- ఇతని పదాలకున్న శక్తిని `ఏ మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. ఇంతవరకూ ఎక్కడా తటస్థ పడని వరిజినల్ థింకర్ ఇక్కడ ఉన్నాడు. ఆధ్యాత్మికం, మనోవైజ్జ్ఞానికం, స్వయం సహాయం మీద అనేక వందల, వేల పుస్తకాలు ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తున్నాయి. అవన్నీ, ఆ ఆకర్షణలన్ని ఇప్పటికే నీ దగ్గర ఉన్నవే. యూజీ చెప్పేది నీకు తెలిసినదాన్ని బద్దలు కొట్టడమే . కొత్త దానితో భర్తీ చేయడం కాదు . కొత్త చిట్కాలు, క్రమ శిక్షణా మార్గాలు కాదు. కొత్త తగులాటంలోకి వెళ్ళకుండానే నీ నమ్మకాలు చెదిరి పోవడానికి, నీకు నీవు ముక్కలు కావడానికి నీవు సిద్దంగా ఉన్నావా ? ఉంటే ఈ పుస్తకాన్ని చదువు.లారీ మోరీస్, `నాచురల్ స్టేట్` సంపాదకుడు
- విభిన్నమైన తత్వవేత్తలకు సంబంధించిన అనేక పుస్తకాలు చదివా. నా కరవు తీరలెదు. వారిలో ఎవరూ పూర్తిగా, అసంపూర్తిగా గాని జీర్ణం కాలేదు. ఇక్కడ యూజీ మొదటి పుస్తకం చదవడంలోనే మొత్తాన్ని నేను అంగీకరించడం నాకు ఆశ్చర్యకరం. అంతే...ఇక అతన్ని ఆసాంతం చదివా. అతను మాట్లాడినదంతా ప్రచురిం చాలని నిర్ణయానికి రావడానికి ఇదే కారణం.`నాచురల్ స్టేట్`నా ఎనిమిదో పుస్తకం.ఇంకా రావాలని ఆశిస్తు న్నా.
పబ్లిషర్, `నాచురల్ స్టేట్`
- యూజీ మాటల్లో - `యుజీ ఫినిష్డ్ మాన్ `. ఇక అన్వేషణ లేదు. ప్రస్తానం లేదు. అయితే ఈ `ఫినిష్డ్ మాన్` సంబాషణలలో సైన్స్, మతం, రాజకీయాలు, తత్వశాస్త్రంలోని డొల్లతనాన్ని చెప్పడమే గాక, నేరుగా మూలాలలోకి వెళ్లి ఎవరినీ వప్పించే ప్రయత్నం చేయకుండానే చాలా సాధారణంగా, నిర్భయంగా, మొఖం మీద గుద్దినట్లు చెప్పడం కొంత ఆశ్చర్యం.
టెర్రీ న్యులాండ్ , మైండ్ ఈజ్ మిత్ సంపాదకుడు
- యూజీ ప్రస్తుత విలువల వ్యవస్థ స్థానంలో ప్రత్యామ్నాయాన్ని చూపడు.కానీ మానవ విశ్వాసాల మూలాలలోకి వెళ్లి అతను విశ్లేషించే తీరును నీవు చూడగలిగితే జీవితం గురించి నీవనుకొంటున్న మహోన్న త భావాలు బలవంతంగా నయినా వదిలించుకునేందుకు ప్రయత్నిస్తావు .ఇలా నీవు కొంత వరకు వెళ్ళగలిగితే,నీ జీవితాన్ని ఏ ప్రయత్నం లేకుండా సాధారణంగా ఎలా ఉండవచ్చో తెలుసు కోవడానికి అవకా శం ఉంటుంది. ఎందుకంటే విలువల చట్రాన్ని ఎక్కువకాలం మోయలేవు.
