Thursday 22 September 2011

సమయం, స్థలం (TIME, SPACE)

  • సమయం, స్థలం అంటూ అక్కడ లేవు. అవన్నీ మేధోపరమైన భావనలు. అక్కడ పదార్థం (థింగ్) లేదా నీవంటున్ననాలుగు కొలతల స్థలం,( ఫోర్ డైమన్షన్ స్పేస్ ), సమయం కొనసాగడం(టైం కంటిన్యుఎషన్)  అంటూ ఏమి ఉండదు. ఈ స్థితి స్థలం, సమయం ప్రకారం నడవదు. ఎందుకంటే ఇక్కడ కొనసాగింపు ఉండదు. 
  • ఆలోచనే సమయం. ఆలోచన లేకపోతే సమయం ఉండదు. ఎక్కడ కేంద్రం ఉండదో అక్కడ స్పేస్, స్థలం ఉండదు . ఎక్కడ కేంద్రం ఉండదో అక్కడ మొత్తంలో నీవు భాగస్వామివి అవుతావు. ఇది ప్రతి దాన్ని కదిలిస్తుంటుంది. దీంట్లో మార్మికమైన అర్ధం లేదు.

ప్రశ్నలే లేవు (NO QUESTIONS)

  • నీ సమస్యలన్నీ కొనసాగుతుంటాయి. కారణం తప్పుడు పరిష్కారాలను కనుగొన్నావు. అక్కడ సమాధానాలు లేకపోతే ప్రశ్నలే ఉండవు. అవి ఒక దానిమీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. తత్వవేతలు, రాజకియవేత్తలు, సైకాలజిస్టులు, ఆద్యాత్మిక గురువులు అనేక పరిష్కారాలు చూపారు. అవి సమాధానాలు కాదు. అది మనకు స్పష్టమైంది. ఆ పరిష్కరాల్లో  నిర్దిష్టత ఉంటే సమస్యలే ఉండవు. 
  • మన ప్రశ్నలన్నీ మన లక్ష్యాలు , నమ్మకాలు, తలంపులు, జ్ఞాపకాల నుంచే వస్తాయి. వాస్తవ స్థితి నుంచి కాదు. ఇక్కడ నీవు స్వేచ్చను పొందవలసి ఉంది. 

Wednesday 14 September 2011

సంబంధం (RELATIONSHIP)

  • నీ చుట్టూ ఉన్న దానితో, నీ దగ్గర సమీపంలోని వారితో నీవు అనుకున్నట్టుగా సంబంధాన్ని ఏర్పరచు కోవ డం సాధ్యం కాదు. మన చుట్టూ జీవితం నుంచి, మానవాళి నుంచి విడిపోయాం. వేరుపడి పోయాం. ఇతర సృ ష్టి నుంచి మనం  విడిపోయాం. మనం ఏవరికి వారు ప్రత్యేక చట్రంలో జీవిస్తున్నాం. సంబంధాల కోసం ప్రయ త్నిస్తున్నాం. దీన్ని ఎవరో పూరించాలనుకుంటున్నాం. ఫలితంగా మనం విడిపోతు న్నాం.  ఈ ఖాళీ ని నింప డం కోసం మన చుట్టూ ఉన్న ప్రజలు అన్ని రకాల సంబంధాల  కోసం సర్వదా  ప్ర యత్ని స్తుంటారు. ఇది నిజం గా  పెద్ద సమస్య. ఇతరులతో సంబధాల కోసం అన్ని రకాల అస్త్రాలు ఉపయోగిస్తాం. సంబంధాలు లేకపోతే నష్టపోతాం. అర్ధం, పరమార్ధం కనబడదు. సంబంధం
  • అర్ధవంతమైన, ప్రయోజనపుర్వకమైన సంబంధాల కోసం ఆసక్తి ప్రదర్శిస్తుంటాం. అందువల్ల వాస్తవ ప్రపంచా న్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది.కాని అర్ధం చేసుకోవడానికి   ఏమీ లేదు. వాస్తవం అంటూ ఏమీ లేదు. వాస్తవ ప్రపంచం అంటూ నేను అంగీకరిచడం అంటే అది సమాజం నన్ను నిర్దేశింహిందే.నిన్ను స్త్రీ అనో, పురుషుడనో, అది బెంచీ, ట్రే అనో చెబుతాను. అంతకుమించి ఈ ప్రపంచంలో వివేకంతో, తెలివితో నడవలేను. వాస్తవ ప్రపం చాన్ని అర్ధం చేసుకోవడమంటే అర్ధంకోసమో, సహాయం కోసమో, ప్రయోజనం కోసమో కాకుండా ఉండాలి.
  • మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మనం విడిగా లేం. ఇదంతా ఒకే సమాహారం. చైతన్యం, ఆత్మ అంటూ మొత్తం నుంచి విడిపోయాం.

