Thursday 25 August 2011

ఆలోచన (THOUGHT)

  •  ఎక్కడైనా ఆలోచన అవసరం. కాని అది ఇప్పుడు మనిషికి శత్రువుగా మారింది. ఎందుకంటే శక్తివంతమైన పరిణామక్రమాన్ని వెనక్కి తోసేసి పరిపుర్ణమైన మనిషి, ఆధ్యాత్మిక మనిషి, పెద్దమనిషి... ఇలా రక రకాల భావనలను నాగరికత సృష్టించింది. ఇక్కడున్న స్వభావానికి అదంతా పూర్తి విరుద్దం.
  •    ఆలోచనలు ఏమీ స్వయంప్రకాశం కావు. తక్షణంలో ఉండవు అని నేను పదే,పదే చెబుతుంటాను. ఇంకొక అడుగు ముందుకేసి అడుగుతున్నాను. అసలు ఆలోచన అనేది ఒకటి ఉందా?. ఈ ముఖ్యమైన ప్రశ్న ఎందుకొస్తుందంటే అక్కడ ఆలోచన అనేది ఒకటి ఉందని మనం దాన్నుంచి విడిపోయ దాన్ని చూస్తుంటాం.కాని  మనం అనుకొంటున్న ఆలోచన చూసినప్పుడు మనం చూసేది ఆలోచన గురించి భావనను.  ఆలోచనను కాదు.
  •      మన ఎదురుగా ఉన్న వాస్తవాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్ధం చేసుకోడానికి మన ఉపయోగించే ఆయుధం విషయంలో ఈ `దేహం` భాగస్వామ్యం కాదు. ఆలోచనలు స్వయం ప్రకాశం,  తక్షణంలో  ఎందుకుండవనే దానికి నేను చెబుతున్న కారణం ఇదే. మొత్తం ఆలోచన గురించి నీవు అనుకున్నదంతా `ఆలోచన` కాదు. ఆలోచన నాగరికత సృష్టి.  మనం దేని నుంచయినా స్వేచ్చ పొందడానికి మనకు ఆలోచనే ప్రధానమనే భావన మన ముందుంది. నా ఆసక్తంతా అది ఆయుధం కాదని, మరో ఆయుధం కూడా లేదని  చెప్పడమే. ఇది నీకు అర్ధమైతే ఆలోచన నీ అస్త్రం కాదు. వేరే ఆయుధం కూడా నీకు అవసరం ఉండదు.   మనం ఈ స్థితిలో ఉండేందుకు వివేకం, అంతరంగిక జ్ఞానం, అంతర్ దృష్టి, అదీ, ఇదీ...అంటూ అనేక మార్గాలను కనుగొన్నాం. ఇవన్నీ  నీకు ఆటంకాలే. అంతర్ దృష్టి ఎంత ప్రత్యేకమైనా అవన్నీ ఏ మాత్రం విలువ లేనివి. అంతర్ దృష్టి అని చెప్పుకునేదంతా ఆలోచన సృష్టే. ఆలోచన తన యధాస్థితిని కొనసాగించడమే ఇది.
  •     ఈ ఆలోచనను నిర్మాణాత్మకంగా, సానుకూలంగా  సంస్కరిచాలేమా? అని అడుగుతున్నావు. సమాజం, సంస్కృతి ...నీవు ఏమైనా పిలువు...అవి నిర్దేశించిన లక్ష్యాలు వేటినీ సాధించడానికి ఆలోచన ఉపకరణం కాదు. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. నాగరికత సృష్టి, లేదా సమాజం మన ముందుంచిన లక్ష్యాలు చేరడం, పొందడం అనేది మన సహజ స్థితికి శత్రువు. ఆలోచన సమస్యలను సృష్టిస్తుంది. పరిష్కరించదు. నేను ఆలోచన రహితస్థితి గురించి మాట్లాడడం లేదు. లక్ష్యాలు చేరేందుకు అనేక మంది ఆధ్యాత్మిక గురువులు మనముందుంచిన ఆలోచనారహితస్థితి కూడా ఆలోచన సృష్టే. ఆలోచనా రహితస్థితిని అనుసరించడం ద్వారా ఆలోచన తన యధా స్థితిని కొనసాగిస్తుంటుంది. అందువల్ల ఆలోచనరహి త స్థితి  అనే  లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనకు వచ్చే అనుభవం ఏదయినా ఉంది అంటే అది ...స్వేచ్చ పొందడానికి మనం చేసే ప్రయత్నాన్ని శక్తివంతం చేస్తుంటుంది.

No comments:

Post a Comment