Saturday 24 November 2012

Doubt is other side of belief

యూజీ 'యాంటీ టీచింగ్ ' ...1970లో  ప్రపంచంలో ఒక విస్పోటనం. జేకే మానసిక పరివర్తన అనే భావనను యూజీ తోసేశాడు .అక్కడ మనసనేదే లేదని ప్రకటించాడు. అందువల్ల మానసిక పరివర్తన అనే భావన మొత్తం అర్ధం లేనినదన్నాడు. యూజీ యాంటీ టీచింగ్ కాలి కింద పట్టాను లాగేయడమే గాకుండా కాలి కింద భూమిని కూడా ధ్వంసం చేసింది .రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొత్త సిద్ధాంతాలు, దారులు ముందుకొచ్చాయి . కొత్త సిద్ధాంతాలతో పాటు జేకే బోధనల్లో [doubt] 'సందేహం ' ప్రధాన అంశం అయింది. అన్ని సిద్ధాంతాలను వ్యతిరేకించే సుప్రసిద్ధ అధిభౌతిక తిరుగుబాటు దారుడు ఆల్బర్ట్ కాము మాటల్లో చెప్పాలంటే మత బోధనలను, సాధనలను  ప్రత్యక్షంగా వ్యతిరేకించారు.తర్వాత అధిభౌతిక విప్లవం కూడా ప్రస్నార్ధక మయింది .చివరికి అధిభౌతికశాస్త్రాన్నే తోసేసే పరిస్థితి వచ్చింది. ఒక విచారణా పద్ధతిగా 'సందేహాన్ని యూజీ కొట్టేసాడు. 'ఇది విశ్వాసానికి మరో పార్శ్వం. సత్యం కోసం చేసే అన్ని అన్వేషణలు, విచారణలు వై ఫల్యం పరధిలోకే వస్తాయి.  ప్రస్థానం చివరలో ఏమి తెలుసు కున్నాం అనే ఒక భావనతోనే ఏ అన్వేషణ అయినా సాగుతుంది . ఇది కేవలం భ్రమలకు గొప్ప కొనసాగింపు.కుక్క తన తోకను అందుకోవడానికి 'చేజ్ ' చేయడానికి చేసే ప్రయత్నం లాంటిదే ఇది ' అని యూజీ  అంటారు .
ముకుందన్

Tuesday 13 November 2012

SENSES

నిన్ను  నడిపించేది  నీ ఆలోచనలు కాదు నీ ఇద్రియాలు. ఇంద్రియాలను అదుపు చేయాలంటూ ఈ మాట్లాడేదంతా పూర్తిగా చెత్త. అదుపు చేసుకోవడమనే  ప్రక్రియ ఇంద్రియాలకు సహజంగా ఉంది. అదేమీ దానికి అవసరం లేదు. ఈ భౌతిక, లేదా మానవ నడక ..నీవు ఏమైనా పిలువు . దాన్ని నడిపించేది కేవలం ఇంద్రియ కార్యకలాపాలే. ఆలోచన కాదు. మనస్సు కాదు.

Reality

మన అస్తిత్వానికి సంబంధించిన వాస్తవం, లేదా ప్రపంచ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడం సాధ్యమనే మన అంగీకారం నుంచే అన్ని సమస్యలూ  వస్తాయి . నేను చెప్పేది నీకు తెలియని దాని నుంచి ఎటువంటి అనుభవాన్ని పొందే మార్గం లేదు. నీ జ్ఞానం ద్వారా నీవు పొందే ఏ అనుభవమైనా అది ఫలితాన్నివ్వదు .అది యుద్ధంలో ఓటమే. మన ఉనికి , ప్రపంచ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి మనం ఉపయోగించే ఆయుధంతో ఈ దేహం నడకకు  సంబంధం ఉండదు . అందువల్ల ఆలోచనలు ఏవి స్వయంప్రకాశం కాదు , తక్షణంలో ఉండవని చెబుతుంటాను. 

