Friday 25 December 2015

నేపధ్యం Background

ఏది సత్యం , ఎవరు  దెవుడు అనే  ప్రశ్నకు  స్పందన , లేదా  సమాధానం నేపధ్యాన్ని బట్టి ఉంటుంది. నేపధ్యం  లేకుండా  అక్కడ సమాధానం  ఉండదు. నేపధ్యం  పరిమితుల్లోనే  సమాధానం ఉంటుంది. అది ఇటాలియన్ నేపధ్యం, లేదా అమెరికన్, లేదా హిందూ నేపధ్యం కావచ్చు . నా  ఉద్దేశం నీవు  ఏమి సమాధానం చెప్పినా ఈ  నేపధ్యం లేకుండా చెప్పాలనేదే . నీ నేపధ్యం  నీకు సంబంధించిందేనా అనేది నీవు చూడగలగాలి . అది ఎటువంటి నేపధ్యం అనేది విషయం కాదు . నిజానికి  ఆ ప్రశ్నకు సమాధానం లేదు . నేను అందువల్లే చెబుతుంటాను భావప్రసారం కమ్యునికేషన్  ఉండదని.  నా ఆసక్తి  అంతా నీవు సమాధానం చెప్పడానికి నీ నేపధ్యాన్ని ఎలా ఆపగాలవనేదే . దాన్ని కట్ చేయడం చాలా కష్టం . ఎప్పుడూ అది కొనసాగుతూ ఉంటుంది. నీ సమాధానమే నీ (బ్యాక్ గ్రౌండ్ )నేపధ్యం. 

నా నేపధ్యమే నా సమాధానం అని నాకు అర్ధం అవుతుందని నీవు చెబుతావు. నేను నీ నుంచి సమాధానం కోరడం లేదు. నీవు ఆ ప్రశ్న  దగ్గర ఆగిపోగలవా . ఆ తెలియని స్థితిలో నీవు ఉండాలనేదే నేను కోరేది . నాకు తెలియదు అనేది నీకు నీవు గాని , నాకు  గాని చెప్పొద్దు . నీకునీవు  తెలియదు అనుకున్నా అది ఆగదు. నీకు నీవు గాని మరొకరికి గాని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఆగిపోతే అద్భుతం జరుగుతుంది.నిజంగా నీవు ఆ తెలియని స్థితిలో ఉండాలంటే  దాని అర్థం 'నిజానికి నాకేమి తేలియదు. నాకు తెలిసిందంతా నేను ఇంతకుముందు చదువుకున్నదే . విన్నదే . నేను సమాధానం చెప్పలేను. ఎవరూ చెప్పాలనుకోవడం లేదు. నాకు నేనే సమాధానం తెలుసుకోవాలి. ఎవరి సమాధానంపై నాకు ఆసక్తి లేదు ' అనేదే ఆ స్థితి.