Monday, 6 September 2021

అత్యంత సంపూర్ణమైన మనిషి

 

యూజీ అత్యంత సంపూర్ణమైన మనిషి: పర్వీన్ బాబి


     యూజీ అత్యంత సంపూర్ణమైన మనిషి.నా జీవితంలో ఇటువంటి వ్యక్తిని చూడలేదు. అక్కడ అసాధారణంగా బయటకు ఏమీ కనిపించడు. అతనితో కొంత సమయం గడిపితే ఆ సంపూర్ణ నడకను నీవు చూస్తావు. నేను యూజీతో కలిసి జీవించాను, ప్రయాణించాను. యూజీతో ఉన్న నిర్దిష్టమైన సమయం తరువాత నేను గ్రహించింది...యూజీ ప్రతి మనిషిని ఒక మనిషిగా చూస్తాడు. ఎవరినైనా తనతో సమానంగా చూస్తాడు. గౌరవిస్తాడు. పరిగణిస్తాడు. అర్ధం చేసుకుంటాడు. ప్రేమిస్తాడు. మరో విషయం ... చిన్న. పెద్ద, పేద, ధనిక ఎవరినైనా తనతో సమానంగా చూస్తాడు. మనందరం బందుత్వాలు, మన పైన, కింద అంటూ చూస్తాం. మనతో సమానంగా చూడం. అతని ప్రవర్తన అతని సహజ స్వభావం నుంచి వచ్చిందే. ఇలా ఉండడం  అతను ప్రయత్నించేది కాదు. లేదా ప్రత్యేకమైన వ్యక్తిగా అతను, అతని ప్రవర్తన ఉండదు. 

                    మరో ముఖ్యమైన సుగుణం... ఎప్పుడూ ఎవరినీ తనస్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోడు. మాములుగా తాను తీసుకోవడంకంటే ఇచ్చేదే ఎక్కువగా ఉంటుంది. ఏమీ ఆశించకుండా అతను తిరిగి ఇస్తాడు. చాలా సందర్బాల్లో తీసుకునే వ్యక్తి గ్రహించలేనంతగా నిశ్శబ్దంగా, నిస్వార్ధంగా ఇస్తుంటాడు. ఎంత కఠోర సత్యమైనా అది ఎదుటి వారికి ప్రయోజనం అనిపిస్తే నిర్మొహమాటంగా చెబుతారు. నిజాన్ని చెప్పడం వల్ల ఇంకొకరికి ఉపకారమని భావిస్తే వారితో స్నేహం పోతుందన్నా లెక్కచేయరు. 

           తన స్వప్రయోజనా లకోసం ఎవరినీ అవకాశంగా తీసుకోవడం, మోసం చేయడం, తప్పుదారి పట్టించడం, ఉపయోగించు కోవడం, వ్యక్తిని, లేదా పరిస్థితులను అవకాశంగా తీసుకోవడం నేనెప్పుడు చూడలేదు. నిస్సహాయ స్థితిలో కుడా యూజీ అలా ప్రవర్తించలేదు. ఇలా ఎవరి గురించి అయినా చెప్పడానికి ప్రపంచంలో ఎవరూ తారసపడలేదు.


U.G...Most perfect human being: Parveen Babi

        U.G. is the most perfect human being I have ever met in my life. There is noting apparently extraordinarily about him. It is when you spend some time with him that you see the perfection operating. I have lived and travelled with U. G. And after being with him for a substantial period of time I have realised that U.G. treats human beings as human beings should be treated-with respect, consideration, understanding and compassion. I also realise that he treats everybody as his equal—whether the person is younger, poorer, richer or older. We all treat people as relations either above us or below us. We do not treat them as our equals. His behavior comes naturally to come. He does not make a deliberate effort to act this way, nor is his behaviour accompanied by the feeling that he is a special person, that his behaviour is special and that is doing people a favour

      Another most special quality about U. G. is that he never uses people for his personal gain. U.G. Personally gives back much more then he receives. And his giving is the purest kind of giving. He gives without expecting anything back in return. He gives silently and so selflessly that oftentimes, even the receiver does not realise that he has received. If he feels it is necessary to state the bitter truth for a person’s good, he states it. He can state the bitter truth because he does not mind losing the person’s friendship, if it helps the person. 

          I have never seen U.G. take advantage of anybody, cheat anybody, mislead anybody, use anybody, or take advantage of a person or situation for his personal gain even in the most insignificant way. Apart from U.G., I am afraid I cannot say this of anybody else I have come across in the world.


                           

సహజస్థితి

 సహజ స్థితి: యు.జి. కృష్ణమూర్తి


         అక్కడ నీలో ఎప్పు డూ అద్భుతమైన ప్రశాంతత ఉంది. అదే నీ సహజ స్థితి. దాన్నినీవు ఎప్పటికీ అర్ధం చేసుకోలేవు. నీవు ప్రశాంతమైన 

మానసిక స్థితిని సృష్టించు కోవడానికి ప్రయత్నిస్తుంటావు. నిజానికి అదే నీలో గందర గోళానికి దారితీస్తుంది. నీవు కేవలం శాంతి గురించే మాట్లాడుతావు. ప్రశాంతమైన మనస్సును సృష్టించుకుంటావు. అంతా ప్రశాంతంగా ఉన్నట్లు నీకు నీవు చెప్పుకుంటావు. కానీ అదంతా హింస. శాంతిని సాధన చేయడం వల్ల, నిశ్శబ్దం కోసం నీవు చేసే ప్రయత్నం ఏ మాత్రం ఉపయోగం లేనిది . నిజమైన నిశ్సబ్దం విస్ఫోటనం. ఆథ్యాత్మిక వాదులు చెబుతున్న సమాధి స్థితి ( డెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ )కాదు .అది మెరుపు స్థితి. అదినీటి బుగ్గ. ఆదిశక్తి . అదే జీవితం. అదే దాని ప్రయాణం. అదే సహజ స్థితి. 

>అఫెక్షన్ అంటే ప్రతిదానికి కదిలిపోవడం. అది ఒక దాని వైపు ఉద్యేగంగా వెళ్ళడం కాదు.సహజ స్థితి అనేది గొప్ప సునిశితమైన స్థితి. ఇంద్రియాలకు సంబంధించిన భౌతిక సునిసితత్వం ఇది. ఇది నాపట్ల ఇతరుల పట్ల ఉద్వేగ పరంగా కరుణ, లేదా దయగా ఉండడమనే ప్రక్రియ కాదు. ఇక్కడ విభజన ఉండదు. 

నీ సహజ స్థితికి ఆధ్యాత్మిక స్థితులైన ఆనందం, బ్రహ్మానందం, ఆనందప్రవాహం ...వంటి వాటితో ఏ మాత్రం సంబంధం లేదు. అవన్నీ అనుభవం పరిధిలోకి వస్తాయి. నాకు తెలిసి ఉన్నదంతా స్వచ్చమైన భౌతికక్రమం . ఇందులో మార్మికత, ఆధ్యాత్మికత ఏమీ లేదు.


