Saturday 27 August 2011

జీవితం ( LIFE)

  •  జీవితం పవిత్రమైనది. మన పిల్లలను, పరిసరాలను మరో యుద్ధం రాకుండా ఎలా రక్షించుకోవాలంటున్నారు. మీరందరూ మానసిక వ్యాధిగ్రస్తులు. బాంబులతో, ఆకలితో, దారిద్ర్యంతో, టేర్రరిజంతో వేల లక్షల మందిని చంపేస్తూ మరో వైపు భావి జీవితం, బర్త్ కంట్రోల్, జీవన మాధుర్యం, జీవిత విలువల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంటారు.
  •  నివు చెబుతావు. జీవితం ప్రవాహం. దానితోపాటే నేను కదులుతుంటాను అని. కాని నిజానికి ప్రవాహా న్నిచదరగొడుతుం టావు. జీవితం కదలిక ఎప్పుడూ భిన్నంగా  వుంటుంది. 
  •  జీవితం అద్బుతమైన క్రమం. ఆలోచన చట్రంలో దాన్ని ఎప్పటికీ అందుకోలేవు.
  •  జీవితం అనుకుంటున్న దానికి భౌతికంగా దాని అర్ధం దానికుంది. దాన్ని తోసేసి ఆధ్యాత్మిక అర్ధం కల్పించడానికి ప్రయత్నిస్తున్నావు. ఏదైనా అర్ధం ఎందుకుండాలి. జీవించడం కోసం  జీవితం వుంది. నీవు ఆధ్యాత్మిక అర్ధం వెతకడంలోనే సమస్య వుంది.
  • అర్దవంతం, ప్రశాంతం, సంపూర్ణం, ఆదర్సవంతంమైన జీవితం...ఇలా పేరుకుపోయిన భావనలు తొలగిపోవాలి. అసలు జీవితం కన్నా వీటి గురించి ఆలోచనకే నీ శక్తులన్నీ వ్యర్ధం అవుతుంటాయి.
  •   నీవు జీవితం మొదలు పెడితే ఏమి ఆలోచిస్తున్నావు  అనేది విషయం కాదు. జీవితం దానంతట అదే  సాగుతుంది. ఎలా జీవించాలి అనే ప్రశ్న జీవితానికి ఒక సమస్య అయింది. ఎలా జివించాలనేది జీవితానికి అర్ధం లేనిది. ఎలా అనే ప్రశ్న వచ్చిన మరుక్షణం సమాధానం కోసం ఎవరో ఒకరి మీద ఆధార పడతావు. దీంతో నీమీద స్వారీ చేయడానికి ఆవకాశం తీసుకుంటారు.
  •   జీవితానికి ఎందుకర్ధం ఉండాలి. ఎలా జీవించాలి అనేది జీవి నడకకు పూర్తిగా సంబంధం లేనిది. అది జివిస్తుంటే ఎలా,  ఎప్పుడు అని  ప్రస్నించదు.  ఎలా అనేది నీవు నిర్దేసిస్తున్నావు. 
  •   జీవితం ఏమిటి? ఎవరికీ తెలియదు. మనం చెప్పేదంతా ఊహాజనితం. జీవితం నుంచి, అనుభవం నుంచి అర్ధం చేసుకున్నది జ్ఞానం సహాయంతో చెబుతావు. మన చుట్టూ ఉన్న ప్రజలతో, ప్రపంచంతో మనకున్న సంబంధమే జీవితంఅనుకుంటాం. మనకు తెలిసింది అదే. వాస్తవానికి అది సంబంధం కాదు. 
  •   జీవితం ఏమిటనేది నీవు ఎప్పటికీ తెలుసుకోలేవు. జీవితం గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు. నీవు  నిర్వచనాలు ఇస్తావు. అవి అర్ధం లేనివి. దేన్నీ అర్ధం చేసుకోడానికి అది నీకు సహాయం చేయదు. అ ప్రశ్న దానంతట అది దగ్ధమైతే  అక్కడ శక్తి వుంటుంది. ఆ శక్తి గురించి నీవు ఏమీ చెప్పలేవు. అది అల్ రెడీ దానంతట అది వ్యక్తమౌతూ ఉంటుంది.దానికి సరిహద్దులు లేవు. పరిమితులు లేవు. అది, నీది నాది కాదు. అది  అందరకీ సంబంధించినది.దానిలో నీవు  ఒక భాగం.నీవు దాని  వ్యక్తీకరణవు. కేవలం పూవు ఒక జీవిత వ్యక్తీకరణలా నీవు మరో జీవితపు వ్యక్తీకరణవు.








No comments:

Post a Comment