జీవితం అంటే ఏమిటి?
యు.జి.కృష్ణమూర్తి
ప్ర: మనలో చాలా మందికి జీవితం ఒక పవిత్రమైన విషయం. మన పిల్లలను పర్యావరణాన్ని పరిరక్షించడానికి, మరొక యుద్ధాన్ని నివారించడానికి మేము కష్టపడుతున్నాం....
యు.జి. : మీరందరూ మానసిక వ్యాధిగ్రస్తులు. బాంబులతో, ఆకలితో, దారిద్ర్యంతో, టెర్రరిజంతో వేల లక్షల మందిని చంపేస్తూ మరో వైపు భావి జీవితం, బర్త్ కంట్రోల్, జీవన మాధుర్యం, జీవిత విలువల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇది చాలా అసంబద్ధం. జీవితంపై మీ కలవరం అంతా కేవలం రాజకీయ సమస్య నుంచి బయిటపడటానికే.
నీవు చెబుతావు. జీవితం ప్రవాహం. దానితోపాటే నేను కదులుతుంటాను అని. కాని నిజానికి ప్రవాహాన్ని చెదరగొడుతుంటావు. జీవితం కదలిక ఎప్పుడూ భిన్నంగా వుంటుంది.
జీవితం అద్భుతమైన క్రమం. ఆలోచన చట్రంలో దాన్ని ఎప్పటికీ అందుకోలేవు.
జీవితం అనుకుంటున్న దానికి భౌతికంగా దాని అర్ధం దానికుంది. దాన్ని తోసేసి ఆధ్యాత్మిక అర్ధం కల్పించడానికి ప్రయత్నిస్తున్నావు. ఏదైనా అర్ధం ఎందుకుండాలి. జీవించడం కోసం జీవితం వుంది. నీవు ఆధ్యాత్మిక అర్ధం వెతకడంలోనే సమస్య వుంది.
అర్థవతం, ప్రశాంతం, సంపూర్ణం, ఆదర్శవంతంమైన జీవితం...ఇలా పేరుకుపోయిన భావనలు తొలగిపోవాలి. అసలు జీవితం కన్నా వీటి గురించి ఆలోచనకే నీ శక్తులన్నీ వ్యర్ధం అవుతుంటాయి.
నీవు జీవితం మొదలు పెడితే ఏమి ఆలోచిస్తున్నావు అనేది విషయం కాదు. జీవితం దానంతట అదే సాగుతుంది. ఎలా జీవించాలి అనే ప్రశ్న జీవితానికి ఒక సమస్య అయింది. ఎలా జివించాలనేది జీవితానికి అర్ధం లేనిది. ఎలా అనే ప్రశ్న వచ్చిన మరుక్షణం సమాధానం కోసం ఎవరో ఒకరి మీద ఆధార పడతావు. దీంతో నీమీద స్వారీ చేయడానికి ఆవకాశం తీసుకుంటారు.
జీవితానికి ఎందుకర్ధం ఉండాలి. ఎలా జీవించాలి అనేది జీవి నడకకు పూర్తిగా సంబంధం లేనిది. అది జివిస్తుంటే ఎలా, ఎప్పుడు అని ప్రశ్నించదు. ఎలా అనేది నీవు నిర్దేశిస్తున్నావు.
జీవితం ఏమిటి? ఎవరికీ తెలియదు. మనం చెప్పేదంతా ఊహాజనితం. జీవితం నుంచి, అనుభవం నుంచి అర్ధం చేసుకున్నది జ్ఞానం సహాయంతో చెబుతావు. మన చుట్టూ ఉన్న ప్రజలతో, ప్రపంచంతో మనకున్న సంబంధమే జీవితంఅనుకుంటాం. మనకు తెలిసింది అదే. వాస్తవానికి అది సంబంధం కాదు.
నీ జీవితం , దాని ఉనికి అద్భుతమైన జీవన నాణ్యతను కలిగి ఉంది. ప్రేమ, అనంతమైన ఆనందం, శాంతి...ఈ భావనలన్నీ నీ సహజమైన ఉనికిని అడ్డుకునేవే.
మీకు తెలిసినది మీ జీవితంలో పనిచేయదు. మీ నడకకు దీనికి ఎలాంటి సంబంధం ఉండదు . ఇది నిజంగా సమస్య కు మూలం.
జీవితం ఏమిటనేది నీవు ఎప్పటికీ తెలుసుకోలేవు. జీవితం గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు. నీవు నిర్వచనాలు ఇస్తావు. అవి అర్ధం లేనివి. జీవితాన్ని సిద్దాంతీకరిస్తావు. అది నీకేమాత్రం విలువైన విషయం కాదు . దేన్నీ అర్ధం చేసుకోడానికి అది నీకు సహాయం చేయదు. ప్రశ్న, ప్రశ్నించేవారు రెండు వేర్వేరు విషయాలు కాదు. ఆ ప్రశ్న తానంతట తాను దగ్దమైతే అక్కడ శక్తి ఉంటుంది. ఆ శక్తి గురించి ఏమీ చెప్పలేరు --- ఇది ఆల్ రెడీ దానంతట అది వ్యక్తమవుతూ ఉంటుంది. అపరిమితమైన రీతిలో వ్యక్తపరుస్తుంది. దానికి పరిమి తులు లేవు, సరిహద్దులు లేవు. ఇది నీది, నాది కాదు. అది అందరికీ సంబంధించినది. దానిలో నీవు ఒక భాగం. నీవు దాని వ్యక్తీకరణవు. కేవలం పూవు ఒక జీవిత వ్యక్తీకరణలా నీవు మరో జీవితపు వ్యక్తీకరణవు.
What is life?
U.G.KRISHNAMURTHY
Q: But for many of us life is a sacred thing. We struggle to protect our children the environment, to avert another war..
U.G: You are all neurotic people. You talk against birth control, drone on and on about the preciousness of life, then bomb and massacre. It is too absurd.
You are concerned with an unborn life while you are killing thousands and thousands of people by bombing, starvation, poverty and terrorism. Your concern about life is only to make a political issue out of it.
You say life is a movement and you are moving with life, but actually you are manipulating the movement. The movement of life is altogether a differ ent thing.
Why should there be any meaning? You see, the meaning of the question on how to live is totally unrelated to the functioning of this living organism. It is living all the time. It doesn't have to ask the question how to live, so how to live is superimposed on this.
Life, your existence, has a tremendous living quality about it. All your notions about love, infinite bliss and peace only block this natural energy of existence.
What you know does not operate in your life. It has no relevance to the way you are functioning. That is really the crux of the problem.
You will never know what life is. No body can say anything about life. You can give definations, but those definitions have no meaning . You can theorize about life, but that is a thing which is not of any value to you---- it canot help you to understand anything. The question and the questioner are not two different things. When the question burns itself out, what is there is is energy. You can't say anything about that energy---it is already manifesting it self, expressing it self in a boundless way, it has no limitations, no boundaries. It is not yours, not mine; it belongs to everybody. You are put of that. You are an expression of that. Just as the flower is an expression of life, you are another expression of life.
No comments:
Post a Comment