Sunday 11 November 2012

Mind is myth

అన్ కండిషన్డ్  మైండ్ అంటూ ఏమీ ఉండదు. మైండ్ కండిషన్ అయి ఉంటుంది. ఇది అసంబద్ధమైంది. మైండ్ అంటూ ఉంటే అది కండిషన్లోనే  ఉంటుంది. ఓపెన్ మైండ్ అంటూ ఏమీ లేదు . నాకు సంబంధించి మైండే లేదు . మనస్సు అనేది భ్రమ. మైండ్ అనేదే లేక పోవడం వల్ల  మ్యుటేషన్ అని జే కృష్ణమూర్తి  మాట్లాడేది అర్ధం లేనిది. విప్లవాత్మకంగా గాని  మరో విధంగా గాని  పరివర్తన  చెందడానికి అక్కడ ఏమీ లేదు . అక్కడ రీలైజ్ అవడానికి సేల్ఫే లేదు.ఈ పునాది మీద నిర్మితమైన మొత్తం మత వ్యవస్థ కూలిపోయింది . అందువల్ల  అక్కడ రీలైజ్  అవడానికి ఏమీ లేదు.
       `మైండ్ లేదు' అనే తాత్విక పునాది పైనే మొత్తం బుద్ధ తత్వం నిర్మితమై ఉంది.అయినా మైండ్ నుంచి స్వేచ్చను పొందడానికి అద్భతమైన చిట్కాలు సృష్టించారు. అన్ని రకాల జెన్  ధ్యాన పద్ధతులతో మనస్సు నుంచి విముక్తమవడానికి సర్వదా ప్రయత్నిస్తుంటారు. కానీ మనస్సు నుంచి   స్వేచ్చను పొందడానికి ఉపయోగించే ఆయుధం మనస్సే . మైండ్ తప్ప మరో ఆయుధం కూడా లేదు. ప్రతి దాన్ని అర్ధం చేసుకోవడానికి మైండ్ ఆయుధం కాదని,మరో ఆయుధం కూడా లేదని ధృశ్చకంగా గాని యాధృశ్చకంగా గానీ గ్రహించ గలిగితే అది మెరుపులాగా నిన్ను తాకుతుంది. మైండ్ కు బాడీ కి మధ్య విభజన తొలగి పోతుంది. నిజానికి అక్కడ విభజన లేదు.

Saturday 10 November 2012

Biography

నా జీవిత చరిత్ర ఎందుకు ? చెప్పడానికి స్టోరీనే లేదని చెప్పే వ్యక్తి జీవిత చరిత్ర ఎలా రాయలనుకొంటున్నావు . నా జీవిత చరిత్ర ఎప్పటికీ చెప్పేది కాదు. జీవిత చరిత్రలు చదివే ఆసక్తి ఉన్న వారికి నిజంగా నిరుత్చాహ పరుస్తుంది .వారి జీవితాలను మెరుగుపరుచుకునేందుకు,నా జీవితం ద్వారా మార్పునకు ఎదురు చూసేవారికి ఆ అవకాశం దొరకదు. సోలోమన్ గండి `అంటూ పిల్లలు పాడుకొనే రైమ్స్ లో నా జీవితాన్ని చక్కగా చేర్చవచ్చు. నీ, నా ,లేదా మరెవరి జీవితం అయినా కేవలం అది ఒక  బెరడు లాంటిది. అంతకు మించి దానికి అర్ధం లేదు.
మహేష్ భట్ తో  ug 

Not living

ఏ  సమయంలో  కూడా  మనం జీవించం . భావనా  ప్రపంచంలో బతుకుతాం . అవన్నీ  మృత ప్రాయం అయినవి .అక్కడ కొత్తదనం  ఉండదు. ఆలోచన ప్రవాహం ఎప్పుడు  ఆగిపోతుందో అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. వేల సంవత్సరాలుగా వస్తున్న గమనం.దీనికి మొదలంటూ లేదు.అందుకే  బైబిల్ చెబుతుంది... ఆదియందు వాఖ్యముండును ఆని. అది ఎప్పుడు మొదలయిందో మనకు తెలియదు. మన నడకను మనం అర్ధం చేసుకోవాలంటే ఆలోచన క్రమాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది . అసలు నీవు బతికే ఉన్నవని నీకు ఎలా తెలుసు.దాన్ని కూడా నీ ఆలోచన , నీ భావన ద్వారానే నిన్ను నీవు తెలుసుకొంటావు. 

