Saturday, 7 June 2025

ఆధ్యాత్మికత కూల్చివేతపై ఒక విచారణ

ఆధ్యాత్మికత కూల్చివేతపై ఒక విచారణ

—----------------------------------------

శంకరాచార్యుడు బాస్టర్డ్‌! 

*గౌడపాదుడు కూడా…!

*మాండూక్య ఉపనిషత్తు ఒక చెత్త! 

*మీరు ఇప్పుడు మాట్లాడుతున్నదీ అదే చెత్త!

*టేప్ రికార్డర్ మీ కన్నా బాగా చెబుతుంది!

యు.జి. కృష్ణమూర్తి, చక్రవర్తి ఆనంతాచార్ మధ్య ఆసక్తికర సంభాషణ


-ఆయన పేరు చక్రవర్తి ఆనంతాచార్. పేరు చూస్తేనే తెలుస్తోంది, ఆయన ఒక వైష్ణవ కుటుంబానికి చెందినవారు అని. శ్రీరామానుజాచార్యుల విశిష్టాద్వైత సిద్దాంతాన్ని అనుసరించే కుటుంబం. ఆయన సంస్కృత వ్యాకరణం, తర్కంలో పండితుడు. రామానుజాచార్యుల తత్వంపై ప్రగాఢ జ్ఞానం కలిగినవాడు. అయినా కూడా శంకరాచార్యుల అద్వైత తత్వాన్ని గాఢంగా ఆదరించేవాడు. శంకరాచార్యుల అద్వైతంపై ఆయన ప్రసంగాలు చాలా మందిని ఆకట్టుకునేవి. బెంగళూరులో మంచి పేరుతెచ్చుకున్నాడు. అందుకే నా స్నేహితుల్లో చాలా మంది ఆయన గురించి తెలుసుకున్నారు. కృష్ణమూర్తి అనే నా స్నేహితుడు రోజూ ఆయన ఉపన్యాసాలకు వెళ్లేవాడు.


ఒక రోజు జూన్ 1998లో, వెంకట చలపతి యు.జి. గురించి ఆనంతాచార్‌కి వివరించాడు. యు.జి ని "జీవన్ముక్తుడు" అని చెప్పాడు. ఆనంతాచార్ యు.జిని కలవాలని ఆసక్తి చూపాడు. అయితే యు.జి చలపతిని వారించాడు. “అతన్ని ఎందుకు తీసుకొస్తావు? నీవు చెప్పిన ప్రకారం “అతను పండితుడు, వేదికలపై ప్రసంగించే వాడు. అలాంటి వారు తమ సంప్రదాయ విశ్వాసాల్లో పెట్టుబడి పెట్టి ఉంటారు. వాళ్లు నన్ను వినలేరు.” అని అన్నాడు. అయినా చలపతికి పట్టుదల ఎక్కువ. చివరికి, జూన్ 21, 1998 ఆదివారం రోజున ఆనంతాచార్ యు.జిని కలవడానికి మేజర్ ఫామ్‌హౌస్‌కి వచ్చాడు. ఆయనతో పాటు చలపతి, కృష్ణమూర్తి కూడా ఉన్నారు.


యు.జి. ఆయనకి గౌరవంగా పక్కన కూర్చునేలా సోఫాలో చోటిచ్చాడు. మిగతావాళ్ళం నేలమీదా, కొంతమంది కుర్చీలమీదా కూర్చున్నారు. ఆ రోజు సంభాషణలోని ముఖ్యాంశాలు ఇవే:

అనంతాచార్ తనను వేదాంత సిద్ధాంతవేత్తగా, వక్తగా, పండితుడిగా పరిచయం చేసుకున్నాడు. అతను యు.జితో సంభాషణను ఇలా ప్రారంభించాడు: “ఉన్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు అనేక సిద్ధులను కలిగి ఉంటారని చెబుతారు.”

యు.జి ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.


ఆనంతాచార్: ధ్యానంతో మనిషి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరవచ్చునని నమ్మకం ఉంది.


యు.జి: ధ్యానానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఇదే నా అభిప్రాయం.


ఆనంతాచార్: అలాంటప్పుడు మనం ఏం చేయాలి?


