Sunday 28 August 2011

సంస్కృతి (CULTURE)

  •         నీకు నీవుగా  వుండాలి. కాని దిగ్బ్రాంతికలిగించే విషయం ఏమిటంటే నీవు ఆధారపడిన మొత్తం మానవాళి వారసత్వం అంతా అపస్యమైంది. దీన్ని నీవు చూడాలి. ఈ గ్రహింపే నీకు మేలుకొలుపు. దృచ్చంగా కానీ, యాదృచ్చకంగా గాని ఇది జరిగితే  నీలో ఈ పరిస్థితికి కారణమైన ఈ సంస్కృతి  లేదా నాగరికత మీద నీకున్న పరా ధీనతపై మెరుపులా ఈ గ్రహింపు నిన్ను తాకుతుంది.
  •     నీవు వారసత్వ భారం నుంచి  స్వేచ్చను పొందితే నీవు మొదటిసారిగా ఒక వ్యక్తిగా  తయారవుతావు. ఈ వ్యక్తి ప్రభావం మానవ చైతన్యంపై  ఖచ్చితంగా వుంటుంది. 
  •        తన సహజ మార్గంలో  ఈ దేహం మొత్తం రసాయనచర్యల్లో  మార్పులు మొదలౌతాయి. దీని అర్ధం ఏమంటే నాగరికత ద్వారా కలుషితమైన, విషతుల్యమైన మొత్తం ఈ వ్యవస్థ  నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడైతే  బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఈ   చైతన్యం , లేదా  జీవితం ...నీవు ఏమైనా పిలువు  దాని వ్యక్తీకరణ, నడక తనదైన శైలిలో వ్యక్తమౌతుంటుంది. ఇటువంటి వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం వుండదు. ఇతడు ఒక ప్రమాదికారిగా తయారౌతాడు. ఇదే వైరుధ్యం. ఇతడు ప్రపంచాన్ని సంస్కరించడానికి కొంత శక్తి కావాలని కోరుకోడు. తను రక్షకుడిననో, స్వేచ్చా జీవిననో, ఆత్మ జ్ఞానం పొందినవాడిననో అనుకోడు.
  •    నీకు నీవుగా, వ్యక్తిగతంగా ఉండాలంటే నీవు  చేయడానికి ఏమీ లేదు. నీవు ఉన్న స్థితి కంటే  భిన్నంగా ఉండాలని సంస్కృతి నిన్ను డిమాండ్ చేస్తుంటుంది.  అలా ఉండడానికి  చేసే  ప్రయత్నంలో మన సర్వ శక్తులూ వృధా అవుతుంటాయి. ఆ శక్తి ఉంటే జీవించడం చాలా సాధారణంగా ఉంటుంది.
  • నీవు సాధారణ మనిషిగా, మామూలు మనిషిగా ఉండాలనుకోవడంలేదు. అదే నిజంగా సమస్య. నీవు ఉన్న దానికన్నా భిన్నంగా ఉండాలని నాగరికత నిర్దేశిస్తోంది.
  • ఈ దేహానికి ఏమీ తెలుసుకోవాలని ఉండదు. దాని రక్షణకు కావలసిన తెలివి అక్కడ ఉంది, పోగేసుకున్న దానిని మేధోతనం అంటాం. ఆలోచనకు కొత్తదనం ఇవ్వడం అనే నిరంతర  ప్రక్రియ కోసం మనం ఈ మేధో సంపత్తిని పోగేసుకుంటాం. దీని సహాయంతో ఇతర జీవ రాసులకంటే ఎక్కువ కాలం జీవించడానికి ప్రయత్నిస్తుంటాం . మొత్తం వ్యవస్థ నాశనానికి ఇదే కారణమౌతోంది.  మేధో సంపత్తిని పోగేసుకోవడమనే వాస్తవం నుంచి మనం తప్పిచుకునే మార్గం లేదు.  జంతువులు  ఏవీ మార్పు కోసం ఏ మాత్రం ప్రయత్నిచవు. దీన్ని మనం అర్ధం చేసుకోవాలి. మనలో మార్పు రావాలనే డిమాండ్ నాగరికత సృష్టి. ఏమి మరాలనేది మౌలిక ప్రశ్న. విప్లవాత్మకంగా గాని మరేదైనా గాని మార్పు చెందాల్సింది ఏ మైనా ఉందా? ఏముంది అక్కడ.? ఏదైనా ఉందా? ఆత్మ ఉందా?  `నేను` ఉన్నానా? ...నా సమాధానం ఏమీ లేదనే. నేను చూసేది, అనుభూతి చెందేది అంతా జ్ఞాన సృష్టి . జ్ఞానమే నేను. ఆ జ్ఞానం ఉనికే తరతరాలుగా వస్తోంది. అదే నాగరికత.

No comments:

Post a Comment