Wednesday 8 August 2012

God is irrelevant

దేవుడి నుంచి మనిషి రక్షింపబడాలి. ఇది చాలా ప్రధానమైంది. ఎందుకంటే నీవు ఉపయోగించే `దేవుడు ' అనే పదం అర్ధంలో నేను చెప్పడం లేదు.దెవుడు అనే భావన అనేక అంశాలతో ముడిబడి ఉంది. కర్మ, పునర్జన్మ, కొత్త అవతారం, జీవితం తర్వాత ...ఇలా విషయమంతా ,  మొత్తం వ్యాపారం ...గొప్ప భారతీయ వారసత్వం అని నీవు చెప్పేదంతా దేవుడు అనే భావనకు సంబంధించినదే. ఈ మొత్తాన్ని చూడాలి. మనిషి భారతీయ వారసత్వం నుంచి బయటపడాలి. ప్రజలే కాదు మొత్తం దేశమంతా ఈ వారసత్వం నుంచి రక్షింప బడాలి.లేకపోతే వ్యక్తిగతంగా గాని ,దేశానికీ గాని భవిష్యత్తు లేదు .
 గందర గోళంగా ఉండే మనస్సు చాలా విధ్వంసకరమైన వాటిని సృష్టించింది.వీటిలో  అత్యంత విధ్వంసకరమైంది '.దెవుడు'. నా దృష్టిలో దేవుడికి సంబంధించిన ప్రశ్న అసంబద్ధం. అభౌతికమైంది.దేవుడి వల్ల మనకేమాత్రం ప్రయోజనం లేదు.రెండుప్రపంచ యుద్ధాల కంటే ఎక్కువ మందిని దేవుడి పేరుతో చంపేశాం.జపాన్ లో బుద్ధ భగవానుడి  పేరు మీద లక్షల మంది చనిపోయారు.ఇదే వరుసలో క్రిస్తియన్లు, ముస్లింలు ఉన్నారు. భారత దేశంలో కూడా ఒక్క రోజులో ఐదు వేల మంది సిక్కులను ఊచ కోత కోశారు. మీది కూడా శాంతియుత దేశంకాదు. నీ  చరిత్ర చదువుకో. మొదటి నుంచి చివరివరకు మొత్తం హింసే  కనబడుతుంది .
 మనిషి బౌతిక జివి. స్వాభావికంగా అతనికి ఆధ్యాత్మిక పార్శ్వం లేదు. పవిత్ర విలువలు, సూత్రాలు, నమ్మకాలూ ,ఆధ్యాత్మిక విలువలు కేవలం డాంబికాలు. ఇవి నీలో  ఏమాత్రం మార్పు తీసుకు రాలేవు. నీవు ఇప్పటికీ  క్రూరుడివే. ఇదే  ప్రవృత్తి  ఎప్పుడు    కలిగివుంటావు. 'నీకు మల్లె నీ  పొరుగు వాడిని ప్రేమించు' అనే  తత్వభోదన నీ విచక్షణారహిత  మారణకాండను  ఆపలేదు. నీ పొరుగువాడిని చంపితే  నీకూ  అదే గతి పడుతుందనే భయంకర నిజం వలన నీవు హత్యా కాండను ఆపుతావు.





