Tuesday, 13 November 2012

Reality

మన అస్తిత్వానికి సంబంధించిన వాస్తవం, లేదా ప్రపంచ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడం సాధ్యమనే మన అంగీకారం నుంచే అన్ని సమస్యలూ  వస్తాయి . నేను చెప్పేది నీకు తెలియని దాని నుంచి ఎటువంటి అనుభవాన్ని పొందే మార్గం లేదు. నీ జ్ఞానం ద్వారా నీవు పొందే ఏ అనుభవమైనా అది ఫలితాన్నివ్వదు .అది యుద్ధంలో ఓటమే. మన ఉనికి , ప్రపంచ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి మనం ఉపయోగించే ఆయుధంతో ఈ దేహం నడకకు  సంబంధం ఉండదు . అందువల్ల ఆలోచనలు ఏవి స్వయంప్రకాశం కాదు , తక్షణంలో ఉండవని చెబుతుంటాను. 

1 comment:

  1. "ప్రపంచ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి మనం ఉపయోగించే ఆయుధంతో ఈ దేహం నడకకు సంబంధం ఉండదు . అందువల్ల ఆలోచనలు ఏవి స్వయంప్రకాశం కాదు" తరచి చూసేకొద్దీ లోతైన భావం కనపడుతుందండి.

    ReplyDelete