- కొత్త నమ్మకాల వైపు. మతాల వైపు నిన్ను మళ్ళించడానికి యూజీ ఏమాత్రం ఆసక్తి చూపడు. అపూర్వమైన దృస్టికోణాన్ని ఇస్తాడు. తనను తాను వ్యక్తీకరించుకొంటాడు.తీసుకో, లేకపోతే లేదంటాడు. నిన్ను సరైన వ్యక్తిగా తయారు చేయడానికి ఏమాత్రం ప్రయత్నించడు.నిజానికి నీలో మార్పే అవసరం లేదంటాడు. మారాల ని ఎడతెగని ప్రయత్నం చేయడం నీ విషాదం అంటాడు. చాలా సహజంగా జ్ఞానులు, . సాధువులు, మానవాళి రక్షకులుగా ... ఇలా ఎవరో నమూనాగా నీవు ఉండాలనుకొంటావంటాడు. లారీ మోరీస్, `నాచురల్ స్టేట్` సంపాదకుడు
- యూజీ చెప్పేదంతా నీవు అగీకరించు లేకపోతే లేదు.అతన్ని వినడానికి ప్రయత్నించడంలో చాల విలువ ఉంది. మన రిఫరెన్స్ పాయింట్ లోకి బాంబులు విసిరినట్లు అతని మాటలు దూసుకువస్తాయి. మన విశ్వాసాల పునాధులు కదిలిపోతాయి. దూసుకువచ్చే అతని మాటల ప్రవాహానికి మూలం ఎక్కడ అని నీవు ఆశ్చర్య పోతావు.
ఆంటోని పాల్ ప్రాంక్ నోరోన్హా ,`థాట్ ఈజ్ యువర్ ఎనిమీ` పుస్తకం ముందు మాటలో
- నిజం చెప్పాలంటే డెబ్బైలో నేను మొదటిసారి యూజీని విన్నప్పుడు చాలా కోల్పోయాను.అప్పుడు జేకేనే అంతిమం, సంపూర్ణ మైన ధార్మికం(ఎక్స్ట్రీంస్పిరుత్యువాలిటి), దాన్నిదాటిఎవరూవెళ్ళలేరు`.అనేభావనలో ఉన్నాను.మళ్లీయూజీని(రెండోకృష్ణమూర్తిని)కలిసినపుడుఅతను జేకే చెప్పిందిమొత్తం`రొమాంటిక్ హగ్వాష్`, కేవలంకల్తీలేనికల్పన(అన్ఆడాల్ట్రేటెడ్ ఫాంటసి),అంతకుమించి ఏమీ లేదు ` అనికొట్టేయడం నన్నుదిగ్బ్రమ కు, అత్యంత భయానికి గురిచేసింది. నాతలమండుతున్నట్టు,మొత్తందేహంనిప్పులకొలిమిలోఉన్న అను భూతిని జేకే కలుగ జేస్తే .యూజీనా తలనే మాయంచేసినట్టు, ఏ మాత్రం పసలేని ఆలోచనా పరుడిగా, ఒక జీరో ననే భావను కలిగించాడు.
ముకుందరావు `దిఅదర్ సైడ్ ఆఫ్ బిలీఫ్`
- అతడు గురువు కాదు.మత బోధకుడు కాదు. ప్రీస్ట్ కాదు.పండితుడు కాదు. నిస్సందేహంగా టిచ ర్ మాత్రం కాదు.నీలో పరివర్తన తీసుకు రావాలనే ఆసక్తి అతనికి ఉండదు.నిజం చెప్పాలంటే అ తను ఏమి చేయడానికి ప్రయత్నించడు.ప్రయోజనం ఏమి లేకుండానే అతడు ప్రేమోద్వేగంతో దహి స్తుంటాడు .
- నీవు ప్రతిఫలించక పోతే అతని వెలుగు నీ మిద ప్రసరిస్తుంది.
- దేవుడు లేడు. బోధన లేడు. ఆద్యాత్మిక పరష్కారం లేదు. ఆశ లేదు. ...యూజీ వీటిలో దే న్నీ నికివ్వడు.దీనికి విరుద్దంగా నీవెక్కడా నిలబడటానికి వీలు లేకుండా మొతాన్ని కుల్చివేస్తాడు.
మహేష్ భట్ తో యూజీనీ పరిచయం చేసిన మిత్రుడు.