Tuesday 13 September 2011

నిస్వార్థం (SELFLESS)

  • నేను నిస్వార్ధంగా  ఉండాలి అనుకొంటావు. ఎప్పుడు ...రేపు...తర్వాత రోజు, అంటే తర్వాత జీవితంలో... కాని ఈ రోజే,ఇప్పుడే బయటపడటం ఎందుకు సాధ్యపడటం లేదు.నిజంగా స్వార్ధం నుంచి బయట పడాల నుకొంటు న్నావా?  కానప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడతావు.   స్వార్ధం లేని స్థితి, ప్రశాంతత అనేది చెప్పుకోవడానికే దాని విలువ. నేను చెప్పడం లేదు నివు స్వార్థ పరుడవని. దానికి వ్యతిరేకంగా నీవు ఆలో చిస్తున్న `స్వార్థరహిత స్థితి`కూడా అర్ద్థం లేనిదే.ధ్యానం ద్వారా స్వార్ధాన్ని అంత మొందించాలనుకొంటావు.  నిజాని కి ధ్యా నం ఏమీ లేదు.స్వార్థరహిత  స్థితి  గురించి ఆలోచనే తప్ప.ఇందుకు నీవు చేసేదేమీ లేదు. స్వా ర్ధం నుంచి స్వేచ్చను పొందాలను కోవడం లేదనే పచ్చి నిజాన్ని నీవు అంగీకరించి తీరాలి.ఆలోచనలను అణుచుకోవడం, అదుపు చేయడంలోనే నీ శక్తంతా నిర్విర్యమైపోతుంది. నీ ఆకాంక్ష ఏదైనా నీ శిక్షణ,నీ ఉపా యాలు,అన్వేషణకు నీ శక్తినంతా ధారపో స్తావు. జీవించడానికి అవసరమైన శక్తిని కోల్పోతావు.జీతానికి అర్ధం వెతకడం ఒక వ్యసనంగా,ఒక వేదనగా మారు తుంది.
    • నిస్వార్థంగా ఒకటి చేయలనుకున్నంత కాలం నీకు నీవు కేంద్రంగా తయరవుతావు. 

Sunday 11 September 2011

అర్ధంచేసుకోవడం (UNDERSTANDING)

  • అర్ధవంతమైన, ప్రయొజనపూర్వకమైన సంబధాలకోసం ఆసక్తి ప్రదర్సిస్తుంటాం. అందు వల్ల వాస్తవ ప్రపం చాన్నిఅర్ధం చేసుకోవాల్సి ఉంది.కాని అర్ధం చేసుకోవడానికి ఏమీ లేదు. వాస్తవం అంటూ ఏమీ లేదు. వాస్త వ ప్రపంచమంటూ నేను అంగీకరించడం అంటే అది సమాజం నన్ను నిర్దేసించిందే.వాస్తవ జగత్తును అర్ధం చేసుకోవడమంటే అర్ధం కోసమో, సహాయం, ప్రయోజనం కోసమో కాకుండా ఉండాలి.
  • నిన్ను నీవు అర్ధంచేసుకోవడం అనేది అతి పెద్ద జోక్స్ లో  ఒకటి . ఆధ్యాత్మిక మనిషి , సనాతన జ్ఞానులే కాకుండా ఆధునిక శాస్త్రవేత్తలు కుడా ఈ భావనకు అగ్ర స్థానం వేసారు.ఇక మానసిక శస్త్ర వేత్తలు అయితే ఆత్మ జ్ఞానం, స్వీయ వాస్తవికత, ఏ  క్షణానికి ఆ క్షణం జీవించడం ...ఇలా చెత్తను  మాట్లాడడానికి  ఎంతో ఇష్టపడ తారు .
  • మనిద్దరి  మధ్య ఏమైనా భావప్రసారం ఉందా? మనం దాన్ని పెంచి పోషిస్తున్నామా?  భావప్రసారాన్ని ఒక సాధనంగా ఇద్దరం ఉపయోగించు కుంటున్నాం  అంతే.అర్ధం చేసుకోవడం అసాధ్యం. నా ప్రతి మాట నీ జ్ఞాన చట్రంలో అనువాదమై పోతుంది . నేను చెప్పేది నీకు రిఫరెన్సు పాయింట్ అవుతుంది.

