Friday, 25 July 2025

జీవితం

 

         జీవితం అంటే ఏమిటి?

       ప్ర: మనలో చాలా మందికి జీవితం ఒక పవిత్రమైన విషయం. మన పిల్లలను పర్యావరణాన్ని పరిరక్షించడానికి, మరొక యుద్ధాన్ని నివారించడానికి మేము కష్టపడుతున్నాం....
     యు.జి. : మీరందరూ మానసిక వ్యాధిగ్రస్తులు. బాంబులతో, ఆకలితో, దారిద్ర్యంతో, టేర్రరిజంతో వేల లక్షల మందిని చంపేస్తూ మరో వైపు భావి జీవితం, బర్త్ కంట్రోల్, జీవన మాధుర్యం, జీవిత విలువల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇది చాలా అసంబద్ధం. జీవితంపై మీ కలవరం అంతా కేవలం రాజకీయ సమస్య నుంచి బయిటపడటానికే.
       నివు చెబుతావు. జీవితం ప్రవాహం. దానితోపాటే నేను కదులుతుంటాను అని. కాని నిజానికి ప్రవాహా న్ని చెదరగొ డుతుంటావు. జీవితం కదలిక ఎప్పుడూ భిన్నంగా వుంటుంది. 
 జీవితం అద్బుతమైన క్రమం. ఆలోచన చట్రంలో దాన్ని ఎప్పటికీ అందుకోలేవు.
        జీవితం అనుకుంటున్న దానికి భౌతికంగా దాని అర్ధం దానికుంది. దాన్ని తోసేసి ఆధ్యాత్మిక అర్ధం కల్పించడానికి ప్రయత్నిస్తున్నావు. ఏదైనా అర్ధం ఎందుకుండాలి. జీవించడం కోసం జీవితం వుంది. నీవు ఆధ్యాత్మిక అర్ధం వెతకడంలోనే సమస్య వుంది.
అర్థవతం, ప్రశాంతం, సంపూర్ణం, ఆదర్శవంతంమైన జీవితం...ఇలా పేరుకుపోయిన భావనలు తొలగిపోవాలి. అసలు జీవితం కన్నా వీటి గురించి ఆలోచనకే నీ శక్తులన్నీ వ్యర్ధం అవుతుంటాయి.
     నీవు జీవితం మొదలు పెడితే ఏమి ఆలోచిస్తున్నావు అనేది విషయం కాదు. జీవితం దానంతట అదే సాగుతుంది. ఎలా జీవించాలి అనే ప్రశ్న జీవితానికి ఒక సమస్య అయింది. ఎలా జివించాలనేది జీవితానికి అర్ధం లేనిది. ఎలా అనే ప్రశ్న వచ్చిన మరుక్షణం సమాధానం కోసం ఎవరో ఒకరి మీద ఆధార పడతావు. దీంతో నీమీద స్వారీ చేయడానికి ఆవకాశం తీసుకుంటారు.
        జీవితానికి ఎందుకర్ధం ఉండాలి. ఎలా జీవించాలి అనేది జీవి నడకకు పూర్తిగా సంబంధం లేనిది. అది జివిస్తుంటే ఎలా, ఎప్పుడు అని ప్రశ్నించదు. ఎలా అనేది నీవు నిర్దేశిస్తున్నావు. 
  జీవితం ఏమిటి? ఎవరికీ తెలియదు. మనం చెప్పేదంతా ఊహాజనితం. జీవితం నుంచి, అనుభవం నుంచి అర్ధం చేసుకున్నది జ్ఞానం సహాయంతో చెబుతావు. మన చుట్టూ ఉన్న ప్రజలతో, ప్రపంచంతో మనకున్న సంబంధమే జీవితంఅనుకుంటాం. మనకు తెలిసింది అదే. వాస్తవానికి అది సంబంధం కాదు. 
           మీ జీవితం , దాని ఉనికి అద్భుతమైన జీవన నాణ్యతను కలిగి ఉంది. ప్రేమ, అనంతమైన ఆనందం, శాంతి‌‌...ఈ భావనలన్నీ నీ సహజమైన ఉనికిని అడ్డుకునేవే‌.
         మీకు తెలిసినది మీ జీవితంలో పనిచేయదు. మీ నడకకు దీనికి ఎలాంటి సంబంధం ఉండదు . ఇది నిజంగా సమస్య కు మూలం.
       జీవితం ఏమిటనేది నీవు ఎప్పటికీ తెలుసుకోలేవు. జీవితం గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు. నీవు నిర్వచనాలు ఇస్తావు. అవి అర్ధం లేనివి. జీవితాన్ని సిద్దాంతీకరి స్తావు. అది నీకేమాత్రం విలువైన విషయం కాదు . దేన్నీ అర్ధం చేసుకోడానికి అది నీకు సహాయం చేయదు. ప్రశ్న, ప్రశ్నించేవారు రెండు వేర్వేరు విషయాలు కాదు. ఆ ప్రశ్న తానంతట తాను దగ్దమైతే అక్కడ శక్తి ఉంటుంది. ఆ శక్తి గురించి ఏమీ చెప్పలేరు --- ఇది ఆల్ రెడీ దానంతట అది వ్యక్తమవుతూ ఉంటుంది.‌ అపరిమితమైన రీతిలో వ్యక్తపరుస్తుంది. దానికి పరిమి తులు లేవు, సరిహద్దులు లేవు. ఇది నీది, నాది కాదు. అది అందరికీ సంబంధించినది. దానిలో నీవు ఒక భాగం. నీవు దాని వ్యక్తీకరణవు. కేవలం పూవు ఒక జీవిత వ్యక్తీకరణలా నీవు మరో జీవితపు వ్యక్తీకరణవు.

               What is life?

Q: But for many of us life is a sacred thing. We struggle to protect our children the environment, to avert another war.. 
   
       U.G: You are all neurotic people. You talk against birth control, drone on and on about the preciousness of life, then bomb and massacre. It is too absurd. 
You are concerned with an unborn life while you are killing thousands and thousands of people by bombing, starvation, poverty and terrorism. Your concern about life is only to make a political issue out of it.
             You say life is a movement and you are moving with life, but actually you are manipulating the movement. The movement of life is altogether a differ ent thing.
       Why should there be any meaning? You see, the meaning of the question on how to live is totally unrelated to the functioning of this living organism. It is living all the time. It doesn't have to ask the question how to live, so how to live is superimposed on this.
             Life, your existence, has a tremendous living quality about it. All your notions about love, infinite bliss and peace only block this natural energy of existence.
         What you know does not operate in your life. It has no relevance to the way you are functioning. That is really the crux of the problem.
        You will never know what life is. No body can say anything about life. You can give definations, but those definitions have no meaning . You can theorize about life, but that is a thing which is not of any value to you---- it canot help you to understand anything. The question and the questioner are not two different things. When the question burns itself out, what is there is is energy. You can't say anything about that energy---it is already manifesting it self, expressing it self in a boundless way, it has no limitations, no boundaries. It is not yours, not mine; it belongs to everybody. You are put of that. You are an expression of that. Just as the flower is an expression of life, you are another expression of life.

నీకు నీవే నమూనా!

 నీకు నీవే నమూనా!

జీసస్, బుద్ధుడు, కృష్ణుడు కాదు

యు.జి.కృష్ణమూర్తి

—----------------------------

జీసస్, బుద్ధుడు లేదా కృష్ణుడి నమూనాలను ఉపయోగించడం ద్వారా, ప్రకృతి సహజంగా విలక్షణమైన వ్యక్తులను సృష్టించే అవకాశాన్ని మనం నాశనం చేసుకున్నాం.

—---------------

ప్రతిఒక్కర్నీ ఒకే మూసలో ఉంచడానికి బాధ్యత వహించే ‘మీ విలువల వ్యవస్థే’ మానవ బాధలకు, మానవ విషాదానికి కారణం.

—-----------

"మోడల్‌లు మిమ్మల్ని ‘బ్రహ్మజ్ఞానులు’గా కాదు…

'జ్ఞానబాధితుల’గా మారుస్తాయి!"

—-----------

ఇటువంటి మోడల్స్‌ను అనుసరించమని చెప్పే వారు – వారు ఎంత పవిత్రులైనా సరే – మనల్ని తప్పుతో పట్టిస్తున్నారు. ఇది ఒక అంధుడు మరొక అంధుడిని నడిపించడమే!

—---------------

బుద్ధుడిలా ఉండాలనుకుంటాం…"

"జీసస్ లా ప్రేమించాలనుకుంటాం…"

ఇలా మనమంతా పరిపూర్ణతను నమూనాల రూపంలో చూస్తూ ఉన్నాం. పరిపూర్ణ మోడల్స్ – వ్యక్తిత్వ వికాసానికి శత్రువులే!”

—------------

‘ప్రతి ఒక్కరూ ఒక విశిష్ట రచన, కాపీలు కాదు.’

—--------

“నువ్వు ఎవరో మరొకరిని అనుకరించే క్షణంలోనే… నీవైపు ద్వారం మూసుకుంటుంది.”

—--------

నీలోని రక్షకుణ్ణి మేల్కొల్పు – ఆదర్శాల కాపీ కాదు.

అనుకరణ కాదు.. స్వయంగా వికసించు

—----------

నీవు నీ ప్రత్యేకతను విస్మరించిన క్షణమే – జీవితం యాంత్రికంగా మారుతుంది.”

—-----------

ప్రకృతి పరిపూర్ణ వ్యక్తిని కాదు, పరిపూర్ణ జాతిని సృష్టించాలనే చూస్తుంది.”

------------

ప్రకృతి లక్ష్యం ‘ఆత్మసిద్ధి’ కాదు, అనుకూలత (adaptability).

—-----------

ఈ భూమ్మీద ఏ రెండు ఆకులు, రెండు మొక్కలు, రెండు హృదయాలూ ఒకేలా లేవు. అయితే మనం ఎందుకు ఒకే త్రికరణంగా, ఒకే మోడల్‌ను ఆరాధిస్తున్నాం?

—--------

ఆత్మసాక్షాత్కారం, మోక్షం, ధ్యానం, సమాధి – ఇవన్నీ మనం సృష్టించిన మోడల్స్! వాటి లోపల జీవించే ప్రయత్నమే మన అసలు బాధ.

—-------

అవతారాలను అనుసరించడం కాదు — వ్యక్తిగత మేల్కొల్పే మానవ వికాసానికి అసలైన మార్గం.

—--

బుద్ధుడైనా, జీసెసైనా, కృష్ణుడైనా…

వారిని గుర్తుంచుకోవడం సరే.

కానీ వారిలా మారాలనే తపనే అసలు బంధనం.

—-----------

 “పుణ్యమూ, శ్రద్ధా, మోక్షాలన్నీ సొమ్ము చేసుకునే మానసిక బజార్లు.”

యేసుని అమ్ముకునే పాస్టర్లూ, బుద్ధుని ప్యాకేజీ చేసే గురు యూనివర్సిటీలూ, భక్తిని బిల్లు చేసే మత పెద్దలూ… ఇది సౌలభ్యం కోసం మానవ విలువల విక్రయం.

