- నా జీవితం గురించి చెప్పాలంటే ఎవరో ఒకరి జీవతం గురించి చెప్పినట్లవుతుంది. ఇక్కడ బంధం, సెంటిమెం ట్, భావోద్యేగాలు నాకు ఉండవు. దీంతో నా గతం గురించిన సొంత అనుభూతులు,ఆలోచనలుదాస్తున్న ట్లు ఉండడం వల్ల నీకు నా మీద తప్పుడు భావం పడుతుంది. నా స్థితి
- ప్రజలు నన్ను భౌతికవాది అంటారు.నాస్తికుడని కూడా అంటారు. వాళ్లెటువంటి ముద్రలు వేసిన వాటిపై నాకేఆసక్తి లేదు.వాటి ప్రభావం నా మీద ఇసుమంత కూడా ఉండదు.ఏ విషయంలోనూ నిన్ను ఒప్పించడాని కి లేదా నా మాటలు నెగ్గించుకోవడానికి ప్రయత్నించను.ప్రజలు వారికుండే సొంత కారణాలవల్ల నన్ను ఏదో చట్రంలో ఇమడ్చడానికి ప్రయత్నిస్తారు . నేను అతి సామన్యుడనని చెప్పినా నన్ను ప్రత్యేకంగా చూస్తారు.
- నా ఆసక్తి అంతా ఇతరులు చెప్పినదాన్ని తోసేయడం కాదు. (అది చాలా సులభం ). నేను చెప్పిన దాన్ని తోసేయడం .
No comments:
Post a Comment