మన అస్తిత్వానికి సంబంధించిన వాస్తవం, లేదా ప్రపంచ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడం సాధ్యమనే మన అంగీకారం నుంచే అన్ని సమస్యలూ వస్తాయి . నేను చెప్పేది నీకు తెలియని దాని నుంచి ఎటువంటి అనుభవాన్ని పొందే మార్గం లేదు. నీ జ్ఞానం ద్వారా నీవు పొందే ఏ అనుభవమైనా అది ఫలితాన్నివ్వదు .అది యుద్ధంలో ఓటమే. మన ఉనికి , ప్రపంచ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి మనం ఉపయోగించే ఆయుధంతో ఈ దేహం నడకకు సంబంధం ఉండదు . అందువల్ల ఆలోచనలు ఏవి స్వయంప్రకాశం కాదు , తక్షణంలో ఉండవని చెబుతుంటాను.
Tuesday, 13 November 2012
Sunday, 11 November 2012
Mind is myth
అన్ కండిషన్డ్ మైండ్ అంటూ ఏమీ ఉండదు. మైండ్ కండిషన్ అయి ఉంటుంది. ఇది అసంబద్ధమైంది. మైండ్ అంటూ ఉంటే అది కండిషన్లోనే ఉంటుంది. ఓపెన్ మైండ్ అంటూ ఏమీ లేదు . నాకు సంబంధించి మైండే లేదు . మనస్సు అనేది భ్రమ. మైండ్ అనేదే లేక పోవడం వల్ల మ్యుటేషన్ అని జే కృష్ణమూర్తి మాట్లాడేది అర్ధం లేనిది. విప్లవాత్మకంగా గాని మరో విధంగా గాని పరివర్తన చెందడానికి అక్కడ ఏమీ లేదు . అక్కడ రీలైజ్ అవడానికి సేల్ఫే లేదు.ఈ పునాది మీద నిర్మితమైన మొత్తం మత వ్యవస్థ కూలిపోయింది . అందువల్ల అక్కడ రీలైజ్ అవడానికి ఏమీ లేదు.
`మైండ్ లేదు' అనే తాత్విక పునాది పైనే మొత్తం బుద్ధ తత్వం నిర్మితమై ఉంది.అయినా మైండ్ నుంచి స్వేచ్చను పొందడానికి అద్భతమైన చిట్కాలు సృష్టించారు. అన్ని రకాల జెన్ ధ్యాన పద్ధతులతో మనస్సు నుంచి విముక్తమవడానికి సర్వదా ప్రయత్నిస్తుంటారు. కానీ మనస్సు నుంచి స్వేచ్చను పొందడానికి ఉపయోగించే ఆయుధం మనస్సే . మైండ్ తప్ప మరో ఆయుధం కూడా లేదు. ప్రతి దాన్ని అర్ధం చేసుకోవడానికి మైండ్ ఆయుధం కాదని,మరో ఆయుధం కూడా లేదని ధృశ్చకంగా గాని యాధృశ్చకంగా గానీ గ్రహించ గలిగితే అది మెరుపులాగా నిన్ను తాకుతుంది. మైండ్ కు బాడీ కి మధ్య విభజన తొలగి పోతుంది. నిజానికి అక్కడ విభజన లేదు.
`మైండ్ లేదు' అనే తాత్విక పునాది పైనే మొత్తం బుద్ధ తత్వం నిర్మితమై ఉంది.అయినా మైండ్ నుంచి స్వేచ్చను పొందడానికి అద్భతమైన చిట్కాలు సృష్టించారు. అన్ని రకాల జెన్ ధ్యాన పద్ధతులతో మనస్సు నుంచి విముక్తమవడానికి సర్వదా ప్రయత్నిస్తుంటారు. కానీ మనస్సు నుంచి స్వేచ్చను పొందడానికి ఉపయోగించే ఆయుధం మనస్సే . మైండ్ తప్ప మరో ఆయుధం కూడా లేదు. ప్రతి దాన్ని అర్ధం చేసుకోవడానికి మైండ్ ఆయుధం కాదని,మరో ఆయుధం కూడా లేదని ధృశ్చకంగా గాని యాధృశ్చకంగా గానీ గ్రహించ గలిగితే అది మెరుపులాగా నిన్ను తాకుతుంది. మైండ్ కు బాడీ కి మధ్య విభజన తొలగి పోతుంది. నిజానికి అక్కడ విభజన లేదు.
