Tuesday, 30 August 2011

దేహం (BODY)

  •      జీవితం, మరణం, స్వేచ్చ గురించి మీరు  కల్పించుకున్న మహోన్నత భావాలను తోసేయండి. అప్పుడు ఈ దేహం యధా స్థితిలో ఉంటుంది. సామరస్యతతో పనిచేస్తుంది. దానికి నీ సహాయం ఏమీ అవసరం లేదు. నీవు ఏమీ చేయొద్దు . శాశ్వితత్వం, పునర్జన్మ, మరణం గురించి... ఇలా ఎప్పుడూ పనికిమాలిన, బుద్దితక్కువ ప్రశ్నలు వేయొద్దు. శరీరం శాశ్వితమైంది. మరణించినా రూపం మారుతుంది . తర్వాత జీవితం,  శాశ్వితత్వం వంటివి  శరీరానికి పట్టవు. శాశ్వితత్వం కోసం పరితపించే ఆలోచనే శరీరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దృష్టిని చెదరగొడుతుంది. 
  •      ఈ దేహానికి ఏది మంచిదో తెలుసనుంటాం. అదే మనకు సమస్యలను సృష్టిస్తోంది. దేహానికి తెలుసు దానికి   ఏమి  కావాలో. ఈ మామూలు సంబంధం  మనకు అర్ధమైతే దేహం దాని మానాన అది ఉండటానికి ఆమో దిస్తాం . నెప్పి ఉన్నా డాక్టర్ దగ్గరకు వెళ్ళకూడదనే క్రైస్తవ సన్యాసులు  భావిస్తున్నట్లు నేను చెప్పడం లేదు. 
  •     ఈ దేహానికి నీ ధ్యానం చిట్కాలు ఏమీ అవసరం లేదు. నిజానికి అవి ప్రశాంతతను చెడగొడతాయి. ప్రశాంతత ఆల్ రెడీ అక్కడ ఉంది. ఇది ఒక అపూర్వమైన ప్రాణి (అర్గానిజం). ప్రశాంతంగా ఉండేందుకు ఈ దేహానికి ఏమీ అవసరం లేదు.
  •      జ్ఞానం కోసం, అత్మచైతన్యం  కోసం ఎంతో చదివి జీవితాన్ని అంకితం చేసారనే వారి మీద ఆధారపడటం అనివార్యమైంది. వారు చెబుతున్న తత్వాలకు దేహానికి ఉన్న వాస్తవ జ్ఞానంతో పోల్చలేవు. వాళ్ళు చెబు తున్న మానసికమైన, భావోద్వేగమైన, ఆత్మ సంబంధమైన కార్యకలాపాలన్నీ ఏకోన్ముఖంగా సాగు తుం టాయి. 
  •  ఈ శరీరం అత్యంత తెలివైంది. ఈ దేహం ఉనికిని తాజాగా  ఉంచడానికి శాస్త్రీయమైన, లేదా వేదాంతపరమైన బోధనలు ఏమీ అవసరం లేదు.
  •    దానంతటది తాజాగా ఉండటానికి ఈ దేహానికి అత్యద్బుతమైన నడక ఉంది. ఇది తప్పనిసరి. ఎందుకంటే ఇంద్రియాలన్నీ  ఎప్పుడూ సజ స్థితిలో సునిసితత్వంతో పని చేస్తుంటాయి. 
  • .            `నేను` లేకుండా ఈ దేహాన్ని ఏమని పిలుస్తావు. ఇది కేవలం దేహం. కాని ఇది భిన్నమైన దేహం. దీని పనితీరు భిన్నమైన మార్గంలో ఉంటుంది. భిన్నమైన శక్తిని కలిగివుంటుంది. నైతిక జీవితానికి సంబంధించిన వత్తిళ్ళు పోతాయి. అంటే దీనర్థం నీవు చేసే నైతిక చర్యలు అపసవ్య మైనవో, మరొకటో  కాదు. నీకు సమాజంతో ఘర్షణలు ఉండవు. ఎందుకంటే నీ లోపల ఘర్షణ లేదు. ఆలోచిస్తే అటువంటి  వ్యక్తి నుంచి  ప్రేమ, కరుణ, దయ ప్రవహిస్తుంటాయి.
  •   దేహం నుంచి మనస్సును వేరు చేయలేవు. మనస్సు కేవలం మానసికమైన కార్యకలాపాలకే  పరిమితం కాదు. ప్రతి కణంలో ఆలోచన ఉంది. నీ దేహంలోని ప్రతికణంలో `నేను ` భావం   పని చేస్తుంటుంది. వేరు చేయడం అంత  సులభం కాదు

దారి లేదు (NO WAY)