—--------------

తననూ, తన మార్గాన్నీ మోడల్‌గా చెప్పేవాడెవడైనా… నీ మీద దురాగతమే చేస్తాడు.”

—-------

శాశ్వతమైన ‘నేను’ అన్నది లేదు.

నీవు ‘నేను’ అంటున్నది – జ్ఞాపకాల చిత్తు మాత్రమే.”

—----------

“నీవు అసలైన కొత్త అనుభూతిని ఎప్పటికీ అనుభవించలేవు. నీవు అనుభవం అంటున్నది… గతానికి ప్రతి రూపం.”

—-------------------------------------------

సంస్కృతి, సమాజం, లేదా ఏది అని పిలిచినా – అది ‘పరిపూర్ణుడి’ నమూనాను మన ముందుంచింది— అదే మానవతకు గొప్ప ఆధ్యాత్మిక గురువుల నమూనా. కానీ ‘ప్రతి ఒక్కరూ అలా మారగలమా? అసాధ్యం! నీవు నీ స్వంత ప్రత్యేకతతో ఒక విశిష్ట వ్యక్తివి. వారిని అనుకరించడం ద్వారా నీవు నీ గుర్తింపును కోల్పోతావు. ఇక్కడే మనమంతా మానవజాతి మొత్తానికి ఒక గొప్ప సమస్యను సృష్టించుకున్నాం. 

కమన సంస్కృతి ఏమంటుంది?

"ఇతనిలా ఉండాలి. అమెలా మాట్లాడాలి. వీరిలా ప్రేమించాలి."ఈ మోడల్స్ వల్లే అసలు మన సహజత్వాన్ని తుడిచిపెట్టుకుంటున్నాం.

మనిషిలోనే ఒక రక్షకుడు ఉన్నాడు – అతను బయట కాదు, లోపలే. ఆ రక్షకుడు వికసించాల్సిందే. అతనికోసం మీరు బుద్ధుడిని పోలాల్సిన పనిలేదు.

మీ సహజతే మీ మార్గం.

 శతాబ్దాలుగా మన మెదడులను కడిగివేశారు – మానవ పరిణామం అంతిమ ఫలితం జీసస్, బుద్ధుడు, కృష్ణుడు లాంటి లాంటి పరిపూర్ణ ఆధ్యాత్మిక గురువులను సృష్టించడమని". కానీ, ప్రకృతికి పరిపూర్ణ వ్యక్తిని సృష్టించడంలో ఆసక్తి లేదు. అది కేవలం పరిస్థితులకు అనుగుణంగా మారే పరిపూర్ణ జాతిని రూపొందించడానికి ఆసక్తి చూపుతుంది. ప్రకృతి ఎలాంటి ఆదర్శాలను, నమూనాలను ఉపయోగించదు. మానవ జాతి సృష్టి ఒక అసాధారణమైన సంఘటన. కానీ సంస్కృతి అందరినీ ఒకే అచ్చులో ఉంచాలనుకుంటుంది – ఇదే మన విషాదానికి మూలం.  

జీసస్, బుద్ధుడు లేదా కృష్ణుడి నమూనాలను ఉపయోగించడం ద్వారా, ప్రకృతి సహజంగా విలక్షణమైన వ్యక్తులను సృష్టించే అవకాశాన్ని మనం నాశనం చేసుకున్నాం. ఎవరైనా నిన్ను వేరొకరిలా ఉండమని చెబితే, ఆ వ్యక్తి ఎంత పవిత్రుడైనా, నిన్ను తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇది ‘గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళకు దారి చూపడం’ లాంటిది.  

‘పరిపూర్ణ వ్యక్తి’ నమూనా అనుసరించడం వల్ల మనం విఫలమయ్యాం. ఆ నమూనా ఎవరిలోనూ ఏ మార్పు తీసుకురాలేదు. ప్రతిఒక్కర్నీ ఒకే మూసలో ఉంచడానికి బాధ్యత వహించే ‘మీ విలువల వ్యవస్థే’ మానవ బాధలకు, మానవ విషాదానికి కారణం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? విలువల వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడం ద్వారా ఏమీ సాధించలేం – ఎందుకంటే మీరు ఒక విలువల వ్యవస్థను ఇంకొక దానితో భర్తీ చేస్తారు.

కాబట్టి, ఏం చేయాలి? నీవు నీ స్వంత ప్రత్యేకతను గుర్తించాలి. నీలోని శక్తిని వెలికితీయాలి. ఈ సమస్యకు పరిష్కారం ఆదర్శాలలో లేదు. అవతారాలు మనకు సహాయం చేయలేవు. మనలోని వ్యక్తిగత శక్తులే సహాయపడతాయి. ప్రతి వ్యక్తిలో ఒక గొప్ప శక్తి దాగి ఉంది. ఆ శక్తిని వెలికితీస్తే, అది వికసిస్తే, అప్పుడు నీలోని నిజమైన ఆదర్శం బయటపడుతుంది. ఇది ఒక వ్యక్తిగత సమస్య – దీనికి అవతారాలేం చేయగలరు? ప్రతి ఒక్కరిలోనూ ఒక రక్షకుడు దాగి ఉన్నాడు.ఆ శక్తిని బయటకు తీసి, వికసింపజేయగలిగితేనే, మార్పు సాధ్యమవుతుంది.  

—-------------------------------------------------

బుద్ధుడు, ఉపనిషత్తులు, జీసెస్, చార్వాకుడు, కబీర్, జైనిజం, సుఫీ, శంకరాచార్యులు, ఇస్కాన్, జుడాయిజం, తివోయిజం తత్వాలతో యూజీకి ఉన్న సామీప్యతలు, భిన్నత్వాలు రేఖా మాత్రంగా…

—--------------

బుద్ధుని సిద్ధాంతం అనిత్యత, శూన్యత, అనాత్మ అనే తత్త్వాల చుట్టూ తిరుగుతుంది. ఒక మార్గాన్ని చూపిస్తారు. ధమ్మపదంలో ‘నీవే నీకు ఆశ్రయం’ అంటారు. 

యు.జి. శాశ్వతమైన ‘నేను’ అన్నది లేదు

నీవు ‘నేను’ అంటున్నది – జ్ఞాపకాల చిత్తు మాత్రమే.” అని అంటారు. యు.జి. బుద్ధునిలా ఆత్మను తిరస్కరిస్తాడు. అయితే మార్గపు అవసరాన్నే ప్రశ్నిస్తాడు.

—-------

ఉపనిషత్తులు- యూ.జి

ఉపనిషత్తులు “ఆత్మ” అనే తత్త్వాన్ని అనిర్వచనీయమైనది, నిరాకారమైనదిగా వివరించాయి. ఆత్మను మాటలతో, మనసుతో, కళ్లతో తెలుసుకోలేరు అంటాయి. ఆత్మ శుద్ధి, బ్రహ్మతో ఏకత్వం, ఆత్మ భావన

ఇక్కడ యు.జి. ఆత్మ అనే భావాన్ని పూర్తిగా కొట్టేస్తాడు. ఆత్మ అనుభవించదగినది కాదు అని —ఆత్మ అనే భావననే మానవ మానసిక నిర్మాణంగా చూస్తాడు. ‘ఆత్మశుద్ది, ‘సాక్షాత్కారం’, పరమాత్మతో ఏకత్వం, ‘అహం’, ‘వాస్తవ స్వరూపం’ అన్నీ మానసిక ముద్రలు, conditioning products. పునరావృత తలంపులే. అవి జీవాన్ని విలీనం చేయవు. జ్ఞాన మిథ్యా భ్రమను బలపరుస్తాయి’ అంటాడు.

—----------

కబీర్- యు.జి.

“కబీర్ ప్రేమలో సత్యం చూశాడు. 

మౌనంలో శాంతిని తాత్వికతను, దివ్యత్వాన్ని చూశాడు. వేల పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం రాదు – ప్రేమ అనే అక్షరాలే నిజమైన జ్ఞానానికి తలుపు అంటారు కబీర్.

యు.జి. ప్రేమ, భక్తి, కవిత్వం అన్నీ తత్వం కాదు — తలంపుల అవశేషం అని నిరాకరిస్తాడు.

వాటిని అభ్యాసంగా పేర్కొంటారు. అనుభూతి కూడా అదే అంటారు. ప్రేమనూ, పూజనూ పవిత్రంగా చూసిన కాలాన్ని యు.జి తిరగరాశాడు. యు.జి.కి ప్రేమ, మౌనం, పూజ అన్నీ తపనలే. శోధనమే శోకం అని చెప్పిన విప్లవ (ర్యాడికల్) ఋషి.”

—---------

సూఫీయిజం- యుజి

యూ.జి. – బయట కనిపించే మతాన్ని తిరస్కరించడంలో సూఫీలతో సమానంగా ఉంటాడు

సామీప్యతలు

—------------

ఇద్దరూ అంతరాన్వేషణే మార్గం అంటారు 

సూఫీలు: "సత్యం బయట కాదు... నీలోనే ఉంది"

యు.జి: "వెలుపల వెతకకు... నువ్వు వెతకడమే బంధం."

సూఫీలు: మౌనంతోనే ఆనందానికి చేరతారు.

యుజి: మాట్లాడే క్షణమే, నిజం తప్పిపోతుంది.

సూఫీలు: మనసు శుద్ధిగా మారితే, దివ్యత్వం సహజంగా వ్యక్తమవుతుంది.

యు.జి: నువ్వు మారాలన్న తాపత్రయం లేకుండానే... సహజంగా ఉన్నావంటే అదే స్వేచ్ఛ.

సూఫీలు: సాంప్రదాయ ధర్మాలను త్రోసిపుచ్చి ప్రేమ అనే మార్గాన్ని ఎంచుకున్నారు.

యు.జి: తాత్విక విధానాలనూ, గురువులనూ, ధ్యానాలనూ తిప్పికొట్టాడు.

భిన్నత్వాలు

—-------

సూఫీయిజం: ప్రేమే మార్గం. ఇష్క్‌ అల్లా అనే విరహానుభూతి.

యూ.జి: ప్రేమ అనేది శరీర స్పందన. దానికి తత్త్వమేం లేదు. ప్రేమ కూడా conditioning అయిన 'pleasure movement'

సూఫీలు: పరమాత్మను ప్రేమించడానికి దేవుడే కేంద్రం.

యు.జి: “దేవుడు అనేది భయంతో పుట్టిన కల్పిత భ్రమ.”

సూఫీలు: ఆనందం అనేది తల్లి ఒడిలో లాంటి అనుభూతి.భక్తి పరవశత.

యు.జి: “ఆనందం అనేది హార్మోన్ల ఆట.శరీర రసాయన చర్య. దాన్ని తత్త్వంగా చేయకండి.”

సూఫీ: ఆనందం – "అనుభవించు – అంతర్లీన దేవుని."

యు:జి: "అనుభవం అంటే – నిన్నటి జ్ఞానం మళ్లీ తలెత్తడం.”

రూమీ ‘తననే మరిచి దైవంతో లయ’ అన్నాడు.

యు.జి.మాత్రం – మరిచిన ‘నేను’ అనేది నిజంగా మరిచిందా? అని అడుగుతాడు.