Saturday 28 July 2012

Real problem is solution

పరిష్కారమే నిజమైన సమస్య . అందువల్లే నీ సమస్యలన్నీ కొనసాగుతుంటాయి. ఎందుకంటే తప్పుడు పరిష్కారాలను నీవు కనుగొన్నావు . అక్కడ సమాధానాలు లేకపోతే ప్రశ్నలే ఉండవు .అవి ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ప్రశ్నలు, సమాధానాలు కలిసి ప్రయాణిస్తుంటాయి. ఆ సమాధానాలతో సమస్యలకు ముగింపు పలకలనుకొంటున్నావు. అందువల్ల సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి . రాజకీయ నాయకులు, మానసిక శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవాదులు ... వీరంతా మనముందుంచిన పరిష్కారాలు నిజానికి పరిష్కారాలు కాదు. బాగా ధ్యానం చేయాలని, సాధన చేయాలని, బాగా కష్టపడాలని ప్రోత్సహిస్తుంటారు, ప్రేరణ కలిగిస్తుంటారు. ఇదంతా హింస. నీ నెత్తి మీద కూర్చొని పదే,  పదే చేయిస్తుంటారు. నీ ఆశను, భయాన్ని పక్కకు తోసేయగల్గితే, వారిని కేవలం వ్యాపారస్తులుగా చూడగలిగితే వాళ్ళు ఎప్పటికీ ఈ సరుకును నీ దగ్గర దిగుమతి చేయరు.కానీ ఈ ప్రవీణులు ఇచ్చే బోగస్ సరుకును నీవు పదే, పదే కోరుకుంటావు. నిజానికి అక్కడ సమస్యలు లేవు.అక్కడ కేవలం పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏ మాత్రం పని చేయవని చెప్పే ధైర్యం మనకు లేదు. అవి పని చేయవని కనుగొన్నా సెంటిమెంటు రంగం లోకి వస్తుంది. అతనిమీద నమ్మకం, విశ్వాసం వల్ల అతన్ని తోసేయ లేవు. పరిష్కరాలే సమస్య. నిజానికి అక్కడ సమస్యలు లేవు. నిజమైన సమాధానాలుగా మనం అంగీకరించిన పరిష్కారాల నుంచే ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సమాధానాలు ముగిసిపోవడంతోనే   ప్రశ్నలకు ఒక సమాధానం వస్తుంది. ఒక సమాధానంపోతే మిగతా సమాధానాలు వెళ్ళిపోతాయి.

అందం Beauty

అందం అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది?వస్తువులో ఉందా ?చూసే కళ్లల్లో ఉందా ?నీవు చుసే వస్తువు పైకి అందంఫై  నీ కున్న  భావనను ప్రసరింప జేస్తున్నావు. అంతే. అక్కడ సూర్యోదయం అందంగా ఉంది అని నీకు నీవు అనుకున్న క్షణంలో నీవు సన్ సెట్ ను చూడడంలేదని అర్థం . అందం అనేది వస్తువులో లేదు. అది చూసే కళ్ళకు సంబంధించింది కూడా కాదు.ఇదంతా నిన్ను నీవు పూర్తిగా పరిత్యజించడం.అందువల్ల అందం అంటే ఏమిటి ? నిజంగా నీకు తెలియదు.నీవు ఏమి చూస్తున్నావో నీకు తెలియదు. ఆ స్థితిలో నీకు ఏమీ తెలియదు.నీవు అందం అని పిలవవచ్చు.కానీ అది అందం అని దాన్ని నేను ఆనందిస్తున్నానని  ఎవరూ చెప్పలేరు.నిజానికి సూర్యోదయాన్ని చూసే మార్గం లేదు . నీవు దాన్నించి విడిగా లేవు .ఎప్పుడయితే నీవు సూర్యోదయం నుంచి విడిపోయావో ఆ క్షణంలో నీలో కవి బయటకు వస్తాడు. కవులు ,చిత్రకారులు ఇలా విడిపోయి వారికి వారు వ్యక్తీకరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఇదే సంస్కృతి, నాగరికత .