Saturday, 10 November 2012
Biography
నా జీవిత చరిత్ర ఎందుకు ? చెప్పడానికి స్టోరీనే లేదని చెప్పే వ్యక్తి జీవిత చరిత్ర ఎలా రాయలనుకొంటున్నావు . నా జీవిత చరిత్ర ఎప్పటికీ చెప్పేది కాదు. జీవిత చరిత్రలు చదివే ఆసక్తి ఉన్న వారికి నిజంగా నిరుత్చాహ పరుస్తుంది .వారి జీవితాలను మెరుగుపరుచుకునేందుకు,నా జీవితం ద్వారా మార్పునకు ఎదురు చూసేవారికి ఆ అవకాశం దొరకదు. సోలోమన్ గండి `అంటూ పిల్లలు పాడుకొనే రైమ్స్ లో నా జీవితాన్ని చక్కగా చేర్చవచ్చు. నీ, నా ,లేదా మరెవరి జీవితం అయినా కేవలం అది ఒక బెరడు లాంటిది. అంతకు మించి దానికి అర్ధం లేదు.
మహేష్ భట్ తో ug
మహేష్ భట్ తో ug
Not living
ఏ సమయంలో కూడా మనం జీవించం . భావనా ప్రపంచంలో బతుకుతాం . అవన్నీ మృత ప్రాయం అయినవి .అక్కడ కొత్తదనం ఉండదు. ఆలోచన ప్రవాహం ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. వేల సంవత్సరాలుగా వస్తున్న గమనం.దీనికి మొదలంటూ లేదు.అందుకే బైబిల్ చెబుతుంది... ఆదియందు వాఖ్యముండును ఆని. అది ఎప్పుడు మొదలయిందో మనకు తెలియదు. మన నడకను మనం అర్ధం చేసుకోవాలంటే ఆలోచన క్రమాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది . అసలు నీవు బతికే ఉన్నవని నీకు ఎలా తెలుసు.దాన్ని కూడా నీ ఆలోచన , నీ భావన ద్వారానే నిన్ను నీవు తెలుసుకొంటావు.
Wednesday, 8 August 2012
God is irrelevant
దేవుడి నుంచి మనిషి రక్షింపబడాలి. ఇది చాలా ప్రధానమైంది. ఎందుకంటే నీవు ఉపయోగించే `దేవుడు ' అనే పదం అర్ధంలో నేను చెప్పడం లేదు.దెవుడు అనే భావన అనేక అంశాలతో ముడిబడి ఉంది. కర్మ, పునర్జన్మ, కొత్త అవతారం, జీవితం తర్వాత ...ఇలా విషయమంతా , మొత్తం వ్యాపారం ...గొప్ప భారతీయ వారసత్వం అని నీవు చెప్పేదంతా దేవుడు అనే భావనకు సంబంధించినదే. ఈ మొత్తాన్ని చూడాలి. మనిషి భారతీయ వారసత్వం నుంచి బయటపడాలి. ప్రజలే కాదు మొత్తం దేశమంతా ఈ వారసత్వం నుంచి రక్షింప బడాలి.లేకపోతే వ్యక్తిగతంగా గాని ,దేశానికీ గాని భవిష్యత్తు లేదు .
గందర గోళంగా ఉండే మనస్సు చాలా విధ్వంసకరమైన వాటిని సృష్టించింది.వీటిలో అత్యంత విధ్వంసకరమైంది '.దెవుడు'. నా దృష్టిలో దేవుడికి సంబంధించిన ప్రశ్న అసంబద్ధం. అభౌతికమైంది.దేవుడి వల్ల మనకేమాత్రం ప్రయోజనం లేదు.రెండుప్రపంచ యుద్ధాల కంటే ఎక్కువ మందిని దేవుడి పేరుతో చంపేశాం.జపాన్ లో బుద్ధ భగవానుడి పేరు మీద లక్షల మంది చనిపోయారు.ఇదే వరుసలో క్రిస్తియన్లు, ముస్లింలు ఉన్నారు. భారత దేశంలో కూడా ఒక్క రోజులో ఐదు వేల మంది సిక్కులను ఊచ కోత కోశారు. మీది కూడా శాంతియుత దేశంకాదు. నీ చరిత్ర చదువుకో. మొదటి నుంచి చివరివరకు మొత్తం హింసే కనబడుతుంది .
మనిషి బౌతిక జివి. స్వాభావికంగా అతనికి ఆధ్యాత్మిక పార్శ్వం లేదు. పవిత్ర విలువలు, సూత్రాలు, నమ్మకాలూ ,ఆధ్యాత్మిక విలువలు కేవలం డాంబికాలు. ఇవి నీలో ఏమాత్రం మార్పు తీసుకు రాలేవు. నీవు ఇప్పటికీ క్రూరుడివే. ఇదే ప్రవృత్తి ఎప్పుడు కలిగివుంటావు. 'నీకు మల్లె నీ పొరుగు వాడిని ప్రేమించు' అనే తత్వభోదన నీ విచక్షణారహిత మారణకాండను ఆపలేదు. నీ పొరుగువాడిని చంపితే నీకూ అదే గతి పడుతుందనే భయంకర నిజం వలన నీవు హత్యా కాండను ఆపుతావు.