    సంగీతం కవిత్వం, కళలు (MUSIC,POETRY, ARTS)

    • సంగీతం  కవిత్వం, భాషను కీర్తించడం అనేదంతా నాగరికత నిర్దేసించిందే. ఇదంతా ఆలోచన సృష్టి. ఇది తెచ్చి పెట్టుకున్న అభిరుచి. పిల్లి కూతలకంటే బెతోవిన్ తొమ్మిదో సింఫనీ అత్యంత సుందరంగా ఉంటుందని అది నీకు చెబుతుంది. రెండూ ఒకే రకమైన సంచలనాలు కలిగిస్తాయి.
    • అత్యంత ప్రముఖులైన సంగీతకారులు, గాయకులకంటే కుక్కల అరుపుల పల్లవిలో ఎంతో జీవం ఉంటుంది.

    Saturday 10 September 2011

    అమెరికా

    •   అమెరికా అంతటా అంత్రాక్స్  దాడుల భయం చుట్టుముట్టింది. ఈ నిజాన్ని  తోక్కిపెట్టేందుకు అన్ని చర్యలు తిసుకుంటోంది. అమెరికన్లు ఉన్మాదులు అని చెప్పడం అంటే ఇంకా గౌరవంగా మాట్లాడినట్లవుతుంది. `శాశ్విత మైన స్వేచ్చ` కోసం పోరాటం చేస్తున్నానని ఈ  దేశం చెప్పే మాటలు ఇక్కడ వర్తించవు. ఇది వీర భూమి కాదు. ఇది స్వేచ్చగా ఉండే వాళ్ళ ఇల్లుకాదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పోలీస్ స్టేట్ గా  మా రింది.  సాధ్యమైనంత  వరకు ఒక్క వారంలో ఇక్కడ నుంచి బయటపడతాను.తర్వాత ఎక్కడికి వెళతానో తెలి యదు. ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను. భారత దేశంలో అడుగు పెట్టను. ఎందుకో మీకు తెలుసు. మీరు అమెరికాకు ద్వారాలు తెరిచారు. వాళ్ళు  పాకిస్తాన్లో   అంతర్యుద్ధం మొదలుపెట్టారు. తర్వాత కాశ్మీర్ ని మధ్య ప్రాచ్యంగా చేస్తారు. మీరు గర్వపడే మీ గొప్ప వారసత్వం సృస్టించిన వెన్నుముక లేని నాయకులకు పశ్చిమ దేశాలను `వెళ్ళిపొండి` అనే దమ్ము లేదు. 
     అమెరికా నుంచి  mahesh భట్ తో ఫోన్లో

    Saturday 3 September 2011

    గురువులు, ఆధ్యాత్మిక వ్యాపారం (GURUS - HOLY BUSINESS)

