ఈ విషయాలపై ఆలోచించండి
‘Think on These Things’
జె.కృష్ణమూర్తి
—------------------------------
ఆలోచనలకు కొత్త దిశానిర్దేశం!
-పేరుకు తగ్గట్టే, ఇది కేవలం ఒక పుస్తకం కాదు, మన ఆలోచనలను, నమ్మకాలను సమూలంగా ప్రశ్నించి, మేధోమథనానికి గురిచేసే ఒక శక్తివంతమైన పిలుపు.
—------------
ఇది మీరు చదవాల్సిన పుస్తకం కాదు – మీరు చూసుకోవాల్సిన అద్దం. మీరు తల్లిదండ్రిగా, ఉపాధ్యాయుడిగా, లేదా ఒక బాధ్యతగల సమాజ సభ్యుడిగా ఉన్నా…ఈ పుస్తకం మీరు ఏదో నేర్పాలనుకున్న సమయంలో, మీకే నేర్పుతుంది.
—------------
ఈ పుస్తకం చదవడం ఒక అభిప్రాయాన్ని మార్చుకోవడం కాదు – మీ విశ్వాసాలపై తిరుగుబాటు చేయించే ప్రక్రియ. మన conditioning, భయం, ఆస్తి, గౌరవం కోసం చేసే పరుగుల వెనక దాగిన అసలు మనిషిని చూసే ఒక స్వచ్చమైన అద్దం.
—------------
ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను, జీవన విధానాన్ని పునఃపరిశీలించుకునే అవకాశం ఇస్తుంది. ఇది కేవలం పుస్తకం కాదు, ఒక ఆత్మాన్వేషణ యాత్ర! ఇది మారాలని చెప్పదు – చూడమంటుంది.
—----------
మీరు పిల్లలకు ఏం నేర్పుతున్నారో కాకుండా – మీరు ఎలా జీవిస్తున్నారు అనేది వారికి బోధపడుతుంది."
—----------
జిడ్డు కృష్ణమూర్తి ‘Think on These Things’ ఒక అసాధారణ గ్రంథం. జేకే గ్రంథాలలో అత్యంత ప్రభావశీలమైన రచనల్లో ఒకటిగా నిలుస్తుంది. ఆయన రచనలలో Freedom from the Known (1969), The First and Last Freedom (1954)తో పాటు ఈ పుస్తకం అత్యంత ప్రభావం చూపిన టాప్-3 గ్రంథాలలో ఒకటిగా చెప్పవచ్చు. భారతదేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో జరిపిన సంభాషణల ఆధారంగా రూపొందిన ఈ పుస్తకం, సమాజం, విద్య, మతం, సంప్రదాయం, రాజకీయాలను కృష్ణమూర్తి తనదైన స్పష్టత, సరళతతో విశ్లేషిస్తారు. కానీ ఇది కేవలం విద్య గురించి మాత్రమే కాదు – మన జీవన పద్ధతుల్ని, మన విలువల్ని, మన సమాజాన్ని ప్రశ్నించే ఒక అద్భుతమైన మానవీయ పిలుపు.
ఈ పుస్తకం ఆలోచనలను కదిలించే శక్తివంతమైన గొంతు. ఇది మనలోని భయాలను, కోరికలను, సామాజిక ఒత్తిళ్లను ప్రశ్నించమని, స్వేచ్ఛగా ఆలోచించమని, నిజమైన మానవత్వాన్ని ఆవిష్కరించమని పిలుపునిస్తుంది.
కృష్ణమూర్తి విద్య గురించి మాట్లాడుతూ, అది కేవలం సమాచార సేకరణ కాదని, స్వతంత్ర ఆలోచన, సృజనాత్మకత, స్వీయ-అవగాహనను పెంపొందించాలని ప్రధానంగా చెబుతారు. నీతి, బాధ్యత, స్వేచ్ఛల మధ్య సమతుల్యతను, అంతర్దృష్టితో జీవించే మార్గాన్ని ఈ పుస్తకం చూపిస్తుంది. కృష్ణమూర్తి విద్య అనేది మనసును విముక్తి చేసే సాధనంగా ఉండాలంటారు.