  NATURAL STATE: U.G.KRISHNAMURTHI


                You can never understand the tremendous peace that you always there within you, that is your natural state. Your trying to create a peaceful state of mind is in fact creating disturbance within you. You can only talk of peace, create a peaceful state of mind is in fact creating disturbance within you. You can talk of peace, create a state of mind and say to yourself that you are very peaceful —but that is not peace; that is violence. So there is no use practising peace, there is no reason to practise silence. Real silence is explosive; it is not the dead state of mind that spiritual seekers think. ‘ Oh. I am at peace with myself! There is silence, a tremendous silence ! I experience silence! — that doesn’t mean anything at all. This is volcanic in its nature: it’s bubbling all the time— the energy, the life — that is its quality. 

                Affection means that your effected by everything, not that some emotion flows from you towards something. The natural state of great sensitivity of the senses, not some kind of emotional compassion or tenderness for others. There is compassion only in the sense that there are no others for me and so there is no separation. 

         Your natural state has no relationship whatsoever with the religious states of bliss and ecstasy. They lie within the field of experience. To me what does exist is a purely physical process. There is nothing mystical or spiritual about it.

అప్పుడు యు.జి‌ని కలుస్తావు


అప్పుడు నీవు యూజీని కలుస్తావు. విజయ్ ఆనంద్, ఫిలిం డైరెక్టర్


           యూజీ టిచర్ కాదు. నీ సొంత టిచర్ నీకు శత్రువు అయినపుడు ఇతడు నీకు స్నేహితుడు అవుతాడు.


                      మన జీవితాలు తీవ్రమైన సమస్యల్లోకి వెళ్ళినపుడు ...మేధోపరమైన సమస్యలు కాదు, భావోద్వేగమైనవి ఎదురైనపుడు ఆ సమస్యలను నీవు ఎదుర్కోలేని క్షణాలు ఎదురవుతాయి. నీకు ఏ సహాయం అందదు. నీకు నీవుగా ఏమీ చేయలేవు. అప్పుడు ఖురాన్, బైబిల్, గీత వంటి ఆధ్యాత్మిక  పుస్తకాల వైపు చూస్తావు. అకస్మాత్తుగా అవి కొంత స్వాంతన ఇస్తాయి.  కానీ అవి తాత్కాలికం. నీవు మళ్లీ అవే పుస్తకాలు చదువుతావు. అవి నిన్ను కొంత సేపు బయట పడేస్తాయి. ఇలా జరుగుతుంటుంది. ఈ క్రమలో చివరకు ఈ పదాలు కూడా మృత ప్రాయంగా కనిపిస్తాయి. ఈ పుస్తకాలు కూడా ఎందుకు పనిచేయడం లేదనే ప్రశ్న వస్తుంది. ఎప్పుడైతే ఈ పుస్తకాలు ఫెయిల్ అయ్యయో అప్పుడు టిచర్ కోసం చూడడం మొదలవుతుంది. వృత్తిలో ఇబ్బంది ఎదురైతే ఒక నిపుణుడి దగ్గరకు వెళతాం. ఆరోగ్య సమస్య అయితే డాక్టర్ దగ్గరకు వెళతాం. ఇటువంటి సమస్య ఎదురైనపుడు రజనీష్, డీ ఫ్రీజాన్, జె.కృష్ణ మూర్తి వంటి వారి దగ్గరకు వెళతాం. ప్రారంభంలో వారి సహాయాన్ని గుర్తిస్తావు. వారు నీకు జీవన మార్గాన్ని ఇస్తారు. కొంత ధ్యానం, కొంత తాత్వికత..., ఇవన్నీ తాత్కాలికంగా నీ ఖాళీలను పురిస్తాయి.ఒక సమాధానం దొరికిందని భావిస్తావు. ఈ ధ్యానం చేసినంత కాల చింతన తొలగిపోతుంది. ఎప్పుడైతే ఇది ఆగిపోతుందో నీకు నివే మిగలిపోతావు. మళ్లీ సమస్య దగ్గరకే వస్తావు.  అందువల్ల నిజంగా నీకు సమాధానం కనబడదు. నీకు నీవు ఎంత కష్ట పడినా ఇంకా చేయాలని  ఇక్కడ టీచర్  చెబుతాడు. దీంతో రెండింతలు నీవు కష్ట పడటానికి ప్రయత్నిస్తావు. ఇదంతా పడగడుపులా అవుతుంది. నీకు నీవు నిజాయతీగా ఉన్నా ఎక్కడా ఏమీ పొందలేమని గ్రహిస్తావు. దీంతో నీవు ఆగిపోతావు. అప్పుడు నీవు యూజీని కలుస్తావు.

               There are moments in our lives when we go through a crisis—not an intellectual crisis but an emotional crisis, when you cannot cope with the suffering. Since no help is coming and you cannot help yourself, that is when you turn to the religious books like Koran, the Gita, or the Bible. You suddenly feel that you get solace. But that solace does not last. You read the books again. They give you exhilaration for an hour or so. Again it wears out. This goes on. And then you feel that probably these are dead words. That’s why the books are not working. So when these books fail, that is the time when you start looking for a teacher. If there is a profession, you go to an expert. If there is a problem with your health, you go to the doctor. When you have a crisis of this kind, you are likely to go to people like Rajneesh, Da Free John, and J. Krishnamurthi. You do find initially that they help. These people give you a way of life. Certain meditation, certain philosophy which fills you up for a short while. You feel as if you have got an answer. As long as you do to meditation, it seems that the crisis has passed away. But the moment you stop and you are with yourself, you are back to the crisis. So you really have found no solution. Here the teacher tells you that you have not done enough of whatever you are supposed to do. So you go back and put in double the effort. This is a kind of forgetfulness like drinking. If you are not getting anywhere. You are stuck. This is when you should meet U. G..

              

దేవుడు

దేవుడు ..అసంబద్ధం, అభౌతికం..యు.జి


  `అవతల` ఏ మైనా ఉందా?. ఎందుకంటే నీకు రోజువారి విషయాలు, నీ చుట్టూ ఏమి జరుగుతుంది అనే దాని మీద ఆసక్తి ఉండదు.`అవతల` అని పిలుస్తున్నదాని మీద, లేదా దేవుడు, సత్యం, వాస్తవం, బ్రహ్మం, ఆత్మజ్ఞానం, లేదా మరోటో కనుగొన్నావు. దాని  కోసం నీ అన్వేషణ  అంతా. అక్కడ ఏ  `అవతల` ఉండకపోవచ్చు. `అవతల` గురించి నీకు విషయం తెలియదు. దాన్ని గురించి నీకేమి చెప్పారో అదే నీకు తెలిసింది. అందువల్ల ఆ జ్ఞానాన్నే ఆవిష్కరిస్తుంటావు.` అవతల` గురించి నీకున్న జ్ఞానమే నీవు పిలుస్తున్న `అవతల`ను  సృష్టించింది. `అవతల గురించి నీకున్న  జ్ఞానమే నీ  అనుభవం  అవుతుంది . ఆ అనుభవం నీ  జ్ఞానాన్ని  పదునేక్కిస్తుంటుంది. నీకేమి తెలిసినా అది  అవతలకు వెళ్ళదు. ఏ అనుభవమైనా అవతలంటు  ఏమీ ఉండదు.  ఏదయినా  అవతల అంటూ ఉంటే `నీవు` కదలిక అదృశ్య మైనప్పుడే  ఉంటుంది. ఆ కదలిక  లేకపోవడమే బహుశా `అవతల ` అని  అనుకొవచ్చు. కాని `అవతల` అనేది ఎప్పటికీ అనుభవంలోకి  రాదు. అనుభవంలోకి రానిదాని కోసం అనుభవంలోకి తెచ్చుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తావు .

