- జీవితం, మరణం, స్వేచ్చ గురించి మీరు కల్పించుకున్న మహోన్నత భావాలను తోసేయండి. అప్పుడు ఈ దేహం యధా స్థితిలో ఉంటుంది. సామరస్యతతో పనిచేస్తుంది. దానికి నీ సహాయం ఏమీ అవసరం లేదు. నీవు ఏమీ చేయొద్దు . శాశ్వితత్వం, పునర్జన్మ, మరణం గురించి... ఇలా ఎప్పుడూ పనికిమాలిన, బుద్దితక్కువ ప్రశ్నలు వేయొద్దు. శరీరం శాశ్వితమైంది. మరణించినా రూపం మారుతుంది . తర్వాత జీవితం, శాశ్వితత్వం వంటివి శరీరానికి పట్టవు. శాశ్వితత్వం కోసం పరితపించే ఆలోచనే శరీరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దృష్టిని చెదరగొడుతుంది.
- ఈ దేహానికి ఏది మంచిదో తెలుసనుంటాం. అదే మనకు సమస్యలను సృష్టిస్తోంది. దేహానికి తెలుసు దానికి ఏమి కావాలో. ఈ మామూలు సంబంధం మనకు అర్ధమైతే దేహం దాని మానాన అది ఉండటానికి ఆమో దిస్తాం . నెప్పి ఉన్నా డాక్టర్ దగ్గరకు వెళ్ళకూడదనే క్రైస్తవ సన్యాసులు భావిస్తున్నట్లు నేను చెప్పడం లేదు.
- ఈ దేహానికి నీ ధ్యానం చిట్కాలు ఏమీ అవసరం లేదు. నిజానికి అవి ప్రశాంతతను చెడగొడతాయి. ప్రశాంతత ఆల్ రెడీ అక్కడ ఉంది. ఇది ఒక అపూర్వమైన ప్రాణి (అర్గానిజం). ప్రశాంతంగా ఉండేందుకు ఈ దేహానికి ఏమీ అవసరం లేదు.
- జ్ఞానం కోసం, అత్మచైతన్యం కోసం ఎంతో చదివి జీవితాన్ని అంకితం చేసారనే వారి మీద ఆధారపడటం అనివార్యమైంది. వారు చెబుతున్న తత్వాలకు దేహానికి ఉన్న వాస్తవ జ్ఞానంతో పోల్చలేవు. వాళ్ళు చెబు తున్న మానసికమైన, భావోద్వేగమైన, ఆత్మ సంబంధమైన కార్యకలాపాలన్నీ ఏకోన్ముఖంగా సాగు తుం టాయి.
- ఈ శరీరం అత్యంత తెలివైంది. ఈ దేహం ఉనికిని తాజాగా ఉంచడానికి శాస్త్రీయమైన, లేదా వేదాంతపరమైన బోధనలు ఏమీ అవసరం లేదు.
- దానంతటది తాజాగా ఉండటానికి ఈ దేహానికి అత్యద్బుతమైన నడక ఉంది. ఇది తప్పనిసరి. ఎందుకంటే ఇంద్రియాలన్నీ ఎప్పుడూ సజ స్థితిలో సునిసితత్వంతో పని చేస్తుంటాయి.
- . `నేను` లేకుండా ఈ దేహాన్ని ఏమని పిలుస్తావు. ఇది కేవలం దేహం. కాని ఇది భిన్నమైన దేహం. దీని పనితీరు భిన్నమైన మార్గంలో ఉంటుంది. భిన్నమైన శక్తిని కలిగివుంటుంది. నైతిక జీవితానికి సంబంధించిన వత్తిళ్ళు పోతాయి. అంటే దీనర్థం నీవు చేసే నైతిక చర్యలు అపసవ్య మైనవో, మరొకటో కాదు. నీకు సమాజంతో ఘర్షణలు ఉండవు. ఎందుకంటే నీ లోపల ఘర్షణ లేదు. ఆలోచిస్తే అటువంటి వ్యక్తి నుంచి ప్రేమ, కరుణ, దయ ప్రవహిస్తుంటాయి.
- దేహం నుంచి మనస్సును వేరు చేయలేవు. మనస్సు కేవలం మానసికమైన కార్యకలాపాలకే పరిమితం కాదు. ప్రతి కణంలో ఆలోచన ఉంది. నీ దేహంలోని ప్రతికణంలో `నేను ` భావం పని చేస్తుంటుంది. వేరు చేయడం అంత సులభం కాదు
Tuesday, 30 August 2011
దేహం (BODY)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment