Thursday, 14 April 2022

ఆశ్రమం ఎందుకు ప్రారంభించాలి

 ఆశ్రమం ఎందుకు ప్రారంభించాలి?

ఆశ్రమం వ్యభిచార గృహం మధ్య తేడా ఏమిటి?

వేశ్యలు ఉత్తమం:

వారు కేవలం జీవనోపాధి కోసం తమ శరీరాన్ని అమ్ముకుంటారు.

మీ ఆశ్రమాలలో మీరు గురువులను అమ్ముకుంటారు.

ఇంత చదువుకుని I.A.S. అధికారి, శంకరాచార్యను అమ్మే దాకా ఎందుకు దిగాల్సి వచ్చింది?"


   అందరి ముందు తనను ఎగతాళి చేశారని బ్రహ్మచారిజీ మండిపడ్డారు.

“మహేష్, నేను ఈ మనిషితో ఒక్క నిమిషం కూడా ఉండను.

 మహేష్ అభ్యర్థనలను పట్టించుకోకుండా, ఇంటి నుండి బయటకు వెళ్లాడు.

"యు.జి., బ్రహ్మచారిజీ నిజంగానే కోపంతో వెళ్ళిపోతున్నాడు" అని బిగ్గరగా అరుస్తున్నాడు మహేష్.

కానీ U.G., తన వంతుగా, నిశ్శబ్దంగా, "అతను ఎక్కడికీ వెళ్ళడం లేదు.

అతను తిరిగి వస్తాడు.

చూస్తుండు."


Why start an ashram? 

What's the difference between an ashram and a brothel? 

Prostitutes are better: 

they merely sell their body for a livelihood. 

In your ashrams you sell gurus. 

After so much education and becoming an I.A.S. officer, why did you have to stoop down to selling Sankaracharya?"

Brahmachariji became furious that he was made fun of in front of everyone.

"Mahesh, I am not going to remain with this man for one more minute. 

he said angrily, and without heeding Mahesh's requests, rushed out of the house. 

"U.G., Brahmachariji is really leaving in anger," Mahesh was shouting loudly. 

But U.G., on his part, said quietly, "HE IS NOT GOING ANYWHERE. 

HE WILL COME BACK. 

WAIT AND SEE.”

Wednesday, 13 April 2022

మనస్సు

 

మనస్సు లేదా ఆలోచన మీది లేదా నాది కాదు. ఇది మన ఉమ్మడి వారసత్వం. నీ మనసు, నా మనసు అనేవి ఏవీ లేవు (అది ఆ కోణంలో మనసు ఒక మిథ్య). మనిషికి తెలిసిన, అనుభవించిన, తరతరాలకు అందజేసే వాటన్నింటికీ మొత్తం మనస్సు మాత్రమే ఉంది. ఊపిరి పీల్చుకోవడానికి మనమందరం ఒకే వాతావరణాన్ని పంచుకున్నట్లే మనమందరం ఆ ఆలోచనా గోళంలో ఆలోచిస్తున్నాము మరియు పనిచేస్తున్నాము.

Mind or thought is not yours or mine. It is our common inheritance. There is no such thing as your mind and my mind (it is in that sense mind is a myth). There is only mind, the totality of all that has been known, felt and experienced by man, handed down from generation to generation. We are all thinking and functioning in that thought sphere just as we all share the same atmosphere for breathing.

స్ఫూర్తి

 ప్రేరణ అనేది అర్థం లేని విషయం. చాలా విషయాలు , వ్యక్తులు మీకు స్ఫూర్తినిస్తారు, కానీ ప్రేరణ నుంచి పుట్టిన చర్యలు అర్థరహితమైనవి. కోల్పోయిన, నిరాశ చెందిన వ్యక్తులు ప్రేరణ కోసం మార్కెట్‌ను సృష్టిస్తారు. ప్రేరేపిత చర్యలన్నీ చివరికి మిమ్మల్ని, మీ జాతిని నాశనం చేస్తాయి.' యు.జి

Inspiration is a meaningless thing. So many things and people inspire us, but the actions born out of inspiration are meaningless. Lost and desperate people create a market for inspiration. All inspired action will eventually destroy you and your kind.' U.G

వివాహ వ్యవస్థ

 The institution of  marriage is not going to disappear.  As long as we demand telationships, it will continue  in  some form or other. Basically it is a question of  possessiveness. The institution of marriage will somehow continue  because  it is not  just the relationship  between the two, but children and property  involved.  And  we use property and children as a pretext to give continuity to the institution of marriage.

The problem is so complex and so complicated. It is not so easy for anybody to come up with answers to the age - old  institution  of marriage.

   వివాహవ్యవస్థ కనుమరుగైపోదు. సంబంధాలకు ప్రాధాన్యం ఉన్నంత కాలం, అది ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. ప్రాథమికంగా ఇది possessiveness  కు  సంబంధించిన ప్రశ్న. వివాహవ్యవస్థ ఏదో ఒకవిధంగా కొనసాగుతుంది ఎందుకంటే ఇది ఇద్దరి మధ్య సంబంధం మాత్రమే కాదు. భద్రత అనే భావన ఉంది. పిల్లలు, ఆస్తి ప్రమేయం ఉంది. ఈ వ్యవస్థ కొనసాగింపు ఈ స్థితే కారణం. పిల్లలను ఒక సాకుగా చూపిస్తాము. సమస్య చాలా సంక్లిష్టమై నది .సనాతన వివాహ వ్యవస్థకు సమాధానాలు చెప్పడం ఎవరికీ అంత సులభం కాదు. యు.జి.

మెమరీ కార్డు లోకి చూస్తున్నారు

 You want to live in your world of  MEMORIES and EXPERIENCES. You have NO LIVING CONTACT with anything in the world, not even your wife and children.

     As long as there is this relationship, there is no contact with that; what there is, is only a contact through your past, dead memory of it.You are not looking at it, although your eyes are focused on this object.You are actually looking inside your memory card.

       మీరు మీ జ్ఞాపకాలు, అనుభవాల ప్రపంచంలో జీవించాలనుకుంటున్నారు.ప్రపంచంలో  దేనితోనూ మీకు లివింగ్ కాంటాక్ట్ లేదు. మీ భార్య, పిల్లలతో కూడా కాదు.

      ఈ సంబంధం ఉన్నంత కాలం, దానితో సంబంధం లేదు; అక్కడ ఉన్నది, మీ గతం ద్వారా ఒక పరిచయం మాత్రమే, అది గతించిన జ్ఞాపకం. మీ కళ్ళు ఈ వస్తువుపై కేంద్రీకరించినప్పటికీ, మీరు దానిని చూడటం లేదు.మీరు నిజంగా మీ మెమరీ కార్డ్ లోపలకి చూస్తున్నారు.

అద్భుతమైన జీవి యూజీ

 U.G. was a wonderful creature with a true passion for life, who wanted to let the Life flow, through the way of Life , and he let it flow. He was truly a unique flower. 

Thank you UG !

 Rajesh Kumar 

Location : Himachal Pradesh .

 జీవితం పట్ల నిజమైన అభిరుచి ఉన్న అద్భుతమైన జీవి యు.జి.కృష్ణమూర్తి. అతను జీవిత మార్గం ద్వారా జీవితాన్ని ప్రవహింపజేయాలని కోరుకున్నాడు అతను దానిని ప్రవహించేలా చేశాడు. అతను నిజంగా ఒక ప్రత్యేకమైన పువ్వు.

హాట్సప్ UG!

Monday, 11 April 2022

జేకే నుంచి యు.జి.దాకా

 జె.కృష్ణమూర్తి నుంచి యు.జి.కృష్ణమూర్తి దాకా.....

            యూజీ కృష్ణమూర్తి పుస్తకాలతో పరిచయమై దశాబ్ధమైంది. అంతకు ముందు జిడ్డు కృష్ణమూర్తి లోకంలో విహరించా. జెకె పుస్తకాలు, సీడీలు, ఇష్టాగోష్టులు ప్రధానమయ్యాయి. మొదట జెకె వైపు చూడటానికి కూడా మనస్సు ససేమిరా అంది. నాస్తికత్వం, మార్క్సిజం నేపధ్యం యాక్సెప్ట్ చేయలేదు. తీవ్రమైన ఘర్షణ తర్వాత జెకె ప్రపంచంలోకి ప్రవేశించా. ఇక జెకె నుంచి చూపు తిప్పుకోవడం కష్టమైంది. ఇది జీవితంలో కీలకమైన మలుపు అనే భావన కలిగింది. దశాబ్దం తర్వాత పరిస్థితి మొదటికి వచ్చింది. రెండో కృష్ణమూర్తి యూజీ వచ్చారు. యూజీ వైపు చూడటానికి కూడా జెకె నేపధ్యం ససేమిరా అంది. మళ్లీ ఘర్షణ. చివరకు జెకె స్థానంలో యూజీ సెటిల్ అయ్యారు. యూజీ నుంచి దృష్టి మరల్చడం కష్టమైంది. జీవితంలో ఇది మరో టర్నింగ్ పాయింట్ అనే భావన కలిగింది. 

              జెకె, యుూజీ ..ఇద్దరూ అభిమానులను అనుయాయులుగా అంగీకరించరు. మనకాళ్ల మీదకు మనలను తోసేస్తారు. తమను కూడా తోసేసేంతగా మనలను మనవైపు నెట్టేస్తారు. జెకె ఇచ్చే ఈ ప్రేరణ జెకెను కూడా క్రిటికల్ గా చూసే దృష్టినిస్తుంది. ఈ చూపే యూజీని కలిపింది. ఇద్దరి పట్ల ఆకర్షణకు.. ఇద్దరూ అన్ని రకాల ఆధిపత్యాలను (స్పిరిట్యువల్, సెక్యులర్ ) ధిక్కరించడం, తమతో సహా ప్రతిదాన్ని ప్రశ్నించడం, ఇదే వ్యక్తీకరణ జీవితంలో ప్రతిఫలించడం ప్రధాన కారణం అనిపిస్తుంది. ఇద్దరూ థియొసాఫికల్ సొసైటీ, ఇతర ప్రభావం నుంచి తమదైన మార్గంలోనడవడం లోనే తమదైన ప్రత్యేకత కనిపిస్తుంది. 

                          థియొసాఫికల్ సొసైటీతో పాటు జెకె ప్రభావానికి భిన్నమైన వ్యక్తీరణ, భిన్నమైన నడక యూజీది. జెకె చెప్పే సెల్ఫ్, థాట్, డౌట్, అవేర్ నెస్, సైలెన్స్, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, సీయింగ్ ... ఇలా అనేక కీలక భావనలను యూజీ కొట్టేస్తారు. తనదైన అపూర్వ దృష్టి కోణాన్ని ఇస్తారు. ఇద్దరిలో సామీప్యతలూ ఎక్కువ కనిపిస్తాయి. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ గా, గొప్ప టీచర్ గా జెకె వేసిన మార్గానికి యూజీ కోనసాగింపుగా కనిపిస్తారు. నాకు జెకేను పరిచయం చేసిన గరుతుల్యులు, పెద్దలు శివరామ్ గారు ఇదే భావనను వ్యక్తం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులందరూ జెకె పదాలను వల్లివేసేవారే. అందులో జీవించిన ఏకైక వ్యక్తిగా యూజీ కృష్ణమూర్తి కనిపిస్తారు’ అని అంటారు.


ప్రత్యామ్నాయం చూపడు

 యూజీ ప్రస్తుత విలువల వ్యవస్థ స్థానంలో ప్రత్యామ్నాయాన్ని చూపడు.కానీ మానవ విశ్వాసాల మూలాలలోకి వెళ్లి అతను విశ్లేషించే తీరును నీవు చూడగలిగితే జీవితం గురించి నీవనుకొంటున్న మహోన్న త భావాలు బలవంతంగా నయినా వదిలించుకునేందుకు ప్రయత్నిస్తావు .ఇలా నీవు కొంత వరకు  వెళ్ళగలిగితే,నీ  జీవితాన్ని ఏ ప్రయత్నం లేకుండా సాధారణంగా ఎలా ఉండవచ్చో తెలుసు కోవడానికి అవకా శం ఉంటుంది. ఎందుకంటే విలువల  చట్రాన్ని ఎక్కువకాలం మోయలేవు. 

                కొత్త నమ్మకాల వైపు. మతాల వైపు నిన్ను మళ్ళించడానికి యూజీ ఏమాత్రం ఆసక్తి చూపడు. అపూర్వమైన దృస్టికోణాన్ని ఇస్తాడు. తనను తాను వ్యక్తీకరించుకొంటాడు.తీసుకో, లేకపోతే లేదంటాడు.  నిన్ను     సరైన వ్యక్తిగా తయారు చేయడానికి ఏమాత్రం ప్రయత్నించడు.నిజానికి నీలో మార్పే అవసరం లేదంటాడు. మారాల ని ఎడతెగని ప్రయత్నం   చేయడం  నీ  విషాదం అంటాడు. చాలా సహజంగా జ్ఞానులు, . సాధువులు, మానవాళి రక్షకులు... ఇలా ఎవరో నమూనాగా నీవు ఉండాలనుకొంటావంటాడు.

                లారీమోరీస్ “నాచురల్ స్టేట్” ముందుమాటలో

     “UG does not give you anything to replace your current belief system. But if you see how penetrating his analysis of human belief is, you may be forced to drop many of your most cherished ideas about life. This can free you some extent,and you may find your life becoming simpler not through any effort of yours but simply because you no longer have to carry the burden of so many belief structures. 

         U.G.is not interested in converting you to a new religion or to any belief system whatsoever.He expresses a unique point of view and tells you to take it or leave it.He is not trying to make you into a better person. In fact, he says that you don’t need to change anything and that it is our tragedy that we are constantly trying to change ourselves. Who you are is completely unique, yet you are trying to model yourself after another,usually one of the “ saints,sages,or saviours of mankind”.

             Larry Morris

    

ప్రశాంతత పై యు.జి.

 

     అక్కడ నీలో ఎప్పు డూ అద్బుత మైన  ప్రశాంతత ఉంది. అదే నీ సహజ స్థితి.  దాన్నినీవు ఎప్పటికీ అర్ధం చే సుకోలేవు. నీవు ప్రశాంతమైన మానసిక స్థితిని సృస్టించు కోవడానికి ప్రయత్నిస్తుంటావు. నిజానికి అదే నీలో గందర గో ళానికి దారితీస్తుంది. నీవు కేవలం శాంతి గురించే మాట్లాడుతావు. ప్రశాంతమైన మనస్సును సృష్టించుకుంటావు. అంతా ప్రశాంతంగా ఉన్నట్లు నీకు నీవు చెప్పుకుంటావు. కానీ అదంతా హింస. శాంతిని సాధన చేయడం వల్ల, నిశ్శబ్దం  కోసం నీవు చేసే ప్రయత్నం ఏ మాత్రం ఉపయోగం లేనిది . నిజమైన నిశ్సబ్దం విస్పోటనం. ఆద్యాత్మికవాదులు చెబుతున్న సమాధి స్థితి   ( డెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ )కాదు .అది మెరుపు స్థితి. అదినీటి బుగ్గ. ఆదిశక్తి . అదే  జీవితం. అదే   దాని ప్రయాణం. అదే  సహజ స్థితి

     U.G on Peace

     "You can never understand the tremendous peace that you always there within you, that is your natural state. Your trying to create a peaceful state of mind is in fact creating disturbance within you. You can only talk of peace, create a peaceful state of mind is in fact creating disturbance within you. You can talk of peace, create a state of mind and say to yourself that you are very peaceful —but that is not peace; that is violence. So there is no use practising peace, there is no reason to practise silence. Real silence is explosive; it is not the dead state of mind that spiritual seekers think. ‘ Oh. I am at peace with myself! There is silence, a tremendous silence ! I experience silence! — that doesn’t mean anything at all. This is volcanic in its nature: it’s bubbling all the time— the energy, the life — that is its quality. You may ask how I know. I don’t know. Life is aware of itself, if we can put it that way ."

ఈ భూమిలో యు.జి.పై రాసిన మొదటి ఆర్టికల్

 ఓ దశాబ్దం క్రితం యూజీ పుస్తకాలు పరిచయం అయినపుడు కలిగిన భావాలు ఇవి


                     పొనుగోటి కృష్ణారెడ్డి గారు ఎడిటర్ గా ఉన్న ‘ఈభూమి’ లో వచ్చిన అప్పటి ఆర్టికల్ ఇది

              ఆలోచింపజేసే యూజీ సంభాషణలు

            ఆయన ఏమీ బోధించరు. ఆయనకు అనుయాయులు లేరు. పబ్లిక్ టాక్ ఏమీ లేదు. వేదికలు లేవు. పుస్తకాలు.                   ఏమీ రాయలేదు. సాధన, శిక్షణ అంటూ ఏమీ చెప్పడు. ఒక సామాన్య మానవుడిలా జీవించాడు. అయినా తననొక ఆత్మజ్ఞానం పొందినవాడిలా భావిస్తూ అనేక దేశాల నుంచి అతని వద్జకు వచ్చి అతనితో ఎడతెగని సంభాషణలు జరిపేవారు.  శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, రచయితలు, విద్యావేత్తలు, జర్నలిస్టుల నుంచి సామాన్యుల వరకుఅనేక మంది తనపై పరంపరగా ప్రశ్నలు సంధించేవారు.తాను కేవలం ప్రశ్నల మూలాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించేవారు. 

                 ఈ క్రమంలో ప్రశ్నలే అదృశ్యమై వచ్చిన వారు దిగ్భ్రమకు లోనయ్యేవారు. తను మాత్రం ‘ నా జీవితం, నా మాటలు నీటిమీద రాతలు. మీ లాగా( సారీ మీరు కాదు) మర్యాద, మప్పితంగా మాట్లాడలేను’అంటారు. అయినా ఆయన మాటలు తూటాల్లా పేలాయి. ఆయన జీవితం సంచలనాత్మకం అయింది. ఆయన సంభాషణలు పుస్తకాలు, సీడీల రూపంలో ప్రపంచాన్ని చుట్టాయి. ‘మిస్టిక్ ఆఫ్ ఎన్ లైటెన్ మెంట్’ అనే పుస్తకం యురోపియన్ భాషలన్నింటిలోకి అనువాదమైంది. అనేక ముద్రణలకు నోచుకుంది.ఆ ప్రేరణతో ‘మైండ్ ఈజ్ మిత్’ అనే పుస్తకాన్ని పబ్లిషర్ ప్రచురించారు. ఇంకా ‘అదర్ సైడ్ ఆఫ్ ది ఫాక్ట్ , ‘ది కరేజ్ టు స్టాండ్ ఎలోన్’, థాట్ ఈజ్ యువర్ ఎనిమి’, ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత మహేష్ భట్ రాసిన ‘జీవిత చరిత్ర’ ... ఇలా అనేక పుస్తకాలు వచ్చాయి. 

                    ఇంతగా ప్రభావితం చేసిన ఆయన తెలుగు వాడంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. యూజీగా చిరపరిచితుడైన ఆయన పూర్తి పేరు ఉప్పలూరి గోపాలకృష్ణ.1918 జులై 19 న మచిలీపట్నం పట్నంలో జన్మించారు. తాత థియసాఫికల్ సొసైటీ ప్రపంచ కేంద్ర కార్యాలయం ఉన్న మద్రాస్ లోని అడయార్ లో బాల్యం, విద్యాభ్యాసం గడిచింది. సొసైటీ సారథులైన అనీబి సెంట్, జిడ్డు కృష్ణమూర్తి వారందరితో సాన్నిహితంగా మెలిగారు. అరుణాచలంలోని రమణ మహర్షిని ఒకే ఒకసారి కలిశారు. స్వామి శివానంద వద్ద ఏడు సంవత్సరాలు ప్రతి వేసవిలో హిమాలయాల్లో క్లసికల్ యోగా సాధన చేశారు. థియొసాఫికల్ సొసైటీ అధికార ప్రతినిధిగా ప్రపంచమంతా పర్యటించారు. 

               ఇలా అవిశ్రాంతంగా సాగుతున్న తన వెతుకులాటకు ఒక్కసారి బ్రేక్ పడింది. తాము చెబుతున్నదానికి, జీవితానికి ఏ మాత్రం సంబంధం లేదని థియొసాఫికల్ సొసైటీకి గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు తన 49వ ఏట తనలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. తన స్థితిని ఆథ్యాత్మిక గురువులు చెప్పే ‘ఆత్మసాక్షాత్కారం, లేదా దివ్వ అనుభవంగా యూజీ చెప్పడు. దీనికి భిన్నంగా తన స్థితిని కాలుజారి పడటంగా చెబుతాడు. నా అనుభవం నీకు ఏ మాత్రం సాయపడదంటారు. తనలో వచ్చిన ఈ పెనుమార్పులపై యూజీ ఇలా అంటారు. ‘ ఆత్మజ్ఞానం ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం కోసం అన్ని చోట్లా వెతికాను. కాని అన్వేషణ గురించి ప్రశ్నించలేకపోయాను. ఆత్మజ్ఞానం ఉందని ఊహించి దానిని అందుకోవాలనుకొన్నాను. ఈ అన్వేషణ నన్ను ఉక్కిబిక్కిరి చేసి, నా సహజస్థితి నుంచి నన్ను దూరం చేసింది. ఉనికిలో లేని దాని గురించి జీవితమంతా శోధించి చాలా పిచ్చి పని చేశాను. నా అన్వేషణ ముగిసింది. అని యుజి తనకు తాను భావిస్తాడు. ఇలా మలుపు తిరిగిన తన జీవిత ప్రస్థానం 2008 ఫిబ్రవరి 17లో మరణించే వరకు ఒక సంచలనంగా సాగుతుంది. తను మాత్రం గుర్తు పెట్టుకోదగిన వ్యక్తినే కాదని, అయి సామాన్యుడనని చెబుతారు

                  ‘యూజీ సంభాషణల్లో సైన్సు, మతం, రాజకీయాలు, తత్వశాస్త్రంలోని డొల్లతనాన్ని చెప్పడమే కాక నేరుగా మూలాల్లోకి వెళ్లి, ఎవరినీ ఒప్పించే ప్రయత్నం చేయకుండానే చాలా సాధరణంగా, నిష్కర్షగా, ముఖం మీద గుద్దినట్లు చెప్పడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది ‘ అంటారు ‘మైండ్ ఈజ్ మిత్’ సంపాదకుడు బెర్రీ న్యూలాండ్. 

            -నేనేమి చేయాలి. నీవు వస్తావు. నేను మాట్లాడతాను. నేను నిన్ను విమర్శించాలి.రాళ్లు వేయాలి. ఇదంతా నిష్ప్రయోజనం. నీ చుట్టూ దుర్భేద్యమైన కోటను నిర్మించుకున్నావు. నీవేమి చెదరవు. అనుభూతి చెందవు. నీ స్థితిని అర్థం చేసుకోవడం కష్టం. నీ చర్యలన్నీ నీ గతించిన జ్ఞాపకాల నుంచి సాగుతుంటాయి. ఈ క్షణంలో సంతోషం, అనుభూతుల గురించి మాట్లాడవు. నీ చర్యలను, భావోద్వేగాలను నిరంతరాయంగా విశ్లేషిస్తుంటావు. అదుపు చేస్తుటావు. ఇలా అనుభూతి చెందాను. అలా ఉండాలి అనుకుంటూ భవిష్యత్తులోని పారిపోతుంటావు. నీ సమస్యకు నీ భవిష్యత్తుకు సంబంధం ఉండదు. 

   -బయిటపడటం ఎందుకు సాధ్యపడడం లేదు. నిజంగా స్వార్థం నుంచి బయిటపడాలనుకుంటున్నావా?కానప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతావు. స్వార్థం లేని స్థితి, ప్రశాంతత అనేది చెప్పుకోవడానికే దాని విలువ.నేను చెప్పడం లేదు నీవు స్వార్థపరుడవని. దానికి వ్యతిరేకంగా నీవు అంటున్న స్వార్థరహిత స్థితి కూడా అర్థం లేనిదే. 

       - అర్థవంతమైన, ప్రయోజన పూర్వక సంబంధాల కోసం ఆసక్తి ప్రదర్శిస్తుంటాం. అందువల్ల వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. కాని అర్థం చేసుకోవడానికి వాస్తవం అంటూ ఏమీ లేదు.వాస్తవ ప్రపంచమంటూ ఉంటే అది సమాజం నన్ను నిర్దేశించిందే. వాస్తవ జగత్తును అర్థం చేసుకోవడమంటే అర్థం కోసమో, సహాయం కోసమో, ప్రయోజనం కోసమో కాకుండా ఉండాలి. 

      - మనమంతా జంతువులలాంటి వారమే.వ్యత్యాసం ఏమీ లేదు. దోమ మన రక్తాన్ని పోల్చడం కంటే మనమేమి పవిత్ర ఉద్ధేశం కోసం సృష్టి కాలేద

     - ప్రజలు నన్ను భౌతికవాది అంటారు.నాస్తికుడని కూడా అంటారు. ఎవరు ఎటువంటి ముద్రలు వేసినా వాటిపై నాకే ఆసక్తి లేదు. ఏ విషయంలోను నిన్ను ఒప్పించడానికి, లేదా నా మాటలు నెగ్గించుకోవడానికి ప్రయత్నిచను. ప్రజలు వారికుండే సొంత కారణాల వల్ల నన్ను ఏదో చట్రంలో ఇమడ్చడానికి ప్రయత్నిస్తారు. నేను అతి సామాన్యుడనని చెప్పినా నన్ను ప్రత్యేకంగా చూస్తారు

       - ‘యుజి మాటలతో మన విశ్వాసాల పునాదులు కదిలిపోతాయి. దూసుకు వచ్చే అతని మాటల ప్రవాహానికి మూలం ఎక్కడని నీవు ఆశ్చర్యపోతావు’ అంటారు ‘థాట్ ఈజ్ యువర్ ఎనిమీ’ పుస్తకం ముందు మాటలో ఆంటోనీ పాల్ నోరోన్హా. 

            పోలిక సరైంది కాకపోయిన యూజీ సంభాషణలు వింటుంటే సోక్రటీస్, జపాన్ కు చెందిన పుకోఒకా, జిడ్డు కృష్ణమూర్తి తలంపునకు వస్తారు. మృత్యు ముంగిట్లో కూడా సోక్రటీస్ ఏథెన్స్ ప్రజల నుద్ధేశించి నిర్భీతిగా, నిజాయితీగా మాట్లాడిన తీరు యూజీ సంభాషణల్లో కనిపిస్తుంది. అలాగే జపాన్ కు చెందిన పుకోఒక వ్యవసాయ శాస్త్రవేత్తలతో భూమి స్వభావాన్ని గురించి చెబతున్నపుడు ఎంత అబ్బురపడతామో, మానవ స్వభావంపై యూజీ మాటలు కూడా అంతగా కదిలిస్తాయి. ఇక జిడ్డు కృష్ణమూర్తిని కృష్ణుడి అంశగానో, ఏసుక్రీస్తు అంశగానో భావించి పెంచి పెద్దచేసిన థియొసాఫికల్ సొసైటీ నుంచి జేకే బయటకు వచ్చే ముందు చేసిన ప్రసంగంలోని విజ్ఞత, తెగువ, నిజాయితీ యూజీలో కనిపిస్తుంది.

'వినదగు యూజీ చెప్పిన...' పుస్తక పరిచయం

 ‘పాలపిట్ట’లో  రాసిన ‘వినదగు యూజీ చెప్పిన...’పుస్తక పరిచయం                                                                                ‘వినదగు యూజీ చెప్పిన...’

                   ‘జీవితమంటే నిన్నటిదినాలకు మరణించడం, ఏ క్షణానికి ఆ క్షణం జీవించడం’ అని జీవితాన్ని కవిత్వీకరిస్తాం. జననం మరణం, సుఃఖం, దుఃఖం, హింస, అహింస, ఒక్కటే, వేరు వేరు కాదు.’ అని తాత్వకతతో జీవితం లోతుల్లోకి వెళ్లి వాస్తవ దృశ్యాన్ని అద్వైతంలో చెబుతాం. నిజానికి మనం అలా జీవించం. భావనా ప్రపంచంలో విహరిస్తాం. యూజీ కృష్ణమూర్తి (యూజీ) దీనికి పూర్తి భిన్నంగాఈ 40ఏళ్లు అద్వైత స్థితిలో జీవించాడు. ప్రపంచమంతా పర్యటిస్తూ సందర్శకుల మధ్య తెరచిన పుస్తకంలా జీవితం గడిపాడు. తనుగా ఎవరికీ బోధన చేయలేదు. పైగా దానికి వ్యతిరేకం. ‘ గ్రహింపును ఆశిస్తూ మీరిక్కడకు దయచేస్తారు. ఐతే గ్రహించడానికి ఏమీలేదని స్పష్టం చేయడం పైనే నా ఆసక్తి’ అని యూజీ అంటారు. ఎవరైనా కదిలిస్తేనే మిషన్ గన్ లో నుంచి తూటాల్లా మాటలు దూసుకు వస్తాయి. ద్వంద్వం లేని స్థితిలో ఉన్న యూజీకి ఎదురుగా ఉన్నది చిన్నా పెద్దా, సామాన్యులా, ప్రముఖులా అన్న భేదం కనిపించదు. డిప్లమేటిక్ గా, లాజిక్ గా  మాట్లాడడు.  అందుకే నీవు ఏ అంశంపై అడిగినా    ముఖం మీద గుద్దినట్లు సూటిగా, స్పష్టంగా సమాధానం వస్తుంది. అలా తూటాల్లా పేలిన కొన్ని మాటల సమాహారమే ‘ వినదగు  యూజీ చెప్పిన...’ పుస్తకం. ఎప్పుడూ ఎలాంటి రచనలు చేయని రాజశేఖర్ నుంచి ఈ పుస్తకం వచ్చిందంటే ఆశ్చర్య మనిపిస్తుంది. ‘యూజీ మాటల్లోని స్వచ్ఛత, సూటిదనానికి అబ్బురపడి ఈ పరమ సత్యాలను ఎవరైనా తెలుగు చేస్తే బావుండు’ అని ఆకాంక్షించిన రాజశేఖరే చివరకు ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. ‘ఎవరు ఈ యూజీ’ అని పాఠకుల్లో ఆసక్తిని రేకెత్తించే సంభాషణలతో, యూజీ చిత్రాలతో పుస్తకాన్ని అందంగా తీసుకు వచ్చారు. 