              దేవుడి నుంచి మనిషి రక్షింపబడాలి. అది చాలా అవసరం. నేననేది నీవు అంటున్న దేవుడు  అనే అర్ధంలో కాదు. నా దృ ష్టిలో దేవుడు దేవుడుగానే లేదు. దేవుడు అనే భావన చుట్టూ కర్మ, పునర్జన్మ, మరణం తర్వాత... ఇలా  మొత్తం విషయమంతా, గొప్ప భారతీయ వారసత్వమని నీవు చెప్పేదంతా...మొత్తం ప్రహసనాన్ని నీవు చూడాలి. మనిషి భారతీయ వారసత్వం నుంచి బయట పడాలి. ప్రజలే కాదు మొత్తం దేశం కూడా ఈ వారసత్వం నుంచి విముక్తి పొందాలి.    
     కలగాపులగమైన మనస్సు చాలా విధ్వంసకర విషయాలను సృష్టించింది. అన్నింటిలో దేవుడు అనే భావన అత్యంత విధ్వంసకరమైంది. నాదృష్టిలో దేవుడికి  సంబందించిన ప్రశ్న చాలా అసంబద్ద మైంది. అభౌతికమైంది. దేవుడి వల్ల మనకే మాత్రం ప్రయోజనం లేదు.రెండు ప్రపంచ  యుద్దాలకంటే దేవుడి పేరుతో జరిగిన  హింసాకాండలో ఎక్కువ మంది చనిపోయారు.పవిత్ర  బుద్దభగవానుడి పేరు మీద జపానులో లక్షలాది మంది మరణించారు. ఇదే వరుసలో క్రిస్టియన్లు, ముస్లింలు ఉన్నారు. భారత దేశంలో కూడాఒక్క రోజులో ఐదు వేల మంది జైనులను ఊచకోత కోశారు. నీది కుడా శాంతియుత దేశం కాదు. నీ చిరిత్ర  చదువుకో. మొదటి నుంచి హింసే కనబడుతుంది.
           మనిషి కేవలం భౌతిక జీవి. (భయోలాజికల్ బీయింగ్ ). స్వాభావికంగా  అతనికి ఆద్యాత్మిక పార్శ్వం లేదు. అన్ని సద్గుణాలు, మార్గదర్సికాలు, నమ్మకాలు , భావాలు, ఆద్యాత్మిక విలువలు, కేవలం డాంబికాలు, అసహజమైనవి. అవేమి నీలో మార్పు తీసుకురాలేవు. నీవిప్పటికీ  క్రూరుడవే. `నీవలె నీ పొరుగువాడిని ప్రేమించు`  అనే తత్వం  వల్ల నీవు జరిపే విచక్షణారహిత  హత్యా కాండ ఆగదు. నీ పొరుగువాడిని చంపితే నీకూ అదే గతి పడుతుందనే భయంకరమైన  నిజం వల్ల నీవు నరమేధాన్నిఆపుతావు

    GOD IS IRRELEVANT:                   U.G.KRISHNAMURTHI

   Is there a beyond? Because you are not interested in the everyday things and the happenings around you. You have invented a  thing called the ‘beyond’, or ‘Timelessness’, or ‘God’, ‘Truth’, ‘ Reality’, ‘Brahman’, ‘enlightenment’, or whatever, and you search for that. There may not be any beyond. You don’t know a thing about that beyond. Whatever you know is what you have been told, the knowledge you have about that. So you are projecting that knowledge. What you call ‘ beyond’ is created by knowledge you have about  that beyond; and whatever knowledge you have about a beyond is exactly what you will experience. The knowledge creates experience, and the experience then strengthens the knowledge. What you know can never be the beyond. Whatever you experience is not the beyond. If there is any beyond this moment of ‘you’ is absent. The absence of this movement probably is the beyond, but the beyond can never be experienced by you; it is when the ‘you’ is not there. Why are you trying to experience a thing that cannot be experienced.?
        Man has to be saved from God - that is very essential. I don’t mean God in the sense in which you use the word God; I mean all that ‘God’ stands for, not only God, but all that is associated with that concept of God - even karma, reincarnation, rebirth, life after death, the whole thing, the whole business of what you call the ‘ great heritage of India’ - all that,  you see. Man has to be saved from the heritage of India. Not only the people; the country has to be saved from that heritage. Otherwise there is no hope for the individual and no hope for the country. 

 That messy thing called the mind has created many destructive thing, and by far the most destructive of them all is God. To the question of Godis irrelevant and immaterial. We have no use for God. More people have been killed in the name of God then in the two world wars put together. In Japa, millions of people died in the name of the sacred Buddha. Cristians and Muslims have done the same. Even in India, 5000 Jains were massacred in a single day. Yours is not a peaceful nation. Read your own history- it’s full of violence from the beginning to the?  Man is merely a biological being. There is no spiritual side to his nature. There is no such thing ... All the virtues , principles , beliefs, ideas, and spiritual values are mere affectations. They haven’t succceeded in changing anything in you . You are still the brute that you have always been. When will you begin to see the truth that the philosophy of ‘ Love  thy neighbour as thyself’  is not what stops you from killing indiscriminately but it is the terror of the fact that if you kill your neighbour you too will also be destroyed along with him that stops you from killing.


వరిజినల్ థింకర్

 వరిజినల్ థింకర్


       ఇతని పదాలకున్న శక్తిని `ఏ మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. ఇంతవరకూ ఎక్కడా తటస్థ పడని వరిజినల్ థింకర్ ఇక్కడ ఉన్నాడు. ఆధ్యాత్మికం, మనోవైజ్జ్ఞానికం, స్వయం సహాయం మీద అనేక వందల, వేల పుస్తకాలు ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తున్నాయి. అవన్నీ, ఆ ఆకర్షణలన్ని ఇప్పటికే నీ దగ్గర ఉన్నవే. యూజీ చెప్పేది నీకు తెలిసినదాన్ని బద్దలు కొట్టడమే . కొత్త దానితో భర్తీ చేయడం కాదు . కొత్త చిట్కాలు, క్రమ శిక్షణా మార్గాలు కాదు. కొత్త తగులాటంలోకి వెళ్ళకుండానే నీ నమ్మకాలు చెదిరి పోవడానికి, నీకు నీవు ముక్కలు కావడానికి నీవు సిద్దంగా ఉన్నావా ? ఉంటే ఈ పుస్తకాన్ని చదువు. ఇది అన్ని ఇతర మార్గాలకు మించిన మార్గం కాదు. ఇది పూర్తిగా మార్గాలకు బయిట ఉంది.