    •  మొత్తం అధ్యాత్మిక వ్యాపారమంతా నైతిక ప్రవర్తన తప్ప మరేమీ లేదు. ప్రవర్తన ప్రణాళికను సమాజం  తన ప్రయోజనాలకోసం నిర్దేశిస్తుంది. మతానిది కుడా ఇదే దారి. నీలో అదుపు కోసం పూజారిని నియమిస్తుంది. బయట పోలిస్ మాన్  సంస్తాగతమయ్యాడు అలా.
    •   జ్ఞానం కోసం, ఆత్మ చైతన్యం కోసం ఎంతో చదివి జీవితాన్ని అంకితం చేశారనే వారి మీద ఆధారపడటం అనివార్యమైంది. వారు చెబుతున్న తత్వాలను దేహానికి ఉన్న వాస్తవ జ్ఞానంతో పోల్చలేవు.ఈ శరీరం అత్యం త తెలివైంది. ఈ దేహం ఉనికిని తాజాగా ఉంచడానికి శాస్త్రీయమైన లేదా వేదాంతపరమైన బోధనలు యేమీ  అవసరం లేదు. వారివి కేవలం మాటలు. ఏమాత్రం నిర్దిష్టత ఉండదు. గుడ్డి నమ్మకాలు. గురువులు, మత గ్రంధాలు చెప్పేదాన్ని నీవు చాలా తెలివిగా హేతుబద్దం చేస్తావు. నీ నమ్మకాల ఫలితమే ఆధిపత్యాన్ని గుడ్డిగా అంగీకరించడం. ఇదంతా రెండో తరగతి జ్ఞానం. నీ నమ్మకాల నుంచి నీవు విడిగా లేవు. నీ నమ్మకాలు, నీ  భ్రమలు తొలిగితే నీవు మిగలవు. 
    •      నీ మేడిటేషన్లు, సాధనలు, పద్దతులు, చిట్కాలు అన్ని అర్ధం లేనివి. వాటన్నిటి అర్ధం నీలో మార్పు తీసుకురావడం. అసలు పరివర్తన, మార్పే లేదు. అక్కడ మార్పుందని అంగీకరించడం నీ విశ్వాసం. అసలు ఎవరు మారాలనేది నీవు ఎప్పుడూ ప్రశ్నించవు.నీలో పరివర్తన కోసం రూపుదిద్దుకున్న భావనే మొత్తం `మిస్టిక్ ఆఫ్ ఎనలైట్ మెంట్`.
    •   వాళ్ళు నిన్ను హెచ్చరిస్తుంటారు. బాగా కష్టపడాలి.అధ్యయనం చేయాలి.ధ్యానం చేయాలి అంటూ నిర్దేసి స్తుంటారు. టీచరు, గురువు, నాయకుడు ...వాళ్ళు చూపేవి తప్పుడు మార్గాలు. అతడే నిజాయతీగా పనిచే యడు. చవక రకం ,నాశిరకం వస్తువులను అమ్ముకొంటూ తనను తానే అమ్ముకొంటాడు.వీరి మీద నీ ఆశలు తోసేయగలిగితే వాళ్ళు నీ దగ్గర ఈ వ్యాపారం చేయరు. 
    •      ధ్యానం ఒక యుద్ధం. యుద్ధం ముగిసిన తర్వాత శాంతి లభిస్తుందని స్వాములు వాగ్దానం చేస్తారు. నీకు కేవలం బాధాకరమైన అనుభవమే మిగులుతుంది.మెడిటేషన్ మోక్షం అనే లక్ష్యమే గాకుండా సాంస్కృతిక చట్రంలో నిన్ను బందీని చేస్తారు. చివరకు పొందేదేమీ లేదు.బాధ తప్ప.చిత్రమైన అనుభవాన్ని పొందితే పొంద వచ్చు. అది నీకయినా మరేవరికయినా  విలువయింది కాదు. 
    •      నీ ఆలోచనలు వలె నీ కోరికలు ...ఏమైనా సరే అదుపు చేయాలి, అణిచివేయాలి. పవిత్రుడిగా ఔన్యత్యాన్ని అందుకోవాలి.నరకప్రాయమైన ఈ స్థితిని కోరిక లేని స్థితిగా పిలుస్తావు .ఎందుకోసం ఇదంతా.నేను ఖచ్చితం గా చెప్పగలను. నీకు కోరిక లేకపోతే నిన్ను శవంగా భావించి శ్మశానానికి తరలిస్తారు.
    • ఆధ్యాత్మికం, మతం పొల్యూషన్ కంటే వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదం కాదు.ఇది ప్రపంచాన్ని చుట్టిన భయంకరమైన అంటు రోగం.
    • ఈ ప్రపంచంలో సంక్షోభానికి గురువుల బోధనలే  కారణం.  ఈ బోధకులందరూ చేసింది ఏమీ లేదు.గందరగో ళం తప్ప.ఈ సంస్కృతికి రాజకీయ నాయకులు వారసులు. వీరిని దుర్నీతిపరులని నిందించి ప్రయోజనం లేదు.మత  గురువులు దుర్నీతిపరులు. ప్రేమను ఎవరు బోధిస్తారో ఆ మనిషి ఈదుర్నీ తికి కారణం.ఎందు కం టే మనవ చైతన్యంలో అతడు  విభజనను సృస్టించాడు. ప్రపంచంలో ఈ రోజున్న భీబచ్చానికి  ఈ మనిషి చెబుతున్న`నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు` అనే సూక్తే కారణం.ఈగురు వులనువదలొద్దు.  వీరి భోదన లు ఏమీ చేయలేవు. కాని ప్రపంచంలో గందరగోళాన్ని తీసుకువచ్చాయి .కేవలం మనుషులను నాశనం చేసే దిశలో ముందడుగు వేయడం కాదు.ఈ రోజు ఈ ప్లానెట్ మీద ఉన్న ప్రతి జీవిని నాశనం చేస్తున్నా యి.
      • నీకు నీ అనుయాయులకు  మనిషి భవష్యత్తు గురించి ఏమాత్రం ఆసక్తి లేదు. కేవలం మీకున్న కొన్ని దగ్గరి లక్ష్యాలు ఎరవేర్చు కోవడం కోసమే ...ఇదంతా  కేవలం ఒక తంతు. మానవాళి , ప్రేమ అంటూ గంటలు గంటలు మాట్లాడుతుంటారు. నీకు నిజంగా ఆసక్తి ఉందా? మానవాళి భవిష్యత్తుపై శ్రద్ధ ఉందా? కోపోద్రేకమైన నీ వ్యక్తిత్వం, నిష్కపటం, శ్రద్ధ అర్ధం లేనివి. అదంతా ఒక కర్మకాండ . నీవు కూర్చో... మాట్లాడు... అంతే  ఆవేశ పడొద్దు. ఆవేశ పడితే ప్రశ్నించ లేవు . నీ గురించి కుడా. కూర్చో. కోపం గురించి నిరంతరాయంగా మాట్లాడుతుంటారు. దేహం పని అయిపోయింది.  కోపాన్ని అది తీసుకుంది. దాన్ని చాలా ఎక్కువగా తీసు కుంటున్నావు. అది నిన్ను ఒత్తిడికి లోను చేస్తే స్వాముల దగ్గరకు వెళ్లొద్దు. మాత్రలు వేసుకో... ఏమైనా  చేయి. ఆ పవిత్రమైన, పరిశుద్దమైన వ్యాపారం నీకేమీ సహాయపడదు. సమయం వృధా చేసుకోవద్దు. 
      • మామూలు అర్థంలో హిందూఇజం మతం కాదు. ఇదంతా కలగాపులగం. అనేక విషయాల కలయిక. వందలాది దుకాణాలున్న బజారు లాంటిది. 