నైతికత (MORALITY)

 నైతికత అంటే ఏమిటి ? ప్రవర్తనకు సంబంధించిన మార్గదర్శక త్వాలను అనుసరిస్తూ ఆనందించడం  కాదు. హింస, తృష్ణ, కోరిక, ఆశ, కోపం, ద్వేషాన్ని జయించడం కాదు.లేదా భావోద్వేగాలకు అతీతంగా నిలబడటం అనే ప్రశ్న కాదు .నీ చర్యలకు ముందూ వెనుకా ప్రశ్నించడం నుంచి నైతిక సమస్య వస్తుంది. మంచికి ,చెడుకి మధ్య బేధాన్ని తెలిపే బుద్ది ఈ పరిస్థితికి కారణం. నీ చర్ర్యలన్నీ ఈ ప్రభావంతో ఉంటాయి. జీవితమంటే కర్మ.(చర్య ). నీ చర్యలను ప్రశ్నించక పోవడమే నైతికత. నీ చర్యలను ప్రశ్నించడమంటే  జీవి వ్యక్తికరణను ధ్వంసం చేయడమే.ఎవరిలోనైతే ఆలోచన రక్షణ లేకుండా జీవి వ్యక్తీకరణ దానంతట అది వస్తుందో అక్కడ కాపాడటానికి సెల్ఫ్ ఉండదు .అప్పుడు అతనికి అబద్దం చెప్పడం , మోసం చేయడం, లేదా ఇతరులకు హాని చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది.అతని సమాజం  దీన్ని అనైతికతగా భావిస్తోంది. నా దృష్టిలో నైతికత అంటే నీ చర్యలను ముందూ వెనుకా ప్రశ్నించడం.ఇదంతా సామజిక అంశం.సమాజం సజావుగా నడవడానికి ఈ నిబంధన అవసరం . ఈ ఆధ్యాత్మిక వాదులు నీ లోపల ఒక  పొలీస్  మాన్ ను సృష్టించారు. నీవు చేసే పనులకు ముందూ వెనుకా కొన్ని చర్యలు మంచివి కొన్ని చర్యలు చెడ్డవి అని నిర్దేశితమయ్యాయి.  ఇది నీకు ఏ మాత్రం సహాయం చేయదు .ఆలోచిస్తుండడం సమస్యలనుసృష్టిస్తుంది .మనిషి ప్రధాన సమస్య నైతిక సంశయం.నీ చర్యలకు ముందూ వెనుకా ప్రశ్నించాల్సి రావడం .ఇది నాడీ సంబంధమైన సమస్య .నీ నమ్మకాలన్నీ కేవలం మనసికమైనవి కాదు .నాడీ వ్యాధికి సంబంధమైనవి .ఏది మంచిదో నీకు తెలియదు.నీకేది మంచిదో అదే నీకు తెలుసు .దాని మీదే నీ ఆసక్తి అంతా .మొత్తం దీని చుట్టూనే కేంద్రీకృత మై ఉంటుంది. మొత్తం నీ కళాత్మకత,  నీ జ్ఞాన కేంద్రాలన్నీ దీని చుట్టూనే ఉంటాయి


నైతిక మనిషి ఒక కోడి పిల్ల . భయపెట్టే మనిషి . పిరికివాడు.అందువల్లే నైతికతను  సాధన చేస్తుంటాడు. కూర్చొని ఇతరులకు తీర్పులు చెబుతుంటాడు. నిజంగా నైతికత ఉన్న మనిషి ఎప్పుడూ ఎవరికీ నీతులు  చెప్పడు. కూర్చొని ఇతరులకు నైతికతపై  తీర్పులు చెప్పడు. మనిషి ఎప్పుడూ స్వార్థపరుడు. నిస్వర్థాన్ని ఎంతో విలువైనదిగా సాధన చేస్తూ  తిరిగి స్వార్థ పరుడిగా కొనసాగుతుంటాడు.తాత్కాలిక  సంతోషాలకు నీవు అలవాటు పడ్డావు. దానంతటికి నేను వ్యతిరేకం కాదు.

