  పూర్...అనేక భావాలు చోటుచేసుకుంటాయి.
  •    `నీకు మల్లె  నీ పొరుగువాడిని ప్రేమించు`.  ఈ పేరుతో ఇటివల జరిగిన  యుద్దాలను పరిశీలిస్తే మనం ఎన్ని లక్షల మందిని చంపేశాం. నీ వలే నీ పొరుగువాడిని ఎలా ప్రేమిస్తావు.? ఇది అసాధ్యం. లేకపోతే అనేక మంది ప్రజలు, మహిళలు, పిల్లలు, నిస్సహాయులు ఎందుకు నరమేదానికి  గురౌతున్నారు. 
  • ప్రేమ, ద్వేషం ఒకే నాణానికి వ్యతిరేక దిశలో లేవు. రెండూ ఒకటే. ఒకే విషయం . 

No comments:

Post a Comment