ఆర్టిస్ట్ అంటూ ఎవరూ ఉండరు . అతను కేవలం టేక్నీషియన్. అతడు లేదా ఆమె చిత్రకళ చిట్కాలు తేలుసుకుంటారు . కార్పెంటర్లు, తాపీ పని వాళ్ళ కు మల్లే వీరు శిల్పులు, నిపుణులు . క్రాఫ్ట్ కంటే ఉన్నతస్థానాన్ని కళకు ఎందుకు కల్పిస్తారు. కళాకారుడి సృష్టికి మార్కెట్ లేకపొతే అతను ఆ వ్యాపారంలో ఉండదు.ఈ సో కాల్డ్ అర్తిస్స్టు ల నమ్మకాలకు మార్కెట్టే ప్రధాన కారణం .ఇతర క్రాఫ్ట్ మెన్ లా కళాకారుడు కూడా ఒక క్రాఫ్ట్ మాన్ .తన వ్యక్తీ కరణకు ఆ పనిముట్టునే ఉపయోగిస్తాడు . మొత్తం మానవ సృజనంతా సునిసితత్వం నుంచే సృష్టి అవుతుంది.మొత్తం కళ అంతా ఒక సంతోష క్షణం. అది (సంతోషం) కూడా నీచే సృష్టి ఆవుతుంది .లేకపొతే అందం, ఆర్ట్ గురించి మాట్లాడడానికి, ప్రశంసించడానికి మార్గం లేదు. వాళ్ల సృష్టిని నీవు ప్రశ్నిస్తే వాళ్లు ఫీలవుతారు .నీకు టేస్టు తెలియదనుకుంటారు . వారి కళను ఎలా ప్రశంసించాలో తెలుసుకోవడానికి స్కులుకెల్లి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటారు. సోకాల్డ్ గ్రేట్ పొయిట్ రాసిన పోయంను నీవు ఎంజాయ్ చేయ లేక పోతే ఆ కవితను ప్రశంసించేట్లు నిన్ను బలవంతంగా ఎడ్యుకేట్ చేస్తారు.విద్యా సంస్థల్లో ఇదంతా వాళ్ళు చేస్తుంటారు.అందాన్ని, చిత్రకళను ఎలా ఆస్వాదించాలో మనకు బోధిస్తుంటారు. సృజనాత్మకరాజకీయాలు, సృజనాత్మక భావాలు , సృజనాత్మక కళ ఇలా ప్రతిదాన్ని తాము క్రిఏటివుగా ఆలోచిస్తామనుకుంటూ అన్వేషణలో ఓదార్పు పొందుతుంటారు.నిజానికి వారిలో ఏ మాత్రం సృజనాత్మకత ఉండదు.వారు ఎమి చేసినా అందులో ఒరిజినాలిటి,తాజాదనం స్వేచ్చా ఉండదు. ఆర్టిస్టులు అక్కడో, ఇక్కడో తీసుకుని దాన్ని కలబోసి ఏదో కొత్త అద్బుతాన్ని సృష్టిస్తున్నట్లు భావిస్తుంటారు. ఆల్ రెడీ అక్కడ ఉన్నదాన్ని వాళ్ళందరూ అనుసరిస్తుంటారు. అనుకరణ శైలే మనకున్న క్రియేటివిటి. మనం వెళ్ళిన స్కూలు ,మనం నేర్చుకున్న భాష ,మనం చదివిన పుస్తకాలు, ఎదుర్కొన్న పరీక్షలు ...ఈ నేపధ్యం నుంచి మనకొక శైలి ఏర్పడుతుంది. ఇలా శైలి టెక్నిక్ అక్కడ నడుస్తుంటుంది.
No comments:
Post a Comment