—-----------

జెన్ బౌద్దం - యు.జి

UG కృష్ణమూర్తి & జెన్ బౌద్ధం మధ్య సంబంధం ఓ ఆసక్తికరమైన తాత్విక ప్రయాణం. ఇద్దరూ మానవ Conditioning మీద గట్టిగా నిలిచిన తాత్వికులే. కానీ: వీరిద్దరినీ పాఠాలు వదిలేసిన తత్త్వవేత్తలుగా, సాధనని ధిక్కరించిన వ్యక్తులుగా ఉన్నా లోపలికి వెళ్తే, సూక్ష్మ భిన్నతలు, విపరీత తాత్విక స్థితిగతులు మన ముందుకొస్తాయి.

—---

జెన్ తత్వం “వాస్తవాన్ని వెతకవద్దు, అభిప్రాయాలను వదిలేయి.”. సాధనను ఆహ్వానించినా, చివరకు వదిలేయడమే లక్ష్యం అంటుంది. యు.జి.కూడా నీవు వెతకే క్షణమే సత్యం మాయమవుతుంది అంటారు.

జెన్: No-mind — ఆలోచనలేని స్థితి.

యు.జి.: "ఆలోచన ఆగాలని కాదు — ఆలోచన అనేది సహజమే. “మీ నాడీ వ్యవస్థ పూర్తిగా స్వేచ్ఛగా స్పందిస్తే, అదే శాంతి.”

జెన్ – గురువు చూపిన బోధి (జ్ఞానోదయం)లో పరమార్థం.

యూ.జి. – "గురువు వచ్చిన క్షణమే నీవు నిన్ను కోల్పోతావు. సాధన, గురువు, మార్గం అన్నీ బంధాలే

జెన్: పుష్పాన్ని చూపి “ఇదే బోధి” అంటుంది.

యు.జి – “ఆ పుష్పాన్ని ఎలా చూడాలో చెప్పే క్షణమే, నీవు నిజాన్ని కోల్పోతావు”

జెన్ – మౌనానికి దారి చూపుతుంది. మౌనాన్ని సాధనగా చూస్తుంది.

యు.జి: మౌనానికి దారి ఉండదు. సాధనతో వచ్చిన మౌనం — మౌనంలా కనిపించవచ్చు, కానీ అది ఓ మేథోబంధం మాత్రమే.

జైన ధర్మం అంటే.. శుద్ధి మార్గం.

అహింస, అపరిగ్రహ, తపస్సు

జీవాత్మ – శుద్ధ చైతన్యం

మోక్షం అంటే కర్మ బంధాల విమోచన.

దీనిపై యు.జి.“నీకు నిన్ను శుద్ధం చేయాల్సిన అవసరం లేదు – అసలు నీవు ఎవరో కావాలనే తపనే తప్పుడు ప్రార్థన.” అంటారు. నిన్ను మార్చుకోవాలన్న తపనే తప్పుడు ఆరంభం. ఎందుకంటే నీవు ఎవరనేది తెలిసే ముందు, నిన్ను శుద్ధి చేయలేవు. జైన తత్త్వంలోని తీవ్ర అనుబంధ నియమాలను – UG conditioningగా చూస్తాడు. తపస్సు, నియమాలు అన్నీ స్వీయబలవంతాలే” అంటారు.

చార్వాకుడు-యు.జి. కృష్ణమూర్తి

—------------

చార్వాకుడు (భౌతికవాదం), ఇద్దరూ ఆధ్యాత్మిక సంప్రదాయ మత ధర్మాలను, క్రతువులను తిరస్కరించారు. స్వర్గం, మోక్షం, పునర్జన్మ లను వ్యతిరేకించారు.

ఇద్దరి మధ్య భిన్నత్వం

చార్వాకుడు – "వాస్తవాన్ని ప్రత్యక్షంగా తెలుసుకో."

యూ.జి – ప్రత్యక్ష అనుభవం కూడా గతానికి సంబంధించిన అభ్యాసమే.”

చార్వాకుడు – "ప్రత్యక్షమే ప్రామాణికం."

యు.జి.– ప్రత్యక్షం” కూడా conditioning లోంచే వస్తుంది. నీవు అనుభవిస్తున్నదే నిజం – కానీ అది conditioning.”

చార్వాకుడు: అనుభవాన్ని ఆలింగనం చేశాడు.

యు.జి – అదే అనుభవాన్ని విచ్ఛిన్నం చేశాడు.

చార్వాకుడు – "ఇంద్రియ సుఖమే లక్ష్యం, పరమానందం."

యు.జి – "ఇంద్రియ సుఖం కూడా జ్ఞాపకాల వలయంలో ఏర్పడిన మాయ."ఇంద్రియ సుఖం అంటే ఏదో శక్తిమంతమైన దృక్కోణం కాదు – అది శరీర ఆత్మసంతృప్తి కోసం నేర్పబడిన వ్యామోహం.”

చార్వాకుడు: జీవితాన్ని విందుగానే చూశాడు.

యు.జి– విందు వెనుక దాగిన తపనల్నే ప్రశ్నించాడు.

—--------

జీసస్- యు.జి.

జీసస్ తనను దేవుని ప్రతినిధిగా, అనేక సందర్భాల్లో దైవపుత్రుడిగా ప్రకటించాడు. ఆయన బోధలో దేవుడు ప్రేమస్వరూపుడు, తండ్రి, రక్షకుడు. మానవుడు పాపవశుడైనప్పుడు దేవుడే మార్గం చూపిస్తాడు.

యు.జి. ప్రకారం, కలగాపులగమైన మనస్సు చాలా విధ్వంసకర విషయాలను సృష్టించింది. అన్నింటిలో దేవుడు అనే భావన అత్యంత విధ్వంసకరమైంది.

దేవుని కోసం మనం చేసే అన్ని తపనలు, ప్రార్థనలు, యాత్రలు అన్నీ —నిజానికి మన లోపలి ఖాళీని నింపే మౌఖిక వినోదమే. మనిషి కేవలం భౌతిక జీవి. (భయోలాజికల్ బీయింగ్ ). స్వాభావికంగా అతనికి ఆద్యాత్మిక పార్శ్వం లేదు. అన్ని సద్గుణాలు, మార్గదర్సికాలు, నమ్మకాలు , భావాలు, ఆద్యాత్మిక విలువలు, కేవలం డాంబికాలు, అసహజమైనవి. అవేమి నీలో మార్పు తీసుకురాలేవు

జీసస్ తనను ఒక మార్గంగా ప్రతిపాదించగా, UG మార్గాలనే భ్రమగా పరిగణించాడు

జీసస్ – ప్రేమను అత్యున్నత మార్గంగా చూపించాడు.

యు.జి – “ప్రేమ కూడా ఒక నేర్పించబడిన తపన మాత్రమే” అన్నాడు. ప్రేమ అనేది కూడా స్వార్థపు స్పర్శతో కలిసిన మరొక తాపత్రయం. ఆ తాపత్రయమే బంధనానికి దారి తీస్తుంది.

జీసస్ ఆశను చూపించాడు.

యు.జి. – ఆశ అనే భ్రమనే ఛేదించాడు.

జీసస్ –పాపం, దేవునికి విరుద్ధమైన పని

యు.జి –. పాపం, పుణ్యం అన్నీ Conditioning మాత్రమే. పాపం–పుణ్యం అన్న పదాలే మానవుని భయాన్ని పెంచే పద్ధతులు. పాపానికి పరిహారం అనేది ఆధ్యాత్మిక మార్కెట్ వ్యూహం మాత్రమే.

—--------

తావోయిజం- యు.జి.

తావో, యు.జి…ఇద్దరూ లక్ష్యం, మార్గం అనే భావనలనే తిరస్కరించారు. యూ.జి. మరింత తీవ్రంగా – అర్థం వెతకడమే మానసిక రుగ్మత అని తేల్చేశాడు.

తావో: సహజంగా ఉండు, ప్రకృతి లయతో జీవించు. "Spontaneity is truth."

యు.జి: నీవు సహజంగా ఉన్నప్పుడు – నీకు తెలియదు నీవు సహజంగా ఉన్నావని. ఒకవేళ నీ సహజత్వాన్ని తెలుసుకున్నావంటే, అది మళ్లీ తలంపే.

తావో ప్రకృతిలో తత్వాన్ని చూసింది. యు.జి. దానిని తలపులే అని తేల్చేశాడు

యు.జి: “నీకు ప్రకృతి కనిపించదు… కేవలం నీకు నేర్పించిన ప్రకృతే గుర్తుకు వస్తుంది.”నీ చూపు వెనుక పాఠశాల ఉంది, పుస్తకం ఉంది. పేర్ల బందీశాల ఉంది.

ఇద్దరూ self అనే భావనను విచ్ఛిన్నం చేశారు. యు.జి అయితే, 'అహం లేదు' అనే ఆలోచనకూ ప్రాముఖ్యం ఇవ్వడు.

యూజి: ప్రకృతి చూసే మన దృష్టి స్వచ్ఛతను కోల్పోయింది. మనం చూసేది జీవితం కాదు — దాని ఫోటోకాపీ అంటారు

—------’

శంకరాచార్యులు-యు.జి.కృషమూర్తి

సత్యాన్వేషణలో ఇద్దరూ ఋషులే… దారులు వేరు

శంకరుడు: "అహం బ్రహ్మాస్మి" – నేను ఎవరో కాదు, పరబ్రహ్మమే.

యు.జి: "ఇక్కడ ‘నేను’ అనే కేంద్రం లేదు. ఆ భావన ఒక మానసిక నిర్మాణం.”

శంకరుడు: "మాయ వల్లే ప్రపంచ భ్రమ."

యు.జి: "ఇది నిజం కాదని తెలుసుకునే ‘మనసే’ అసలైన మాయ.”

శంకరుడు వేదాలు, ఉపనిషత్తుల ఆధారంగా మాట్లాడాడు.

యు.జి. వాటినే పూర్తిగా తిరస్కరించాడు – "అవి మానవ కల్పనలు" అన్నాడు. తత్వాలన్నీ మానవ భయాల ప్రతిబింబాలు.

శంకరుడు జ్ఞానానుకూలంగా భక్తిని గుర్తించారు.

యు.జి. భక్తి భయానికి మూలం అన్నాడు

శంకరుడు శిష్యులకు బోధించాడు, పాఠాలు నేర్పాడు.

యు.జి: ఎవరినీ మార్చాలని, నేర్పాలని ప్రయత్నించలేదు. "నేను ఉపదేశకుడిని కాదు" అన్నాడు.

శంకరుడు: "జ్ఞాన ద్వారానే మోక్షం సాధ్యం."

యూ.జి: "విముక్తికి జ్ఞానం అడ్డుగోడ!. "జ్ఞానం అనేది conditioning”. నీవు విముక్తిని కోరిన నిమిషమే,

నీవు బానిసవుతున్నావు — నీ తలంపులకి.

శంకరుడు: జ్ఞాన మార్గం వేదాంతం 

యూ.జి: మార్గమని భావనకే నిరాకరణ

శంకరుడు మనస్సు ద్వారా బ్రహ్మాన్ని పొందాలన్నాడు.

