- మొత్తం అధ్యాత్మిక వ్యాపారమంతా నైతిక ప్రవర్తన తప్ప మరేమీ లేదు. ప్రవర్తన ప్రణాళికను సమాజం తన ప్రయోజనాలకోసం నిర్దేశిస్తుంది. మతానిది కుడా ఇదే దారి. నీలో అదుపు కోసం పూజారిని నియమిస్తుంది. బయట పోలిస్ మాన్ సంస్తాగతమయ్యాడు అలా.
- జ్ఞానం కోసం, ఆత్మ చైతన్యం కోసం ఎంతో చదివి జీవితాన్ని అంకితం చేశారనే వారి మీద ఆధారపడటం అనివార్యమైంది. వారు చెబుతున్న తత్వాలను దేహానికి ఉన్న వాస్తవ జ్ఞానంతో పోల్చలేవు.ఈ శరీరం అత్యం త తెలివైంది. ఈ దేహం ఉనికిని తాజాగా ఉంచడానికి శాస్త్రీయమైన లేదా వేదాంతపరమైన బోధనలు యేమీ అవసరం లేదు. వారివి కేవలం మాటలు. ఏమాత్రం నిర్దిష్టత ఉండదు. గుడ్డి నమ్మకాలు. గురువులు, మత గ్రంధాలు చెప్పేదాన్ని నీవు చాలా తెలివిగా హేతుబద్దం చేస్తావు. నీ నమ్మకాల ఫలితమే ఆధిపత్యాన్ని గుడ్డిగా అంగీకరించడం. ఇదంతా రెండో తరగతి జ్ఞానం. నీ నమ్మకాల నుంచి నీవు విడిగా లేవు. నీ నమ్మకాలు, నీ భ్రమలు తొలిగితే నీవు మిగలవు.
- నీ మేడిటేషన్లు, సాధనలు, పద్దతులు, చిట్కాలు అన్ని అర్ధం లేనివి. వాటన్నిటి అర్ధం నీలో మార్పు తీసుకురావడం. అసలు పరివర్తన, మార్పే లేదు. అక్కడ మార్పుందని అంగీకరించడం నీ విశ్వాసం. అసలు ఎవరు మారాలనేది నీవు ఎప్పుడూ ప్రశ్నించవు.నీలో పరివర్తన కోసం రూపుదిద్దుకున్న భావనే మొత్తం `మిస్టిక్ ఆఫ్ ఎనలైట్ మెంట్`.
- వాళ్ళు నిన్ను హెచ్చరిస్తుంటారు. బాగా కష్టపడాలి.అధ్యయనం చేయాలి.ధ్యానం చేయాలి అంటూ నిర్దేసి స్తుంటారు. టీచరు, గురువు, నాయకుడు ...వాళ్ళు చూపేవి తప్పుడు మార్గాలు. అతడే నిజాయతీగా పనిచే యడు. చవక రకం ,నాశిరకం వస్తువులను అమ్ముకొంటూ తనను తానే అమ్ముకొంటాడు.వీరి మీద నీ ఆశలు తోసేయగలిగితే వాళ్ళు నీ దగ్గర ఈ వ్యాపారం చేయరు.
- ధ్యానం ఒక యుద్ధం. యుద్ధం ముగిసిన తర్వాత శాంతి లభిస్తుందని స్వాములు వాగ్దానం చేస్తారు. నీకు కేవలం బాధాకరమైన అనుభవమే మిగులుతుంది.మెడిటేషన్ మోక్షం అనే లక్ష్యమే గాకుండా సాంస్కృతిక చట్రంలో నిన్ను బందీని చేస్తారు. చివరకు పొందేదేమీ లేదు.బాధ తప్ప.చిత్రమైన అనుభవాన్ని పొందితే పొంద వచ్చు. అది నీకయినా మరేవరికయినా విలువయింది కాదు.