  •  నేను ఏ మార్గాన్ని  సూచించడం లేదు. ఎందుకంటే అక్కడ దారి లేదు. నేను ఈ స్థితిలోకి కాలుజారిపడి ఇతరుల మార్గాల నుంచి స్వేచ్చను పొందాను. 
  • నన్ను నమునాగా ఉపయోగించుకొమనో , లేదా నా అడుగుజాడల్లో నడవమనో నేనెప్పుడూ చెప్పను. 
  •   సరైన మార్గం అంటూ ఏదీ లేదు. నేను నీకు రూట్ మ్యాప్ ఇవ్వలేను. కాని నేను ఒకటి చెబుతాను. అక్కడ స్వర్గం లేదు. కొత్త జేరూసలెం  లేదు. ఇది కేవలం జీవించడం. కేవలం ఈతకొట్టడం. అంతకుమించి ఏమీ లేదు. 
  •   నేనేమి చెప్పినా సాహిత్యంగా తీసుకోవద్దు. అలా తీసుకొని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి దాన్ని, ప్రతి వాఖ్యాన్ని పరీక్షించు. నీ  నడకకు దానికి ఏమైనా సంబంధం ఉందేమో  చూడు. నీవు తప్పకుండా పరీక్షించాలి. నీవు దీన్ని అంగీకరించే స్థితిలో లేవు. నీవు అంగీకరించినా, అంగీకరించక పోయినా ఇది నిజం.
  • ఎవరకీ చెప్పడానికి  నాకేదారి లేదు. వస్తారు. వింటారు. అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎటువంటి అంతరాయం లేకుండా వినడం తప్ప వేరే మార్గం లేదు. కానీ అంతరాయం చేసే వాడే ప్రధాన అవరోధం. అది నివే. నీ ఎదురుగా ఉన్న జీవితం నుంచి వచ్చే ఆలోచనలు, నమ్మకాలు, అనుభూతుల  సృస్టివి నీవు .  ఈ యధా స్థితిని కొనసాగించడానికే  నీ ఆలోచన ఆసక్తి చూపుతుంది. అదే మార్పును కోరదు. అయితే మార్పు ఆగదు. అది దేన్నీ అంగీకరించదు. నీ యధా స్థితిని కూడా డిస్టర్బ్ చేస్తుంది. నేను చెప్పేది అంతరాయం కలిగిస్తున్న నీ రిఫరెన్స్ పాయంట్  నిన్ను బలాడ్యుడిని చేస్తుంది. రక్షిస్తుంటుంది అని.  
  • రాబోయే భవిష్యత్ చర్యలను, పరిస్థితులను కాచుకునేందుకు సిద్ధంగా ఉండాలనే దిమాండ్ మన సమస్యలకు కారణం. ప్రతి సందర్భం విలక్షణంగా ఉంటుంది. మనకున్న జ్ఞానంతో పరిస్థితులను ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధంగా  ఉంటాం. మన పరిష్కారానికి, ఎదుర్కోవడానికి పరిస్థితులు ఏ మాత్రం సహాయపడవు.

    జ్ఞానోదయం (ENLIGHTMENT)

    • `జ్ఞానోదయం`  అంటూ ఏమీ లేదు. గురువులు, సాధువులు, జ్ఞానులు, లోకరక్షకులు వందల సంవత్సరాలుగా అక్కడ  జ్ఞానోదయం ఉందని నొక్కి చెబుతూన్నారు. `వారు జ్ఞానోదయం పొందారు`  అని నీవు చెప్పవచ్చు. వాళ్ళందరిని కట్టకట్టి ఓ నదిలో తోసేయి. అక్కడ ఏమీ  జ్ఞానోదయం లేదని గ్రహించడమే   జ్ఞానోదయం.  
    •   స్వేచ్చ,  జ్ఞానోదయం పొందిన మనిషి ఎవరికీ  స్వేచ్చ,  జ్ఞానోదయం కలిగించడానికి  ఆసక్తి చూపడు. ఎందుకంటే స్వేచ్చ,  జ్ఞానోదయం పొందినవాడినని తెలుసుకునే మార్గం అతనికి లేదు. ఇది ఎవరితోనైనా పంచు కునేదికాదు. ఎందుకంటే ఇది అనుభవం పరిధిలోకి రాదు. 
    • నాకు తెలిసి ఉన్నదంతా భౌతిక క్రమం, ఇందులో మార్మికత,ఆధ్యాత్మికత  ఏమీ లేదు




    ప్రేమ (LOVE)