Saturday 21 July 2012

Music, Poetry, Artists-2

ఆర్టిస్ట్  అంటూ  ఎవరూ  ఉండరు . అతను కేవలం టేక్నీషియన్.   అతడు లేదా ఆమె  చిత్రకళ చిట్కాలు తేలుసుకుంటారు . కార్పెంటర్లు, తాపీ పని వాళ్ళ కు  మల్లే వీరు శిల్పులు, నిపుణులు . క్రాఫ్ట్ కంటే ఉన్నతస్థానాన్ని కళకు ఎందుకు  కల్పిస్తారు. కళాకారుడి సృష్టికి మార్కెట్  లేకపొతే అతను  ఆ వ్యాపారంలో ఉండదు.ఈ సో కాల్డ్  అర్తిస్స్టు ల నమ్మకాలకు మార్కెట్టే  ప్రధాన కారణం .ఇతర క్రాఫ్ట్ మెన్ లా  కళాకారుడు కూడా ఒక క్రాఫ్ట్ మాన్ .తన వ్యక్తీ కరణకు ఆ  పనిముట్టునే ఉపయోగిస్తాడు . మొత్తం మానవ సృజనంతా సునిసితత్వం నుంచే సృష్టి అవుతుంది.మొత్తం కళ అంతా ఒక సంతోష క్షణం. అది (సంతోషం) కూడా నీచే సృష్టి ఆవుతుంది .లేకపొతే అందం, ఆర్ట్ గురించి మాట్లాడడానికి, ప్రశంసించడానికి మార్గం  లేదు. వాళ్ల సృష్టిని నీవు ప్రశ్నిస్తే వాళ్లు ఫీలవుతారు .నీకు టేస్టు తెలియదనుకుంటారు . వారి కళను ఎలా ప్రశంసించాలో తెలుసుకోవడానికి స్కులుకెల్లి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటారు. సోకాల్డ్ గ్రేట్ పొయిట్ రాసిన పోయంను నీవు ఎంజాయ్ చేయ లేక పోతే ఆ కవితను ప్రశంసించేట్లు నిన్ను బలవంతంగా ఎడ్యుకేట్ చేస్తారు.విద్యా సంస్థల్లో ఇదంతా వాళ్ళు చేస్తుంటారు.అందాన్ని, చిత్రకళను ఎలా ఆస్వాదించాలో మనకు బోధిస్తుంటారు. సృజనాత్మకరాజకీయాలు, సృజనాత్మక   భావాలు , సృజనాత్మక కళ  ఇలా ప్రతిదాన్ని తాము క్రిఏటివుగా ఆలోచిస్తామనుకుంటూ అన్వేషణలో ఓదార్పు పొందుతుంటారు.నిజానికి వారిలో ఏ మాత్రం సృజనాత్మకత ఉండదు.వారు ఎమి  చేసినా అందులో  ఒరిజినాలిటి,తాజాదనం స్వేచ్చా ఉండదు. ఆర్టిస్టులు అక్కడో, ఇక్కడో తీసుకుని దాన్ని కలబోసి ఏదో కొత్త  అద్బుతాన్ని సృష్టిస్తున్నట్లు భావిస్తుంటారు. ఆల్ రెడీ అక్కడ ఉన్నదాన్ని వాళ్ళందరూ అనుసరిస్తుంటారు. అనుకరణ శైలే మనకున్న క్రియేటివిటి. మనం వెళ్ళిన స్కూలు ,మనం నేర్చుకున్న భాష ,మనం చదివిన పుస్తకాలు, ఎదుర్కొన్న పరీక్షలు ...ఈ నేపధ్యం నుంచి మనకొక శైలి ఏర్పడుతుంది. ఇలా శైలి టెక్నిక్ అక్కడ నడుస్తుంటుంది.