యు.జి మనస్సే భ్రాంతి అని తేల్చేశాడు.

శంకరుడు గుణాతీతం కోసం తపస్సు చేశాడు.

యూ.జి. గుణాలనే ధ్వంసం చేశాడు.

శంకరుడు: "శరీరం మారిపోయే వస్తువు. ఆత్మ చైతన్య స్వరూపం."

యూ.జి: "శరీరమే సత్యం. దీని మేధస్సులో ఆత్మ అనే భావన కల్పించబడింది.”

జుడాయిజం - యు.జి

—----------

జుడాయిజం: సత్యం అనేది దేవుని క్రమంలో, ఆయన ఇచ్చిన నియమాల్లో దాగి ఉంది. సత్యం ధర్మగ్రంథాల్లో వెతుకుతాడు.

యు.జి: సత్యం అనేది నీ వెతుకులాట మొదలవకముందే అక్కడే ఉంది — వెతకడమే దాన్ని మాయ చేస్తుంది. వెతకడం అన్నదే భ్రమ.

జుడాయిజం: జీవితం కోసం దేవుడు ఇచ్చిన 613 మిత్వోత్ (ఆజ్ఞలు) పాటించాలి.

యు.జి: నియమాలు, ధర్మాలు అన్నీ బంధాలే. జీవితం మానవ చట్టాలకు లోబడి ఉండదు.

జుడాయిజం: దేవుడు ఒకే సత్య స్వరూపుడు – యెహోవా. ఆయనతో సంబంధమే జీవానికి ఉద్దేశ్యం. దేవుని తోడుగా చూస్తాడు,

యూ.జి: "దేవుడు అనే భావన భయంతో పుట్టిన మానవ మానసిక కల్పన."దేవుడే భయానికి ప్రతి రూపం.

జుడాయిజం: ప్రార్థన, ఉపవాసం, ధర్మాచరణ ముఖ్యమైన సాధనాలు. ప్రార్థనలో సత్యం వెతుకుతాడు,

యు.జి: ఏ సాధననూ గుర్తించడు. మనసుతో చేసే ప్రయత్నమే అసత్యం అంటాడు. ప్రార్థనలోనే మాయ మొదలవుతుంది" అంటాడు.

—---------

కృష్ణ తత్వం (ఇస్కాన్)- యు.జి.

ఇస్కాన్: భగవంతుడిని వ్యక్తిగతంగా ప్రేమించు. శరణాగతి ద్వారా పరమాత్మను పొందాలి 

యుజి: దేవుడు అనే భావన భయంతో పుట్టిన మానసిక కల్పన. సాధనలకన్నా, నిజమైన స్వీయ ఆత్మజ్ఞానం వల్లే విముక్తి వస్తుంది.

ఇస్కాన్: ఆత్మ శాశ్వతమైనది – పరమాత్మునితో ఏకత్వమే లక్ష్యం 

యు.జి: ఆత్మ అనేది జ్ఞాపకాలే – దానికి వాస్తవ ఉనికే లేదు. “శాశ్వత ఆత్మ" అనే భావన మానసిక రూపకల్పనే.

ఇస్కాన్: ఈ లోకం మాయ, భగవత్ సేవే నిజమైన ధర్మం.

యు.జి: ఈ లోకానుభవం అనేది స్మృతి ఆధారిత మాయే.

ఇస్కాన్: సంగీత, నాట్యం హరినామం, భజనలు ద్వారా శుద్ధి 

యు.జి: కళలన్నీ శరీరానుభూతిని తత్త్వంగా మలచే మాయలు

ఇస్కాన్: నీ భక్తి ద్వారా కృష్ణుని చేరుకో.”

యు.జి: నీ భక్తి కూడా నువ్వే సృష్టించుకున్న బంధం.”


యు.జి.కృష్ణమూర్తి భావనలను తెలుగులో తెలుసుకుందామని ఆశక్తి ఉన్నవారు నా బ్లాగు 

 ugtelugu.blogspot.com (అచింతనాపరుడు) నుంచి తెలుసుకోవచ్చు 

సమాజం, సంస్కృతి, జీవితం, పేదరికం, మానవ సంబంధాలు, దేహం, ఇంద్రియాలు, సహజస్థితి, ఆహారపు అలవాట్లు, చైతన్యం, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక గురువులు, గతం, వర్తమానం, దాతృత్వం, మనస్సు, ధ్యానం, ఆలోచన, కవులు, రచయితలు, కళాకారులు..ఇలా భిన్న అంశాలపై యూజీ ఏం చెబుతాడు? అని రేఖా మాత్రంగానైనా తెలుసుకోవడానికి ఈ బ్లాగును దర్శించవచ్చు

ఇక ప్రశ్నలే లేవు “No More Questions:

 ఇక ప్రశ్నలే లేవు

“No More Questions: 

The Final Travels of U.G. Krishnamurti”

రచయిత: లూయిస్ బ్రాలీ 

—-------------------------------------------------- 

రచయిత పరిచయం

లూయిస్ బ్రాలీ, ఒహాయోలో జన్మించినాడు.

న్యూయార్క్‌లో చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్, ఫ్రీలాన్స్ ఆర్ట్ హ్యాండ్లర్‌గా పని చేసేవారు. 2002లో యూజీ కృష్ణమూర్తిని అక్కడే కలుసుకున్నాడు.

—--------

“ఇది ఓ భిన్నమైన విధంగా యు.జి.ని చూడటం. యు.జి.తో జీవించడం అంటే... భూకంపం మధ్యలో, తుఫాను లోపల, అగ్నిపర్వతం పేలుతున్నప్పుడు నివేదిక ఇస్తున్న వార్తాప్రతినిధి లాంటి అనుభూతి.”

“ఇది ఒక సాధారణ పాశ్చాత్యుడి చూపు. యూ.జి.ని ఎదుర్కొన్న వ్యక్తి జీవితం ఎలా తలకిందులవుతుంది అనేది ఇందులో ఉంది.”

—--------

యు.జి. చివరి ప్రయాణం లూయిస్ పుస్తకంలో కనిపిస్తుంది. కానీ అది ముగింపు కాదు —

మనలో మొదలయ్యే అసలు ప్రశ్నకు అద్దం.

ప్రశ్నలు ముగిసిన చోటే మొదలవుతుంది నిజం.

—----------

ఈ పుస్తకంలో యు.జి. విప్లవాత్మక స్వభావం, లూయిస్ అనుభవించిన అంతరంగపు ప్రకంపనలు రెండూ స్పష్టంగా వ్యక్తమవుతాయి.

—----

యు.జి. ముందు లూయిస్ కు ఏ ప్రశ్నా అర్థవంతంగా అనిపించలేదు. యు.జి. ఒక ప్రశ్నకూ సమాధానమివ్వలేదు. కానీ ఏ ప్రశ్నా అవసరం లేకుండా చేశాడు.”

—----

 *ఇది యు.జి. గురించే కాదు. ఇది “జ్ఞానం” అనే దిండు మీద మనం ఎలా తలపెట్టుకుని నిద్రపోతున్నామనే అవగాహన ప్రయాణం.

*అతనితో ఉన్న ప్రతీ క్షణం ఓ బాధగా మొదలై, ఒక లోపలి మార్గంగా మారింది.

*శాంతి ఇవ్వలేదు యు.జి.… కలవరమే ఇచ్చాడు. కానీ ఆ కలవరమే నాకు కొత్త దారి చూపించింది. అదే నా లోపల కొత్త వెలుగు వెలిగించింది.

*ఆయన మాటల్లో ఉపదేశం లేదు...

మన భ్రమల తాళాలు విరిగిపోయేంత అసహనం ఉంది: లూయిస్

—------

NO More Questions ఎందుకు చదవాలి?

—----------------------------

ఒక అద్భుతమైన జీవితం ఎలా బోధన అవుతుందో చూడాలంటే…

Spirituality అనే పేరుతో జరిగే మార్కెట్‌ను అర్థం చేసుకోవాలంటే…

మన భ్రమలే మన జ్ఞానం అయ్యేలా ఎలా మారుతుందో తెలుసుకోవాలంటే…

—---------


ప్రపంచం మొత్తం ఆధ్యాత్మికత అనే పేరుతో అన్వేషణలో నిమగ్నమై ఉంటుంది. గురువులు, బోధనలు, ఉపనిషత్తులు, ధ్యానాలూ — ఇవన్నీ మానవ స్వరూపంలో జ్ఞానానికే మార్గాలుగా నిలుస్తున్నాయనుకుంటాం. కానీ ఒకడు వచ్చాడు — అన్నీ అంగీకరించకుండా, ఏ మంత్రానికి బానిస కాకుండా, ఉపదేశాల్ని నిరాకరిస్తూ.  అతను "గురువు కాదు" అని తానే ప్రకటించుకున్నాడు. అతని సమాధానం: "ఇంకా ప్రశ్నలేవీ లేవు!" — అదే యూజీ కృష్ణమూర్తి.


“No More Questions” అనేది యు.జి. కృష్ణమూర్తి చివరి జీవన సంవత్సరాలకు సంబంధించిన ఓ ప్రత్యేకమైన జీవనకథ. రచయిత లూయిస్ బ్రాలీ, యు.జిని 2002లో కలిసి, అమెరికా, ఇండియా, యూరోప్‌లో ఆయనతో ఐదేళ్ల పాటు ప్రయాణిస్తూ, సేవకుడిగా, సహచారుడిగా ఉండటం వల్ల కలిగిన అనుభవాలను ఈ పుస్తకంగా మలిచారు. ఆ కలయిక ఒక్క జీవితాన్ని మాత్రమే కాదు – ఒక్కసారి మనిషి ప్రశ్నలను ప్రశ్నించుకోవాల్సిన సందర్భాన్ని కూడా ఆవిష్కరించింది. ఈ పుస్తకం యు.జి. మానసిక వైఖరిని, ఆయన దృక్కోణాలను, వింత సంభాషణల్ని, కొంచెం విచిత్రంగా కనిపించే  లోతైన జీవన రీతిని విప్పిచూపుతుంది. “ఇది నేర్పే కథ కాదు… ఇది జీవించిన కథ” అని లూయిస్ రాసిన ఈ పుస్తకం మనకు చెప్తుంది. లూయిస్ తన జీవితాన్ని తీసుకొని తన అహంభావాలను విడదీసి, మనముందు ఉంచాడు. అతను చెప్పిన మాటల్లో ఎవ్వరి గురించీ చెప్పాలన్న ఉద్దేశం లేదు – ఎవరు మనలో ఉన్నారో అర్థం చేసుకోవాలన్న ఆవేదన ఉంది. ఈ పుస్తకం ఆయన దగ్గర ఉన్న రోజుల్ని మాత్రమే కాదు, మనకున్న ప్రశ్నల పుట్టను కూడా ప్రశ్నిస్తుంది.


