ఏ సమయంలో కూడా మనం జీవించం . భావనా ప్రపంచంలో బతుకుతాం . అవన్నీ మృత ప్రాయం అయినవి .అక్కడ కొత్తదనం ఉండదు. ఆలోచన ప్రవాహం ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. వేల సంవత్సరాలుగా వస్తున్న గమనం.దీనికి మొదలంటూ లేదు.అందుకే బైబిల్ చెబుతుంది... ఆదియందు వాఖ్యముండును ఆని. అది ఎప్పుడు మొదలయిందో మనకు తెలియదు. మన నడకను మనం అర్ధం చేసుకోవాలంటే ఆలోచన క్రమాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది . అసలు నీవు బతికే ఉన్నవని నీకు ఎలా తెలుసు.దాన్ని కూడా నీ ఆలోచన , నీ భావన ద్వారానే నిన్ను నీవు తెలుసుకొంటావు.
No comments:
Post a Comment