- అర్ధవంతమైన, ప్రయొజనపూర్వకమైన సంబధాలకోసం ఆసక్తి ప్రదర్సిస్తుంటాం. అందు వల్ల వాస్తవ ప్రపం చాన్నిఅర్ధం చేసుకోవాల్సి ఉంది.కాని అర్ధం చేసుకోవడానికి ఏమీ లేదు. వాస్తవం అంటూ ఏమీ లేదు. వాస్త వ ప్రపంచమంటూ నేను అంగీకరించడం అంటే అది సమాజం నన్ను నిర్దేసించిందే.వాస్తవ జగత్తును అర్ధం చేసుకోవడమంటే అర్ధం కోసమో, సహాయం, ప్రయోజనం కోసమో కాకుండా ఉండాలి.
- నిన్ను నీవు అర్ధంచేసుకోవడం అనేది అతి పెద్ద జోక్స్ లో ఒకటి . ఆధ్యాత్మిక మనిషి , సనాతన జ్ఞానులే కాకుండా ఆధునిక శాస్త్రవేత్తలు కుడా ఈ భావనకు అగ్ర స్థానం వేసారు.ఇక మానసిక శస్త్ర వేత్తలు అయితే ఆత్మ జ్ఞానం, స్వీయ వాస్తవికత, ఏ క్షణానికి ఆ క్షణం జీవించడం ...ఇలా చెత్తను మాట్లాడడానికి ఎంతో ఇష్టపడ తారు .
- మనిద్దరి మధ్య ఏమైనా భావప్రసారం ఉందా? మనం దాన్ని పెంచి పోషిస్తున్నామా? భావప్రసారాన్ని ఒక సాధనంగా ఇద్దరం ఉపయోగించు కుంటున్నాం అంతే.అర్ధం చేసుకోవడం అసాధ్యం. నా ప్రతి మాట నీ జ్ఞాన చట్రంలో అనువాదమై పోతుంది . నేను చెప్పేది నీకు రిఫరెన్సు పాయింట్ అవుతుంది.
No comments:
Post a Comment