Monday 11 April 2022

జేకే నుంచి యు.జి.దాకా

 జె.కృష్ణమూర్తి నుంచి యు.జి.కృష్ణమూర్తి దాకా.....

            యూజీ కృష్ణమూర్తి పుస్తకాలతో పరిచయమై దశాబ్ధమైంది. అంతకు ముందు జిడ్డు కృష్ణమూర్తి లోకంలో విహరించా. జెకె పుస్తకాలు, సీడీలు, ఇష్టాగోష్టులు ప్రధానమయ్యాయి. మొదట జెకె వైపు చూడటానికి కూడా మనస్సు ససేమిరా అంది. నాస్తికత్వం, మార్క్సిజం నేపధ్యం యాక్సెప్ట్ చేయలేదు. తీవ్రమైన ఘర్షణ తర్వాత జెకె ప్రపంచంలోకి ప్రవేశించా. ఇక జెకె నుంచి చూపు తిప్పుకోవడం కష్టమైంది. ఇది జీవితంలో కీలకమైన మలుపు అనే భావన కలిగింది. దశాబ్దం తర్వాత పరిస్థితి మొదటికి వచ్చింది. రెండో కృష్ణమూర్తి యూజీ వచ్చారు. యూజీ వైపు చూడటానికి కూడా జెకె నేపధ్యం ససేమిరా అంది. మళ్లీ ఘర్షణ. చివరకు జెకె స్థానంలో యూజీ సెటిల్ అయ్యారు. యూజీ నుంచి దృష్టి మరల్చడం కష్టమైంది. జీవితంలో ఇది మరో టర్నింగ్ పాయింట్ అనే భావన కలిగింది. 

              జెకె, యుూజీ ..ఇద్దరూ అభిమానులను అనుయాయులుగా అంగీకరించరు. మనకాళ్ల మీదకు మనలను తోసేస్తారు. తమను కూడా తోసేసేంతగా మనలను మనవైపు నెట్టేస్తారు. జెకె ఇచ్చే ఈ ప్రేరణ జెకెను కూడా క్రిటికల్ గా చూసే దృష్టినిస్తుంది. ఈ చూపే యూజీని కలిపింది. ఇద్దరి పట్ల ఆకర్షణకు.. ఇద్దరూ అన్ని రకాల ఆధిపత్యాలను (స్పిరిట్యువల్, సెక్యులర్ ) ధిక్కరించడం, తమతో సహా ప్రతిదాన్ని ప్రశ్నించడం, ఇదే వ్యక్తీకరణ జీవితంలో ప్రతిఫలించడం ప్రధాన కారణం అనిపిస్తుంది. ఇద్దరూ థియొసాఫికల్ సొసైటీ, ఇతర ప్రభావం నుంచి తమదైన మార్గంలోనడవడం లోనే తమదైన ప్రత్యేకత కనిపిస్తుంది. 

                          థియొసాఫికల్ సొసైటీతో పాటు జెకె ప్రభావానికి భిన్నమైన వ్యక్తీరణ, భిన్నమైన నడక యూజీది. జెకె చెప్పే సెల్ఫ్, థాట్, డౌట్, అవేర్ నెస్, సైలెన్స్, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, సీయింగ్ ... ఇలా అనేక కీలక భావనలను యూజీ కొట్టేస్తారు. తనదైన అపూర్వ దృష్టి కోణాన్ని ఇస్తారు. ఇద్దరిలో సామీప్యతలూ ఎక్కువ కనిపిస్తాయి. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ గా, గొప్ప టీచర్ గా జెకె వేసిన మార్గానికి యూజీ కోనసాగింపుగా కనిపిస్తారు. నాకు జెకేను పరిచయం చేసిన గరుతుల్యులు, పెద్దలు శివరామ్ గారు ఇదే భావనను వ్యక్తం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులందరూ జెకె పదాలను వల్లివేసేవారే. అందులో జీవించిన ఏకైక వ్యక్తిగా యూజీ కృష్ణమూర్తి కనిపిస్తారు’ అని అంటారు.


No comments:

Post a Comment