మనిషి బౌతిక జివి. స్వాభావికంగా అతనికి ఆధ్యాత్మిక పార్శ్వం లేదు. పవిత్ర విలువలు, సూత్రాలు, నమ్మకాలూ ,ఆధ్యాత్మిక విలువలు కేవలం డాంబికాలు. ఇవి నీలో ఏమాత్రం మార్పు తీసుకు రాలేవు. నీవు ఇప్పటికీ క్రూరుడివే. ఇదే ప్రవృత్తి ఎప్పుడు కలిగివుంటావు. 'నీకు మల్లె నీ పొరుగు వాడిని ప్రేమించు' అనే తత్వభోదన నీ విచక్షణారహిత మారణకాండను ఆపలేదు. నీ పొరుగువాడిని చంపితే నీకూ అదే గతి పడుతుందనే భయంకర నిజం వలన నీవు హత్యా కాండను ఆపుతావు.
Saturday, 28 July 2012
Real problem is solution
పరిష్కారమే నిజమైన సమస్య . అందువల్లే నీ సమస్యలన్నీ కొనసాగుతుంటాయి. ఎందుకంటే తప్పుడు పరిష్కారాలను నీవు కనుగొన్నావు . అక్కడ సమాధానాలు లేకపోతే ప్రశ్నలే ఉండవు .అవి ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ప్రశ్నలు, సమాధానాలు కలిసి ప్రయాణిస్తుంటాయి. ఆ సమాధానాలతో సమస్యలకు ముగింపు పలకలనుకొంటున్నావు. అందువల్ల సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి . రాజకీయ నాయకులు, మానసిక శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవాదులు ... వీరంతా మనముందుంచిన పరిష్కారాలు నిజానికి పరిష్కారాలు కాదు. బాగా ధ్యానం చేయాలని, సాధన చేయాలని, బాగా కష్టపడాలని ప్రోత్సహిస్తుంటారు, ప్రేరణ కలిగిస్తుంటారు. ఇదంతా హింస. నీ నెత్తి మీద కూర్చొని పదే, పదే చేయిస్తుంటారు. నీ ఆశను, భయాన్ని పక్కకు తోసేయగల్గితే, వారిని కేవలం వ్యాపారస్తులుగా చూడగలిగితే వాళ్ళు ఎప్పటికీ ఈ సరుకును నీ దగ్గర దిగుమతి చేయరు.కానీ ఈ ప్రవీణులు ఇచ్చే బోగస్ సరుకును నీవు పదే, పదే కోరుకుంటావు. నిజానికి అక్కడ సమస్యలు లేవు.అక్కడ కేవలం పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏ మాత్రం పని చేయవని చెప్పే ధైర్యం మనకు లేదు. అవి పని చేయవని కనుగొన్నా సెంటిమెంటు రంగం లోకి వస్తుంది. అతనిమీద నమ్మకం, విశ్వాసం వల్ల అతన్ని తోసేయ లేవు. పరిష్కరాలే సమస్య. నిజానికి అక్కడ సమస్యలు లేవు. నిజమైన సమాధానాలుగా మనం అంగీకరించిన పరిష్కారాల నుంచే ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సమాధానాలు ముగిసిపోవడంతోనే ప్రశ్నలకు ఒక సమాధానం వస్తుంది. ఒక సమాధానంపోతే మిగతా సమాధానాలు వెళ్ళిపోతాయి.
అందం Beauty
అందం అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది?వస్తువులో ఉందా ?చూసే కళ్లల్లో ఉందా ?నీవు చుసే వస్తువు పైకి అందంఫై నీ కున్న భావనను ప్రసరింప జేస్తున్నావు. అంతే. అక్కడ సూర్యోదయం అందంగా ఉంది అని నీకు నీవు అనుకున్న క్షణంలో నీవు సన్ సెట్ ను చూడడంలేదని అర్థం . అందం అనేది వస్తువులో లేదు. అది చూసే కళ్ళకు సంబంధించింది కూడా కాదు.ఇదంతా నిన్ను నీవు పూర్తిగా పరిత్యజించడం.అందువల్ల అందం అంటే ఏమిటి ? నిజంగా నీకు తెలియదు.నీవు ఏమి చూస్తున్నావో నీకు తెలియదు. ఆ స్థితిలో నీకు ఏమీ తెలియదు.నీవు అందం అని పిలవవచ్చు.కానీ అది అందం అని దాన్ని నేను ఆనందిస్తున్నానని ఎవరూ చెప్పలేరు.నిజానికి సూర్యోదయాన్ని చూసే మార్గం లేదు . నీవు దాన్నించి విడిగా లేవు .ఎప్పుడయితే నీవు సూర్యోదయం నుంచి విడిపోయావో ఆ క్షణంలో నీలో కవి బయటకు వస్తాడు. కవులు ,చిత్రకారులు ఇలా విడిపోయి వారికి వారు వ్యక్తీకరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఇదే సంస్కృతి, నాగరికత .
Subscribe to:
Posts (Atom)