సహజ స్థితి ( NATURAL STATE)
- అక్కడ నీలో ఎప్పు డూ అద్బుత మైన ప్రశాంతత ఉంది. అదే నీ సహజ స్థితి. దాన్నినీవు ఎప్పటికీ అర్ధం చే సుకోలేవు. నీవు ప్రశాంతమైన మానసిక స్థితిని సృస్టించు కోవడానికి ప్రయత్నిస్తుంటావు. నిజానికి అదే నీలో గందర గోలానికి దారితీస్తుంది. నీవు కేవలం శాంతి గురించే మాట్లాడుతావు. ప్రశాంతమైన మనస్సును సృష్టించుకుంటావు. అంతా ప్రశాంతంగా ఉన్నట్లు నీకు నీవు చెప్పుకుంటావు. కానీ అదంతా హింస. శాంతిని సాధన చేయడం వల్ల, నిస్సబ్దం కోసం నీవు చేసే ప్రయత్నం ఏ మాత్రం ఉపయోగం లేనిది . నిజమైన నిశ్సబ్దం విస్పోటనం. ఆద్యాత్మికవాదులు చెబుతున్న సమాధి స్థితి ( డెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ )కాదు .అది మెరుపు స్థితి. అదినీటి బుగ్గ. ఆదిశక్తి . అదే జీవితం. అదే దాని ప్రయాణం. అదే సహజ స్థితి.
- >అఫెక్షన్ అంటే ప్రతిదానికి కదిలిపోవడం. అది ఒక దాని వైపు ఉద్యేగంగా వెళ్ళడం కాదు.సహజ స్థితి అనేది గొప్ప సునిశితమైన స్థితి. ఇంద్రియాలకు సంబందించిన భౌతిక సునిసితత్వం ఇది. ఇది నాపట్ల ఇతరుల పట్ల ఉద్వేగ పరంగా కరుణ, లేదా దయగా ఉండడమనే ప్రక్రియ కాదు. ఇక్కడ విభజన ఉండదు.
- నీ సహజ స్థితికి ఆద్యాత్మిక స్థితులైన ఆనందం, బ్రహ్మానందం, ఆనందప్రవాహం ...వంటి వాటితో ఏ మాత్రం సంబంధం లేదు. అవన్నీ అనుభవం పరిధిలోకి వస్తాయి. నాకు తెలిసి ఉన్నదంతా స్వచ్చమైన భౌతికక్రమం . ఇందులో మార్మికత, అద్యాత్మికత ఏమీ లేదు.
- సత్యం, వాస్తవం, అంటూ నీవు చేసే వెతుకులాట అంతా నీ సహజ స్థితికి నిన్ను దూరం చేస్తుంది. ఆ స్థితి అక్కడ ఉంది. నీ ప్రయత్నాలతో పొందేది కాదు. సాధించడం, ఫలితాలు రావడం అనేది ఉండదు. అసలు అక్కడ దానంతట అదివ్యక్తమౌతూ ఉంటుంది. నీవు చేసేవన్నీ అసాద్యమైనవి.
- >సహజ స్థితి అంటే ఆత్మ చైతన్యం , దైవత్వం పొందడం కాదు, ఇది సాధించేది, పొందేది కాదు. ఇది ఉనికిలోకి తెచ్చేది కాదు. అది అక్కడ ఉంది. అది జీవన స్థితి. `జీవితం` అంటే అది అమూర్తమైందనే అర్ధం కాదు. ఆలోచనతో సంబంధం లేకుండా ఇంద్రియాలు పనిచేయడం. ఆలోచనకు లాభాపేక్ష ఉంటుంది. ఆలోచన తాననుకున్న విధంగా కొనసాగడానికి ఇంద్రియాల కదలికలను నిర్దేసిస్తుంటుంది.
- నీ సహజ స్థితికి, ఆధ్యాత్మిక ఆనందం, బ్రహ్మానందానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇటువంటివన్నీ అనుభవం పరధిలోకి వస్తాయి. అవన్నీ వందల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక అన్వేషణ దిశగా మనిషిని నడిపించాయి. అదంతా ఆలోచన సమ్మతమైన స్థితి. అది వస్తుంటుంది . పోతుంటుంది. దాన్ని ఎవరూ అందుకోలేరు. గ్రహించలేరు. వ్యక్తికరించలేరు. అది దెబ్బతిన్న రహదారి. అది నిన్ను ఎక్కడికీ తీసుకెళ్లలేదు .అక్కడ ఎండ మావుల్లో చలమ ఏమీ లేదు. వెళితే అక్కడ బురదలో చిక్కుకు పోవడమే.
No comments:
Post a Comment