ఇక ప్రశ్నలే లేవు
“No More Questions:
The Final Travels of U.G. Krishnamurti”
రచయిత: లూయిస్ బ్రాలీ
—--------------------------------------------------
రచయిత పరిచయం
లూయిస్ బ్రాలీ, ఒహాయోలో జన్మించినాడు.
న్యూయార్క్‌లో చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్, ఫ్రీలాన్స్ ఆర్ట్ హ్యాండ్లర్‌గా పని చేసేవారు. 2002లో యూజీ కృష్ణమూర్తిని అక్కడే కలుసుకున్నాడు.
—--------
“ఇది ఓ భిన్నమైన విధంగా యు.జి.ని చూడటం. యు.జి.తో జీవించడం అంటే... భూకంపం మధ్యలో, తుఫాను లోపల, అగ్నిపర్వతం పేలుతున్నప్పుడు నివేదిక ఇస్తున్న వార్తాప్రతినిధి లాంటి అనుభూతి.”
“ఇది ఒక సాధారణ పాశ్చాత్యుడి చూపు. యూ.జి.ని ఎదుర్కొన్న వ్యక్తి జీవితం ఎలా తలకిందులవుతుంది అనేది ఇందులో ఉంది.”
—--------
యు.జి. చివరి ప్రయాణం లూయిస్ పుస్తకంలో కనిపిస్తుంది. కానీ అది ముగింపు కాదు —
మనలో మొదలయ్యే అసలు ప్రశ్నకు అద్దం.
ప్రశ్నలు ముగిసిన చోటే మొదలవుతుంది నిజం.
—----------
ఈ పుస్తకంలో యు.జి. విప్లవాత్మక స్వభావం, లూయిస్ అనుభవించిన అంతరంగపు ప్రకంపనలు రెండూ స్పష్టంగా వ్యక్తమవుతాయి.
—----
యు.జి. ముందు లూయిస్ కు ఏ ప్రశ్నా అర్థవంతంగా అనిపించలేదు. యు.జి. ఒక ప్రశ్నకూ సమాధానమివ్వలేదు. కానీ ఏ ప్రశ్నా అవసరం లేకుండా చేశాడు.”
—----
*ఇది యు.జి. గురించే కాదు. ఇది “జ్ఞానం” అనే దిండు మీద మనం ఎలా తలపెట్టుకుని నిద్రపోతున్నామనే అవగాహన ప్రయాణం.
*అతనితో ఉన్న ప్రతీ క్షణం ఓ బాధగా మొదలై, ఒక లోపలి మార్గంగా మారింది.
*శాంతి ఇవ్వలేదు యు.జి.… కలవరమే ఇచ్చాడు. కానీ ఆ కలవరమే నాకు కొత్త దారి చూపించింది. అదే నా లోపల కొత్త వెలుగు వెలిగించింది.
*ఆయన మాటల్లో ఉపదేశం లేదు...
మన భ్రమల తాళాలు విరిగిపోయేంత అసహనం ఉంది: లూయిస్
—------
NO More Questions ఎందుకు చదవాలి?
—----------------------------
ఒక అద్భుతమైన జీవితం ఎలా బోధన అవుతుందో చూడాలంటే…
Spirituality అనే పేరుతో జరిగే మార్కెట్‌ను అర్థం చేసుకోవాలంటే…
మన భ్రమలే మన జ్ఞానం అయ్యేలా ఎలా మారుతుందో తెలుసుకోవాలంటే…
—---------
ప్రపంచం మొత్తం ఆధ్యాత్మికత అనే పేరుతో అన్వేషణలో నిమగ్నమై ఉంటుంది. గురువులు, బోధనలు, ఉపనిషత్తులు, ధ్యానాలూ — ఇవన్నీ మానవ స్వరూపంలో జ్ఞానానికే మార్గాలుగా నిలుస్తున్నాయనుకుంటాం. కానీ ఒకడు వచ్చాడు — అన్నీ అంగీకరించకుండా, ఏ మంత్రానికి బానిస కాకుండా, ఉపదేశాల్ని నిరాకరిస్తూ. అతను "గురువు కాదు" అని తానే ప్రకటించుకున్నాడు. అతని సమాధానం: "ఇంకా ప్రశ్నలేవీ లేవు!" — అదే యూజీ కృష్ణమూర్తి.