భ్రమల మూలాలను కుదిపేసే మాటలు 

—-----------------------------------------

యు.జి. చివరి రోజుల్లో కూడా ఎవరికీ ఏం చెబుదామని తపించలేదు. అయినా, ఆయన చుట్టూ ఉన్నవాళ్లందరికీ ఆయన జీవితం ఓ బోధగా మారింది – ఏ ఒక్క మాట లేకుండానే. తాను ఎవరికీ బోధించాలనే కోరిక యూజీకి ఎప్పుడూ లేదు. కానీ చివరికి, బోధించకుండా బోధించే జీవితం గానే నిలిచిపోయాడు .యు.జి. తన బలహీనతల్ని దాచలేదు, మేథోబలాన్ని ప్రదర్శించలేదు. అతని జీవితం, మాటలు, నిశ్శబ్దం – అన్నీ కలిసే ఒక శబ్దాతీత బోధనగా మారాయి. అతను ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు – కానీ అతని మాటలు గురుశబ్దాలు కంటే, మనిషిలోని భ్రమలపై వేస్తున్న అసహనపు తాళాలు లాగా వినిపించేవి. ఆ శబ్దం మన లోపలికి దూసుకెళ్లి, భ్రమల మూలాలను కుదిపేస్తుంది” అంటాడు లూయిస్

అతని మాటలు మార్గం చూపించలేవు. అవి మనలో ఉన్న అన్ని మార్గాలను ప్రశ్నిస్తాయి అని చెబుతాడు.


ప్రశ్నలే లేని స్థితికి నెడతాడు

—---------------------------

"లూయిస్ అనుభవంలో యూ.జి. అనేది ఎదురులేని ఒక నిజం. అతని దగ్గర మీరు ప్రశ్నలు అడగలేరు – ఎందుకంటే అతను మిమ్మల్ని ప్రశ్నలే లేని స్థితికి నెడతాడు. చివరికి మిగిలేది ఒక్కటే... ‘ఇదేనా నిజం?’ అనే లోపలికి వెళ్లే ప్రశ్న. యు.జి. ఒక తార్కిక ప్రత్యామ్నాయం లేని నిజంగా అనిపించాడు. యూ.జి. ప్రశ్నలకు సమాధానాలివ్వలేదు – కానీ ప్రశ్నలే మిగలకుండా చేసి వదిలేవాడు.” ఈ పుస్తకంలో లూయిస్ యు.జి.తో గడిపిన అనుభవాలను, ఆత్మవిమర్శలను, విచిత్రమైన బంధాన్ని వివరించాడు. యూ.జి ఆరోగ్యం క్షీణించిపోయే వేళ, అతని మాటలే కాదు — అతని నిశ్శబ్దం, అతని చలనం కూడా ఓ బోధన అయింది. లూయీస్ కి యు.జి.లో కనిపించినది – ఒక ద్వంద్వరహిత వాస్తవం. ప్రశ్నలతో వెళ్లిన లూయీస్, ప్రశ్నలు మిగలనివ్వని యు.జి.ని ఎదుర్కొన్నాడు.” "అతని దేహం భాషే ఉపనిషత్తు, అతని జీవితం జీవంతో కదిలే (త్రిమితీయ) ఒక గ్రంథం."


అన్ని భద్రత గోడల్ని కూల్చేశాడు

—---------------------------------

లూయిస్ యు.జి. పక్కన ఉండి, ఆయన మాటల కంటే తీవ్రమైన నిశ్శబ్దాన్ని అనుభవించాడు. అపారమైన శూన్యాన్ని తట్టుకున్నాడు. యు.జి. ఏ మతాన్ని, ఏ ఆధ్యాత్మికతను, ఏ బోధనను కూడా అంగీకరించలేదు. అతను ప్రేమపై మన ఊహలను, జ్ఞానంపై మన గర్వాన్ని, మన జీవనాధారాలపై మనకున్న నమ్మకాల్నే ముక్కలుగా చేశాడు. యు.జి. తట్టుకోలేనివాడు కాదు – ఒప్పుకునేవాడు కాదు. మతం, బోధన, ప్రేమ, జ్ఞానం… మనం నమ్మిన ప్రతిదాన్నీ అతను ప్రశ్నించాడు, పగులగొట్టాడు. యు.జి. ఎవరి మతాన్ని కాదు, ఎవరి బోధనను కాదు – మనమే నిర్మించుకున్న అన్ని భద్రత గోడల్ని కూల్చేశాడు. ప్రేమ, జ్ఞానం, మన జీవన నమ్మకాలు అన్నీ అతని దగ్గర ప్రశ్నార్థకాలు అయ్యాయి. యు.జి.తో గడిపిన సంవత్సరాలు లూయిస్ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి.

కాని శాంతి ఇవ్వలేదు... కలవరమే ఇచ్చాడు. (not peace, but disturbance) ఆ కలవరమే ఓ కొత్త బాధ, ఓ కొత్త దారిని చూపించాయి.  అది నిజమైన దారి. కొత్త చూపు కూడా.” ఈ వాక్యాల్లో యూ.జి. విప్లవాత్మక స్వభావం, లూయిస్ అనుభవించిన అంతరంగపు ప్రకంపనలు రెండూ స్పష్టంగా వ్యక్తమవుతాయి.


జె.కె. నుంచి యూ.జి. వరకు – ఒక భిన్నమైన యాత్ర

—-------------------------------------------------------

యు.జి.ని కలిసే ముందు లూయిస్ జిడ్డు కృష్ణమూర్తి (జేకే) బోధనలపై మక్కువతో ఉన్నవాడు. కానీ యు.జి.ని చూసాక అతనిలో జరిగిందేమిటంటే — “శాంతిని వెతకటం కంటే ప్రశ్నలే తొలగిపోవడం ముఖ్యం” అనే బోధ. జేకే బోధనల్లో ఒక వెతుకులాట (search) ఉంది, యు.జి.లో వెతుకులాటే లేదు. అతను. "నేను గురువు కాదు, జ్ఞాని కాదు, సత్యం వెతుకుతున్నవాడిని కూడా కాదు" అన్నాడు. అతని బోధనలే ఓ నిరాకరణ. అతని మాటలు, బోధనలు ఏ రూపంలోనూ శాశ్వతంగా ఉండవు… వాటిని పట్టుకోలేరు. "యూ.జి. పక్కన ఉన్న తర్వాత నాకు ‘నేను ఎవరిననే’ భావనే మాయమైపోయింది. అదే నిజమైన పరివర్తన”, అదే అసలైన మార్పు.”అని లూయిస్ చెబుతాడు.


యు.జి.జీవితం,  బోధన కాదు, ఓ ప్రత్యక్ష స్వరూపం

—-----------------------------------------------------

యుజి ఎటూ వెళ్లినా — హైదరాబాదు, న్యూయార్క్, లూకా, స్విట్జర్లాండ్ — అతను ఎప్పుడూ అదే ఒరిజినాలిటీని చూపించాడు: “నన్ను ఎందుకు అనుసరిస్తున్నావ్?” అని ప్రశ్నిస్తూ అందరి ఆశలను తుడిచేశాడు. అతని మాటలతో కాదు — అతని మౌనంతో, హాస్యంతో, నిరాకరణతో..

ఈ పుస్తకాన్ని చదవటం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కాదు. అది ఒక మానసిక బహిష్కరణ. చదివే ప్రతి ఒక్కరికీ, "నేను నిజంగా ఎవరిని అనుకుంటున్నాను?" అనే ప్రశ్న తప్పక తలెత్తుతుంది. బహుశా... చివరికి మనమూ అదే అంటామేమో:

“ఇంకా ప్రశ్నలేవీ కావు.”

—---------


యూ.జి.తో భూకంపం మధ్య జీవించడం

-ఓ అమెరికన్ పాఠకుని స్పందన

—---------------------------

“No More Questions” పుస్తకం నన్ను నిండు తుఫానులోకి తోసింది. యు.జి. పక్కన బతకడం అంటే— ఓ భూకంపం నడుమ, తుఫానులో, అగ్నిపర్వతంలో నివేదిక ఇస్తున్న వార్తాప్రతినిధిలా ఉండటమే!” అని ఓ అమెరికన్ పాఠకుడు అద్భుతంగా చెబుతాడు. యు.జి. చెప్పిన విషయాలను పూర్తిగా గ్రహించడం అసాధ్యమే అయినా— వాటిలో ఓ అసాధారణమైన స్పష్టత ఉంటుంది. “ఆయన ముందు నిలబడటం ద్వారా, నా ‘నేను’ అణుగిపోతూ ఉండేది”  అని అమెరికన్ పాఠకుడు అంటాడు


(*లూయిస్  "Goner  అనే టైటిల్ తో రాసిన పుస్తకమే తర్వాత "No More Questions"గా వచ్చింది. సబ్‌టైటిల్ కూడా రెండింటికి ఒకేలా ఉంటుంది.)



Tuesday, 8 July 2025

సృజనాత్మకత కాదు ప్రతిదీ అనుకరణే

 సృజనాత్మకత కాదు ప్రతిదీ అనుకరణే

(“You define creativity to comfort yourself”

"Creativity is imitation. What’s new is only what breaks free of all models—and even that cannot be repeated. True creativity ends where it begins.” U.G.Krishnamurti)

—----’----------------------------------

యు.జి. కృష్ణమూర్తి ఆలోచనలు సృజనాత్మకత అనే భావనను లోతుగా ప్రశ్నిస్తాయి. ఆయన దృష్టిలో, “సృజనాత్మకత అనేది కేవలం అనుకరణ మాత్రమే—అది గత అనుభవాలు, శిక్షణ, మార్కెట్ అవసరాలు, శైలుల కలయిక. నిజమైన కొత్తదనం అంటే ఎలాంటి మోడల్‌ను అనుసరించకుండా పుట్టినది మాత్రమే, కానీ అలాంటిది దాదాపు అసాధ్యం.

మీకు మీరు ఓదార్చుకోవడానికి సృజనాత్మకతను నిర్వచిస్తారు. కొత్తదనం అనేది అన్ని నమూనాల నుంచి విముక్తి పొందినది మాత్రమే – అది కూడా పునరావృతం కాదు. నిజమైన సృష్టి (సృజనాత్మకత) ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది”అంటారు

—-------------------

*‘క్రియేటివిటీ’ అనేది ఒక మానవ నిర్మిత భ్రమ

*కళాకారులు కూడా కార్పెంటర్లు, తాపీ పని వాళ్లలా శిల్పులు, నిపుణులు

*నైపుణ్యాన్ని అమ్ముకునే వ్యాపారులు

—---------------

-కళాకారులు మేధావులు కారు. వారు శిక్షణ పొందిన కార్మికులు. వారికి మర్కెట్ ఉంటే మాస్టర్స్, లేకపోతే మిగతావాళ్లే.”


-ప్రతి కళాకృతిలో కొత్తదనం కనిపించినా… అది వేరే ఎక్కడో మొదలైన అనుకరణే!”


-దేన్ని స్వతంత్రంగా సృష్టించం. మనం విన్నదాన్ని, చూసినదాన్ని, మన ఊహల కరచాలనాలతో మళ్ళీ తయారు చేస్తాం.


-మీరు సృష్టించారా, లేక గతం మీ ద్వారా మరోసారి రూపం దాల్చిందా?”