        ఇక యూజీ మాటల ప్రవాహం మనకు నూతన ఆలోచనా విధానం, చిట్కాలు, పద్ధతులను ఇవ్వదు. పైగా నేరుగా మన కాలికింద పట్టాను లాగేస్తుంది. ఆశల్ని తుంచేస్తుంది. విశ్వాసాల పునాధులను కూల్చివేస్తుంది. ఇలా అని యూజీ ప్రత్యామ్నాయం చూపించడు. ఎక్కడా నిలబడడానికి స్థానం లేకుండా చేస్తాడు. ‘విత్తనమే కుళ్లిపోయింది, చెట్టును ట్రిమ్ చేయడం కాదు, మూలాలను కట్ చేయడమే నేను చేసేది’ అంటారు. ఉదాహరణకు ప్రకృతి, ఆధ్యాత్మికత, సంస్కృతి, గురువులు మీద యూజీ స్పందన ఇలా ఉంటుంది. 

        “విలక్షణమైన జీవుల్ని అనంతంగా సృష్టించడంలో ప్రకృతి నిమగ్నమై ఉంది. కాని సంస్కృతి అందరూ ఒకే రీతిలో మసులు కోవాలనే మూసను సృష్టించింది. ఇది ఘోరం. “ 

         “ జీసస్, బుద్ధుడు, లేక కృష్ణుడు లాంటి వారికి ఆదర్శంగా తీసుకొనిఅనుసరించడం వల్ల విలక్షణ వ్వక్తుల్ని పుట్టించగల సృష్టి సామర్థ్యాన్ని నాశనం చేసుకున్నాం.” 

         “దైనందిన విషయాల పట్ల మీ చుట్టూ జరిగే వారి పట్ల ఆసక్తి లేనందున మీరు అతీతం, కాలరహితం, దైవం, సత్యం, జ్ఞానోదయం మొదలైన వాటిని కల్పించుకొని వాటి కోసం వెతుకుతున్నారు.”

         “ మతాధిపతులు ప్రసాదించిన మత పద్ధతిలో నీ ప్రాపంచిక జీవితాన్ని దిద్దుకోవాలనుకుంటే భౌతిక ప్రపంచపు వాస్తవికతను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తూ సామరస్యంగా జీవించే అవకాశాన్ని నాశనం చేసుకోవడమే అవుతుంది.”

          “ నిస్వార్థపరుడవడం కోసం ఏదో చేస్తున్నంత కాలం స్వార్థపరుడుగానే మిగిలిపోతావు.”

           ‘నిన్ను నీవు తెలుసుకో’  అన్నదొక పెద్ద హాస్యోక్తి. ఈ మాట ప్రాచీన జ్ఞానాన్ని పరిరక్షించే పవిత్రాత్ములు మాత్రమే కాదు, ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అంటూనే ఉంటారు. ఆత్మ జ్ఞానం, ఆత్మసాక్షాత్కారం, క్షణ-క్షణం జీవించడం లాంటి చెత్త మాట్లాడడానికి మానసిక శాస్త్రవేత్తలు కూడా ఇష్టపడుతున్నారు.”

                యూజీ ఇలా మనకు తెలిసిన మొత్తాన్ని బద్దలు కొడతాడు. ‘ మారాల్సింది ఏమీ లేదంటూనే వంగిన నడుములపై ఘనమని అనాధిగా మోస్తున్న విలువైన మూటలను ఊడదీయించి ఒక్కో వజ్రాన్ని గులకరాయిగా చూపి  పారేయిస్తాడు మనతోనే. ఊతకర్రల్ని తన్నేసి, ‘భయం లేదు.నిటారుగా నడువ’మంటాడు అని రచయిత రాజశేఖర్ ఈ పుస్తకం ‘నామాట’ లో యూజీ సంభాషణల సారాన్ని ఒక్క మాటలో చక్కగా చెప్పారు.

పరిష్కారమే అసలు సమస్య

 పరిష్కారమే అసలు సమస్య


               పరిష్కారమే నిజమైన సమస్య . అందువల్లే నీ సమస్యలన్నీ కొనసాగుతుంటాయి. ఎందుకంటే తప్పుడు పరిష్కారాలను నీవు కనుగొన్నావు . అక్కడ సమాధానాలు లేకపోతే ప్రశ్నలే ఉండవు .అవి ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ప్రశ్నలు, సమాధానాలు కలిసి ప్రయాణిస్తుంటాయి. ఆ సమాధానాలతో సమస్యలకు ముగింపు పలకలనుకొంటున్నావు. అందువల్ల సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి . రాజకీయ నాయకులు, మానసిక శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవాదులు ... వీరంతా మనముందుంచిన పరిష్కారాలు నిజానికి పరిష్కారాలు కాదు. బాగా ధ్యానం చేయాలని, సాధన చేయాలని, బాగా కష్టపడాలని ప్రోత్సహిస్తుంటారు, ప్రేరణ కలిగిస్తుంటారు. ఇదంతా హింస. నీ నెత్తి మీద కూర్చొని పదే,  పదే చేయిస్తుంటారు. నీ ఆశను, భయాన్ని పక్కకు తోసేయగల్గితే, వారిని కేవలం వ్యాపారస్తులుగా చూడగలిగితే వాళ్ళు ఎప్పటికీ ఈ సరుకును నీ దగ్గర దిగుమతి చేయరు.కానీ ఈ ప్రవీణులు ఇచ్చే బోగస్ సరుకును నీవు పదే, పదే కోరుకుంటావు. నిజానికి అక్కడ సమస్యలు లేవు.అక్కడ కేవలం పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏ మాత్రం పని చేయవని చెప్పే ధైర్యం మనకు లేదు. అవి పని చేయవని కనుగొన్నా సెంటిమెంటు రంగం లోకి వస్తుంది. అతనిమీద నమ్మకం, విశ్వాసం వల్ల అతన్ని తోసేయ లేవు. పరిష్కరాలే సమస్య. నిజానికి అక్కడ సమస్యలు లేవు. నిజమైన సమాధానాలుగా మనం అంగీకరించిన పరిష్కారాల నుంచే ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సమాధానాలు ముగిసిపోవడంతోనే   ప్రశ్నలకు ఒక సమాధానం వస్తుంది. ఒక సమాధానంపోతే మిగతా సమాధానాలు వెళ్ళిపోతాయి.

   The Real Problem Is the Solution

 U.G. KRISHNAMURTHI 

               The real problem is the solution. Your problems continue because of the false solutions you have invented. If the answers are not there the questions can’t be there. There are interdependent; your problems and solutions go together. Because you want to use certain answers to end your problems, those problems continue. The numerous solutions offered by all these holy people, the psychologists, the politicians, are not really solutions at all . That is obvious. They can only exhort you to try harder, practice more mediations, cultivate humility, stand on your head, and more and more of the same. That is all they can do. If you brushed aside your hope, fear, and naivete, and treated these fellows like businessmen, you should see that they do not deliver the goods, and never will. But you go on and on buying these bogus wares offered up by the experts. 


Actually there are no problems, there are only solutions. But you don’t even have the guts to say that they don’t work. Even if you have discovered that they don’t work, sentimentality comes into picture. The feeling, “ That man in whom I have placed my confidence and belief cannot con himself and con everyone else comes in the way of throwing the whole thing out of the window, down the drain. The solutions are still a problem. Actually there is no problems there. The only problem is to find out the inadequacy or uselessness of all the solutions that have been offered to us. The questions naturally are born out of the assumption and answers that we have taken for granted us real answers. But we really don’t want any answers to the questions, because an answer to the questions is the end of the answers. If one answer ends, all the other answers also go;

మతం

మతం

     యు.జి.కృష్ణమూర్తి

      మొత్తం మత ఆలోచన క్రమశిక్షణ పునాదిపై నిర్మితమైంది. నాకు క్రమశిక్షణ అంటే ఒక విధంగా తనను తాను హింసించు కోవడం. మనమందరం మనల్ని మనం హిసించుకునేవాళ్ళం. (Masochists).ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి బాధను ఒక సాధనం అనుకుంటున్నాం. అందువల్ల మనల్ని మనం హింసించుకుంటాం.

