The Natural State
In the Words of U.G. Krishnamurti
—------------------------------------------
Compiled & Edited by Peter Maverick
—-------------------------------------------------
-మీ ప్రగాఢ నమ్మకాలను ప్రశ్నించే, మీ ఆలోచనలకు పదును పెట్టే అసాధారణ పుస్తకం!
-స్వీయ విశ్లేషణకు ఇది ఒక అద్దం. ఒక ఆత్మసాక్షాత్కార ప్రయత్నం కాదు.
-ఇది ఒక తాత్విక అన్వేషణ
మీ ఆలోచనలను సవాలు చేసే శక్తివంతమైన రచన
-సాధనలే మార్గమని నమ్మే వారికి ఇది ఓ గట్టి షాక్.
ఇది ‘వివేకానందులు" కోసం కాదు – “విచారణకర్తలు” కోసం.
-"The Natural State" అనేది ఒక పుస్తకమేమీ కాదు… అది ఒక అద్దం. దానిలో మీరు చూడబోయేది.. మీరు అనుకుంటున్న 'మీరు' కాదేమో!”
-మతపరమైన బోధనలు, గురువులు, సాధనల పట్ల అనుమానం కలిగిన వారికి ఇది ఓ సత్యం కోసం పోరాటం.
-పాఠకుడిగా మీ లోతులు తడిమే ధైర్యం ఉంటే, ఈ పుస్తకం మిమ్మల్ని మానసికంగా మెల్లగా ఛిద్రం చేస్తూ, దాని వెనుక ఉన్న "ఆకాశం" చూపిస్తుంది.
-సొంత అవగాహనలు, కండిషనింగ్‌ను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్న నిజమైన అన్వేషకులకు ఇది గొప్ప "మేలుకొలుపు".
-ఎటువంటి మార్గదర్శి పుస్తకం కాదు. మార్గం చూపడం కూడా ఒక మాయే అని చెబుతాడు యూజీ. ఇది కేవలం మీలోని ప్రశ్నల్ని పెంచే అద్దం మాత్రమే.
"సత్యం కోసం అన్వేషించే వారికి ఒక అసాధారణ ఆహ్వానం – మీ ఊహలను, నమ్మకాలను ప్రశ్నించండి, మీ నిజమైన స్వభావాన్ని కనుగొనండి.
—-----------------------‐—------------------------
“యు.జి. కృష్ణమూర్తి బోధనలకు కాపీరైట్ లేదు. వాటిని మీరు పునరుత్పత్తి చేయవచ్చు, పంపిణీ చేయవచ్చు, అర్థం చేసుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు, వక్రీకరించవచ్చు, చెడగొట్టవచ్చు, మీకు నచ్చినట్లు చేయవచ్చు, చివరికి మీ సొంతమని చెప్పుకోవచ్చు కూడా – నా అనుమతి లేకుండా లేదా ఎవరి అనుమతి లేకుండా." ఈ మాటలు యు.జి. కృష్ణమూర్తి నిస్సంగత్వం, స్వేచ్ఛా దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి.
—-------------------------------------------’
మీరు ఎప్పుడైనా జీవితం గురించి, మీ గురించి, మీ నమ్మకాల గురించి లోతుగా ప్రశ్నించారా? మీరు ఎవరనే భావనను, సమాజం మీపై రుద్దిన ఆలోచనలను సందేహించారా? అలాంటి ప్రశ్నలతో హృదయాన్ని తాకే, మనసును కదిలించే ఒక అసాధారణ రచన "ది నాచురల్ స్టేట్ – ఇన్ ది వర్డ్స్ ఆఫ్ యు.జి. కృష్ణమూర్తి". . పీటర్ మావెరిక్ సంకలనం చేసి, సవరించిన "ది నేచురల్ స్టేట్" పుస్తకం, యు.జి. కృష్ణమూర్తి సంభాషణల సంకలనం. వివిధ వనరుల నుంచి సేకరించిన ఆయన మాటలను సులభంగా చదవగలిగే చిన్న, చిన్న పేరాల్లో పొందుపరిచారు. ఈ ఎంపికలు యు.జి. ఆలోచనలను ఒకదానికొకటి అనుసంధానిస్తూ, ఒక సమగ్రతను సృష్టిస్తాయి. సూటిగా, సరళమైన,, లోతైన ఆలోచనలతో నిండిన ఒక అద్భుత రచన ఇది. ఈ పుస్తకం మొత్తం ప్రభావం పాఠకుడిని విస్మయానికి గురిచేసి, జీవితంపై వారికున్న ప్రగాఢ నమ్మకాలు, అభిప్రాయాలు ఎంత నిష్ప్రయోజనమో గుర్తించేలా చేస్తుంది. యు.జి. దృక్పథంతో ఇప్పటికే పరిచయం ఉన్నవారికి సైతం, ఈ పుస్తకం సమగ్రమైన అవలోకనాన్ని అందించి, స్పష్టతను ఇస్తుంది. సొంత అవగాహనలు, కండిషనింగ్‌ను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్న నిజమైన అన్వేషకులకు ఇది గొప్ప "మేలుకొలుపు".