    Thursday 1 September 2011

    సంతోషం (HAPPYNESS)

    •     ప్రపంచంలో మనుగడకు ఆలోచన అనివార్యం. అయితే మన ఎదురుగా ఉన్న లక్ష్యాలను సాధించడానికి అది ఏ మాత్రం మనకు సహాయపడదు. ఆలోచన ద్వారా లక్ష్యాలను సాధించడం అసాధ్యం. నీవు చెబుతున్న సంతోషం అనే దాని కోసం నీవు చేసే శోధన కూడా అసాధ్యం.ఎందుకంటే అక్కడ శాశ్విత ఆనందం అంటూ ఏమీ లేదు. అక్కడ ఉన్నదంతా ఆనంద క్షణాలు, సంతోషం లేని క్షణాలు. శాశ్వత ఆనందం అనే స్థితి నీ  దేహానికి శత్రువు. ఇంద్రియాల స్థితి (పర్సెప్షన్)ని, నరాల వ్యవస్థను సునిశితంగా ఉంచడానికే ఈ శరీరం ఆశక్తి చూపి స్తుంది. అది ఈదేహం అస్తిత్వానికి తప్పనిసరి. శాశ్విత ఆనందం అనే అసాధ్యమైన  లక్ష్యాన్ని సాధించేందుకు ఆలోచననే ఆయుధాన్ని ప్రయోగిస్తే ఈ శరీరానికి ఉండే సునిసితత్వం ధ్వంసమౌతుంది. మనకు ఆసక్తి కరమైన  శాశ్వత ఆనందం, శాశ్వత సుఖం అనే  వాటిని ఈ దేహం  తోసేస్తుంది. ఇందు కోసం మనం చేసే ప్రయత్నం ఏదీ సఫలం కాదు. 
    •   నా ప్రత్యేకమైన ఆనందం కోసమే ఈ విశ్వమంతా రూపుదిద్దుకుంది అనే మనిషి నిశ్చితాభిప్రాయమే మొత్తం సమస్యకు నాంది అవుతుంది.  అవరోధాలు లేని సంతోషం , ఆనందానికి అత్యున్నతదశ దేవుడు ...అటువంటి వి ఉనికిలో లేవు. ఉనికిలో లేనిది కోరుకోవడమే నీ సమస్యకు మూలం. పరివర్తన, మోక్షం , స్వేచ్చ ...ఇవన్నీ భిన్నమైనప్పటికి ఒకే చట్రంలోకి వస్తాయి. 
    • నీవు అనుకుంటున్న శాశ్విత ఆనందాన్ని దేహం మాత్రం తీసుకోదు. ఉదాహరణకు లైంగికానందం అనేది సహజంగా తాత్కాలికమైంది. దీర్ఘకాలికంగా, నిరంతరాయంగా అనుభూతి చెందలేదు. శాశ్విత ఆనందమంటూ శరీరం మీద ప్రయోగిస్తే తీవ్రమైన మానసికమైన సమస్యలు తలెత్తుతాయి. 
    • సంతోషం అనేది నాగరికత సృష్టి. అటువంటిది ఏదైనా ఉందా అంటే ...నేను లేదంటాను. సంతోషం కోసం  నీ  అన్వేషణ నాగరికతలో నుంచి వచ్చిందే. ప్రపంచంలో ఎక్కడైనా ఇది మామూలు కోరికగా ఉనికిలో ఉన్న విషయమని మనకు తెలుసు. మానవాళికి ఇది ప్రధానమైన కోరిక. సతోషం... ఈ పదాన్ని మీరు ఉపయోగించడమంటే  ఇంత కంటే వేరే సంచలనం ఉండదు. ఆ క్షణంలో నీ  ఆలోచన  మనం సంతోషం అనుకుంటున్న సంచలనం నుంచి విడిపోతుంది. తన సహజస్థితి కంటే ఎక్కువ సమయం ఆ సంచలనాన్ని నిలుపుకోవాలనే డిమాండ్ కుడా దాంతో ఉటుంది. ఈ దేహం మాత్రం ఎటువంటి సంచలనా న్నైనా, ఎంత ప్రత్యేకమైన  కోరిక నైనా తిరస్కరిస్తుంది. ఆ సంచల నాన్ని సుదీర్ఘ కాలం ఉంచుకోవాలనే భావన  నీకున్న జీవితాన్ని, సునిసితత్వాన్ని నాశనం చేస్తుంది. సంతోషం అంటే తెలియకపోతే ఎప్పుడూ సంతోషం లేకుండా ఉండవు .