     వాస్తవానికి, మొత్తం మత ఆలోచన బాధ పునాదిపై నిర్మితమైంది. మనపై ఆ విధమైన క్రమశిక్షణను విధించే వారు శాడిస్టులు. ఏదో సాధించాలనే ఆశతో మనల్ని మనం హింసించుకుంటున్నాం. ఆలోచనలు, నమ్మకాలకు మనం బానిసలం. వాటిని తోసేయడా నికి సిద్ధంగా లేం. వాటిని తోసేయడంలో విజయం సాధిస్తే, వాటిని మరోనమ్మకం, క్రమశిక్షణతో భర్తీ చేస్తాం.

            చంపడం, చావడం అనేదే మానవ సంస్కృతికి పునాధి అని నేను చెప్తున్నాను. చరిత్రను మొదటి నుంచి చూడడానికి ఆసక్తి ఉన్నట్లయితే, ఎవరు మనతో లేరు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారనే భావనపైనే మానవత్వం పునాది మొత్తం నిర్మితమైందనేది తెలుస్తుంది. అదే మనిషి ఆలోచనలో పనిచేస్తోంది. అందువల్ల పశ్చిమంలో చర్చి, తూర్పున, ఇక్కడా ఇతర మతపరమైన ఆలోచనల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న దేవుని పేరిట చంపడం, చావడం అనేదే నాటి క్రమం. అందుకే ఇక్కడ ఛాందసవాదం ఉంది.

              తూర్పు, పడమర మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం మన మతాలు. మనలాంటి విచిత్రమైన పాత్రలను క్రైస్తవ మతం ఉత్పత్తి చేయలేదు. ఇక్కడ మతం అనేది వ్యక్తిగత వ్యవహారం. ప్రతి ఒక్కరూ తన సొంత దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన ప్రత్యేక వస్తువులను విక్రయిస్తున్నారు. అందుకే ఇక్కడ మనకు భిన్నత్వం ఉంది. ఇది పాశ్చాత్య దేశాలలో లేదు. మన చెప్పే కునే వారసత్వంలో ఈ వెరైటీ నే అత్యంత ఆకర్షణీయమైన భాగం. హిందూ మతం ఒక మతం కాదు. ఇది గందరగోళంగా ఉన్న అనేక విషయాల కలయిక. "హిందూ" పదం అనేది వాడుకలో లేక పోయినా సంస్కృతేతర పదం నుంచి వచ్చింది. మీకు దీని గురించి ఏమీ తెలియదు. దేశంపై దండయాత్ర చేసి బ్రాహ్మణ సామాజిక నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన ఆర్యన్లు స్థానిక భారతీ యులను ముదురు రంగులో ఉన్నట్లు గుర్తించారు. వారి మతా న్ని నల్లజాతి మతం అని పిలిచా రు . స్కాలర్లు, పండితులు నా వివరణను ఇష్టపడకపోవచ్చు, కానీ ఇది సరైనది. చారిత్రాత్మకమైనది.

     విశ్వం కేంద్రంగా మనిషి ఉన్నాడనే మతపరమైన ఆలోచన దాని పుట్టుకలో ఉంది. ఉదాహరణకు, యూదులు, క్రైస్తవులు ప్రతిదీ మనిషి ప్రయోజనం కోసం సృష్టి అయిందని విశ్వసిస్తారు. అందుకే మనిషి ప్రకృతిలో భాగం కాలేడు. అతను విశ్వంలో, మొత్తం సృష్టిలో కేంద్రంగా ఉండాలని కోరుకుంటు న్నందున అతను మొత్తాన్ని కలుషితం చేశాడు, నాశనం చేశాడు.

         మంచితనం, హుందాతనం , అమాయ కత్వం...ఇలా అన్ని సుగుణాలు కలిగి ఉండాలను కుంటున్నావు. భిన్నంగా ఉండాలనుకుటున్నావు, కానీ ఎప్పడు? భవిష్యత్తులో. ఉపాధ్యాయులందరూ ఇదే వాగ్దానం చేస్తారు, కేవలం తదుపరి జీవితం లేదా మరణానం తర జీవితం అంటూ వాగ్దానం చేస్తారు. అప్పటివరకు అతను వ్యాపారంలో ఉంటాడు, అతనికి భరోసా ఉంది. అతను ఏమీ లేదని చెబితే మీరు అతన్ని వదిలివేయం డి. అందుకే నేను ఇబ్బంది పడాల్సి న అవసరం లేదు. మీరు ఏ సందర్భంలోనైనా వెళ్లిపోతారు. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చేది ఖచ్చితంగా మిమ్మల్ని వేరే చోటికి తీసుకెళుతుం ది. ఒక రకమైన తప్పుడు ఆశలు లేదా వాగ్డాల నుంచి ఏదో పొందాల నే ఆసక్తితో ఉన్నావు. ఇక్కడ పొందడానికి ఏమీ లేదు. 

        ప్రాథమికంగా ప్రేరణ అదే: మీరు ఒక కొత్త టీచర్, ఒక కొత్త బైబిల్, కొత్త ఆర్డర్, కొత్త చర్చి కోసం చూస్తున్నారు --- మీరు చేయగలిగేది అదే. ప్రాథమికంగా ఇప్పటికీ అదే ఉంది: మీరు కాథలిక్ చర్చి నుంచి ఒక అడుగు ముందు కు వేయలేదు. మతతత్వం మాత్ర మే మీకు ఆసక్తి అయితే క్రైస్తవ మతం తప్ప మరెక్కడా చూడవల సిన అవసరం లేదు. గొప్ప ఉపా ధ్యాయుల లోతైన ప్రకటనలు వివిధ మతాలలో విభిన్నంగా లేవు. మీరు కొత్త పద్ధతులు, కొత్త వ్యవస్థలు, కొత్త పదబంధాలు నేర్చుకుంటారు, ఆపై మీరు ఈ కొత్త భాష ననుసరించి ఆలోచించడం మాట్లాడటం మొదలు పెడతారు, బహుశా మీరు గొప్పగా భావిస్తారు, కానీ ప్రాథమి కంగా అది ఏమాత్రం అర్థం లేనిది.

      కలగాపులగమైన మనస్సు చాలా విధ్వంసకర విషయాలను సృష్టించింది. అన్నింటిలో దేవుడు అనే భావన అత్యంత విధ్వంసక రమైంది. నాదృష్టిలో దేవుడికి సంబందించిన ప్రశ్న చాలా అసంబద్ద మైంది. అభౌతికమైంది. దేవుడి వల్ల మనకే మాత్రం ప్రయోజనం లేదు.రెండు ప్రపంచ యుద్దాలకంటే దేవుడి పేరుతో జరిగిన హింసాకాండలో ఎక్కువ మంది చనిపోయా రు.పవిత్ర బుద్దభగవానుడి పేరు మీద జపానులో లక్షలాది మంది మరణించారు. ఇదే వరుసలో క్రిస్టియన్లు, ముస్లింలు ఉన్నారు. భారత దేశంలో కూడాఒక్క రోజులో ఐదు వేల మంది జైనులను ఊచకోత కోశారు. నీది కుడా శాంతియుత దేశం కాదు. నీ చిరిత్ర చదువుకో. మొదటి నుంచి హింసే కనబడుతుంది.

          మనిషి కేవలం భౌతిక జీవి. (భయోలాజికల్ బీయింగ్ ). స్వాభావికంగా అతనికి ఆద్యాత్మిక పార్శ్వం లేదు. అన్ని సద్గుణాలు, మార్గదర్సికాలు, నమ్మకాలు , భావాలు, ఆద్యాత్మిక విలువలు, కేవలం డాంబికాలు, అసహజమైనవి. అవేమి నీలో మార్పు తీసుకురాలేవు. నీవిప్పటికీ క్రూరుడవే. `నీవలె నీ పొరుగువాడిని ప్రేమించు` అనే తత్వం వల్ల నీవు జరిపే విచక్షణారహిత హత్యా కాండ ఆగదు. నీ పొరుగువాడిని చంపితే నీకూ అదే గతి పడుతుందనే భయంకరమైన నిజం వల్ల నీవు నరమేధాన్నిఆపుతావు.