- నీ ఆలోచనలు వలె నీ కోరికలు ...ఏమైనా సరే అదుపు చేయాలి, అణిచివేయాలి. పవిత్రుడిగా ఔన్యత్యాన్ని అందుకోవాలి.నరకప్రాయమైన ఈ స్థితిని కోరిక లేని స్థితిగా పిలుస్తావు .ఎందుకోసం ఇదంతా.నేను ఖచ్చితం గా చెప్పగలను. నీకు కోరిక లేకపోతే నిన్ను శవంగా భావించి శ్మశానానికి తరలిస్తారు.
- ఆధ్యాత్మికం, మతం పొల్యూషన్ కంటే వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదం కాదు.ఇది ప్రపంచాన్ని చుట్టిన భయంకరమైన అంటు రోగం.
- ఈ ప్రపంచంలో సంక్షోభానికి గురువుల బోధనలే కారణం. ఈ బోధకులందరూ చేసింది ఏమీ లేదు.గందరగో ళం తప్ప.ఈ సంస్కృతికి రాజకీయ నాయకులు వారసులు. వీరిని దుర్నీతిపరులని నిందించి ప్రయోజనం లేదు.మత గురువులు దుర్నీతిపరులు. ప్రేమను ఎవరు బోధిస్తారో ఆ మనిషి ఈదుర్నీ తికి కారణం.ఎందు కం టే మనవ చైతన్యంలో అతడు విభజనను సృస్టించాడు. ప్రపంచంలో ఈ రోజున్న భీబచ్చానికి ఈ మనిషి చెబుతున్న`నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు` అనే సూక్తే కారణం.ఈగురు వులనువదలొద్దు. వీరి భోదన లు ఏమీ చేయలేవు. కాని ప్రపంచంలో గందరగోళాన్ని తీసుకువచ్చాయి .కేవలం మనుషులను నాశనం చేసే దిశలో ముందడుగు వేయడం కాదు.ఈ రోజు ఈ ప్లానెట్ మీద ఉన్న ప్రతి జీవిని నాశనం చేస్తున్నా యి.
- నీకు నీ అనుయాయులకు మనిషి భవష్యత్తు గురించి ఏమాత్రం ఆసక్తి లేదు. కేవలం మీకున్న కొన్ని దగ్గరి లక్ష్యాలు ఎరవేర్చు కోవడం కోసమే ...ఇదంతా కేవలం ఒక తంతు. మానవాళి , ప్రేమ అంటూ గంటలు గంటలు మాట్లాడుతుంటారు. నీకు నిజంగా ఆసక్తి ఉందా? మానవాళి భవిష్యత్తుపై శ్రద్ధ ఉందా? కోపోద్రేకమైన నీ వ్యక్తిత్వం, నిష్కపటం, శ్రద్ధ అర్ధం లేనివి. అదంతా ఒక కర్మకాండ . నీవు కూర్చో... మాట్లాడు... అంతే ఆవేశ పడొద్దు. ఆవేశ పడితే ప్రశ్నించ లేవు . నీ గురించి కుడా. కూర్చో. కోపం గురించి నిరంతరాయంగా మాట్లాడుతుంటారు. దేహం పని అయిపోయింది. కోపాన్ని అది తీసుకుంది. దాన్ని చాలా ఎక్కువగా తీసు కుంటున్నావు. అది నిన్ను ఒత్తిడికి లోను చేస్తే స్వాముల దగ్గరకు వెళ్లొద్దు. మాత్రలు వేసుకో... ఏమైనా చేయి. ఆ పవిత్రమైన, పరిశుద్దమైన వ్యాపారం నీకేమీ సహాయపడదు. సమయం వృధా చేసుకోవద్దు.
- మామూలు అర్థంలో హిందూఇజం మతం కాదు. ఇదంతా కలగాపులగం. అనేక విషయాల కలయిక. వందలాది దుకాణాలున్న బజారు లాంటిది.
No comments:
Post a Comment