         యూజీ ప్రస్తుత విలువల వ్యవస్థ స్థానంలో ప్రత్యామ్నాయాన్ని చూపడు.కానీ మానవ విశ్వాసాల మూలాలలోకి వెళ్లి అతను విశ్లేషించే తీరును నీవు చూడగలిగితే జీవితం గురించి నీవనుకొంటున్న మహోన్న త భావాలు బలవంతంగా నయినా వదిలించుకునేందుకు ప్రయత్నిస్తావు .ఇలా నీవు కొంత వరకు వెళ్ళగలిగితే,నీ జీవితాన్ని ఏ ప్రయత్నం లేకుండా సాధారణంగా ఎలా ఉండవచ్చో తెలుసు కోవడానికి అవకా శం ఉంటుంది. ఎందుకంటే విలువల చట్రాన్ని ఎక్కువకాలం మోయలేవు.

     కొత్త నమ్మకాల వైపు. మతాల వైపు నిన్ను మళ్ళించడానికి యూజీ ఏమాత్రం ఆసక్తి చూపడు. అపూర్వమైన దృస్టికోణాన్ని ఇస్తాడు. తనను తాను వ్యక్తీకరించుకొంటాడు.తీసుకో, లేకపోతే లేదంటాడు. నిన్ను సరైన వ్యక్తిగా తయారు చేయడానికి ఏమాత్రం ప్రయత్నించడు.నిజానికి నీలో మార్పే అవసరం లేదంటాడు. మారాల ని ఎడతెగని ప్రయత్నం చేయడం నీ విషాదం అంటాడు. చాలా సహజంగా జ్ఞానులు, . సాధువులు, మానవాళి రక్షకులుగా ... ఇలా ఎవరో నమూనాగా నీవు ఉండాలనుకొంటావంటాడు.

             లారీ మోరీస్, 

 "ది నాచురల్ స్టేట్" పుస్తకానికి ముందు మాట


                 Original thinker


          Don't underestimate the power of his words. Here is an original thinker unlike any one you've ever come across before. The hundred thousand books of çliched thoughts on spirituality, psychology and self-help available today offer you ways that are congenial to what you already know. U.G. merely offers to shatter what you know and not to replace it with anything, no new technique or discipline or way. Are you ready to be shattered, to have your beliefs stripped away and then not be given anything new to hang on to? Then read this book. It's not a way beyond all the other ways. It's outside of ways altogether.

       He does not give you anything to replace your current belief system.But if you see how penetrating his analysis of human belief is , you may be forced to drop many of your most cherished ideas about life. This can free you to some extent, and you may find your life becoming simpler not through any effort of yours but simply because you no longer have to carry the burden of so many belief structures.

          U.G is not interested in converting you to a new religion or to any belief system whatsoever. He expresses a unique point of view and tells you to take it or leave it. Hi is not trying to make you into a better person. In fact, he says that you don't need to change anything and that it is our tragedy that we are constantly trying to change ourselves. Who you are is completely unique, yet you are trying to modal yourself after another, usually one of the "saints,sages,or saviors of mankind"


Larry Morris,

Introduction of "the natural state" book


చైతన్యం

          చైతన్యం (CONSCIOUSNESS)


        నీవు ఎప్పుడూ పరిపూర్ణంగా, పవిత్రంగా ఉండాలనుకుంటావు. ఆ చైతన్యంలోనే అపరిశుద్ద్యం ఉంది. అపరిసుద్ద్యం అనే పదాన్నే నీవు ఇష్టపడవు. నీవు పవిత్రమైన, దైవికమైన, సంపూర్ణమైనదని భావించేదంతా అపరిసుద్దమే. నీవు చేయగలిగేదేమీ లేదు. అది నీ చేతిలో లేదు
        మానవ చైతన్యం స్థానాన్ని నీకోసం నీవు కనుగొనే మార్గం లేదు. ఎందుకంటే నీవు చైతన్యం నుంచి విడిగా లేవు. 
   సొసైటీ నీ బయట లేదు. నీ లోపల ఉంది. నాగరికత మానవ చైతన్యంలో ఉంది. నీ ముందు తరం మనిషి ప్రతి అనుభవంలో అది ఉంది.
         పరిమితులు లేని, సరిహద్దులు లేని చైతన్యంలో మార్పు ఎలా తీసుకువస్తారు? మానవ చైతన్య స్థానాన్ని కనుగొనడానికి మీరు అన్ని రకాల పరిశోధనలు చేయవచ్చు, కానీ మానవ చైతన్య స్థానం అంటూ ఏదీ లేదు. మీరు ప్రయత్నిం చవచ్చు కానీ విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువ
       మీరు ఏమి చేస్తున్నారు ? ఏమీ చేయడం లేదు. కొత్త పదబంధాలు, కొత్త పదాలను వల్లివేస్తున్నారు. మీరు చేస్తున్నది అంతే. ఆ చైతన్యంలో ఉన్న కాలుష్యం అనే వాస్తవాన్ని మీరు అంగీకరించరు. మీరు ఏది పవిత్రంగా, అసాధారణమైందిగా భావించినా అది ఆ చైతన్యంలోని కాలుష్యమే.. అది స్వచ్ఛత కలిగి ఉండాలి. అన్నీ ... పవిత్రమైనవి, దైవికమైనవన్నీ.. -ఆచెత్తంతా తప్పక వెళ్లపోవాలి. అది పోయినప్పుడు మీకు మీరుగా ఉంటారు. లేకుంటే ఆధారపడటం ఉంటుంది.
 నేను చైతన్య స్థితిని ప్రశ్నిస్తున్నాను.ఎందుకంటే మనం అనుకొంటున్నచైతన్య స్థితి కుడా జ్ఞాపకమే. నీకున్న జ్ఞానం సహాయంతో నీవు చైతన్యంగా ఉంటావు.ఆ జ్ఞానం నీ జ్ఞాపక చట్రంలో భద్రంగా ఉంటుంది. నీవంటున్న కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్ కాన్షియస్ లు అన్నీ ఆలోచన వ్యవస్థ సృష్టించిన సూక్ష్మ రూపాలే. ఈ చాతుర్యం, ఆవిష్కరణ ద్వారా ఆలోచన తన యధాతద స్థితిని కొనసాగిస్తుంది.
          So all that you consider very profound, all that you consider sacred, is a contamination in that consciousness. You may not like the word contamination but all that you consider sacred, holy and profound is a contamination. There's nothing that you can do, it's not in your hands.
             You have no way at all of finding out yourself the seate of human consciousn ess because it is all over and you are not separate from that consciousness.
           Society is there inside , not outside. Culture is part of human conscio usness and everything that any predecessor has experienced is part of that.
           How you bring about a change in conscio usness, which has no limits, which has no boundaries, which has no frontiers? You can do every kind of research to find the seat of human consciousness, but there is no such thing as the seat of human conscio usness at all.you can try but chances of succeeding in that are slim
        What are you doing ? You are not doing anything. you are repeating new phrases,new words, new idioms. That is all you are doing. You don't accept the fact that all that is a contamination there in that consciousness. Whatever you consider sacred, whatever you consider extraordinary, is a contamination in that consciousness. It has to purity itself. All that - all that dross, all that is holy, all that is sacred -- must go. When that has gone you are yourself, otherwise there is dependence.