           RELIGION

U.G.KRISHNAMURTHi

          whole structure of religious thought is built on the foundation of discipline. Discipline to me means a sort of masochism. We are all masochists. We torture ourselves because we think that suffering is a means to achieve our spiritual goals.

               As a matter of fact, the whole religious thinking is built on the foundation of suffering. Those who impo se that kind of discipline on us are sadists and we are all being masochists in accepti ng that. We torture ourselve s in the hope of achieving something.We are slaves to our ideas and beliefs. We are not ready to throw them out. If we succeed in throwing them out we replace them with another set of beliefs, another body of discipline.

         Very foundation of the human culture is to kill and to be killed. If one is interested in looking at history right from the beginning, the whole foundation of humanity is built on the idea that those who are not with us are against us.That's what is operating in human thinking. 

 To kill and to be killed in the name of God, represented by the church in the West and all the other religious thinking here in the East, was the order of the day. That's why there is fundamentalism.

    U.G.: The only difference between the East and the West is the difference in our religions. Christianity has not produced such weird characters as we have in this country. Here religion is an individual affair. Each one has set up his own shop and is selling his particular wares. That's why we have the variety here, which is lacking in the West. This variety is the most attractive part of our so-called heritage. Hinduism is not a religion. It is a combination and confusion of many things. The actual word "Hindu" comes from a lost non-Sanskrit word no longer in use. You wouldn't know anything about it. The invading Aryans who set up the Brahmanic social structure found the native Indians to have a dark complexion and called their religion the religion of the blacks—the "Hindus". The scholars and pundits may not like my interpretation, but it is correct and historical. 

     Its genesis was in the religious idea that man is at the centre of the universe. For example, the Jews and Christians belive that everything is created for the benefit of man . That is why man is no longer a part of nature. He has polluted, destroyed, and killed off enerything, all on account of his wanting to be at the centre of the universe, of all creation.

      You want to be a good man, a nice man, an innocent man, and all that stuff. You want to be something different, but always in the future. That is what all the teachers promise you, and they just promise, a next life or an afterlife. Till then he is in business, he is assured. If he says there is nothing you leave him. That is why I do not have to bother. You are going to leave in any case because what brings you here will certainly take you somewhere else. You are interested in getting something, some kind of a false hope or promise. Here you are not going to get it.

          Basically the motivation is the same: you are looking for a new teacher, a new Bible, a new order, a new church---that is all you can do. Basically it`s still the same thing: you have not moved one step from the Catholic Church . If religiousness is all you are interested in there is no need to look anywhere other than in Christianity. Thr profound statements of the great teachers are not any different in the different religions. All I am saying is that looking to alien lands and religions does not mean anything. You learn new techniques, new systems, new phrases, and then you beginto think and speak in terms of this new language, and probabuly you feel just great, but basically it does not mean anything at all.

             That messy thing called the mind has created many destructive thing, and by far the most destructive of them all is God. To the question of Godis irrelevant and immaterial. We have no use for God. More people have been killed in the name of God then in the two world wars put together. In Japa, millions of people died in the name of the sacred Buddha. Cristians and Muslims have done the same. Even in India, 5000 Jains were massacred in a single day. Yours is not a peaceful nation. Read your own history- it’s full of violence from the beginning to the?  

          Man is merely a biological being. There is no spiritual side to his nature. There is no such thing ... All the virtues , principles , beliefs, ideas, and spiritual values are mere affectati ons. They haven’t succcee ded in changing anything in you . You are still the brute that you have always been. When will you begin to see the truth that the philosophy of ‘ Love thy neighbour as thyself’ is not what stops you from killing indiscrimina tely but it is the terror of the fact that if you kill your neighbour you too will also be destroyed along with him that stops you from killing.

జీవితం అంటే ఏమిటి

 

జీవితం అంటే ఏమిటి?

             యు.జి.కృష్ణమూర్తి


       ప్ర: మనలో చాలా మందికి జీవితం ఒక పవిత్రమైన విషయం. మన పిల్లలను పర్యావరణాన్ని పరిరక్షించడానికి, మరొక యుద్ధాన్ని నివారించడానికి మేము కష్టపడుతున్నాం....

     యు.జి. : మీరందరూ మానసిక వ్యాధిగ్రస్తులు. బాంబులతో, ఆకలితో, దారిద్ర్యంతో, టెర్రరిజంతో వేల లక్షల మందిని చంపేస్తూ మరో వైపు భావి జీవితం, బర్త్ కంట్రోల్, జీవన మాధుర్యం, జీవిత విలువల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇది చాలా అసంబద్ధం. జీవితంపై మీ కలవరం అంతా కేవలం రాజకీయ సమస్య నుంచి బయిటపడటానికే.

       నీవు చెబుతావు. జీవితం ప్రవాహం. దానితోపాటే నేను కదులుతుంటాను అని. కాని నిజానికి ప్రవాహాన్ని చెదరగొడుతుంటావు. జీవితం కదలిక ఎప్పుడూ భిన్నంగా వుంటుంది. 

         జీవితం అద్భుతమైన క్రమం. ఆలోచన చట్రంలో దాన్ని ఎప్పటికీ అందుకోలేవు.

        జీవితం అనుకుంటున్న దానికి భౌతికంగా దాని అర్ధం దానికుంది. దాన్ని తోసేసి ఆధ్యాత్మిక అర్ధం కల్పించడానికి ప్రయత్నిస్తున్నావు. ఏదైనా అర్ధం ఎందుకుండాలి. జీవించడం కోసం జీవితం వుంది. నీవు ఆధ్యాత్మిక అర్ధం వెతకడంలోనే సమస్య వుంది.

అర్థవతం, ప్రశాంతం, సంపూర్ణం, ఆదర్శవంతంమైన జీవితం...ఇలా పేరుకుపోయిన భావనలు తొలగిపోవాలి. అసలు జీవితం కన్నా వీటి గురించి ఆలోచనకే నీ శక్తులన్నీ వ్యర్ధం అవుతుంటాయి.

        నీవు జీవితం మొదలు పెడితే ఏమి ఆలోచిస్తున్నావు అనేది విషయం కాదు. జీవితం దానంతట అదే సాగుతుంది. ఎలా జీవించాలి అనే ప్రశ్న జీవితానికి ఒక సమస్య అయింది. ఎలా జివించాలనేది జీవితానికి అర్ధం లేనిది. ఎలా అనే ప్రశ్న వచ్చిన మరుక్షణం సమాధానం కోసం ఎవరో ఒకరి మీద ఆధార పడతావు. దీంతో నీమీద స్వారీ చేయడానికి ఆవకాశం తీసుకుంటారు.

        జీవితానికి ఎందుకర్ధం ఉండాలి. ఎలా జీవించాలి అనేది జీవి నడకకు పూర్తిగా సంబంధం లేనిది. అది జివిస్తుంటే ఎలా, ఎప్పుడు అని ప్రశ్నించదు. ఎలా అనేది నీవు నిర్దేశిస్తున్నావు. 

           జీవితం ఏమిటి? ఎవరికీ తెలియదు. మనం చెప్పేదంతా ఊహాజనితం. జీవితం నుంచి, అనుభవం నుంచి అర్ధం చేసుకున్నది జ్ఞానం సహాయంతో చెబుతావు. మన చుట్టూ ఉన్న ప్రజలతో, ప్రపంచంతో మనకున్న సంబంధమే జీవితంఅనుకుంటాం. మనకు తెలిసింది అదే. వాస్తవానికి అది సంబంధం కాదు. 