యు.జి: ఏమీ చేయకండి. నిష్క్రియగా ఉండండి.


ఆనంతాచార్: [నవ్వుతూ] అలా అయితే ప్రతి ఒక్కరూ యోగి అయిపోతారు.


యు.జి: నేనైతే యోగిని కాను.


ఆనంతాచార్: మీరు ప్రపంచాన్ని చుట్టిన వ్యక్తి. అన్ని సంఘర్షణలను అంతం చేయడానికి, అందరినీ కలిపే ఏదైనా విశ్వ తత్వం (యూనివర్సల్ ఫిలాసఫీ) ఉండదని అనుకుంటున్నారా?


యు.జి: అటువంటి తత్వం అన్నది ఒక కల్పన మాత్రమే. అదే సమస్యకు మూలం.


ఆనంతాచార్: అంటే మీరు చెప్పదలుచుకున్నది ఏమిటంటే – జీవితం ఒకటే అన్న భావన లేదు అనేనా? ఎందుకంటే అన్ని మతాధిపతులూ జీవన ఏకత్వం గురించి మాట్లాడారు కదా.


యు.జి: మీరు ఆ జీవితానికి ఒక వ్యక్తీకరణ. మీ రక్తం పీల్చే దోమ మరో వ్యక్తీకరణ. బయట ఉన్న పురుగు కూడా అదే. సమస్య ఏమిటంటే, మనం జీవనాన్ని అర్థం చేసుకోవాలనుకుంటాం. అందుకు ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నం సంఘర్షణను సృష్టిస్తుంది. అదే కన్ఫ్యూజన్ ‌కి కారణం.


ఆనంతాచార్: అద్వైతవేదాంతం జీవితం "అనిర్వచనీయమైనది" (వర్ణించలేని) అని చెబుతుంది.


యు.జి: అలా అయితే వాళ్లు దానిపైన ఎందుకు మాట్లాడుతున్నారు? [ఇప్పుడు యూ.జి స్వరం కాస్త తీవ్రతరంగా మారింది.] ఆవల (బియాండ్) ఏమైనా ఉంటే దానిని ఎప్పటికీ పక్కాగా పట్టుకోలేం, అర్థం చేసుకోలేం, వ్యక్తపరచలేం. అప్పుడు దాన్ని “ఆనందం”, “ఆత్మానుభూతి” అని ఎలా వర్ణించగలరు? నిజంగా దాన్ని అనిర్వచనీయమని అనుకుంటే, అక్కడే ఆగిపోవాలి కదా!


ఆనంతాచార్: తత్త్వవేత్తలుగా వారు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలనుకున్నారు...


యు.జి: అది మీకు ఏం ఉపయోగం సార్? తత్త్వవేత్తలు అంటే జ్ఞానాన్ని ప్రేమించే వాళ్లు. తత్త్వం అనే అంశం మన బుద్ధిని పదును పెడుతుంది అంతే.


ఆనంతాచార్: ఒక మనిషి జ్ఞాని ఔనో, కాదో ఎలా తెలుసుకోవాలి?


యు.జి: తెలుసుకోగలిగే మార్గం మీకు లేదు.


ఆనంతాచార్: శంకరాచార్యులు ఒక జ్ఞానిని ఎలా గుర్తించాలో చెప్పారు. గీతలో కూడా ఉంది...


యు.జి: ఇవన్నీ వృథా పదాలు! అర్థం లేని మాటలు! వాటితో మీకు ఏ ప్రయోజనం జరిగింది? మీరు ఇప్పటికీ అదే ప్రశ్న అడుగుతున్నారు కదా!


[అందరూ నవ్వారు. ఆనంతాచార్ కాస్త అయోమయంగా మారారు. రెండు గ్లాసుల నీటిని తాగారు.]


ఆనంతాచార్: మనం ఒకరితో ఒకరు సంభాషించాలంటే పదాలు తప్పనిసరి కదా.


యు.జి: నేను చెప్తున్నదేమిటంటే, ఎటువంటి కమ్యూనికేషన్ (భావప్రసారం) సాధ్యం కాదు, అవసరం లేదు కూడా.


ఆనంతాచార్: కాని మేధస్సును పొందాలంటే మాకు వేరే మార్గం లేదు.