సమాజం

 

సమాజం
      యు.జి.కృష్ణమూర్తి

     సంపూర్ణమైన మనిషి అనే ఆదర్శాన్ని సమాజం నీ ముందుం చింది. ఏ నాగరికత నుంచి వచ్చావనేది విషయం కాదు. నీకు ఆధ్యాత్మిక ఉద్గ్రంథాలు , సంస్కృతులు ఉన్నాయి. నీవు ఎలా ఉండాలనేది అవి నిర్దేశిస్తుంటాయి .సాధన ద్వారా సహజ స్థితిని పొందడం సాధ్యమని కూడా యోగులు, జ్ఞానులు, నీకు చెప్పారు. అందు వల్ల నీవు నీ ప్రవర్తనను, ఆలోచన ను అదుపు చేస్తుంటావు. ఇదంతా అసహజంగా మారుతుం టుంది. జీవితాన్ని అదుపు చేసే ప్రయత్నం నీలో రెండో నడకకు దారితీస్తుంది. దాన్నే నీవు పిలిచే `నేను` ( సెల్ఫ్).
          ఆదర్శ సమాజం, ఆదర్శ మానవుని గురించి మర్చిపోండి. కేవలం మీ నడక తీరును చూడండి. అది ప్రధానమైన విషయం. మనిషి తనదైన ప్రత్యేకతలోకి పూర్తిగా వికసించ కుండా సంస్కృతి నిరోధించింది. ఇది తప్పుడు విషయాన్ని, ఆదర్శవంతమైన వ్యక్తిని మనిషి ముందుంచింది. ఈ మొత్తం విషయం మానవాళి విభజన చైతన్యం నుంచి పుట్టింది. ఇది మీకు హింస తప్ప మరేమీ తీసుకురాలేదు. అందుకే ఇద్దరు గురువులు లేదా రక్షకులు ఎప్పుడూ అంగీకరించరు. ప్రతి ఒక్కరూ తన స్వంత అర్ధంలేని చెత్తను బోధించాలనే ఉద్దేశంతో ఉంటారు.
          సమాజంలో నేను భాగస్వా మినని చెబుతావు. అయినా భిన్నంగా ఉన్నానని నీవే భావిస్తుంటావు. సమాజ చైతన్యం నుంచి నీవు విడిగా లేవు. గుంపులో ఉన్న వ్యక్తికి, లేదా చర్చికి వెళ్ళని కమ్యూ నిస్టుకు నీకు తేడా ఏమిటి? 
         నీకు నీమీద విశ్వాసం లేదు. నాగరికత మీద విశ్వాసం ఉండాలంటూన్నావు . నీకు సమాజం ఏమి చెప్పిందో దానిమీదే నమ్మకం. అది మౌలిక సమస్య. సమాజం నీ బయట లేదు. నీ లోపల ఉంది. నాగరికత మానవ చైతన్యలో భాగం. నీ ముందు తరం ప్రతి మనిషి అనుభవంలో, అన్ని చోట్లా ఇది భాగమై ఉంది.   
         నీ ఆలోచన నడక నీలోని జీవీ నడకకు సమాంతరంగా ఉంటుంది. కాని నిన్ను అది ఐసోలేట్ చేస్తుంటుంది. అది జీవితాన్ని ఎప్పటికీ స్పర్శించ లేదు. నీకు నీవు జీవితం నుంచి విడిపోతావు. ఇది చాల అసహ జం. అలా అని ఆలోచనారహిత స్థితి సహజ స్థితికాదు. వందల సంత్సరాలుగా పాతుకుపాయిన అతి పెద్ద మోసాల్లో ఇదొకటి. ఆలోచన లేకపొతే నీవుఉండవు. మనుగడకు ఆలోచన తప్పనిసరి. దాన్ని ఆపితే ఊపిరి ఆడదు. దాని సహజ నడకలో అది వెళ్ళాలి. మొత్తం సమస్యకు ఇదే సంక్లిష్టమైంది.
        సమాజం ఘర్షణ పునాధి మిద నిర్మితమైంది. నీవే సొసైటీ.అందువల్ల సమాజంతో ఎప్పుడూ ఘర్షణ పడా ల్సిందే.
           మన సంస్కృతి లేదా సమాజం సృష్టించిన విలువ వ్యవస్థలో ఎలా ఒదిగి పోవాలో వాళ్ళు [మనస్తత్వవేత్తలు] మీకు చెప్తారు. అది నిజంగా మానవ సమస్య. ప్రతి తెలివైన పురుషుడు, స్త్రీ తనకు తానుగా అడగవలసిన ఒక ప్రాథమిక ప్రశ్న, 'ఈ గ్రహం మీద నాకు ఎలాంటి మనిషి కావాలి?'

             Society

U.G.KRISHNAMURTHY

    Society has put before you the ideal of a 'perfect man'. No matter in which culture you were born, you have scriptural doctrines and treditions handed down to you to tell you how to behave. You are told that through due practice you can even eventually come into the state attained by the sages, saints and saviours of mankind. And so you try to control your behaviour, to control your thoughts, to be something unnatural. Your effort to control life has created a secondary movement of thought within you, which you call the 'I'.        
      Forget about the ideal society and the ideal human being. Just look at the way you are functioning, that is the importent thing. What has prevented the organism from full flowering into its own uniqueness is culture. It has placed the wrong thing, the ideal person, before man. The whole thing is born out of the divisive consciousness of mankind. It has brought us nothing but violence. That is why no two gurus or saviours ever agree. Each is intent upon preaching his own nonsense.
       You say you are a part of the society and yet you think you are different. You are not seperate from the social consciousness.What is the difference between the man who goes to the mass and you, or the communist who doesn't go to the church?.
        This movement of thought within you is parallel to the movement of life, but isolated from it; it can never touch life. You are a living creature, yet you lead your entire life within the realm of. this isolated, parallel movement of thought. You cut yourself off life - that is something very unnatural.The natural state is not a thoughtless state. That is one of the greatest hoaxes perpetrated for thousands of years. You will never be without thought. Being able to think is necessary to survive but in this state thought stops choking you. It falls into its natural rhythm.This is the crux of the whole problem.
          They [psychologists] tell you how to fit into the value system that is created by our culture or society. That is really the human problem. The one very basic question which every intelligent man and woman should ask for himself or herself is, 'What kind of a human being do I want on this planet?'