          నీ జీవితం , దాని ఉనికి అద్భుతమైన జీవన నాణ్యతను కలిగి ఉంది. ప్రేమ, అనంతమైన ఆనందం, శాంతి‌‌...ఈ భావనలన్నీ నీ సహజమైన ఉనికిని అడ్డుకునేవే‌.

         మీకు తెలిసినది మీ జీవితంలో పనిచేయదు. మీ నడకకు దీనికి ఎలాంటి సంబంధం ఉండదు . ఇది నిజంగా సమస్య కు మూలం.

       జీవితం ఏమిటనేది నీవు ఎప్పటికీ తెలుసుకోలేవు. జీవితం గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు. నీవు నిర్వచనాలు ఇస్తావు. అవి అర్ధం లేనివి. జీవితాన్ని సిద్దాంతీకరిస్తావు. అది నీకేమాత్రం విలువైన విషయం కాదు . దేన్నీ అర్ధం చేసుకోడానికి అది నీకు సహాయం చేయదు. ప్రశ్న, ప్రశ్నించేవారు రెండు వేర్వేరు విషయాలు కాదు. ఆ ప్రశ్న తానంతట తాను దగ్దమైతే అక్కడ శక్తి ఉంటుంది. ఆ శక్తి గురించి ఏమీ చెప్పలేరు --- ఇది ఆల్ రెడీ దానంతట అది వ్యక్తమవుతూ ఉంటుంది.‌ అపరిమితమైన రీతిలో వ్యక్తపరుస్తుంది. దానికి పరిమి తులు లేవు, సరిహద్దులు లేవు. ఇది నీది, నాది కాదు. అది అందరికీ సంబంధించినది. దానిలో నీవు ఒక భాగం. నీవు దాని వ్యక్తీకరణవు. కేవలం పూవు ఒక జీవిత వ్యక్తీకరణలా నీవు మరో జీవితపు వ్యక్తీకరణవు.

What is life?

         U.G.KRISHNAMURTHY

Q: But for many of us life is a sacred thing. We struggle to protect our children the environment, to avert another war.. 

   

       U.G: You are all neurotic people. You talk against birth control, drone on and on about the preciousness of life, then bomb and massacre. It is too absurd. 

You are concerned with an unborn life while you are killing thousands and thousands of people by bombing, starvation, poverty and terrorism. Your concern about life is only to make a political issue out of it.

             You say life is a movement and you are moving with life, but actually you are manipulating the movement. The movement of life is altogether a differ ent thing.

       Why should there be any meaning? You see, the meaning of the question on how to live is totally unrelated to the functioning of this living organism. It is living all the time. It doesn't have to ask the question how to live, so how to live is superimposed on this.

             Life, your existence, has a tremendous living quality about it. All your notions about love, infinite bliss and peace only block this natural energy of existence.

         What you know does not operate in your life. It has no relevance to the way you are functioning. That is really the crux of the problem.

        You will never know what life is. No body can say anything about life. You can give definations, but those definitions have no meaning . You can theorize about life, but that is a thing which is not of any value to you---- it canot help you to understand anything. The question and the questioner are not two different things. When the question burns itself out, what is there is is energy. You can't say anything about that energy---it is already manifesting it self, expressing it self in a boundless way, it has no limitations, no boundaries. It is not yours, not mine; it belongs to everybody. You are put of that. You are an expression of that. Just as the flower is an expression of life, you are another expression of life.

శాఖాహారం - ఏమిటి భిన్నత్వం

 

శాకాహారం.... ఏమిటి భిన్నత్వం. యు.జి.


 "పవిత్రం,దైవికం, సంపూర్ణం అని నీవు భావించేదంతా అపరిశుధ్యమే. నీ చైతన్యంలోనే అపరిశుధ్యం ఉంది. శాఖాహారం గురించి మాట్లాడతావు. మరోవైపు లక్షలాది మందిని చంపేస్తావు. ఇది అత్యంత అనైతికం, అమానుషమైన చర్య. నాగరికమైన సంస్కృతికి చెందిన మనుషులు ఇలా ఎప్పుడూ చేయరు. నీవు చూడగలుగుతున్నావా? రెండు అసంబద్ధ వైఖరులను.      

           శాకాహారం.. దేనికోసం. ఏదో ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం? జీవులు ఒకదానిపై ఒకటి పరస్పరంగా ఆధారపడి జీవిస్తాయి. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇది వాస్తవం. మాంసాహారం తీసుకునే దేహంకన్నా నీ దేహం పరిశుద్దంగా,స్వచ్ఛంగా ఉండటానికి అవకాశం లేదు. నీవు భారత దేశంలో ఎక్కడికైనా వెళ్ళు. శాకాహారులను చూడు. వాళ్ళేమీ దయగా, ప్రశాంతంగా ఉండరు. నీవు ఆశ్చర్య పోతావు. మాంసాహారుల కన్నా శాకాహారులు కలహకారులుగా ,దూకుడుగా ఉంటారు.భారత దేశ చరిత్ర చదువుకో. మొత్తం రక్తం చరిత్రే. నరమేధం, హత్యలే కనిపిస్తాయి. మొత్తం మతం పేరున జరిగినవే. అందువల్ల ఆధ్యాత్మికతతో చేసేదేమీ లేదు. మాంసాహారానికి, శాకాహారానికి ఏమిటి భిన్నత్వం. జీవులు పరస్పరం ఆధారపడి జీవిస్తుంటాయి.నీ దేహం మీద ఎన్ని సూక్ష్మజీవులు దోగాడుతున్నాయి. అవన్నీ నీ మీదే జీవిస్తున్నాయి‌.

           నీవు ఏమి విశ్వసిస్తావో దాన్నే విశ్వసించు. అలాగే కొందరికి నమ్మకాలు ఉంటాయి. ఇది ప్రజల విశ్వాసాలకు సంబంధించింది. ఒక నమ్మకం స్థానంలో మరో నమ్మకం చేరుతుంది. భావాలను ఆరగించు. నీ పొట్టలోకి భావాలనే పంపించు.మంచి భావాలను తీసుకో ...గుడ్ లక్. 

   ఎలా జీవించాలి? ఏమి తినాలి అని అడిగిన మరుక్షణం నీవు సమస్యను సృష్టిస్తున్నాను. ఇది మొత్తం సంస్కృతి. నీ అభిరుచులన్నీ రుచులను కల్పిస్తుంటాయి.   నీవు ఏమి తింటావనేది దేహానికి తెలియదు. అవసరానికి మించి తీసుకున్నపుడే ఈ దేహానికి సమస్య వస్తుంది. నీవు సంతోషం కోసం తింటావు. తినడం అనేదానిలో కూడా ఆనందాన్ని వెతుక్కునే స్థితికి వచ్చావు."

       Is there anything to vegetarianism

If I talk of vegetarianism and kill millions of people,that is the most immoral, unpardonable act that a civilized culture of human beings can ever do. Do you see the absurdity of the two? 

       Vegetarianism for what? For some spiritual goals? One form of life lies off another. That's a fact, whether you like it or not. Your body is not going to be any more pure than the meat-eating body. you go to India, those that have been vegetarian, they are not kind, they are not peaceful. You will be surprised. Vegetarians can be more aggressive than the meat eaters. Read the history of India- it is full of bloodshed, massacres, and assassinations-all in the name of religion. So it has nothing to do with spirtuality. What you put in there (stumach) is not really problem. One form of life lives on another form of life. How money millions of bacteria are crawling all your body.

You can believe whatever you want to believe. Some one else believes something else. It is belief that to matters to people. You replace one belief with another. You eat ideas. You put ideas in your stumach. You can eat good ideas. Good luck to you. 

The moment you ask, 'How to live' and 'What to eat? ' you have created a problem ... Everything is cultural. All your tastes are cultivated tastes. The body does not know what you are eating. The problem is you eat more than what the body needs. You eat for pleasure. Eating has become a pleasure-seeking moment of life.