- సమయం, స్థలం అంటూ అక్కడ లేవు. అవన్నీ మేధోపరమైన భావనలు. అక్కడ పదార్థం (థింగ్) లేదా నీవంటున్ననాలుగు కొలతల స్థలం,( ఫోర్ డైమన్షన్ స్పేస్ ), సమయం కొనసాగడం(టైం కంటిన్యుఎషన్) అంటూ ఏమి ఉండదు. ఈ స్థితి స్థలం, సమయం ప్రకారం నడవదు. ఎందుకంటే ఇక్కడ కొనసాగింపు ఉండదు.
- ఆలోచనే సమయం. ఆలోచన లేకపోతే సమయం ఉండదు. ఎక్కడ కేంద్రం ఉండదో అక్కడ స్పేస్, స్థలం ఉండదు . ఎక్కడ కేంద్రం ఉండదో అక్కడ మొత్తంలో నీవు భాగస్వామివి అవుతావు. ఇది ప్రతి దాన్ని కదిలిస్తుంటుంది. దీంట్లో మార్మికమైన అర్ధం లేదు.
No comments:
Post a Comment