యూజీ 'యాంటీ టీచింగ్ ' ...1970లో ప్రపంచంలో ఒక విస్పోటనం. జేకే మానసిక పరివర్తన అనే భావనను యూజీ తోసేశాడు .అక్కడ మనసనేదే లేదని ప్రకటించాడు. అందువల్ల మానసిక పరివర్తన అనే భావన మొత్తం అర్ధం లేనినదన్నాడు. యూజీ యాంటీ టీచింగ్ కాలి కింద పట్టాను లాగేయడమే గాకుండా కాలి కింద భూమిని కూడా ధ్వంసం చేసింది .రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొత్త సిద్ధాంతాలు, దారులు ముందుకొచ్చాయి . కొత్త సిద్ధాంతాలతో పాటు జేకే బోధనల్లో [doubt] 'సందేహం ' ప్రధాన అంశం అయింది. అన్ని సిద్ధాంతాలను వ్యతిరేకించే సుప్రసిద్ధ అధిభౌతిక తిరుగుబాటు దారుడు ఆల్బర్ట్ కాము మాటల్లో చెప్పాలంటే మత బోధనలను, సాధనలను ప్రత్యక్షంగా వ్యతిరేకించారు.తర్వాత అధిభౌతిక విప్లవం కూడా ప్రస్నార్ధక మయింది .చివరికి అధిభౌతికశాస్త్రాన్నే తోసేసే పరిస్థితి వచ్చింది. ఒక విచారణా పద్ధతిగా 'సందేహాన్ని యూజీ కొట్టేసాడు. 'ఇది విశ్వాసానికి మరో పార్శ్వం. సత్యం కోసం చేసే అన్ని అన్వేషణలు, విచారణలు వై ఫల్యం పరధిలోకే వస్తాయి. ప్రస్థానం చివరలో ఏమి తెలుసు కున్నాం అనే ఒక భావనతోనే ఏ అన్వేషణ అయినా సాగుతుంది . ఇది కేవలం భ్రమలకు గొప్ప కొనసాగింపు.కుక్క తన తోకను అందుకోవడానికి 'చేజ్ ' చేయడానికి చేసే ప్రయత్నం లాంటిదే ఇది ' అని యూజీ అంటారు .
ముకుందన్
ముకుందన్