    కార్యకారణసంబధం(CAUSE AND EFFECT)

    •        `కార్యకారణసంబధం` అనే సూత్రీకరణ ప్రకారం ప్రతి ఆలోచన లేదా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అది తక్షణంలో కాకపోయినా ఆ తర్వాతయినా ఉంటుంది  అంటాం. కార్యకారణసంబధం అనేభావన ఆలోచన (సంస్కృతి)  సృష్టి. అసలు కారణం అనేది ఎక్కడా ఉండకపోచ్చు. ప్రతిసంఘటన పత్యేకమైంది. స్వతంత్రమైంది. అయితే ప్రతి సంఘటనను మనం కలుపుతూ మన జీవితానికి అన్వయించుకుంటాం. కథను అల్లుకుంటాం. నిజానికి ప్రతి సంఘటన స్వతంత్రంమయింది. మనం దీన్ని అంగీకరిస్తే మన గుర్తింపునకు ఎక్కడలేని సమస్య వచ్చి పడుతుంది. మన జీవితాల్లో గుర్తింపు అనేది ప్రధానమైంది. నిరంతరాయం జ్ఞాపకాలను తవ్వుకుంటూ గుర్తింపును నిలుపుకుంటూ ఉంటాం. ఇదికూడా ఆలోచనే. ఈ గుర్తింపు, లేదా జ్ఞాపకం ఏదయినా అనండి.వీటి లౌల్యంలో పడి ఎక్కడలేని శక్తులన్నింటిని నిర్వీర్యం చేసుకుంటుంటాం.జీవన సమస్యలను ఎదుర్కోవడానికి అక్కడ ఏమాత్రం శక్తి ఉండదు. ఈ గుర్తింపు నుంచి స్వేచ్చను పొందే మార్గం ఏదయినా ఉందా?  నేను చెప్పేది ప్రధానంగా ఆలోచనే సమస్యలను సృష్టిస్తుంది. వాటి పరిష్కారానికి మనకు సహాయ పడదు. ఆలోచనకు సంబంధించిన గతితార్కిక ఆలోచన కూడా మన ఆయుధాన్ని పదునెక్కిస్తుంటుంది. అన్ని తత్వాలు చేసే పని కూడా ఇదే.