దేవుడి నుంచి మనిషి రక్షింపబడాలి. ఇది చాలా ప్రధానమైంది. ఎందుకంటే నీవు ఉపయోగించే `దేవుడు ' అనే పదం అర్ధంలో నేను చెప్పడం లేదు.దెవుడు అనే భావన అనేక అంశాలతో ముడిబడి ఉంది. కర్మ, పునర్జన్మ, కొత్త అవతారం, జీవితం తర్వాత ...ఇలా విషయమంతా , మొత్తం వ్యాపారం ...గొప్ప భారతీయ వారసత్వం అని నీవు చెప్పేదంతా దేవుడు అనే భావనకు సంబంధించినదే. ఈ మొత్తాన్ని చూడాలి. మనిషి భారతీయ వారసత్వం నుంచి బయటపడాలి. ప్రజలే కాదు మొత్తం దేశమంతా ఈ వారసత్వం నుంచి రక్షింప బడాలి.లేకపోతే వ్యక్తిగతంగా గాని ,దేశానికీ గాని భవిష్యత్తు లేదు .
గందర గోళంగా ఉండే మనస్సు చాలా విధ్వంసకరమైన వాటిని సృష్టించింది.వీటిలో అత్యంత విధ్వంసకరమైంది '.దెవుడు'. నా దృష్టిలో దేవుడికి సంబంధించిన ప్రశ్న అసంబద్ధం. అభౌతికమైంది.దేవుడి వల్ల మనకేమాత్రం ప్రయోజనం లేదు.రెండుప్రపంచ యుద్ధాల కంటే ఎక్కువ మందిని దేవుడి పేరుతో చంపేశాం.జపాన్ లో బుద్ధ భగవానుడి పేరు మీద లక్షల మంది చనిపోయారు.ఇదే వరుసలో క్రిస్తియన్లు, ముస్లింలు ఉన్నారు. భారత దేశంలో కూడా ఒక్క రోజులో ఐదు వేల మంది సిక్కులను ఊచ కోత కోశారు. మీది కూడా శాంతియుత దేశంకాదు. నీ చరిత్ర చదువుకో. మొదటి నుంచి చివరివరకు మొత్తం హింసే కనబడుతుంది .
మనిషి బౌతిక జివి. స్వాభావికంగా అతనికి ఆధ్యాత్మిక పార్శ్వం లేదు. పవిత్ర విలువలు, సూత్రాలు, నమ్మకాలూ ,ఆధ్యాత్మిక విలువలు కేవలం డాంబికాలు. ఇవి నీలో ఏమాత్రం మార్పు తీసుకు రాలేవు. నీవు ఇప్పటికీ క్రూరుడివే. ఇదే ప్రవృత్తి ఎప్పుడు కలిగివుంటావు. 'నీకు మల్లె నీ పొరుగు వాడిని ప్రేమించు' అనే తత్వభోదన నీ విచక్షణారహిత మారణకాండను ఆపలేదు. నీ పొరుగువాడిని చంపితే నీకూ అదే గతి పడుతుందనే భయంకర నిజం వలన నీవు హత్యా కాండను ఆపుతావు.

No comments:
Post a Comment