సంస్కృతి అసలు అవరోధం

 

సంస్కృతి అసలు అవరోధం


నీకు నీవుగా ఉంటావు. కాని దిగ్బ్రాంతికలిగించే విషయం ఏమిటంటే నీవు ఆధారపడిన మొత్తం మానవాళి వారసత్వం అంతా అపస్యమైంది. దీన్ని నీవు చూడాలి. ఈ గ్రహింపే నీకు మేలుకొలుపు. ఉద్దేశపూర్వకంగా కానీ, యాదృచ్చికంగా గాని ఇది జరిగితే నీలో ఈ పరిస్థితికి కారణమైన ఈ సంస్కృతి లేదా నాగరికత మీద నీకున్న పరా ధీనతపై మెరుపులా ఈ గ్రహింపు నిన్ను తాకుతుంది.

    నీవు వారసత్వ భారం నుంచి స్వేచ్చను పొందితే నీవు మొదటిసారిగా ఒక వ్యక్తిగా తయారవుతావు. నేను ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఈ వ్యక్తి ప్రభావం మానవ చైతన్యంపై ఖచ్చితంగా వుంటుంది. మీరు కొలనులో ఒక రాయి విసిరినప్పుడు వృత్తాకార తరంగాలు ఏర్పడినట్లు. బహుశా మనిషికి ఉన్న ఏకైక ఆశ ఇది.

     ఇది మొత్తానికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే దేశం వ్యక్తికి కొనసాగింపు. ప్రపంచం వివిధ దేశాల కొనసాగింపు. మీలో మార్పు రావాలనే డిమాండ్ ఉన్నంత వరకు, మీరు ప్రపంచంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటారు. సంస్కృతి ,దాని విలువల వ్యవస్థ చట్రంలో ఇమడలేక పోవడంవల్ల మీరు ప్రపంచాన్ని మార్చాలను కుంటున్నారు.

         నీకు నీవుగా, వ్యక్తిగతంగా ఉండాలంటే నీవు చేయడానికి ఏమీ లేదు. నీవు ఉన్న స్థితి కంటే భిన్నంగా ఉండాలని సంస్కృతి నిన్ను డిమాండ్ చేస్తుంటుంది. అలా ఉండడానికి చేసే ప్రయత్నంలో నీ సర్వ శక్తులూ వృధా అవుతుంటాయి. ఆ శక్తి ఉంటే జీవించడం చాలా సాధారణంగా ఉంటుంది.

        మనుషులందరి చర్యలను ఒక మూసలో ఉంచడపైనే సంస్కృతికి ఆసక్తి . ఎందుకంటే వారు విలువ వ్యవస్థ యథాతథ స్థితిని కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అదే నిజమైన సంఘర్షణ. సహజ స్థితి -ఆ విలువల వ్యవస్థలో ఇమడ్చలేనిది.

 భారతీయ వారసత్వం నుంచి మనిషి రక్షించబడాలి. ప్రజలే కాదు దేశం ఈ వారసత్వం నుంచి బయిట పడాలి.

     ఈ జీవికి ఆసక్తి కలిగించే ఒక ప్రశ్న ఏమిటంటే " మొత్తం సంస్కృతిక బానిసత్వాన్ని, సంస్కృతి ప్రభావాన్ని ఎలా తోసేయడం? ఈ ప్రశ్న మాత్రమే ఈ జీవికి ఉంది, మాటల్లో కాదు, ఆలోచనల్లో కాదు... మొత్తం మానవాళికి ఇది ఒక ప్రశ్న.

              తన సహజ మార్గంలో ఈ దేహం మొత్తం రసాయన చర్యల్లో మార్పులు మొదలౌతాయి. దీని అర్ధం ఏమంటే నాగరికత ద్వారా కలుషితమైన, విషతుల్యమైన మొత్తం ఈ వ్యవస్థ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఈ చైతన్యం , లేదా జీవితం ...నీవు ఏమైనా పిలువు దాని వ్యక్తీకరణ, నడక తనదైన శైలిలో వ్యక్తమౌతుంటుంది. ఇటువంటి వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం వుండదు. ఇతడు ఒక ప్రమాదికారిగా తయారౌతాడు.ఇతను సంప్రదాయానికి ముప్పు. ఎందుకంటే అతను వారసత్వం మొత్తం నడకను బలహీన పరుస్తున్నాడు.‌ ఇదే వైరుధ్యం. ఇతడు ప్రపంచాన్ని సంస్కరించడానికి కొంత శక్తి కావాలని కోరుకోడు. తను రక్షకుడిననో, స్వేచ్చా జీవిననో, ఆత్మ జ్ఞానం పొందినవాడిననో అనుకోడు.


      You become yourself. 

You see, the shock that your dependence on the entire heritage of mankind has been wrong, when that realisation dawns on you. It hits you like lightning that your dependence on this culture, be it Oriental or Occidental, has been responsible for this situation in you. So you are freed from the burden of the past and become for the first time an individual. That is the individual I am talking about. That individual will certainly have an impact on human consciousness.Liike when you throw a stone in a pool it sets in motion cirular waves. Maybe that's the only hope that man has.That applies to the whole as well because the nation is the extension of the individual and the world is the extension of the different nations. 

      As long as there is a demand in you to bring about a change in yourself, you want to bring about a change in the world. Because you can't fit into the framework of culture and its value system,you want to change the world.

     To be individual and to be yourself you don't have to do a thing. Culture demands that you should be something other than what you are. What a tremendous amount of energy we are waste trying to become that! If that energy is released what is it that we can't do? How simple it would be for everyone one of us to live in this world. It is so simple.

          Culture is interested in fitting the actions of all human beings in to common mould , and that is because, they are interested in maintaining the status quo of the value system. That is the real conflict is.This natural state -is something which cannot be fitted into that value system.

         Man has to be saved from the heritage of India. Not only the people ; the country has to be saved from that heritage.

      The one question that this organism is interested in is "How throw off the whole thralldom, the whole strangling influence of culture? That question is the only question this organism has , not in words, not has a thought ---the whole human organism is that one question.

          The whole chemistry of the body changes so it begins to function in its own natural way. That means everything that is poisoned and contaminated by the culture is thrown out of the system. It is thrown out of your system and then that consciousness or life or whatever you want to call it expresses itself and functions in a very natural way. The whole thing has to be thrown out of your system.

           Such a man is of no use to the society. On the contrary, he becomes a threat. He is threat to the tredition because he's undermining the whole function of the heritage .He doesn't think that he is chosen by some power to reform the world. He doesn't think that he is a saviour or a free or enlightened man.