-"నిజంగా మీరు కలను సృష్టిస్తున్నారా?

లేదా మీ చదువు, పరిసరాల అనుకరణలో ఇంకో కల నెరవేరుస్తున్నారా?”


-ప్రకృతిలో ఏదీ నమూనా ఆధారంగా తయారవదు. ప్రతి దాంట్లోనూ ప్రత్యేకత ఉంది. మనం మాత్రం అంతా ఓ మూసలో పొదుగుతాం. దాన్నే కళ అని చెప్పుకుంటాం!”


-మనలో అసంతృప్తి, ఒత్తిడి, ఒంటరితనం – ఇవన్నీ కలిస్తే బయటికి వస్తుంది ఓ పాట, ఓ శిల్పం, ఓ నవల.

మనం భావించే సృజనాత్మకత కూడా. కళ అనేది ఒక విచిత్ర ఆత్మరక్షణ చర్య.


-మన కళ్ళకు కనబడే కళ, మనసుకు నచ్చే సంగీతం – ఇవన్నీ మనకు నేర్పించిన అభిరుచుల ఫలితం. 


“ఒక పద్యం మీ మనసును తాకిందంటే, అది మీ శిక్షణ తాకింది. మీ మనసు కాదు.”


"మీరు నిజంగా సృష్టిస్తున్నారా?"

—---------

మీరు గీసిన బొమ్మ, మీరు పాడిన పాట, మీరు రాసిన పద్యం — అవి నిజంగా మీ సృష్టియేనా? లేకపోతే అవి ఎప్పుడో ఎక్కడో విన్న, చూసిన, నేర్చుకున్న అనుభవాల సమ్మేళనమేనా? సృజన అనేది కొత్తదనమా? లేక శైలుల, భావాల అనుభవాల కలయకేనా? ఇది కళా ప్రపంచాన్ని కదిలించే ప్రశ్న. 

కళకు అపార గౌరవం ఇచ్చే ఈ యుగంలో, ఒక ప్రత్యేక స్వరం — యూజీ కృష్ణమూర్తి. “సృజనాత్మకత అనే పదానికే అర్థం లేదు! అంటారు. ప్రతి శిల్పం, పాట, బొమ్మ, పద్యం — ఇవన్నీ మనం చూసినదాన్నే మరో రూపంలో మళ్ళీ ప్రతిబింబించడం కాదు? "Creativity is imitation”". ఈ ఒక్క వాక్యం, మన లోలోపల ఓ నిశ్శబ్ద విస్ఫోటంలా కదలికలు రేపుతుంది.

మనది అనుకున్న కల… నిజానికి ఎవరి ప్రతిబింబం?

ఆ ప్రశ్న చిన్న శబ్దం కాదు – మన మౌనాన్ని తడిమే మేధో తరంగం. – "ఇది నా సృష్టి" అనడంలో ఆనందం ఉంది — కానీ అది నిజమా? ప్రశ్నించడం భయాన్ని కలిగిస్తుందేమో... కానీ దాన్లోనే కొత్త చూపు ఉంది. మన దృష్టికి కొత్త కిటికీ తెరుచుకుంటుంది. ఈ వ్యాసం — అలాంటి కిటికీ. ఈ వ్యాసం...ఆ దూరాన్ని తొలిగించే కంటి కాంతి." ఇక సృజనాత్మకతపై యూజీ ఏమంటారంటే…

—------

 

“ఆర్టిస్ట్ అంటూ ఎవరూ ఉండరు . అతను కేవలం టేక్నీషియన్. అతడు లేదా ఆమె చిత్రకళ చిట్కాలు తేలుసుకుంటారు . కార్పెంటర్లు, తాపీ పని వాళ్ళ కు మల్లే వీరు శిల్పులు, నిపుణులు . క్రాఫ్ట్ కంటే ఉన్నతస్థానాన్ని కళకు ఎందుకు కల్పిస్తారు. కళాకారుడి సృష్టికి మార్కెట్ లేకపొతే అతను ఆ వ్యాపారంలో ఉండదు. ఈ సో కాల్డ్ అర్తిస్టుల నమ్మకాలకు మార్కెట్టే ప్రధాన కారణం.

కళ లేదా సృజనాత్మకత అనేది మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. ఒక కళాకారుడి రచనకు మార్కెట్‌లో గిరాకీ లేకపోతే, అతను తన కళను కొనసాగించలేడు. అందుకే కళాకారులు తమ రచనలను "గొప్పవి"గా, "సృజనాత్మకమైనవి"గా చిత్రీకరిస్తారు. కానీ వాస్తవంలో, ఇది కేవలం వాణిజ్య లావాదేవీ మాత్రమే. కళాకారుడు, శిల్పి, సంగీతకారుడు—వీరంతా ఒక నైపుణ్యాన్ని అమ్ముకునే వ్యాపారులు మాత్రమే. కళకు విలువ కలిగించేది మార్కెట్‌ మాత్రమే. "కళా భావన", "అలౌకిక సృష్టి" అనే భావాలు అన్నీ మార్కెట్‌ శక్తులే పెంచిన మోహాలు. పెయింటింగ్ ఎక్కడ ఎగ్జిబిట్ అయ్యింది? ఎన్ని కోట్లు పడ్డాయి? ఎవరు కొనుగోలు చేశారు?

ఈ ప్రశ్నలన్నీ ఆ కళాకృతిని “మూల్యముతో” కొలుస్తాయి. అసలు అది కొత్తదా, అవసరమైనదా అన్న ప్రశ్న మిగిలిపోతుంది.

ఇతర క్రాఫ్ట్ మెన్ లా కళాకారుడు కూడా ఒక క్రాఫ్ట్ మాన్. తన వ్యక్తీ కరణకు ఆ పనిముట్టునే ఉపయోగిస్తాడు. మొత్తం మానవ సృజనంతా సునిసితత్వం నుంచే సృష్టి అవుతుంది. మొత్తం కళ అంతా ఒక సంతోష క్షణం. అది (సంతోషం) కూడా నీచే సృష్టి ఆవుతుంది. లేకపొతే అందం, ఆర్ట్ గురించి మాట్లాడడానికి, ప్రశంసించడానికి మార్గం లేదు. వాళ్ల సృష్టిని నీవు ప్రశ్నిస్తే వాళ్లు ఫీలవుతారు. నీకు టేస్టు తెలియదనుకుంటారు . వారి కళను ఎలా ప్రశంసించాలో తెలుసుకోవడానికి స్కులుకెల్లి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటారు. సోకాల్డ్ గ్రేట్ పొయిట్ రాసిన పోయంను నీవు ఎంజాయ్ చేయ లేక పోతే ఆ కవితను ప్రశంసించేట్లు నిన్ను బలవంతంగా ఎడ్యుకేట్ చేస్తారు. విద్యా సంస్థల్లో ఇదంతా వాళ్ళు చేస్తుంటారు. అందాన్ని, చిత్రకళను ఎలా ఆస్వాదించాలో మనకు బోధిస్తుంటారు. ఇది కళకే కాదు — రాజకీయాలకు, ఆధ్యాత్మికతకూ వర్తిస్తుంది.. నిజానికి. సృజనాత్మక రాజకీయాలు, సృజనాత్మక భావాలు , సృజనాత్మక కళ ఇలా ప్రతిదాన్ని తాము క్రియేటివుగా ఆలోచిస్తామనుకుంటూ అన్వేషణలో ఓదార్పు పొందుతుంటారు. నిజానికి వారిలో ఏ మాత్రం సృజనాత్మకత ఉండదు. వారు ఎమి చేసినా అందులో ఒరిజినాలిటి, తాజాదనం, స్వేచ్చా ఉండదు. ఆర్టిస్టులు అక్కడో, ఇక్కడో తీసుకుని దాన్ని కలబోసి ఏదో కొత్త అద్బుతాన్ని సృష్టిస్తున్నట్లు భావిస్తుంటారు. ఆల్ రెడీ అక్కడ ఉన్నదాన్ని వాళ్ళందరూ అనుసరిస్తుంటారు. 

పాతదాన్ని కొత్త ముసుగులో తిప్పి వినిపిస్తున్నారు. దానికి అలంకారాలు చేర్చి, పేర్లు పెట్టుకుని, దానిని “సృష్టి” అని వర్ణించుకుంటాం. మనం చేసే ప్రతి సృష్టి, ప్రతి ఆలోచన, ప్రతి కళ – ఇవన్నీ గతంలో ఉన్న దాని అనుకరణలు. అనుకరణ, శైలే మనకున్న క్రియేటివిటి. మనం వెళ్ళిన స్కూలు ,మనం నేర్చుకున్న భాష ,మనం చదివిన పుస్తకాలు, ఎదుర్కొన్న పరీక్షలు ...ఈ నేపధ్యం నుంచి మనకొక శైలి ఏర్పడుతుంది. ఇలా శైలి టెక్నిక్ అక్కడ నడుస్తుంటుంది. అందులోనే కళను మల్లెమాలలా మెరుగుపరుచుకుంటారు. 


కళాకారుడు కేవలం నైపుణ్యం అమ్మే వ్యాపారి

—-----------------------------------------------

“కళాకారుడంటే ఒక తాపీవాడు, కార్పెంటర్ లాంటివాడే. అతను నేర్చుకున్న నైపుణ్యాన్ని మార్కెట్‌లో అమ్ముతాడు. కళకు గొప్పతనం ఇచ్చేది మనమే—మార్కెట్ దానికి ధర నిర్ణయిస్తుంది. ఒక పెయింటింగ్ కోట్లు పలికింది, ఒక పాట హిట్ అయింది—ఇవన్నీ మార్కెట్ ఆటలే. కళ అనేది మన అసంతృప్తి, ఒంటరితనం, ఒత్తిడి నుంచి పుట్టిన ఒక రక్షణ చర్య. మనం చూసినవి, విన్నవి, నేర్చుకున్నవి—వాటిని కొత్త రూపంలో మళ్లీ చెప్పడమే కళ.”


మన సృజనాత్మకత ఒక భ్రమ

—-----------------

“మీరు ఒక కవిత రాస్తే, అది మీ హృదయం నుంచి వచ్చిందని అనుకుంటారు. కానీ ఆలోచించండి—అది మీరు చదివిన పుస్తకాలు, విన్న కథలు, చూసిన జీవితం నుంచి వచ్చిన రంగుల సమ్మేళనం కాదా? మీరు పాడిన పాట, గీసిన బొమ్మ—ఇవన్నీ మీ శిక్షణ, మీ అభిరుచుల ప్రతిబింబాలే. నిజమైన సృజనాత్మకత అంటే ఏదీ మోడల్ లేకుండా పుట్టినది. అలాంటిది మనం చేయగలమా? లేదు. మనం చేసేది అనుకరణే—కొత్త రూపంలో పాత ఆలోచనలు.”


