`అవతల` ఏ మైనా ఉందా?. ఎందుకంటే నీకు రోజువారి విషయాలు, నీ చుట్టూ ఏమి జరుగుతుంది అనే దాని మీద ఆసక్తి ఉండదు.`అవతల` అని పిలుస్తున్నదాని మీద, లేదా దేవుడు, సత్యం, వాస్తవం, బ్రహ్మం, ఆత్మజ్ఞానం, లేదా మరోటో కనుగొన్నావు. దాని కోసం నీ అన్వేషణ అంతా. అక్కడ ఏ `అవతల` ఉండకపోవచ్చు. `అవతల` గురించి నీకు విషయం తెలియదు. దాన్ని గురించి నీకేమి చెప్పారో అదే నీకు తెలిసింది. అందువల్ల ఆ జ్ఞానాన్నే ఆవిష్కరిస్తుంటావు.` అవతల` గురించి నీకున్న జ్ఞానమే నీవు పిలుస్తున్న `అవతల`ను సృష్టించింది. `అవతల గురించి నీకున్న జ్ఞానమే నీ అనుభవం అవుతుంది . ఆ అనుభవం నీ జ్ఞానాన్ని పదునేక్కిస్తుంటుంది. నీకేమి తెలిసినా అది అవతలకు వెళ్ళదు. ఏ అనుభవమైనా అవతలంటు ఏమీ ఉండదు. ఏదయినా అవతల అంటూ ఉంటే `నీవు` కదలిక అదృశ్య మైనప్పుడే ఉంటుంది. ఆ కదలిక లేకపోవడమే బహుశా `అవతల ` అని అనుకొవచ్చు. కాని `అవతల` అనేది ఎప్పటికీ అనుభవంలోకి రాదు. అనుభవంలోకి రానిదాని కోసం అనుభవంలోకి తెచ్చుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తావు .
దేవుడి నుంచి మనిషి రక్షింపబడాలి. అది చాలా అవసరం. నేననేది నీవు అంటున్న దేవుడు అనే అర్ధంలో కాదు. నా దృ ష్టిలో దేవుడు దేవుడుగానే లేదు. దేవుడు అనే భావన చుట్టూ కర్మ, పునర్జన్మ, మరణం తర్వాత... ఇలా మొత్తం విషయమంతా, గొప్ప భారతీయ వారసత్వమని నీవు చెప్పేదంతా...మొత్తం ప్రహసనాన్ని నీవు చూడాలి. మనిషి భారతీయ వారసత్వం నుంచి బయట పడాలి. ప్రజలే కాదు మొత్తం దేశం కూడా ఈ వారసత్వం నుంచి విముక్తి పొందాలి.
- కలగాపులగమైన మనస్సు చాలా విధ్వంసకర విషయాలను సృష్టించింది. అన్నింటిలో దేవుడు అనే భావన అత్యంత విధ్వంసకరమైంది. నాదృష్టిలో దేవుడికి సంబందించిన ప్రశ్న చాలా అసంబద్ద మైంది. అభౌతికమైంది. దేవుడి వల్ల మనకే మాత్రం ప్రయోజనం లేదు.రెండు ప్రపంచ యుద్దాలకంటే దేవుడి పేరుతో జరిగిన హింసాకాండలో ఎక్కువ మంది చనిపోయారు.పవిత్ర బుద్దభగవానుడి పేరు మీద జపానులో లక్షలాది మంది మరణించారు. ఇదే వరుసలో క్రిస్టియన్లు, ముస్లింలు ఉన్నారు. భారత దేశంలో కూడాఒక్క రోజులో ఐదు వేల మంది జైనులను ఊచకోత కోశారు. నీది కుడా శాంతియుత దేశం కాదు. నీ చిరిత్ర చదువుకో. మొదటి నుంచి హింసే కనబడుతుంది.
- మనిషి కేవలం భౌతిక జీవి. (భయోలాజికల్ బీయింగ్ ). స్వాభావికంగా అతనికి ఆద్యాత్మిక పార్శ్వం లేదు. అన్ని సద్గుణాలు, మార్గదర్సికాలు, నమ్మకాలు , భావాలు, ఆద్యాత్మిక విలువలు, కేవలం డాంబికాలు, అసహజమైనవి. అవేమి నీలో మార్పు తీసుకురాలేవు. నీవిప్పటికీ క్రూరుడవే. `నీవలె నీ పొరుగువాడిని ప్రేమించు` అనే తత్వం వల్ల నీవు జరిపే విచక్షణారహిత హత్యా కాండ ఆగదు. నీ పొరుగువాడిని చంపితే నీకూ అదే గతి పడుతుందనే భయంకరమైన నిజం వల్ల నీవు నరమేధాన్నిఆపుతావు.
No comments:
Post a Comment