ఈ పుస్తకంలోని ప్రతి పేరా సరళంగా, స్పష్టంగా ఉంటుంది, కానీ ఆలోచనలు మాత్రం గాఢమైనవి, ఆశ్చర్యకరమైనవి. యు.జి. తనదైన విశిష్టమైన శైలిలో ఆధ్యాత్మికత, జీవితం, వ్యక్తిత్వం గురించిన సాంప్రదాయ భావనలను తలకిందులు చేస్తాడు. "వ్యక్తి అనేది లేదు. సమాజం, సంస్కృతి మనల్ని సృష్టించాయి.. కానీ మనం వ్యక్తులమని నమ్మేలా చేశాయి," అని యు.జి. సూటిగా చెబుతాడు. ఈ పుస్తకం ఆధ్యాత్మికతను ఒక జీవశాస్త్రీయ స్థితిగా చూపిస్తూ, సాంప్రదాయ మార్గాలను తిరస్కరిస్తుంది. యూజీ మిమ్మల్ని మారనివ్వడు – కానీ మిమ్మలే మీరు చూసేలా చేస్తాడు.
ఈ పుస్తకం మీ నమ్మకాలను, ఊహలను ప్రశ్నించేలా చేస్తూ, మిమ్మల్ని స్వేచ్ఛ దిశగా నడిపిస్తుంది.
యు.జి. విప్లవాత్మక ఆలోచనలు జీవితంపై కొత్త కోణాన్ని అందిస్తాయి. సంక్లిష్టమైన ఆలోచనలను సరళమైన, చదవడానికి సులభమైన పేరాలలో అందిస్తుంది.
ఈ పుస్తకం సాంప్రదాయ ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించే వారికి షాకింగ్‌గా అనిపించవచ్చు, కానీ నిజమైన అన్వేషకులకు ఇది ఒక అద్భుత బహుమతి.
ఈ పుస్తకం ఆధ్యాత్మికతకు సంబంధించిన "ఎలా చేయాలి" గైడ్ కాదు. ఇది ఒక తాత్విక అన్వేషణ. మీ ఆలోచనలను సవాలు చేసే ఒక శక్తివంతమైన రచన. కొందరికి ఈ పుస్తకం అస్తవ్యస్తంగా అనిపించవచ్చు, మరికొందరికి ఫాంట్ సైజు సమస్యగా ఉండవచ్చు. అయినప్పటికీ, యు.జి. అభిమానులకు ఇది ఒక అమూల్యమైన సంకలనం.
"ది నాచురల్ స్టేట్" అనేది సాధారణ ఆలోచనలను సవాలు చేసే, జీవితం గురించిన లోతైన సత్యాలను ఆవిష్కరించే ఒక అసాధారణ పుస్తకం. యు.జి. కృష్ణమూర్తి అసాంప్రదాయ దృక్పథం, సూటిగా, హాస్యంతో కూడిన సంభాషణలు ఈ పుస్తకాన్ని అద్భుతంగా, అసమానంగా చేస్తాయి. మీరు యు.జి. అభిమాని అయినా, లేక కొత్తగా ఆయనను కనుగొన్నవారైనా, ఈ పుస్తకం మీ ఆలోచనలను మార్చివేస్తుంది. చదవండి, సవాలు స్వీకరించండి. మీ నిజమైన స్వభావాన్ని కనుగొనండి!
—------
ఈ పుస్తకాన్ని చదవడం అంటే –
-“నేను ఎవరు?” అన్న ప్రశ్నను కొత్త కోణంలో చూడడం.
-మానవ సమాజం మనలో నాటిన తప్పుడు విశ్వాసాలపై అవగాహన కలగడం.
-మతం, గురువులు, ముక్తి వంటి భావనలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవడం.
-మనం అనుకున్న వ్యక్తిత్వం అసలే లేనిది అనే వాస్తవాన్ని స్వీకరించడం.
—--------
“మనం తలుచుకునే స్వేచ్ఛ కూడా ఒక భ్రమ. మన భయాలు, ఆశలు అన్నీ – సంస్కృతి కోరిన ఆకృతిలో మనం బతకాలని భావించే ఒత్తిడులే.”యు.జి.
—-----------------
*యు.జి.కృష్ణమూర్తి భావనలను తెలుగులో తెలుసుకుందామని ఆశక్తి ఉన్నవారు నా బ్లాగు
ugtelugu.blogspot.com (అచింతనాపరుడు) నుంచి తెలుసుకోవచ్చు
సమాజం, సంస్కృతి, జీవితం, పేదరికం, మానవ సంబంధాలు, దేహం, ఇంద్రియాలు, సహజస్థితి, ఆహారపు అలవాట్లు, చైతన్యం, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక గురువులు, గతం, వర్తమానం, దాతృత్వం, మనస్సు, ధ్యానం, ఆలోచన, కవులు, రచయితలు, కళాకారులు..ఇలా భిన్న అంశాలపై యూజీ ఏం చెబుతాడు? అని రేఖా మాత్రంగానైనా తెలుసుకోవడానికి ఈ బ్లాగును దర్శించవచ్చు
—----------------------
.
No comments:
Post a Comment