ఈ సత్యాన్ని అంగీకరించాలి

—---------------------------

ప్రకృతి మాత్రమే నిజమైన సృష్టిని చేస్తుంది. ఎందుకంటే అది ఏ ఒక్క మోడల్‌ను అనుసరించదు. మనం, మానవులుగా, ఈ సత్యాన్ని అంగీకరించాలి. మన సృజనాత్మకత అనేది కేవలం ఒక శైలి, ఒక సాంకేతికత, ఒక అనుకరణ మాత్రమే. ఈ ఆలోచన మనల్ని కొంత అసౌకర్యంగా చేయవచ్చు, కానీ అది మనల్ని మన స్వంత ఆలోచనల గురించి లోతుగా ఆలోచించేలా చేస్తుంది. మనం నిజంగా సృజనాత్మకంగా ఉన్నామా, లేక మనం కేవలం ప్రకృతికి సంబంధించిన గొప్ప సృష్టిని అనుకరిస్తున్నామా? అనే నిశిత దృష్టిని ఇస్తుంది.


ప్రకృతి సృష్టి విభిన్నం, మానవ సృష్టి అనుకరణ!”

—------------------------------------------------

యు.జి. ప్రకృతిని ఒక గొప్ప ఉదాహరణగా చూపిస్తారు. "ప్రకృతి ఏ ఒక్క ఆకృతిని రెండుసార్లు సృష్టించదు. రెండు ముఖాలు, రెండు ఆకులు, రెండు ఇసుక రేణువులు ఎన్నటికీ ఒకేలా ఉండవు," అని ఆయన చెబుతారు. ప్రకృతి ఏ ఒక్క మోడల్‌ను అనుసరించకుండా, ప్రతి సృష్టిని పూర్తిగా విభిన్నంగా, అద్భుతంగా నిర్మిస్తుంది. ప్రకృతి ఏదీ కాపీ చేయదు. కానీ మనం మాత్రం కాపీ చేయడానికే పరిమితమయ్యాం. ఈ విభిన్నతను ఒక సాధారణ ఫ్రేమ్‌లో బిగించి, దానిని "సృజనాత్మకత" అని పిలుస్తాం.


మన కళ మన అసంతృప్తి నుంచి పుట్టింది

—------------------------‐—---------------

“ఒక కళాకృతి పుట్టడం అంటే, మనలోని ఒంటరితనం, ఆవేదన, ఒత్తిడి బయటకు వచ్చే క్షణం. మనం దాన్ని కళ అంటాం, సృజనాత్మకత అంటాం. కానీ నిజంగా అది మనం నేర్చుకున్న శైలి, మనం చూసిన జ్ఞాపకాలు, మనం అనుభవించిన భావాల కలయికే. మీ కవిత మీ మనసును తాకిందంటే, అది మీ శిక్షణను తాకింది—మీ మనసును కాదు.”


ప్రకృతిలోని వైవిధ్యం ఒక సవాలు

—--------------------------------------

ప్రకృతిలోని ఈ వైవిధ్యం మన సృజనాత్మకతకు ఒక సవాలు. మనం సృష్టించే ప్రతి దానిలో ఏదో ఒక గత రూపం, గత ఆలోచన లేదా గత అనుభవం ఉంటుంది. అందుకే, యు.జి. అంటారు, "మీరు ఒక కొత్త ఆలోచనను సృష్టించామని చెప్పినప్పుడు, మీరు దాని మూలాన్ని గుర్తించలేకపోతే, అది మీ సొంతమైనట్లు భావిస్తారు. కానీ అది నిజం కాదు.”నిజమైన సృజనాత్మకత అంటే ప్రకృతిలా ఏ నమూనా లేకుండా పుట్టడం. అలాంటి సృష్టి మనిషికి సాధ్యమా? ఇది ఒక ప్రశ్న, ఒక సవాలు.”


నిజంగా "మీ" సృష్టి అని మీరు భావిస్తారా?

—-----------------------------------------

ఒక క్షణం ఆలోచించండి... మీరు ఒక కొత్త ఆలోచనను సృష్టించినప్పుడు, ఒక అద్భుతమైన చిత్రాన్ని గీసినప్పుడు, లేదా ఒక కవితను రాసినప్పుడు, అది నిజంగా "మీ" సృష్టి అని మీరు భావిస్తారా? లేక, అది ఎక్కడో, ఎప్పుడో మీరు చూసిన, విన్న, అనుభవించిన జ్ఞాపకాల సమ్మేళనమా? సృజనాత్మకత అనేది మనం ఊహించుకున్నట్లు అంత పవిత్రమైనది, అసాధారణమైనది కాదు, అది కేవలం ఒక భ్రమ.

ఒక పాట పుట్టిందంటే, అది గత వేదనలకు శబ్దం కలిగించినప్పుడే…ఒక బొమ్మ వెలిసిందంటే, అది మన జ్ఞాపకాలకు రంగు వేసినట్టే…కళ పుట్టింది అనుకునే ప్రతి క్షణం… పాతదాన్ని మళ్లీ పలికించిన క్షణమే.


కంప్యూటర్లు.. భవిష్యత్తు

—-----------------------

యు.జి. ఒక ఆసక్తికరమైన ఊహను ముందుకు తెస్తారు: "రాబోయే రోజుల్లో, కంప్యూటర్లు మనం ఇప్పటివరకు చూసిన అందరు కళాకారులు, సంగీతకారుల కంటే గొప్ప కళను, సంగీతాన్ని సృష్టిస్తాయి." ఇది ఒక హెచ్చరిక కూడా. మానవ మేధస్సు, ఆలోచనలు, సృజనాత్మకత – ఇవన్నీ కంప్యూటర్‌లతో పోల్చినప్పుడు ఒక యంత్రం లాంటివే. మనం మనల్ని యంత్రాలుగా అంగీకరించడానికి సిద్ధంగా లేం, కానీ సత్యం అదేనని యు.జి. నొక్కి చెబుతారు. కంప్యూటర్లు ఒక రోజు మన "సృజనాత్మకత" మూలాలను బయటపెట్టగలవు. అవి మనం ఎక్కడి నుంచి ఆలోచనలను "కాపీ" చేశామో చూపించగలవు. ఇది మన సృజనాత్మకత భ్రమను ఛేదించే రోజు అవుతుంది.


ఇవన్నీ మానవ భ్రమలే

—-----------------------

మన మనస్సు ప్రతీ కొత్తదానికి ఒక ట్యాగ్ తగిలిస్తుంది – creative writing, creative thinking, creative politics...కానీ నిజంగా కొత్తదేమైనా ఉందా?. మీరు ఒక రచన రాశారు. ఒక పాట పాడారు. ఒక చిత్రాన్ని వేశారు. ఇది మీరు నిజంగా సృష్టించినదేనా?

లేదా ఎక్కడో ఎప్పుడో విన్నదాన్ని, చూసినదాన్ని, మీ ఒత్తిడిని కలిపి రూపొందించిన అనుకరణా? ఒక పాత పాట కొత్త మ్యూజిక్‌లో, ఒక కవిత కొత్త పదాల్లో… కానీ మూలం ఇదే. మనకు కళ అంటే ఎంత గౌరవం! కవిత్వం, సంగీతం, చిత్రకళ, శిల్పం… ఇవన్నీ మనలో భావోద్వేగాలను రేపే సాధనాలే. కానీ యూజీ కృష్ణమూర్తి మాటల్లో, ఇవన్నీ మానవ భ్రమలే. "సృజనాత్మకత అనే పదానికే అర్ధం లేదని చెప్పిన మానసిక విప్లవవేత్త – యూజీ. మనం చేసే ప్రతిదీ ఏదో ఒక మోడల్‌ను అనుకరించడమేనని, అసలైన క్రియేటివిటీ అంటే ఏదీ మోడల్‌ లేకుండా పుట్టినదే అని స్పష్టం చేస్తారు.


ఒక మానసిక విప్లవం

—----------

మనమంతా సృష్టి అని పిలుచుకునే ప్రతి చర్య, అసలు చూస్తే, అనుభవాల పునరావృతమే. శిల్పం, నృత్యం, సంగీతం, చిత్రం, సాహిత్యం — ఇవన్నీ మానవుని మునుపటి మోడల్స్‌పై ఆధారపడే శిల్పాలే.

ఈ నిజాన్ని అంగీకరించడమే నిజమైన భావవిచారణకు ప్రారంభం. ఈ నిజాన్ని అంగీకరించడమే నిజమైన ఆలోచనకు మొదటి అడుగు.”

జాతీయ, అంతర్జాతీయ కళాకారుల గొంతులోనూ అదే సత్యం. ఈ ప్రశ్న, ఈ ఆవేదన — కేవలం యూజీ దృష్టికే పరిమితమై లేదు.

పెద్దపల్లి యాదగిరిరెడ్డి నుంచి ఇళయరాజా వరకు, మల్లికా సారాభాయ్ నుంచి ఎంఎఫ్ హుస్సేన్ వరకూ, రాజమౌళి నుంచి అమృత షేర్ గిల్ వరకూ,

డేవిడ్ హాక్నీ, అనిష్ కపూర్, జరీనా హష్మి, లియో టాల్ స్టాయ్, ఎలియట్ వంటి ప్రపంచవిఖ్యాత కళాకారుల లోతైన స్వీయానుభవాల్లో కూడా అదే మాట వినిపిస్తుంది:

“మేము సృష్టించలేదు… మేము అనుభవించినదాన్ని మళ్లీ మలిచాం.”ఇదే భావం మనకు కనిపిస్తుంది.


యాదగిరి రెడ్డి (పెద్దపల్లి కళాకారుడు):

 "నేను చెక్కే బొమ్మలన్నీ నా ఊర్లోని దేవుడి గోపురాల నుంచి వచ్చిన ప్రభావం. నేను ఏమీ సృష్టించలేను. నేను చెక్కేది ఒక ఫలితమే – నేర్చుకున్న పాఠాలకి.”

—------

వర్ణిక శ్రీ ( చిత్రకారిణి):

 "AI నా బొమ్మలన్నిటిని మిమిక్రీ చేస్తోంది. అది నాకు భయం కాదు – గుణపాఠం. నేను అనుకున్న uniqueness అసలు లేదేమో అనిపిస్తోంది.

—--------

రాజమౌళి (సినిమా దర్శకుడు):

 "చాలామంది నా సినిమాలపై 'originality' అనే మాట ఉపయోగిస్తారు. కానీ నేను ఎక్కడో చూసిన visual, పాత కథాంశం, పూరాణిక అంశాల ఆధారంగా నిర్మించాను. క్రియేటివిటీ అనేది అడ్డతీగల కలయిక”.

—----------

మల్లికా సారాభాయ్ (నాట్యకారిణి)

 "భారతనాట్యం అన్నది నిశ్చితమైన నమూనాలో నడుస్తుంది. దాంట్లో మనం మన భావాలను వ్యక్తీకరించవచ్చు. కానీ కొత్తదేంటీ అనేది మళ్లీ ప్రశ్నించుకోవాల్సిందే.”

—-------

ఇళయరాజా (సంగీత దర్శకుడు)

"ఒక్కో రాగం ఒక ప్రపంచం. నేను దానిలోకి ప్రవేశించి ఆ భావాన్ని మలుస్తాను. రాగం కొత్త కాదు. నా ప్రకటన మాత్రమే కొత్త.”

