పునర్జన్మ (RECORNATION)
- పునర్జన్మ లేదా కర్మను నేను వ్యతిరేకించడం లేదు. నేను నమ్మకం మూలాన్ని ప్రశ్నిస్తున్నాను . విశ్వసించే వారికి పునర్జన్మ ఉంది. విశ్వ సించని వారికి లేదు. గురుత్వాకర్షణ, లేదా ఇతర ప్రకృతి సూత్రాల ప్రకారం అటువంటిది ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం చెబుతాను. పునర్జన్మ మీద నీకు నమ్మకం ఉందా లేదా అనేది విషయం కాదు. మనకు తరచుగా ఎదురయ్యే `పునర్జన్మ ఏ మైనా ఉందా `అనే ప్రశ్నకు సమాధానం పొందాలంటే, ఆ సమస్యకు తెరపడాలంటే ఎవరికీ వారు తెలుసుకోవడానికి ఆసక్తి చూపాలి. పునర్జన్మ ఉందా? మనస్సు ఉందా? నేను ఉన్నానా ? ... ఇలా ఏ అంశాన్నైనా చుడండి. అదంతా కేవలం జ్ఞానం సృష్టి. నీవు అదృష్ట వశాత్తూ వీటన్నింటి తాలుకు మొత్తం జ్ఞానం నుంచి విముక్తి అయితే , ఏ మైనా కేంద్రం, నేను, ఆత్మ, స్వభావం అనే అనుభవం ఏ మైనా ఉంటుందా?. అందుకే `నేను` అనేది కేవలం మొదట నామవాచకం. నాకు అక్కడ కేంద్రం లేదా ఆత్మా ఏ మీ కనిపించవు. అందువల్ల పునర్జన్మ అనే భావనంతా కేవలం నమ్మకాల పునాధి మీద నిర్మితమైంది.
- మనం ఈ రోజు అంతు లేని బాధలు, దారిద్ర్యం ఆకలి, హీనమైన పరిస్థితులలో ఉన్నాం . పునర్జన్మ పాపాలవల్లె ఈ బాధలు అనే నమ్మకం ఈ పరిస్థితుల్లో మనకు సౌకర్యవంతంగా ఉటుంది. ఉన్న స్థితిని నేరుగా చూడకుండా ఈ నమ్మకం సేద తీరుస్తుంది. ఆధ్యాత్మిక , మరే విశ్వాసాలు కాని తోటి మనుషుల కు మనం ఏదో ఒకటి చేయాలనే తలంపుతో చేసేదంతా అమానవీయ కార్యాలె.
- మరణం తర్వాత జీవితం కొనసాగాలి అనే కోరిక నుంచే పునర్జన్మ మీద విశ్వాసం వచ్చింది. మరణం తరువాత ఏ మి జరుగుతుందనే కోరిక కుడా ఈ మెకానిజం నుంచే వచ్చిందే.
No comments:
Post a Comment