గురువులు, ఆధ్యాత్మిక వ్యాపారం -2

 

గురువులు-ఆధ్యాత్మిక వ్యాపారం-2

     మనిషి బౌతిక జివి. స్వాభావికంగా అతనికి ఆధ్యాత్మిక పార్శ్వం లేదు. పవిత్ర విలువలు, సూత్రాలు, నమ్మకాలూ ,ఆధ్యాత్మిక విలువలు కేవలం డాంబికాలు. అవి నిన్ను ఏమీ స్పర్శించలేవు. ఇవి నీలో ఏమాత్రం మార్పు తీసుకు రాలేవు. భక్తుల హృదయపూర్వక ఆరాధనను, భక్తినీ శతాబ్దాలుగా మతం దోపోడీ చేసింది‌. మానవ జాతి భవిష్యత్తు. 'నీకు మల్లె నీ పొరుగు వాడిని ప్రేమించడం' లో లేదు. నీ పొరుగువాడిని చంపితే నీకూ అదే గతి పడుతుందనే భయభ్రాంతులపై ఆధారపడి ఉంది.
            ఆధ్యాత్మికంగా గాని, లౌకికంగా గాని గురువులు నుంచి నేను నేర్చుకుంది ఇసుమంతైనా లేదని నిస్సంకోచంగా చెప్పగలను.
        ఉపాధ్యాయుడు, గురువు లేదా నాయకుడు చెప్పే సమాధా నాలతో పాటు, అతడు చూపించేవి తప్పుడు పరిష్కారాలు. అతడే ఏ పని నిజాయితీగా చేయడు. మార్కెట్‌లో చీప్, చెత్త వస్తువుల ను అమ్ముకుంటుంటాడు. మీ ఆశ, భయం, అమాయక త్వాన్ని పక్కన పెట్టి వీళ్ళని వ్యాపారుల్లా చూడగలి గితే వారు వస్తువులను దిగుమతి చేయరు. ఎప్పటికీ ఇవ్వరు. మీరే చూస్తారు. కానీ మీరు నిపుణులు అందించే ఈ బోగస్ వస్తువులను కొంటూ ఉంటారు .
        కరుణ, ఆనందం, ప్రేమ... మతపరమైన ఈ అనుభవాలన్నీ ఉనికిలో లేని శాంతి కోసం తపించే ఆరాటంలో భాగం. సహజంగా ఆల్ రెడీ అక్కడ ఉన్న శాంతిని నాశనం చెసేవి.
          మనల్ని శతాబ్దాలుగా పవిత్ర పురుషులు బ్రెయిన్‌వాష్ చేశారు. మనం మన ఆలోచనలను నియంత్రించాలి. ఆలోచన లేకపోతే నీవు శవంగా అవుతావు‌. ఆలోచించకుండా, ఆలోచనలను నియంత్రించమని చెప్పే మార్గం ఈ సత్పురుషులకు లేదు. ఆలోచనల ను నియంత్రించమని ఇతరులకు చెబుతూ వారు ధనవంతులుగా మారారు.
        మతం, దేవుడు, ఆత్మ అన్నీ మీ మానసిక కొనసాగింపును చెక్కుచెదరకుండా ఉంచడానికి ఉపయోగించే పదాలు, ఆలోచనలు మాత్రమే. ఈ ఆలోచనలు లేనప్పుడు మనిషి నడక సాధారణంగా, సామరస్యంగా ఉంటుంది.         
             వారసత్వమంతా రోగగ్రస్తమైన మనస్సు నుంచి పుట్టింది. మనిషి అవినీతిపరుడు. 'అరిగిపోయిన పదమైన 'వారసత్వం'పై నింద వేస్తాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారడానికి ఇష్టపడకపోవడాన్నే మీరు సంప్రదాయంగా పిలుస్తారు.
          మనం మన భావాలకు, నమ్మకాలకు బానిసలం. వాటిని నిజంగా అధిగమించలేం. వాటిని తోసేసినా వాటి స్థానాన్ని మరో నమ్మకంతో, మరో రకం క్రమశిక్షణతో భర్తీ చేస్తాం.
    నీ మెడిటేషన్ లు, సాధనలు, పద్ధతులు, చిట్కాలలో ఏమైనా అర్థం ఉంటే నీవు ఇక్కడ ఈ ప్రశ్నలు అడగవు. వాటన్నిటి అర్థం నీలో మార్పు తీసుకురా వడం. అక్కడ మారడానికి, పరివర్తన చెందడానికి ఏమీ లేదు. ఏదో ఉందనుకోవడం నీ విశ్వాసం.
         మత ఆధిపత్యం ప్రజలపై తన పట్టును కొనసాగించాలని కోరుకుంటుంది. కానీ మతం పూర్తిగా వ్యక్తిగత విషయం.            
          ఆధ్యాత్మిక విలువలు తప్పుడు విలువలు. లోక రక్షకులమని చెప్పుకునేవారు ఈ ప్రపంచాన్ని దుఃఖ మయం చేశారు తప్ప మరోటి కాదు. ఇక్కడున్న నిశ్చలత మరొకరికి బదిలీ అయ్యేది కాదు. ఈ కారణంగా మొత్తం గురు వ్యాపారం పూర్తిగా అర్థంలేని చెత్త.
        దేవుడిని విశ్వసించేవారు, శాంతిని బోధించేవారు, ప్రేమ గురించి మాట్లాడేవారు మానవ అడవిని సృష్టించారు. మనిషి అడవితో పోలిస్తే, ప్రకృతి అడవి సరళమైనది, సునిశితం అయినది! ప్రకృతిలో జంతువులు తమ జాతిని చంపవు. అది ప్రకృతి అందంలో భాగం. ఈ విషయంలో మనిషి ఇతర జంతువుల కంటే అధ్వాన్నంగా ఉన్నాడు. నాగరికుడుగా పిలవబడే మనిషి భావాలు, నమ్మకాల కోసం చంపుతాడు. అయితే జంతువులు మనుగడ కోసం మాత్రమే చంపుతాయి.
          జీవించడానికి మనిషికి జ్ఞానం అవసరం. కానీ దేవుడు, సత్యం, వాస్తవికత వంటి ఊహాగానాలకు అస్సలు అర్ధం లేదు. అవన్నీ సాంస్కృతి సృష్టించిన విలువలు. అవి జీవి మనుగడకు పూర్తిగా సంబంధం లేనివి. అవన్నీ సామాజికంగా ఏకపక్షంగా స్థిరపడిన మతపరమైన విలువలు. మన అభిరుచులన్నీ కల్పించుకున్న వే. ఇష్టాలు, అయిష్టాలు అంతే.
        నేను చెప్తున్నాను, ఈ సాధువులు, రక్షకులందరూ కలిసిన దానికంటే మీరు చాలా ప్రత్యేకం. అసాధా రణమైనవారు. మీరు ఎందుకు వాళ్ళను చౌకగాబా రుగా అనుకరించాలను కుంటున్నారు. ఇతరులను కాపీ చేయడం మానేయండి. ఇది ప్రధానం.