యు.జి: మేధస్సే అసలు ఆటంకమని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు?


[ఆనంతాచార్ చుట్టూ ఉన్నవాళ్లను చూస్తూ అయోమయంలో ఉన్నారు. చలపతి వైపు తిరిగి, "ఇతను ఏం చెబుతున్నాడో నాకు అర్థం కావడం లేదు" అంటారు. తర్వాత యుజి వైపు తిరుగుతారు.]


ఆనంతాచార్: నేను యు.జి. ఏం చెప్తున్నారో అర్థం చేసుకోలేకపోతున్నాను. నా శాస్త్రీయ అధ్యయనం చాలా సంవత్సరాలుగా ఉంది...


యు.జి: నేను చదువుకోని వాడిని…


ఆనంతాచార్: కాదు, కాదు, అలా చెప్పకండి. మీరు ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తివి. అలాంటి వారిని చాలా అరుదుగా చూస్తాం. జ్ఞాని అన్నవాడు అన్నిటికంటే ఉన్నత స్థితిలో ఉంటాడు. నా అభిప్రాయం ప్రకారం, మనిషి తన పరిసరాలన్నింటిని మర్చిపోయి, అఖండ ఆత్మలో లీనమైతే, అదే శంకరాచార్యులు చెప్పిన బ్రాహ్మి స్థితి. నా ధ్యానం అంత గొప్పది కాదు. నేను పెద్ద సాధన చేయలేదు. కానీ చేయాలనే కోరిక ఉంది. నేను జ్ఞాన మార్గంలో ఉన్నవాడిని.


యు.జి: నేను మీలా పండితుడిని కాదు. కానీ అద్వైతం నేర్చుకున్నాను. మా ఆచార్యులు మహాదేవన్ గారు.


ఆనంతాచార్: మనం ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?


యు.జి: అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.


ఆనంతాచార్: అర్థం చేసుకోకపోతే, ప్రపంచంతో ఎలా సంబంధంలో ఉండగలం?


యు.జి: మీరు నిజంగా ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నానని అనుకుంటున్నావా? మీరు నిజంగా ఆ వ్యక్తిని చూస్తున్నారని భావిస్తున్నారా? మీ భార్యను జీవితంలో ఒక్కసారి అయినా నిజంగా చూసారా? ఒకవేళ నిజంగా చూసుంటే, ఆ సంబంధం అప్పుడే ముగిసిపోతోంది. నీవు ప్రతిదీ నీకున్న జ్ఞానం ద్వారా చూస్తావు. నీ చుట్టూ ఉన్న వస్తువుల గురించిన జ్ఞానమే నీకు ప్రపంచాన్ని సృష్టిస్తుంది. నీకు తెలియనిది నీవు అనుభవించలేవు. అందుకే నేను చెబుతున్నాను, కొత్త అనుభవం అనేది ఏదీ లేదు. నీవు ప్రపంచంతో ఎలా సంబంధం కలిగి ఉండగలవు? 


ఆనంతాచార్: మనం శ్వాసిస్తూ, ఈ ప్రపంచంలో జీవిస్తున్నంత వరకు సంబంధం కలిగి ఉంటాం.


యు.జి: కాదు, మీరు ఏ స్థాయిలోనూ ఏ వస్తువుతోనూ నిజంగా సంబంధం కలిగి ఉండలేరు..


[యు.జి స్వరం మరింత గట్టిగా మారడంతో ఆనంతాచార్ కలవరపడతారు.అతను కుర్చీలో అసౌకర్యంగా కదులుతాడు. మోహన్ మరింత నీళ్లు ఇచ్చి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.]


మోహన్: [ఆనంతాచార్‌తో] మీరు ఆయన మాటలు అంగీకరిస్తున్నారా సార్?


యు.జి: ఆయన ఏం అంగీకరిస్తారు? ఆయన అంగీకరించగల స్థితిలో లేరు.


(ఆనంతాచార్ మాండూక్య ఉపనిషత్తు ఉల్లేఖిస్తూ: “పరా విద్య, అపరా విద్య ఉన్నాయి. వృత్తి జ్ఞానాన్ని విడిచిపెడితే స్వరూప జ్ఞానం కలుగుతుంది. చివరికి ‘ఉపశాంతోయం ఆత్మా’ అనే మాట మాండూక్యం సూచిస్తుంది .”)


