Saturday 24 November 2012

Doubt is other side of belief

యూజీ 'యాంటీ టీచింగ్ ' ...1970లో  ప్రపంచంలో ఒక విస్పోటనం. జేకే మానసిక పరివర్తన అనే భావనను యూజీ తోసేశాడు .అక్కడ మనసనేదే లేదని ప్రకటించాడు. అందువల్ల మానసిక పరివర్తన అనే భావన మొత్తం అర్ధం లేనినదన్నాడు. యూజీ యాంటీ టీచింగ్ కాలి కింద పట్టాను లాగేయడమే గాకుండా కాలి కింద భూమిని కూడా ధ్వంసం చేసింది .రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొత్త సిద్ధాంతాలు, దారులు ముందుకొచ్చాయి . కొత్త సిద్ధాంతాలతో పాటు జేకే బోధనల్లో [doubt] 'సందేహం ' ప్రధాన అంశం అయింది. అన్ని సిద్ధాంతాలను వ్యతిరేకించే సుప్రసిద్ధ అధిభౌతిక తిరుగుబాటు దారుడు ఆల్బర్ట్ కాము మాటల్లో చెప్పాలంటే మత బోధనలను, సాధనలను  ప్రత్యక్షంగా వ్యతిరేకించారు.తర్వాత అధిభౌతిక విప్లవం కూడా ప్రస్నార్ధక మయింది .చివరికి అధిభౌతికశాస్త్రాన్నే తోసేసే పరిస్థితి వచ్చింది. ఒక విచారణా పద్ధతిగా 'సందేహాన్ని యూజీ కొట్టేసాడు. 'ఇది విశ్వాసానికి మరో పార్శ్వం. సత్యం కోసం చేసే అన్ని అన్వేషణలు, విచారణలు వై ఫల్యం పరధిలోకే వస్తాయి.  ప్రస్థానం చివరలో ఏమి తెలుసు కున్నాం అనే ఒక భావనతోనే ఏ అన్వేషణ అయినా సాగుతుంది . ఇది కేవలం భ్రమలకు గొప్ప కొనసాగింపు.కుక్క తన తోకను అందుకోవడానికి 'చేజ్ ' చేయడానికి చేసే ప్రయత్నం లాంటిదే ఇది ' అని యూజీ  అంటారు .
ముకుందన్

Tuesday 13 November 2012

SENSES

నిన్ను  నడిపించేది  నీ ఆలోచనలు కాదు నీ ఇద్రియాలు. ఇంద్రియాలను అదుపు చేయాలంటూ ఈ మాట్లాడేదంతా పూర్తిగా చెత్త. అదుపు చేసుకోవడమనే  ప్రక్రియ ఇంద్రియాలకు సహజంగా ఉంది. అదేమీ దానికి అవసరం లేదు. ఈ భౌతిక, లేదా మానవ నడక ..నీవు ఏమైనా పిలువు . దాన్ని నడిపించేది కేవలం ఇంద్రియ కార్యకలాపాలే. ఆలోచన కాదు. మనస్సు కాదు.

Reality

మన అస్తిత్వానికి సంబంధించిన వాస్తవం, లేదా ప్రపంచ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడం సాధ్యమనే మన అంగీకారం నుంచే అన్ని సమస్యలూ  వస్తాయి . నేను చెప్పేది నీకు తెలియని దాని నుంచి ఎటువంటి అనుభవాన్ని పొందే మార్గం లేదు. నీ జ్ఞానం ద్వారా నీవు పొందే ఏ అనుభవమైనా అది ఫలితాన్నివ్వదు .అది యుద్ధంలో ఓటమే. మన ఉనికి , ప్రపంచ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి మనం ఉపయోగించే ఆయుధంతో ఈ దేహం నడకకు  సంబంధం ఉండదు . అందువల్ల ఆలోచనలు ఏవి స్వయంప్రకాశం కాదు , తక్షణంలో ఉండవని చెబుతుంటాను. 