- యూజీ అత్యంత సంపూర్ణమైన మనిషి.నా జీవితంలో ఇటువంటి వ్యక్తిని చూడలేదు. అక్కడ అసాధారణంగా బయటకు ఏమీ కనిపించడు. అతనితో కొంత సమయం గడిపితే ఆ సంపూర్ణ నడకను నీవు చూస్తావు. నేను యూజీతో కలిసి జీవించాను, ప్రయాణించాను. యూజీతో ఉన్న నిర్దిష్టమైన సమయం తరువాత నేను గ్రహించింది...యూజీ ఎవరినైనా తనతో సమానంగా చూస్తాడు. గౌరవిస్తాడు. పరిగణిస్తాడు. అర్ధం చేసుకుంటాడు. ప్రేమిస్తాడు. మరో విషయం ... చిన్న. పెద్ద, పేద, ధనిక ఎవరినైనా తనతో సమానంగా చూస్తాడు. మనందరం బందుత్వాలు, మన పైన, కింద అంటూ చూస్తాం. మనతో సమానంగా చూడం. అతని ప్రవర్తన అతని సహజ స్వభావం నుంచి వచ్చిందే. ఇలా ఉండడం అతను ప్రయత్నించేది కాదు. లేదా ప్రత్యేకమైన వ్యక్తిగా అతను, అతని ప్రవర్తన ఉండదు.
- మరో ముఖ్యమైన లక్షణం ... ఏ ఒక్కరినీ తనస్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోడు. మాములుగా తాను తీసుకోవడంకంటే ఇచ్చేదే ఎక్కువగా ఉంటుంది. ఏమీ ఆశించకుండా అతను తిరిగి ఇస్తాడు. చాలా సందర్బాల్లో తీసుకునే వ్యక్తి గ్రహించలేనంతగా నిశ్శబ్దంగా, నిస్వార్ధంగా ఇస్తుంటాడు. తన స్వప్రయోజనా లకోసం ఎవరినీ అవకాశంగా తీసుకోవడం, మోసం చేయడం, తప్పుదారి పట్టించడం, ఉపయోగించు కోవడం, వ్యక్తిని, లేదా పరిస్థితులను అవకాశంగా తీసుకోవడం నేనెప్పుడు చూడలేదు. నిస్సహాయ స్థితిలో కుడా యూజీ అలా ప్రవర్తించలేదు. ఇలా ఎవరి గురించి అయినా చెప్పడానికి ప్రపంచంలో ఎవరూ తారసపడలేదు.
పర్వీన్ బాబీ బెంగులురులోని చంద్రశేఖర్ కు ఇచ్చిన మెయిల్ నుంచి
- మహేష్ ... సానుకూల దృక్పధానికి సంబంధించిన విషయం ఈ ప్రపంచంలో చాలా ఉంది. రియల్ ఫిలాసఫీ అక్కడ చాలా ఉంది. కానీ యాంటి ఫిలాసఫీ అక్కడ లేదు. ూజీని నిజంగా ఇలా పిలవ వచ్చు. ఎంతమంది నీ ఆశను నీ నుంచి తీసుకెళ్ళారు.నీ కాలి కింద పట్టాను ఎంత మంది లాగేశా రు. ఎవరూ ఆ పని చేయలేరు. యూజీ తరచు చెప్పేది అక్కడ ఆశ లేదు. కాని అది హోప్ లెస్ కాదు.
- యూజీ మీద నీవు ప్రేమను వ్యక్తం చేయలేవు. అది నిజంగా అతన్ని బాధపెడుతుంది. అతను చాలా సహజంగా దాన్ని అనుమతించడు. నా ప్రేమ వ్యక్తీకరణను కేవలం అతి సెంటిమెంటల్ నాన్సెన్స్ గా అతనెప్పుడూ గౌరవంగా తోసేస్తాడు.అది నిజం కావచ్చు. కానీ నా హృదయం దాన్ని నమ్మలేదు. ఈ ప్రపంచం ఒక ఏకాంత ప్రదేశం. నా జీవితం మీద అత్యంత తీవ్ర ప్రభావం చూపిన యూజీ కృష్ణమూర్తి లేకుండా నేను ఎదుగుతాను. మరణిస్తాను. కాని ఈ నిజాన్ని నేను అంగీకరించ లేను.
- యూజీ టిచర్ కాదు. నీ సొంత టిచర్ నీకు శత్రువు అయినపుడు ఇతడు నీకు స్నేహితుడు అవుతాడు.
