బోధన (TEACHING)
- నేనేమీ బోదించను. మూలాలను కట్ చేయడంపైనే నా ఆసక్తి. విత్తనం కుళ్ళిపోయింది. అది వెళ్లి పోవాలి. చెట్టును ట్రిం చేయడం కాదు. అది నా మార్గం కాదు.
- నా బోధన అంటూ ఏమీ లేదు. ఎప్పుడూ ఉండదు. బోధన అనేది పదం కాదు. జీవితంలో మార్పు కోసం, నూతన ఆలోచనా మార్గాన్ని, లేదా చిట్కాను, పద్దతిని, లేదా వ్యవస్థను, `బోధన` ఇస్తుంది. నేను చెబు తున్నది బోధనేతర అంశం. నేను ఎలా ఉన్నాననేది మామూలుగా వివరించడం.
- నేనేమి చేయాలి. నీవు వస్తావు. నేను మాట్లాడతాను. `నేను నిన్ను విమర్శించాలి.రాళ్లువేయాలి`. ఇదంతా నిష్ప్రయోజనం. నీ చుట్టూ దుర్బేద్యమైన కోటను నిర్మించుకున్నావు. నీవేమి చెదరవు. అనుభూతి చెందవు. నీ స్థితిని అర్ధం చేసుకోవడం కష్టం. నీ చర్యలన్నీ గతించిన జ్ఞాపకాలనుంచి సాగుతుంటాయి. నీ చర్యల నుంచి నిన్ను నీవు విడి పోతుంటావు. ఈ క్షణంలో సంతోషం, అనుభూతి గురించి మాట్లాడవు. నీ చర్యలను, భావోద్యేగాలను నిరంతరాయంగా విశ్లేషిస్థూ, అదుపు చేస్తుంటావు. ఇలా అనుభూతి చెందాను...అలా వుండాలి అనుకుంటూ ఎప్పుడూ భవిష్యత్తులోకి పారిపోతుంటావు. నీ సమస్యకు నీ భవిష్యత్తుకు సంబంధం వుండదు. నీ సమస్యలన్నింటిని భవిష్యత్తులోనుంచి ఆలోచిస్తావు. అదంతా వ్యర్ధం. ఏదయినా జరిగితే ఈ క్షణంలో జరగాలి.
-
No comments:
Post a Comment