(యు.జి. ఒక్కసారిగా మండిపడ్డారు. “మాండూక్య ఉపనిషత్తుకు టాయిలెట్ పేపర్ కంటే విలువ లేదు అని చెపుతాడు. శంకరాచార్యులను "బాస్టర్డ్" అని దూషించారు – ఉపనిషత్తులపై వ్యాఖ్యానాలు రాయడాన్ని తప్పుపట్టారు. మాండూక్య కరికా రచించిన గౌడపాదుడిని కూడా అదే పదంతో దూషించారు.)


(ఇది ఆనంతాచార్‌కు సహించలేనిది అయింది. అతను కోపంతో వణుకుతాడు. స్థిరంగా కూర్చోలేకపోతాడు. మోహన్ మళ్లీ నీళ్లు అందిస్తూ “ఇంకొంచెం తాగండి సార్, అలా కూర్చోండి” అని శాంతపర్చేందుకు ప్రయత్నించాడు.)


ఆనంతాచార్: [ఆగ్రహంతో, చుట్టూ ఉన్నవాళ్లను చూస్తూ] “ఇది చాలా అతిగా ఉంది సార్. యు.జి. చాలా అసభ్యమైన పదాలను ఉపయోగిస్తున్నారు. శంకరాచార్యులను బాస్టర్డ్ అంటారా? ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఇలాంటి భాష వాడతాడా?”

[అప్పుడు యుజి మరోసారి ఆగ్రహంతో రగిలిపోతాడు]

యు.జి: అవును! నేనింకా అదే చెబుతాను – శంకరాచార్యుడు బాస్టర్డ్‌! మాండూక్య ఉపనిషత్తు కాగితం విలువ కూడా లేదు – అది చెత్త! అదే చెత్త మీరు ఇప్పుడు మాట్లాడుతున్నదీ! మీ నోట మాటగా వస్తున్నది శంకరాచార్యుల మాటలే – మీ స్వంతమైనదేం ఉంది? అదే నా ప్రశ్న. శంకరాచార్యులు, గౌడపాదులు… ఇవన్నీ వదిలేయండి. నీవు కేవలం పునరావృతం చేస్తున్నావు. టేప్ రికార్డర్ నీ కన్నా బాగా చెబుతుంది!


మీరు చెబుతున్న మాటలు మీ జీవితం మీద ఏమైనా ప్రభావం చూపించాయా? మూర్ఖుల ముందు నిలబడి వాళ్లకి బోధించి జీవితాన్ని గడపండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అవి మిమ్ములను తాకలేదు. మరి ఆ స్థితిని ఎవరైనా ప్రేమ, ఆనందం అని ఎలా వర్ణించగలరు? ప్రేమ విభజిస్తుంది, వేరు చేస్తుంది. ఇప్పటికే విభజన ఉంది. విభజన ఉన్న చోట ప్రేమ ఎలా ఉంటుంది?


[ఆనంతాచార్ ఇక తట్టుకోలేక లేచి నిబడతాడు. అతను ఇక సహించలేకపోతాడు. "నేను ఇక్కడ జ్ఞానోదయం పొందిన వ్యక్తిని చూస్తానని ఆశతో వచ్చాను. ఇలాంటి ప్రతికూల వ్యక్తిని కలుస్తానని ఎప్పుడూ ఊహించలేదు అంటారు.]


 [యు.జి. వెంటనే జవాబిస్తూ, "నీవు తప్పు మనిషి దగ్గరకు వచ్చావు. ఇప్పుడు వెళ్లిపోవచ్చు."]


[అనంతాచార్ గౌరవ సూచకంగా చేతులు జోడించి గది నుంచి బయటకు వెళ్లిపోతాడు]

—-------


*ఈ సంభాషణ “Stopped in Our Tracks: UG – Anecdotes, Comments and Reflections (Second Series)” అనే గ్రంథం నుంచి తీసుకున్నది. రచన: కె. చంద్రశేఖర్ నోట్‌బుక్స్ ఆధారంగా..

—-------------------------

No comments:

Post a Comment