ఈ పుస్తకం సమాజాన్ని, ఉపాధ్యాయులను, ముఖ్యంగా తల్లిదండ్రులను మేల్కొల్పే ఒక ఆహ్వానం. ఇది యువ మనసులను సంకెళ్ల నుంచి విడిపించి, నిజమైన జ్ఞానం, ప్రేమ, స్వేచ్ఛల వైపు నడిపిస్తుంది. ప్రతి పాఠకుడి హృదయాన్ని తాకే ఈ గ్రంథం, మనం ఎవరమనే ప్రశ్నను మనలోనే లేవనెత్తుతుంది.
జె. కృష్ణమూర్తి తన అద్భుతమైన అంతర్దృష్టితో, సాధారణ సంభాషణల రూపంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అందించిన ఈ సందేశాలు నేటికీ అత్యంత ప్రభావవంతమైనవి. భారతదేశంలో ప్రారంభమైన ఈ ప్రసంగాలు, మానవ సమాజంలోని ప్రతి కోణాన్ని – సంస్కృతి, విద్య, మతం, రాజకీయాలు, సంప్రదాయాలు – నిశితంగా పరిశీలిస్తాయి. ఆశయం, దురాశ, అసూయ, భద్రత పట్ల కోరిక, అధికారం పట్ల దాహం వంటి ప్రాథమిక భావోద్వేగాలు మానవ సమాజానికి ఎలా నష్టం కలిగిస్తున్నాయో ఆయన తేటతెల్లం చేస్తారు.
కృష్ణమూర్తి ఆలోచనలు అసాధారణమైన సరళతతో, సూటిదనంతో మనల్ని మనం ఎదుర్కునేలా చేస్తాయి. ఈ పుస్తకం ముఖ్యంగా విద్యపై, యువ మనస్సుల వికాసంపై దృష్టి పెడుతుంది. సంప్రదాయ విద్యావ్యవస్థ సృజనాత్మకతను అణచివేసి, అనుగుణ్యతను ప్రోత్సహిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శిస్తారు. నిజమైన తెలివితేటలు అంటే స్వతంత్రంగా ఆలోచించడం, పక్షపాతం లేకుండా పరిశీలించడం అని ఆయన చెబుతారు. స్వేచ్ఛ, బాధ్యతల మధ్య గల సంబంధాన్ని వివరిస్తూ, నిజమైన స్వేచ్ఛకు ఆత్మజ్ఞానం, నైతిక జీవనం ఎలా అవసరమో తెలియజేస్తారు.
ఈ పుస్తకం కేవలం జ్ఞానాన్ని అందించడం కాదు, అది మనల్ని మనం లోతుగా అర్థం చేసుకునే ప్రక్రియలో ఒక తిరుగుబాటును రేకెత్తిస్తుంది. మనం నమ్మిన ప్రతిదాన్ని కదిలించి, మనసును స్వేచ్ఛగా ఉంచుకోవడమే విద్య నిజమైన ఉద్దేశ్యమని ఆయన బోధిస్తారు. దురదృష్టవశాత్తు, నేటి విద్య భౌతికవాదానికి బందీగా మారి, స్వేచ్ఛకు బదులుగా రుణభారాన్ని మోపుతోంది. ఈ పరిస్థితి నుంచి విద్యను ఎలా విముక్తం చేసి, నిజమైన స్వేచ్ఛకు మార్గం సుగమం చేయాలో కృష్ణమూర్తి మనకు ఆలోచింపజేస్తారు. పిల్లల్ని తప్పులు చేయనివ్వకుండా నడిపించే పద్ధతా? లేకపోతే, వారు ఎందుకు తప్పులు చేస్తున్నారో గమనించే శక్తిని పెంచే ప్రయాణమా?అని జెకె ప్రశ్నస్తారు. కృష్ణమూర్తి ప్రకారం, నిజమైన విద్య యువతలోని అంతర్గత తెలివితేటలను మేల్కొల్పడంలో సహాయపడుతుంది. ఇది కేవలం విషయ పరిజ్ఞానం మాత్రమే కాదు, అది నిరంతరం, ఉద్వేగభరితంగా, దృఢంగా ఉండే ఒక శక్తి. ఈ శక్తి స్వచ్ఛమైనది, ఆశలు లేనిది. అది వాస్తవికతను కనుగొనడంలో సహాయపడుతుంది. అటువంటి శక్తి నుంచి వచ్చే సామర్థ్యం అపారమైనది, అపరిమితమైనది.