“No More Questions” అనేది యు.జి. కృష్ణమూర్తి చివరి జీవన సంవత్సరాలకు సంబంధించిన ఓ ప్రత్యేకమైన జీవనకథ. రచయిత లూయిస్ బ్రాలీ, యు.జిని 2002లో కలిసి, అమెరికా, ఇండియా, యూరోప్‌లో ఆయనతో ఐదేళ్ల పాటు ప్రయాణిస్తూ, సేవకుడిగా, సహచారుడిగా ఉండటం వల్ల కలిగిన అనుభవాలను ఈ పుస్తకంగా మలిచారు. ఆ కలయిక ఒక్క జీవితాన్ని మాత్రమే కాదు – ఒక్కసారి మనిషి ప్రశ్నలను ప్రశ్నించుకోవాల్సిన సందర్భాన్ని కూడా ఆవిష్కరించింది. ఈ పుస్తకం యు.జి. మానసిక వైఖరిని, ఆయన దృక్కోణాలను, వింత సంభాషణల్ని, కొంచెం విచిత్రంగా కనిపించే లోతైన జీవన రీతిని విప్పిచూపుతుంది. “ఇది నేర్పే కథ కాదు… ఇది జీవించిన కథ” అని లూయిస్ రాసిన ఈ పుస్తకం మనకు చెప్తుంది. లూయిస్ తన జీవితాన్ని తీసుకొని తన అహంభావాలను విడదీసి, మనముందు ఉంచాడు. అతను చెప్పిన మాటల్లో ఎవ్వరి గురించీ చెప్పాలన్న ఉద్దేశం లేదు – ఎవరు మనలో ఉన్నారో అర్థం చేసుకోవాలన్న ఆవేదన ఉంది. ఈ పుస్తకం ఆయన దగ్గర ఉన్న రోజుల్ని మాత్రమే కాదు, మనకున్న ప్రశ్నల పుట్టను కూడా ప్రశ్నిస్తుంది.
భ్రమల మూలాలను కుదిపేసే మాటలు
—-----------------------------------------
యు.జి. చివరి రోజుల్లో కూడా ఎవరికీ ఏం చెబుదామని తపించలేదు. అయినా, ఆయన చుట్టూ ఉన్నవాళ్లందరికీ ఆయన జీవితం ఓ బోధగా మారింది – ఏ ఒక్క మాట లేకుండానే. తాను ఎవరికీ బోధించాలనే కోరిక యూజీకి ఎప్పుడూ లేదు. కానీ చివరికి, బోధించకుండా బోధించే జీవితం గానే నిలిచిపోయాడు .యు.జి. తన బలహీనతల్ని దాచలేదు, మేథోబలాన్ని ప్రదర్శించలేదు. అతని జీవితం, మాటలు, నిశ్శబ్దం – అన్నీ కలిసే ఒక శబ్దాతీత బోధనగా మారాయి. అతను ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు – కానీ అతని మాటలు గురుశబ్దాలు కంటే, మనిషిలోని భ్రమలపై వేస్తున్న అసహనపు తాళాలు లాగా వినిపించేవి. ఆ శబ్దం మన లోపలికి దూసుకెళ్లి, భ్రమల మూలాలను కుదిపేస్తుంది” అంటాడు లూయిస్
అతని మాటలు మార్గం చూపించలేవు. అవి మనలో ఉన్న అన్ని మార్గాలను ప్రశ్నిస్తాయి అని చెబుతాడు.
ప్రశ్నలే లేని స్థితికి నెడతాడు
—---------------------------
"లూయిస్ అనుభవంలో యూ.జి. అనేది ఎదురులేని ఒక నిజం. అతని దగ్గర మీరు ప్రశ్నలు అడగలేరు – ఎందుకంటే అతను మిమ్మల్ని ప్రశ్నలే లేని స్థితికి నెడతాడు. చివరికి మిగిలేది ఒక్కటే... ‘ఇదేనా నిజం?’ అనే లోపలికి వెళ్లే ప్రశ్న. యు.జి. ఒక తార్కిక ప్రత్యామ్నాయం లేని నిజంగా అనిపించాడు. యూ.జి. ప్రశ్నలకు సమాధానాలివ్వలేదు – కానీ ప్రశ్నలే మిగలకుండా చేసి వదిలేవాడు.” ఈ పుస్తకంలో లూయిస్ యు.జి.తో గడిపిన అనుభవాలను, ఆత్మవిమర్శలను, విచిత్రమైన బంధాన్ని వివరించాడు. యూ.జి ఆరోగ్యం క్షీణించిపోయే వేళ, అతని మాటలే కాదు — అతని నిశ్శబ్దం, అతని చలనం కూడా ఓ బోధన అయింది. లూయీస్ కి యు.జి.లో కనిపించినది – ఒక ద్వంద్వరహిత వాస్తవం. ప్రశ్నలతో వెళ్లిన లూయీస్, ప్రశ్నలు మిగలనివ్వని యు.జి.ని ఎదుర్కొన్నాడు.” "అతని దేహం భాషే ఉపనిషత్తు, అతని జీవితం జీవంతో కదిలే (త్రిమితీయ) ఒక గ్రంథం."
