అభిప్రాయాలు (COMMENTS -2)
- యూజీనీ, యూజీ బోధనలను అర్ధం చేసుకోవడమంటే నీ అర చేతిలో గాలిని పట్టుకోవడమే. అయనా అవి సేద తీరుస్తాయి. తాజా గాలిని , పరిమళాన్ని ఇస్తాయి. కారుచిచ్చులా నిన్ను ద హించి వేస్తాయి కుడా. నిస్సందేహంగా యూజీ బోధనలు , కారు మబ్బులా కమ్మిన భ్రమల నుంచి మనలను భూమి మీదకు తీసుకువస్తాయి. దీంతో మనం తిరిగి ఘర్షణ లేని , వై రుద్యం లేని మామూలు జీవితం లోకి వస్తాం.
- యూజీనీ, అతని జీవితాన్ని గురించి సంభాషించ కుండా అతని బోధనలు అంచనా వేయడం కష్టం. జీవించడం ... జివించ కుండా ఉదాహరణగా చెప్పడానికి అతను ముందుంచిన సాధ్యాలు అనిశ్చితంగా ఉంటాయి. తనకు ఏమి జరిగింది, తాను ఎలా జీవిస్తుంది తనకు తానుగా బోధనలుగా యూజీ నుంచి వ్యక్తమౌతుంది. వాటి ప్రభావం లేకుండా, వాటితో తనకు తాను సంబంధం లేకుండా యూజీ గురించి మాట్లాడడం, అధ్యయనం చేయడం కష్టం. అయనప్పటికీ కొన్ని ప్రశ్నలకు సంబంధించి విస్మయాన్ని యూజీ బోధనలు పాఠకుడికి మిగులుస్తాయి. ఈ ప్రశ్నలకు అక్కడ ఏ సమాధానం ఉండక పోవచ్చు. జివితమైనా అంతే... యూజీ దృష్టిలో అర్ధం చేసుకోవడం అసాధ్యం.
- నారాయణమూర్తి, రిటైర్డ్ ఫిలాసఫీ టీచర్, యూ ఎస్
No comments:
Post a Comment