—-------

గిరీష్ కర్నాడ్ (రచయిత, నటుడు)

"నా నాటకాలకు మూలాలు పురాణాలు, జానపద కథలే. ఆ పాత్రల్లోనే ఆధునికతను అన్వేషిస్తున్నాను”

—---------

రఘువీర్ యాదవ్ (నటుడు, గాయకుడు)

 "ప్రతి పాట వెనుక ఒక జానపద మాడ్యులే ఉంది. దాన్ని మామూలు శ్రోతకు చేరేలా పాడుతున్నాం అంతే.

—------------

డేవిడ్ హాక్నీ (పెయింటర్)

"ప్రతి పెయింటింగ్ అనుకరణే. నేను నా తల్లి చిత్రాన్ని వేసినప్పుడు కూడా, అది నా జ్ఞాపకాలలో ఉండే ఆమె ముఖభావాల నకలే!"

—----------

అనిష్ కపూర్ (శిల్ప కళాకారుడు)

"కళ అంటే కొత్తగా ఏదైనా చెప్పడమేం కాదు. అది గతంలో అసంపూర్ణంగా మిగిలిన దాన్ని కొనసాగించడమే.”

—-------

 జరీనా హష్మీ (పెయింటర్)

"నేను గీసే గీతలు పర్షియన్ మినియేచర్ కళల నుంచి వచ్చాయి. నేనవన్నీ సృష్టించట్లేదు... అవే నాలోపల నుంచి మళ్ళీ బయటికి వస్తున్నాయి.”

—----------

 సుబోద్ గుప్తా (శిల్ప కళాకారుడు)

"నా పనిలో ఎక్కువ భాగం జ్ఞాపకాల నుంచే వస్తుంది – నా ఊరిలోని పాత్రలు, నా గతం. కానీ నేను వాటిని సృష్టించానని చెప్పలేను... నేను కేవలం మళ్లీ నిర్మించాను.”

—--------

 మల్లికా సారాభాయి (నృత్యకారిణి)

“శాస్త్రీయ నృత్యం అనేది ఒక నిర్దిష్ట నమూనా – ఇందులో కొత్తదనం అనేది భావప్రకటనతో పరిమితం. నేను నృత్యరూపకాలు రూపొందిస్తాను కానీ ఏదీ కొత్తగా సృష్టించానని నాకు అనిపించదు”

—------

త్యాగరాజ – భక్తి, సంగీతం,

త్యాగరాజ నిత్యము రాముడి స్థుతిని పాటలుగా రాశాడు. అతని సంగీతం చాలా భాగం కర్ణాటక సంగీత పద్ధతులపై ఆధారపడింది. స్వయంగా త్యాగరాజ గారి సంకీర్తనలు కూడా తాను శ్రవించిన కథల, పురాణాల మీద ఆధారపడినవి.

యూజీ దృక్కోణం ప్రకారం

 త్యాగరాజ గానం “సృష్టి” కాదు… అది వ్యక్తిగత భక్తి భావనకు రూపం. ఆ భావనలూ ఇతరుల నుంచి వచ్చినవే. అందుకే అది కూడా మానసిక pleasure movement.

—---------

నందలాల్ బోస్ (పెయింటర్)

అజంతా ప్రభావంతో నిర్మిత కళ. నందలాల్ బోస్ 20వ శతాబ్ద భారత కళా ఉద్యమానికి పితామహుడు. ఆయన ఎక్కువగా అజంతా గుహల చిత్రాలు, జాపనీస్ బ్రష్ ఆర్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభావం ఆధారంగా కళా శైలి అభివృద్ధి చేసాడు.

—------

వేమన పద్యాలు

జ్ఞానం, కానీ కొత్తగా ఏమిలేదు. వేమన పద్యాలు సామాజిక విమర్శ, తత్వజ్ఞానం, బౌద్ధ ధర్మం, లోకజ్ఞానం కలయిక. అయితే అతని పద్యాలలోని ధర్మబోధ, జీవన సత్యాలు శతాబ్దాలుగా చెప్పిన విషయాల రూపమే.

—------

రవివర్మ (చిత్రకళ) 

పాశ్చాత్య టెక్నిక్‌లో భారతీయ మోథాలజీ

అతడు నూతనత చూపించినట్లు అనిపించినా, పశ్చాత్య న్యూడ్ బాడీ ప్రొపోర్షన్లను మన భారతీయ దేవతలకు అప్లై చేశాడు. ఇది ఒక సాంకేతిక కలయిక, కాకపోతే కొత్త సృష్టి కాదు.

—----------

 రవీంద్రనాథ్ ఠాగూర్ (రచయిత, చిత్రకారుడు)

రచనల్లో యూరోపియన్ రొమాంటిసిజం, ఉపనిషత్తుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. చిత్రకళలో modernism + tribal art influence కూడా ఉంది.


యూజీ దృష్టిలో:

 ఆత్మవిమర్శగా కనిపించిన టాగోర్ రచన, అసలు సాంప్రదాయ భాషా శైలులకు మరొక రూపమే.

—----

సత్యజిత్ రే: (సినిమా దర్శకుడు)

అతని "Pather Panchali" చిత్రానికి Vittorio De Sica “Bicycle Thieves” ప్రభావం ఉన్నట్లు చెబుతారు. వాస్తవిక సినిమాల శైలి (Italian Neorealism) ఆధారంగా చిత్రీకరణ.

తన సంగీతం, టైటిల్ డిజైన్ కూడా పాశ్చాత్య శిక్షణల ఆధారమే.

—----

అమృత షేర్ గిల్ (చిత్రకారిణి)

ప్యారిస్ లో ఆర్ట్ శిక్షణ, పాశ్చాత్య శరీరాల తీరు, భవనాల నిర్మాణాల్లో Fauvism, Impressionism ప్రభావం. భారతీయ గ్రామీణ జీవితాన్ని చిత్రించినా – పాశ్చాత్య త్రీ-డైమెన్షనల్ ఫ్రేమింగ్ వాడింది.

ఆమె కళ భారతీయ విషయంపై పాశ్చాత్య శైలీ అద్దం. కొత్తగా కనిపించినా, అంతర్గతంగా అనుకరణే.

—-------

రవిశంకర్ (సంగీతకారుడు)

భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసినవాడు. Beatlesతో కలిసి పని చేసాడు. తన సంగీతాన్ని Western classical structure లో అనుసంధానించాడు.

—----

యూజీ దృష్టిలో:

సంగీతం అనేది spontaneous instrument కాదు – అది అభ్యాస, అభిరుచి, శిక్షణ ఆధారిత ప్రదర్శన.

—-----

ఎం.ఎస్ హుస్సేన్ (చిత్రకారుడు)

Picasso ప్రభావం. మార్కెట్ & మీడియా ద్వారా సంచలనంగా మారాయి. శైలిలో స్పష్టమైన Cubism, Expressionism ఉంది. అసలైన “originality” కాక, స్టైల్, వివాదం, మార్కెటింగ్ కలయిక Husain ప్రత్యేకతగా నిలిచింది.

—---

ఎంఎస్ సుబ్బలక్ష్మి(గాయని)

కర్ణాటక సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.

గీతాలు సాంప్రదాయ బజనలే, కానీ ఆమె delivery వల్ల కొత్తతనంగా అనిపించింది. గానం అంటే నోటి స్వరం కాదు – అది శ్వాస, శాస్త్రం, సాధన.

—--------

 టైబ్ మెహతా (చిత్రకారుడు)

Partition, వలస బాధలు వంటి అంశాలు తీసుకున్నా, అతని చిత్రం Francis Bacon శైలి ఆధారితంగా ఉంది. minimalist expressionist cubism.

బెంగళూరు ఆర్ట్ మార్కెట్‌లో అతని చిత్రాలు అత్యధిక ధరకు అమ్ముడయ్యాయి. మానవ బాధను చూపించే శైలి కూడా ప్రేరణ ఆధారితమే. “Creative breakthrough” అనేది మార్కెట్ వినియోగంగా మారింది.

—------

రుక్మిణి దేవి అరుండేల్ (భారతనాట్యం పునరుజ్జీవకురాలు) 

భారతనాట్యాన్ని బ్రాహ్మణీ సంస్కృతిలోకి తిరిగి చేర్చింది. అసలు ఇది దేవదాసీ సంప్రదాయంగా పుట్టింది.ఆమె "నాట్యం" రూపాన్ని శుద్ధ శైలీకృత నాట్యంగా మార్చింది.

—---------

నీల్ గైమాన్ (ఆంగ్ల రచయిత)

సృష్టి అనేది అనుకరణప్రక్రియలో ఉత్పన్నం

—-----

స్టీఫెన్ కింగ్

"సృష్టికి ముందు అనుకరణ వచ్చేది.” అనుకరణకే ప్రాధాన్యం

—-----

టి.ఎస్. ఎలియట్ (కవి, తాత్వికుడు)

అనుకరణను స్వంతంగా మార్చడం – క్రియేటివిటీ అన్నదీ కాదు

—--------

నీల్ రిచర్డ్ గైమాన్ (ఆంగ్ల రచయిత) 

“Life imitates art మన జీవితం కూడా ప్రతిబింబమే, పూర్తిగా స్వతంత్రం కాదు.


 నిజమైన మానసిక విప్లవం.

—-------------------------------

యు.జి. కృష్ణమూర్తి ఈ ఆలోచన మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది. సృజనాత్మకత అనేది మనం ఊహించుకున్నట్లు పవిత్రమైనది కాదు—అది మన గతం, శిక్షణ, అనుభవాల సమ్మేళనం. ప్రకృతి లాంటి నిజమైన సృష్టి మనిషికి సాధ్యం కాదు. మనం చేసేది పాతదాన్ని కొత్త రూపంలో చూపడమే. ఈ సత్యాన్ని అంగీకరించడం కష్టమైనా, అది మన ఆలోచనలకు కొత్త కిటికీ తెరుస్తుంది. మన కళ, మన సృజనాత్మకత—అవన్నీ మన భావోద్వేగాలు, జ్ఞాపకాలు, శైలుల ప్రతిబింబాలే. ఈ నిజాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన మానసిక విప్లవం.

యుగప్రవాహాన్ని ప్రశ్నించిన యూజీ కృష్ణమూర్తి

—------------------------------------------------

భారతీయ కళాకారుల్లో ‘కొత్త’ అనిపించిన ప్రతి ప్రయత్నం కూడా పాతదాన్ని కొత్త రేకులలో ప్రదర్శించడమే. దీనికి ఆధారమైనది – అనుభవం, శిక్షణ, మార్కెట్ అవసరం, భావోద్వేగ ప్రదర్శన.

"కళాకారుడు నిజంగా కొత్తదాన్ని సృష్టిస్తాడా?"

"లేక పాత రూపాలకు కొత్త రంగులు వేసే పనిదారుడేనా?” ఈ ప్రశ్నలన్నీ ఏవో తరగతి గదుల్లో పుట్టే తాత్విక సందేహాలు కాదు. ఇవి యుగప్రవాహాన్ని ప్రశ్నించిన యూజీ కృష్ణమూర్తి గారి కోణంలో వచ్చి సందేహాలు.