    •              ప్రేమ  గురించి చెప్పమని పదే పదే అడుగుతున్నావు. ప్రేమంటే ఇద్దరు వుండాలి. నీకు తెలుసు. నేను ఒకరిని ప్రేమిస్తాను.  నిన్ను మరొకరు   ప్రేమిస్తారు. ఎక్కడ విభజన వుంటుందో  అక్కడ ప్రేమ వుండదు. మనం ఈ లోటును పూరిం చడానికి ప్రయత్నిస్తుంటాం . ఇది మనకు దారుణమైన పరిస్థితి. ఇది అర్ధం లేనిది. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలనే ఫాన్సీ ఇడియా మనలోనించి డిమాండ్ చేస్తుంటుంది. మధ్య... అంటే నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. నా కుక్కను  ప్రేమిస్తాను. నా  భార్యను ప్రేమిస్తాను. ఎవరిని ప్రేమించినా ఏమిటి భిన్నత్వం. నా  మాటలు  చాలా వైరాగ్యంగా కనిపించవచ్చు . వాస్తవానికి  ఏమీ ప్రత్యేకత లేదు. నీవు నీ దేశాన్ని ప్రేమిస్తావు. నేను నా  దేశాన్ని  ప్రేమిస్తాను. అక్కడ యుద్ధం వుంటుంది. 
    •     నా నుంచి  సానుకూల సమాధానాన్ని కోరుకుంటున్నావు. నేను దాన్ని తప్పించు కోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇది  రాజకీయ ఇంటర్య్వు కాదు. నేను మోసం చేయడం లేదు. నాకేమీ తెలివిగల, డిప్లొమాటిక్  సమాధానం ఇవ్వాలని లేదు. నిజంగా ఈ  ప్రశ్న ప్రతి ఒక్కరూ అడుగుతారు. మన సంబంధాల్లో ప్రేమ లేదు. వాటిని ప్రేమ పూరిత సంబంధాలుగా చేయాలనుకొంటున్నాం.  ఇందు కోసం ఎంతో శక్తిని దారపోస్తుంటాం. ఇది ఒక యుద్ధం. శాంతి... శాశ్వితమైన శాంతి పొందుదామనే ఆశతో మొత్తం సమ యాన్నంతా యుద్ధం చేసేందుకు మనకు మనం సన్నద్దులమౌతుంటాం. ఈ యుద్ధంలో అలసిపోతావు.  చివరకు ప్రేమ రాహిత్య సంబందాలలోనే  సెటిల్ అయిపోవడం ఇక్కడ విషాదం. 
    •   ఇద్దరు వ్యక్తుల మధ్య సంపూర్ణమైన, ఆదర్సవంతమైన సంబంధం నేరిపే క్రమంలో ప్రేమ విఫలమైతే  అక్కడ ద్యేషం చోటుచేసుకుంటుంది. లేదా విరోధ భావం, విరక్తి ఏదైనా పదాలు ఉంటే...నేను పదాల్లో చాలా  పూర్...అనేక భావాలు చోటుచేసుకుంటాయి.
    •    `నీకు మల్లె  నీ పొరుగువాడిని ప్రేమించు`.  ఈ పేరుతో ఇటివల జరిగిన  యుద్దాలను పరిశీలిస్తే మనం ఎన్ని లక్షల మందిని చంపేశాం. నీ వలే నీ పొరుగువాడిని ఎలా ప్రేమిస్తావు.? ఇది అసాధ్యం. లేకపోతే అనేక మంది ప్రజలు, మహిళలు, పిల్లలు, నిస్సహాయులు ఎందుకు నరమేదానికి  గురౌతున్నారు. 
    • ప్రేమ, ద్వేషం ఒకే నాణానికి వ్యతిరేక దిశలో లేవు. రెండూ ఒకటే. ఒకే విషయం . 

    Sunday, 28 August 2011

    సంస్కృతి (CULTURE)