అన్ని భద్రత గోడల్ని కూల్చేశాడు
—---------------------------------
లూయిస్ యు.జి. పక్కన ఉండి, ఆయన మాటల కంటే తీవ్రమైన నిశ్శబ్దాన్ని అనుభవించాడు. అపారమైన శూన్యాన్ని తట్టుకున్నాడు. యు.జి. ఏ మతాన్ని, ఏ ఆధ్యాత్మికతను, ఏ బోధనను కూడా అంగీకరించలేదు. అతను ప్రేమపై మన ఊహలను, జ్ఞానంపై మన గర్వాన్ని, మన జీవనాధారాలపై మనకున్న నమ్మకాల్నే ముక్కలుగా చేశాడు. యు.జి. తట్టుకోలేనివాడు కాదు – ఒప్పుకునేవాడు కాదు. మతం, బోధన, ప్రేమ, జ్ఞానం… మనం నమ్మిన ప్రతిదాన్నీ అతను ప్రశ్నించాడు, పగులగొట్టాడు. యు.జి. ఎవరి మతాన్ని కాదు, ఎవరి బోధనను కాదు – మనమే నిర్మించుకున్న అన్ని భద్రత గోడల్ని కూల్చేశాడు. ప్రేమ, జ్ఞానం, మన జీవన నమ్మకాలు అన్నీ అతని దగ్గర ప్రశ్నార్థకాలు అయ్యాయి. యు.జి.తో గడిపిన సంవత్సరాలు లూయిస్ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి.
కాని శాంతి ఇవ్వలేదు... కలవరమే ఇచ్చాడు. (not peace, but disturbance) ఆ కలవరమే ఓ కొత్త బాధ, ఓ కొత్త దారిని చూపించాయి. అది నిజమైన దారి. కొత్త చూపు కూడా.” ఈ వాక్యాల్లో యూ.జి. విప్లవాత్మక స్వభావం, లూయిస్ అనుభవించిన అంతరంగపు ప్రకంపనలు రెండూ స్పష్టంగా వ్యక్తమవుతాయి.
జె.కె. నుంచి యూ.జి. వరకు – ఒక భిన్నమైన యాత్ర
—-------------------------------------------------------
యు.జి.ని కలిసే ముందు లూయిస్ జిడ్డు కృష్ణమూర్తి (జేకే) బోధనలపై మక్కువతో ఉన్నవాడు. కానీ యు.జి.ని చూసాక అతనిలో జరిగిందేమిటంటే — “శాంతిని వెతకటం కంటే ప్రశ్నలే తొలగిపోవడం ముఖ్యం” అనే బోధ. జేకే బోధనల్లో ఒక వెతుకులాట (search) ఉంది, యు.జి.లో వెతుకులాటే లేదు. అతను. "నేను గురువు కాదు, జ్ఞాని కాదు, సత్యం వెతుకుతున్నవాడిని కూడా కాదు" అన్నాడు. అతని బోధనలే ఓ నిరాకరణ. అతని మాటలు, బోధనలు ఏ రూపంలోనూ శాశ్వతంగా ఉండవు… వాటిని పట్టుకోలేరు. "యూ.జి. పక్కన ఉన్న తర్వాత నాకు ‘నేను ఎవరిననే’ భావనే మాయమైపోయింది. అదే నిజమైన పరివర్తన”, అదే అసలైన మార్పు.”అని లూయిస్ చెబుతాడు.
యు.జి.జీవితం, బోధన కాదు, ఓ ప్రత్యక్ష స్వరూపం
—-----------------------------------------------------
యుజి ఎటూ వెళ్లినా — హైదరాబాదు, న్యూయార్క్, లూకా, స్విట్జర్లాండ్ — అతను ఎప్పుడూ అదే ఒరిజినాలిటీని చూపించాడు: “నన్ను ఎందుకు అనుసరిస్తున్నావ్?” అని ప్రశ్నిస్తూ అందరి ఆశలను తుడిచేశాడు. అతని మాటలతో కాదు — అతని మౌనంతో, హాస్యంతో, నిరాకరణతో..
ఈ పుస్తకాన్ని చదవటం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కాదు. అది ఒక మానసిక బహిష్కరణ. చదివే ప్రతి ఒక్కరికీ, "నేను నిజంగా ఎవరిని అనుకుంటున్నాను?" అనే ప్రశ్న తప్పక తలెత్తుతుంది. బహుశా... చివరికి మనమూ అదే అంటామేమో:
“ఇంకా ప్రశ్నలేవీ కావు.”
—---------
యూ.జి.తో భూకంపం మధ్య జీవించడం
-ఓ అమెరికన్ పాఠకుని స్పందన
—---------------------------
“No More Questions” పుస్తకం నన్ను నిండు తుఫానులోకి తోసింది. యు.జి. పక్కన బతకడం అంటే— ఓ భూకంపం నడుమ, తుఫానులో, అగ్నిపర్వతంలో నివేదిక ఇస్తున్న వార్తాప్రతినిధిలా ఉండటమే!” అని ఓ అమెరికన్ పాఠకుడు అద్భుతంగా చెబుతాడు. యు.జి. చెప్పిన విషయాలను పూర్తిగా గ్రహించడం అసాధ్యమే అయినా— వాటిలో ఓ అసాధారణమైన స్పష్టత ఉంటుంది. “ఆయన ముందు నిలబడటం ద్వారా, నా ‘నేను’ అణుగిపోతూ ఉండేది” అని అమెరికన్ పాఠకుడు అంటాడు
(*లూయిస్ "Goner అనే టైటిల్ తో రాసిన పుస్తకమే తర్వాత "No More Questions"గా వచ్చింది. సబ్‌టైటిల్ కూడా రెండింటికి ఒకేలా ఉంటుంది.)
No comments:
Post a Comment