కృష్ణమూర్తి బోధనలు విస్తృతమైన ఆలోచనల సముద్రాన్ని కలిగి ఉన్నాయి. ఆయనకు ప్రత్యేకంగా ఒక "సందేశం" అంటూ ఏమీ లేదు. కానీ ఆయన మాటలు మనసులో ప్రశ్నల వెల్లువ సృష్టిస్తాయి. అవి, నిజమైన మనిషిగా జీవించడం అంటే ఏమిటో తెలుసుకోవడానికి మన ఆలోచనలకు పదును పెడతాయి. నేటి భయంతో కూడిన, షరతులతో కూడిన సమాజంలో, నిజమైన, నిష్కళంకమైన మానవత్వాన్ని సజీవంగా ఉంచడం కష్టం. కృష్ణమూర్తి రచనలు మనలోని కపటత్వాన్ని మనం ఒప్పుకునేలా చేస్తాయి., భయం, అభద్రత, కోరికలు లేని జీవితాన్ని ఆకాంక్షించేలా చేస్తాయి.
సమాజానికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మేల్కొలుపు. జ్ఞానోదయం వైపు ఒక ప్రయాణం ఇది.
ఈ పుస్తకం ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, యువతను తీర్చిదిద్దాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక నిత్యనూతన మార్గదర్శి. పోటీతత్వాన్ని కాకుండా, సంపూర్ణ వికాసాన్ని ప్రోత్సహించే విద్య ప్రాముఖ్యతను ఇది ప్రధానంగా చెబుతుంది. నిన్నటి మనిషిని కాపాడే విద్య కాదు – రేపటి మనిషిని మేల్కొలిపే విద్య అవసరం అనే భావనను కలిగిస్తుంది. మీ నమ్మకాలను సవాలు చేయాలనుకుంటే, ఈ రచనను చదవండి. కృష్ణమూర్తి రచనలలో అత్యంత ప్రభావం చూపిన మూడు గ్రంథాలలో ఇది ఒకటిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా ఆలోచనాపరులను ఆకర్షిస్తోంది.
ఈ పుస్తకం చదివితే
—-------------------
*మీరు మీ పిల్లల్ని ఎలా చూస్తున్నారో ప్రశ్నించుకుంటారు.
*పిల్లల భావితరాన్ని కట్టిపడేసే వ్యవస్థలను మీరు గమనిస్తారు.
*నిజమైన మార్పు ఎలా వస్తుందో అన్వేషిస్తారు
ఈ పుస్తకం మీకు నేర్పేది
—---------------------
-అభిలాషలు, భయాలు, అసూయలు – ఇవన్నీ మానవ సమాజాన్ని పాడుచేసే మూలాలుగా చూపిస్తుంది.
-విద్య ద్వారా పిల్లలలో స్వేచ్ఛను, ప్రశ్నించగల శక్తిని, అబద్ధపు విలువలపై తిరుగుబాటు చేయగల సాహసాన్ని ఇస్తుంది.
-సత్యం అనేది ఒక దారి కాదు – అది వ్యక్తిగత అవగాహనతో మాత్రమే కనిపించగలిగేది.
—--------
ఈ పూస్తకం మీరు పిల్లలకు ఏం నేర్పుతున్నారో కాకుండా – మీరు ఎలా జీవిస్తున్నారు అనేది బోధపడుతుంది."
—--------
No comments:
Post a Comment