    •         నీకు నీవుగా  వుండాలి. కాని దిగ్బ్రాంతికలిగించే విషయం ఏమిటంటే నీవు ఆధారపడిన మొత్తం మానవాళి వారసత్వం అంతా అపస్యమైంది. దీన్ని నీవు చూడాలి. ఈ గ్రహింపే నీకు మేలుకొలుపు. దృచ్చంగా కానీ, యాదృచ్చకంగా గాని ఇది జరిగితే  నీలో ఈ పరిస్థితికి కారణమైన ఈ సంస్కృతి  లేదా నాగరికత మీద నీకున్న పరా ధీనతపై మెరుపులా ఈ గ్రహింపు నిన్ను తాకుతుంది.
    •     నీవు వారసత్వ భారం నుంచి  స్వేచ్చను పొందితే నీవు మొదటిసారిగా ఒక వ్యక్తిగా  తయారవుతావు. ఈ వ్యక్తి ప్రభావం మానవ చైతన్యంపై  ఖచ్చితంగా వుంటుంది. 
    •        తన సహజ మార్గంలో  ఈ దేహం మొత్తం రసాయనచర్యల్లో  మార్పులు మొదలౌతాయి. దీని అర్ధం ఏమంటే నాగరికత ద్వారా కలుషితమైన, విషతుల్యమైన మొత్తం ఈ వ్యవస్థ  నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడైతే  బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఈ   చైతన్యం , లేదా  జీవితం ...నీవు ఏమైనా పిలువు  దాని వ్యక్తీకరణ, నడక తనదైన శైలిలో వ్యక్తమౌతుంటుంది. ఇటువంటి వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం వుండదు. ఇతడు ఒక ప్రమాదికారిగా తయారౌతాడు. ఇదే వైరుధ్యం. ఇతడు ప్రపంచాన్ని సంస్కరించడానికి కొంత శక్తి కావాలని కోరుకోడు. తను రక్షకుడిననో, స్వేచ్చా జీవిననో, ఆత్మ జ్ఞానం పొందినవాడిననో అనుకోడు.
    •    నీకు నీవుగా, వ్యక్తిగతంగా ఉండాలంటే నీవు  చేయడానికి ఏమీ లేదు. నీవు ఉన్న స్థితి కంటే  భిన్నంగా ఉండాలని సంస్కృతి నిన్ను డిమాండ్ చేస్తుంటుంది.  అలా ఉండడానికి  చేసే  ప్రయత్నంలో మన సర్వ శక్తులూ వృధా అవుతుంటాయి. ఆ శక్తి ఉంటే జీవించడం చాలా సాధారణంగా ఉంటుంది.
    • నీవు సాధారణ మనిషిగా, మామూలు మనిషిగా ఉండాలనుకోవడంలేదు. అదే నిజంగా సమస్య. నీవు ఉన్న దానికన్నా భిన్నంగా ఉండాలని నాగరికత నిర్దేశిస్తోంది.
    • ఈ దేహానికి ఏమీ తెలుసుకోవాలని ఉండదు. దాని రక్షణకు కావలసిన తెలివి అక్కడ ఉంది, పోగేసుకున్న దానిని మేధోతనం అంటాం. ఆలోచనకు కొత్తదనం ఇవ్వడం అనే నిరంతర  ప్రక్రియ కోసం మనం ఈ మేధో సంపత్తిని పోగేసుకుంటాం. దీని సహాయంతో ఇతర జీవ రాసులకంటే ఎక్కువ కాలం జీవించడానికి ప్రయత్నిస్తుంటాం . మొత్తం వ్యవస్థ నాశనానికి ఇదే కారణమౌతోంది.  మేధో సంపత్తిని పోగేసుకోవడమనే వాస్తవం నుంచి మనం తప్పిచుకునే మార్గం లేదు.  జంతువులు  ఏవీ మార్పు కోసం ఏ మాత్రం ప్రయత్నిచవు. దీన్ని మనం అర్ధం చేసుకోవాలి. మనలో మార్పు రావాలనే డిమాండ్ నాగరికత సృష్టి. ఏమి మరాలనేది మౌలిక ప్రశ్న. విప్లవాత్మకంగా గాని మరేదైనా గాని మార్పు చెందాల్సింది ఏ మైనా ఉందా? ఏముంది అక్కడ.? ఏదైనా ఉందా? ఆత్మ ఉందా?  `నేను` ఉన్నానా? ...నా సమాధానం ఏమీ లేదనే. నేను చూసేది, అనుభూతి చెందేది అంతా జ్ఞాన సృష్టి . జ్ఞానమే నేను. ఆ జ్ఞానం ఉనికే తరతరాలుగా వస్తోంది. అదే నాగరికత.

    Saturday, 27 August 2011

    జ్ఞానం (KNOWLEDGE)

    •    నీవు ఇంకా, ఇంకా జ్ఞానాన్ని, అనుభవాన్ని సాధించాలనుకుంటావు.ఈ క్రమంలో  విషయాలను బాగా అర్ధం చేసుకోచ్చు ననుకుంటావు. కాని నేను చెప్పేదేమిటంటే నీ జీవన  ప్రయాణం ఎప్పటికీ నీ జ్ఞానంలో భాగస్వామ్యం కాదు. నీవే ప్రవాహం అవ్వాలని ఏదో ఒకటి చేస్తుంటావు. ఈ దిశలో నీకు  నీవు ప్రవాహం నుంచి విడిపోతుంటావు.

    సృజనాత్మకత (CRIEATIVITY)

    •   సృజనాత్మకత అనేది ఏమీ లేదు. భాష ఆలోచన సృష్టి. జీవితం సృజనాత్మకం అంటే దాన్ని నమునాగా ఉపయోగించడానికి వీలు లేదు. మన  సృజనాత్మకత అని చెప్పుకునేదంతా అనుకరణ. అక్కడ ఉన్న దానికి నకలు. నాకేమి అక్కడ బ్లూప్రింట్ అనేదేమీ కనబడదు.