Saturday 28 July 2012

Real problem is solution

పరిష్కారమే నిజమైన సమస్య . అందువల్లే నీ సమస్యలన్నీ కొనసాగుతుంటాయి. ఎందుకంటే తప్పుడు పరిష్కారాలను నీవు కనుగొన్నావు . అక్కడ సమాధానాలు లేకపోతే ప్రశ్నలే ఉండవు .అవి ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ప్రశ్నలు, సమాధానాలు కలిసి ప్రయాణిస్తుంటాయి. ఆ సమాధానాలతో సమస్యలకు ముగింపు పలకలనుకొంటున్నావు. అందువల్ల సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి . రాజకీయ నాయకులు, మానసిక శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవాదులు ... వీరంతా మనముందుంచిన పరిష్కారాలు నిజానికి పరిష్కారాలు కాదు. బాగా ధ్యానం చేయాలని, సాధన చేయాలని, బాగా కష్టపడాలని ప్రోత్సహిస్తుంటారు, ప్రేరణ కలిగిస్తుంటారు. ఇదంతా హింస. నీ నెత్తి మీద కూర్చొని పదే,  పదే చేయిస్తుంటారు. నీ ఆశను, భయాన్ని పక్కకు తోసేయగల్గితే, వారిని కేవలం వ్యాపారస్తులుగా చూడగలిగితే వాళ్ళు ఎప్పటికీ ఈ సరుకును నీ దగ్గర దిగుమతి చేయరు.కానీ ఈ ప్రవీణులు ఇచ్చే బోగస్ సరుకును నీవు పదే, పదే కోరుకుంటావు. నిజానికి అక్కడ సమస్యలు లేవు.అక్కడ కేవలం పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏ మాత్రం పని చేయవని చెప్పే ధైర్యం మనకు లేదు. అవి పని చేయవని కనుగొన్నా సెంటిమెంటు రంగం లోకి వస్తుంది. అతనిమీద నమ్మకం, విశ్వాసం వల్ల అతన్ని తోసేయ లేవు. పరిష్కరాలే సమస్య. నిజానికి అక్కడ సమస్యలు లేవు. నిజమైన సమాధానాలుగా మనం అంగీకరించిన పరిష్కారాల నుంచే ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సమాధానాలు ముగిసిపోవడంతోనే   ప్రశ్నలకు ఒక సమాధానం వస్తుంది. ఒక సమాధానంపోతే మిగతా సమాధానాలు వెళ్ళిపోతాయి.

No comments:

Post a Comment