Sunday 11 November 2012

Mind is myth

అన్ కండిషన్డ్  మైండ్ అంటూ ఏమీ ఉండదు. మైండ్ కండిషన్ అయి ఉంటుంది. ఇది అసంబద్ధమైంది. మైండ్ అంటూ ఉంటే అది కండిషన్లోనే  ఉంటుంది. ఓపెన్ మైండ్ అంటూ ఏమీ లేదు . నాకు సంబంధించి మైండే లేదు . మనస్సు అనేది భ్రమ. మైండ్ అనేదే లేక పోవడం వల్ల  మ్యుటేషన్ అని జే కృష్ణమూర్తి  మాట్లాడేది అర్ధం లేనిది. విప్లవాత్మకంగా గాని  మరో విధంగా గాని  పరివర్తన  చెందడానికి అక్కడ ఏమీ లేదు . అక్కడ రీలైజ్ అవడానికి సేల్ఫే లేదు.ఈ పునాది మీద నిర్మితమైన మొత్తం మత వ్యవస్థ కూలిపోయింది . అందువల్ల  అక్కడ రీలైజ్  అవడానికి ఏమీ లేదు.
       `మైండ్ లేదు' అనే తాత్విక పునాది పైనే మొత్తం బుద్ధ తత్వం నిర్మితమై ఉంది.అయినా మైండ్ నుంచి స్వేచ్చను పొందడానికి అద్భతమైన చిట్కాలు సృష్టించారు. అన్ని రకాల జెన్  ధ్యాన పద్ధతులతో మనస్సు నుంచి విముక్తమవడానికి సర్వదా ప్రయత్నిస్తుంటారు. కానీ మనస్సు నుంచి   స్వేచ్చను పొందడానికి ఉపయోగించే ఆయుధం మనస్సే . మైండ్ తప్ప మరో ఆయుధం కూడా లేదు. ప్రతి దాన్ని అర్ధం చేసుకోవడానికి మైండ్ ఆయుధం కాదని,మరో ఆయుధం కూడా లేదని ధృశ్చకంగా గాని యాధృశ్చకంగా గానీ గ్రహించ గలిగితే అది మెరుపులాగా నిన్ను తాకుతుంది. మైండ్ కు బాడీ కి మధ్య విభజన తొలగి పోతుంది. నిజానికి అక్కడ విభజన లేదు.

Saturday 10 November 2012

Biography

నా జీవిత చరిత్ర ఎందుకు ? చెప్పడానికి స్టోరీనే లేదని చెప్పే వ్యక్తి జీవిత చరిత్ర ఎలా రాయలనుకొంటున్నావు . నా జీవిత చరిత్ర ఎప్పటికీ చెప్పేది కాదు. జీవిత చరిత్రలు చదివే ఆసక్తి ఉన్న వారికి నిజంగా నిరుత్చాహ పరుస్తుంది .వారి జీవితాలను మెరుగుపరుచుకునేందుకు,నా జీవితం ద్వారా మార్పునకు ఎదురు చూసేవారికి ఆ అవకాశం దొరకదు. సోలోమన్ గండి `అంటూ పిల్లలు పాడుకొనే రైమ్స్ లో నా జీవితాన్ని చక్కగా చేర్చవచ్చు. నీ, నా ,లేదా మరెవరి జీవితం అయినా కేవలం అది ఒక  బెరడు లాంటిది. అంతకు మించి దానికి అర్ధం లేదు.
మహేష్ భట్ తో  ug 

Not living

ఏ  సమయంలో  కూడా  మనం జీవించం . భావనా  ప్రపంచంలో బతుకుతాం . అవన్నీ  మృత ప్రాయం అయినవి .అక్కడ కొత్తదనం  ఉండదు. ఆలోచన ప్రవాహం ఎప్పుడు  ఆగిపోతుందో అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. వేల సంవత్సరాలుగా వస్తున్న గమనం.దీనికి మొదలంటూ లేదు.అందుకే  బైబిల్ చెబుతుంది... ఆదియందు వాఖ్యముండును ఆని. అది ఎప్పుడు మొదలయిందో మనకు తెలియదు. మన నడకను మనం అర్ధం చేసుకోవాలంటే ఆలోచన క్రమాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది . అసలు నీవు బతికే ఉన్నవని నీకు ఎలా తెలుసు.దాన్ని కూడా నీ ఆలోచన , నీ భావన ద్వారానే నిన్ను నీవు తెలుసుకొంటావు.