- మన జీవితాలు సమస్యల్లోకి వెళ్ళినపుడు ...మేధోపరమైన సమస్యలు కాదు, భావోద్వేగమైనవి ఎదురైనపుడు ఆ సమస్యలను నీవు ఎదుర్కోలేని క్షణాలు ఎదురవుతాయి. నీకు ఏ సహాయం అందదు. నీకు నీవుగా ఏమీ చేయలేవు. అప్పుడు ఖురాన్, బైబిల్, గీత వంటి ఆధ్యాత్మిక పుస్తకాల వైపు చూస్తావు. అకస్మాత్తుగా అవి కొంత స్వాంతన ఇస్తాయి. కానీ అవి తాత్కాలికం. నీవు మళ్లీ అవే పుస్తకాలు చదువుతావు. అవి నిన్ను కొంత సేపు బయట పడేస్తాయి. ఇలా జరుగుతుంటుంది. ఈ క్రమలో చివరకు ఈ పదాలు కూడా మృత ప్రాయంగా కనిపిస్తాయి. ఈ పుస్తకాలు కూడా ఎందుకు పనిచేయడం లేదనే ప్రశ్న వస్తుంది. ఎప్పుడైతే ఈ పుస్తకాలు ఫెయిల్ అయ్యయో అప్పుడు టిచర్ కోసం చూడడం మొదలవుతుంది. వృత్తిలో ఇబ్బంది ఎదురైతే ఒక నిపుణుడి దగ్గరకు వెళతాం. ఆరోగ్య సమస్య అయితే డాక్టర్ దగ్గరకు వెళతాం. ఇటువంటి సమస్య ఎదురైనపుడు రజనీష్, డీ ఫ్రీజాన్, జె.కృష్ణ మూర్తి వంటి వారి దగ్గరకు వెళతాం. ప్రారంభంలో వారి సహాయాన్ని గుర్తిస్తావు. వారు నీకు జీవన మార్గాన్ని ఇస్తారు. కొంత ధ్యానం, కొంత తాత్వికత..., ఇవన్నీ తాత్కాలికంగా నీ ఖాళీలను పురిస్తాయి.ఒక సమాధానం దొరికిందని భావిస్తావు. ఈ ధ్యానం చేసినంత కాలం సందిగ్దం తొలగిపోతుంది. ఎప్పుడైతే ఇది ఆగిపోతుందో నీకు నివే మిగలిపోతావు. మళ్లీ సమస్య దగ్గరకే వస్తావు. అందువల్ల నిజంగా నీకు సమాధానం కనబడదు. నీకు నీవు ఎంత కష్ట పడినా ఇంకా చేయాలని ఇక్కడ టీచర్ చెబుతాడు. దీంతో రెండింతలు నీవు కష్ట పడటానికి ప్రయత్నిస్తావు. ఇదంతా పడగడుపులా అవుతుంది. నీకు నీవు నిజాయతీగా ఉంటే ఎక్కడా ఏమీ పొందలేమని గ్రహిస్తావు. దీంతో నీవు ఆగిపోతావు. అప్పుడు నీవు యూజీని కలుస్తావు.
- నాజీవితంలో యూజీ చాలా విలువైన విషయాలు బోధించాడు. కాని వాటన్నింటి సారాంశం రెండు ముక్కల్లో చెప్పాలంటే `సింప్లీ స్టాప్`.
- స్పిర్త్యువాలిటి ఒక మల్టిమిలియన్ డాలర్ల పరిశ్రమ. కొత్త మాస్టర్స్, కొత్త గురువులు, టెక్నిక్కులు, పద్దతులు, బోధనలతో ఎదుగుతున్న పరిశ్రమ. ఎవరికివారు ఎనలైట్ మెంట్, మోక్షం, నిర్వాణ స్థితిని సాధించేందుకు నేరుగా వెళ్ళే దగ్గరి దారి ఇదే నంటూ చెప్పుకుంటారు. వీరు చెప్పే సత్యం, వాస్తవం వాళ్ళ రోజువారి జీవితంలో కనిపించవు. ఆశలో, హింసలో జీవించే ప్రజల జీవితాల కంటే ఈ ఆధ్యాత్మిక దేవుళ్ళు ఏ మాత్రం భిన్నంగా ఉండరు. మరో వైపు ఈ మొత్తం ప్రహసనానికి అవతల యూజీ వంటరిగా నిలబడి ఇలా ప్రకటిస్తాడు...`అమ్ముకోవడానికి నా దగ్గర ఏమీలేదు.నిరూపించు కోవడానికి ఏమీ లేదు. నూరడానికి కత్తి లేదు.ఎందుకు యూజీ ఇలా అంటారంటే `నివు నీడను పట్టుకోవడానికి పరుగెడు తున్నావు. చాలా మాములుగా నీవు కోరుకునేది అక్కడ ఉనికిలో లేదు.`
- అరుణ్ బాబాని, `యూజీ సేస్...` ఎడిటర్, ముంబై
No comments:
Post a Comment