Saturday, 7 June 2025

దాతృత్వం

 మనస్సు సృష్టించిన నీచమైన ఆవిష్కరణ దాతృత్వం

*మోసం, దోపిడీ స్వభావం కలిగిన చర్య

*అసమానతలు పెంచేందుకే దోహదం

*నిజమైన సామాజిక మార్పులకు ఆటంకం

*తిరుగుబాటు రాకుండా రక్షణ 

యు.జి.కృష్ణమూర్తి


యు. జి. కృష్ణమూర్తి దానధర్మాలను తీవ్రంగా విమర్శించారు. ఆయన దృష్టిలో దానం అనేది మోసపూరితమైన, దోపిడీ స్వభావం కలిగిన చర్య. దానం దొంగతనం నుంచి వస్తుంది. ధనవంతులు సంపాదించే సంపద తరచూ అన్యాయమైన లేదా దోపిడీ మార్గాల ద్వారా వస్తుంది. ఆ సంపదలో కొంత భాగాన్ని దానంగా ఇస్తారు. దానం ద్వారా సంపన్నులు, పేదలు తిరుగుబాటు చేయకుండా సమాజంలో ఉన్న అధికార నిర్మాణాలను నిలబెట్టుకుంటారు. అపరాధ భావం, స్వార్థం నుంచి ఉద్భవిస్తుంది. దానం చేసేవారు తరచూ ఇతరుల బాధలను తగ్గించడానికంటే, తమ అపరాధ భావాన్ని తగ్గించుకోవడానికి లేదా తమను తాము గొప్పగా, మంచిగా భావించడానికి దానం చేస్తారు. దానం అనేది అసమానతలను తగ్గించడానికి బదులు, వాటిని మరింత పెంచుతుంది. ఇది ఆధారపడే వ్యవస్థను సృష్టించి, నిజమైన సామాజిక మార్పును అడ్డుకుంటుంది. అసమానతలు, బాధలకు మూల కారణాలను వ్యక్తిగత మార్పు,  సమానమైన సామాజిక వ్యవస్థ ద్వారా పరిష్కరించాలని, దానం అనే తాత్కాలిక పరిష్కారాలపై ఆధారపడకూడదని ఆయన  ప్రధానంగా చెప్పారు.

ఇది అత్యంత దుర్మార్గమైన చర్య

“దాతృత్వం అనేది మానవ మనస్సు సృష్టించిన అత్యంత నీచమైన ఆవిష్కరణ. మొదట, అందరికీ సమానంగా చెందాల్సిన దాన్ని దొంగిలిస్తారు. తర్వాత దాన్ని చట్టం, ఇతర మార్గాల ద్వారా కాపాడుకుంటారు. లేనివారు మీపై తిరుగుబాటు చేయకుండా నిరోధించడానికి మీరు దానధర్మం చేస్తారు. అది మీ అపరాధ భావనను కూడా తగ్గిస్తుంది.  నిజమైన కరుణ కాకుండా, ఉన్నత భావన  అహంభావం నుంచి ఇది వచ్చింది. దానం చేసే వారంతా దానం చేసినప్పుడు తమను తాము గొప్పగా భావిస్తారు. నిజమైన దయ, కరుణ  శ్రద్ధ అనేవి బాధల మూల కారణాన్ని అర్థం చేసుకోవడం నుంచి వస్తాయి.  ఉపరితల దాన గుణాల నుంచి కాదు. మతం దాతృత్వాన్ని  ‘అద్భుతమైన’ విషయంగా ఆవిష్కరించింది. భూమిపై దైవిక జీవనం" సృష్టించాలనే ఆలోచన కూడా ఆందోళన, బాధలకు మూలం. అది మనం చేసిన అత్యంత దుర్మార్గమైన, అసహ్యకరమైన చర్య. ప్రకృతి మనకు సమృద్ధిని అందించింది. కానీ ప్రపంచంలోని అసమానతలకు మనమే వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి” అని యు.జి ‘దాతృత్వం’ అసలు ముఖాన్ని చూపిస్తారు.


Charity is the filthiest invention of the human mind

-Most vicious and vulgar thing

-Charity as a byproduct of theft

U.G.KRISHNAMURTHI


“Charity is the filthiest invention of the human mind. First you steal what belongs to everyone, then you use the law and various other means to protect it. You give charity to prevent the have-nots from rebelling against you. It also makes you feel less guilty. All do-gooders feel ‘high’ when they do good.”

Religion has invented that wonderful thing called charity. It is the most vicious and vulgar thing that we have done. Nature has provided us with a bounty. But we are individually responsible for the inequities of the world. Charity is rooted in a system where some accumulate wealth while others suffer, and that charitable acts are often motivated by a desire to alleviate guilt or maintain social order rather than genuine concern for the well-being of the needy. Charity ultimately perpetuates the inequality it attempts to address.

Charity as a byproduct of theft:

 That the wealth that is later given as charity is initially accumulated through means that are often unjust or exploitative. Charity is often used to prevent the "have-nots" from rebelling against the "have-s," thus maintaining the existing power structure.

That people engage in charity not only to alleviate the suffering of others, but also to feel better about themselves and to reduce their own feelings of guilt. Charity can actually reinforce the inequalities it aims to address, as it can create a system of dependence and dependence, rather than true social change. The root causes of inequality and suffering through personal transformation and a more equitable social system, rather than relying on charitable acts to patch up the system.

Charity to be a vulgar act. It as something that arises from a sense of superiority and ego, rather than genuine compassion. True compassion and care come from understanding the root cause of suffering, not from superficial gestures of giving. The idea of creating a "divine life on earth" as a source of anxiety and suffering.”

No comments:

Post a Comment