          GURUS-HOLY BUSINESS (part-2)

              U.G.KRISHNAMURTHI

       Man is merly a biological being. There is no spiritual side to his nature. All your virtues, priniciplrs, beliefs, ideas and spiritual values imposed on you by your culture are mere affectations. They haven't touched anything in you. Religion exploited for centuries the devoutness piousness and whole-souled fervour of the religious man. Not in 'love thy reighbour as theyself' but in the terror that if you try to kill your neighbour you will also be destroyed along with him, lies the future of mankind.
           I can say without hesitation that I have learner precious little from either spiritual or secular teachers.
       The teacher, guru or leader who offers solutions is also false, along with his so called answers. He is not doing any honest work. Only selling a cheep, shoddy commodity in the marketpl ace. If you brushed aside your hope, fear and naivete, and treated these fellowes like bussinessmen, you wouldl see that they do not deliver the goods and never will. But you go on and on buying these bogus wares offered by the experts.
        All these religious experiences like compas sion, bliss and love are part of the craving for a non-existent peace which is destructive to the natural peace already there.
               We have brainwashed for centuries by holy men that we must control our thaughts. Without thinking, you would become corpse. Without thinking, the holy men wouldn't have any means of telling us to control our thaughts. They have become rich telling others to control their thaughts.
        Religion, god, soul are all just words, ideas used to keep your psychological continuity intact. When these thoughts are not there, what is left is the simple, harmonious physical functioning of the organism.
           All heritage is born of a diseased mind. Man is corrupt and lays the blame at the feet of the coined word 'heritage'. The unwillingness to change with the changing times you call tredition.
       We are slaves to our ideas and beliefs. We are not really to through them out. If we succeed in throwing them we replace them with another set of beliefs, another body of discipline.
      If your medications, sadhanas, methods and techniques ment anything, you wouldn’t be here asking these questions. They are all means for you to bring about change. I maintain that there is nothing to change or transform. You accept that there is something to change as an article of faith.
         Religious authority wants to continue its hold on the people, but religion is entirely an individual affair.
     Spiritual values are false. The so-called messiahs have left nothing but misery in this world. The certainty here cannot be transmitted to another. For this reason the whole guru business is absolute nonsense.
   Ones who believe in God, who preach peace and talk of love, who have created the human jungle. Compare d to man's jungle, nature's jungle is simple and sensib le! In nature animals don't kill their own kind. That is part of the beauty of nature. In this regard man is worse than the other animals. The so-called "civilized" man kills for ideals and beliefs, while the animals kill only for survival.
         The knowledge that is essential for the living organism—-all of that is necessary. But all those speculations about god, truth, reality, have no meaning at all. They are all cultural values. They are totally unrelated to the survival of the living organism.They are all socially arbitrarily fixed,religious values. All our tastes are cultivated tastes. Likes and dislikes are all cultivated.

గురువులు, ఆధ్యాత్మిక వ్యాపారం

 

గురువులు, ఆధ్యాత్మిక వ్యాపారం 
           యు.జి.కృష్ణమూర్తి

     మొత్తం మత వ్యాపారం అంటే నైతిక ప్రవర్తన నియమావళి తప్ప మరోటి కాదు. మీరు ఉదారంగా, కరుణతో, ప్రేమగా ఉండాలి. కాని అన్ని సమయాలలో మీరు అత్యాశ తో , కఠినంగా ఉంటారు. ప్రవర్తన ప్రణాళికను సమాజం తన ప్రయోజనాల కోసం నిర్దేశిస్తుంది. మతానిది కుడా ఇదే దారి. నీలో అదుపు కోసం పూజారిని నియమించింది. బయట పోలిస్ మాన్ సంస్తాగతమయ్యాడు అలా. పోలీస్ మాన్ కు పూజారికి మధ్య భిన్నత్వం లేదు.
          గురువులందరూ తమ అనుచరులకు చిన్నపాటి అనుభవాలను అందించే సంక్షేమ సంస్థలు .. గురువుల ఆట ఒక లాభదాయకమైన పరిశ్రమ. సంవత్సరానికి రెండు మిలియన్ డాలర్లు వేరే విధంగా ప్రయత్నించం డి. ఈ గురువులు ప్రపంచం ఎప్పుడూ చూడని అసహ్యమైన అహంకారులు.
      వారు డబ్బు గురించి చాలా తేలికగా మాట్లాడతారు. అది వారికి ప్రాముఖ్యత లేనట్లు.. వాస్తవానికి ఇది వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. ఈ పవిత్ర పురుషులు అందరిలాగే అత్యాశ, అసూయ ప్రతీకారంతో రగిలిపోయే బాస్టర్డ్స్. మీరు మీ పని ద్వారా, మీ పిల్లల ద్వారా జీవించాలనుకుంటున్నారు. ఈ వ్యక్తులు తమ మత సంస్థల ద్వారా జీవించాలనుకుంటున్నారు. మార్కెట్లో ఈ గురువులు మీకు కొన్ని ఐస్ ప్యాక్‌లను విక్రయిస్తా రు. మీకు కొన్ని సౌకర్యాలను అందిస్తారు.
        రక్షకులు ప్రపంచాన్ని గందరగోళపరిచారు. వారు ప్రపంచాన్ని విభజించడమే కాకుండా, ప్రపంచంలో సంఘర్షణకు, హింసకు మూలంగా కొనసాగుతున్నారు. 
       ఆధ్యాత్మికత అనేదే లేదు. ఆధ్యాత్మికత అని చెప్పుకుంటున్న దాన్ని జీవితం అని అనుకుంటున్న దానికి ఆపాదించు కుంటూ మీకు మీరు సమస్యలను సృష్టించుకుం టున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో ఎదుగు దల, అభివృద్ధిని చూస్తారు. మీరు దీనిని ఆధ్యాత్మిక జీవితం అని పిలవబడే దానికి కూడా వర్తింప జేస్తున్నారు. ఒకే ఒక జీవితం ఉంది ... ఇది భౌతిక జీవితం. మరో దానికి ఎటువంటి ఔచిత్యం లేదు. మతపెద్దలు మీ ముందు ఉంచిన, మీకు ఇచ్చిన మతపరమైన నమూనాగా మీ భౌతిక జీవితాన్ని మార్చాలనుకుంటున్నారు. భౌతిక ప్రపంచంలో సామరస్యంగా జీవించే అవకాశాన్ని నాశనం చేసుకుంటు న్నారు. మీ బాధకు, మీ కష్టానికి, మీ, దుఃఖానికి ఇదే కారణం.
     స్వీయ తిరస్కరణ మతపెద్దలను సుసంపన్నం చేస్తుంది. మీకు మీరు ప్రాథమిక అవసరాలను నిరాకరిస్తుంటే ఆధ్యాత్మిక స్వాములు రోల్స్ రాయిస్ కారులో ప్రయాణిస్తూ, రాజులా తింటూ, శక్తిమంతంగా వ్యవహరిస్తుంటారు. అతను, ఆ పవిత్ర వ్యాపారంలో ఉన్న వారు, ఇతరుల మూర్ఖత్వం, విశ్వసనీయతపై వృద్ధి చెందుతారు. రాజకీయ నాయకులదీ ఇదే వరుస. ఇది ప్రతిచోటా ఒకే విధంగా ఉంటుంది.
               రాజకీయ సంస్థలు, సిద్ధాంతాలు మనిషి మత ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన పులిపిర్లు. మానవజాతి విషాదానికి ఒక విధంగా ఇదే కారణం. మనం భావాలకు, నమ్మకాలకు బానిసలం. ఏదో సాధించాలనే ఆశతో మనల్ని మనం హింసించు కుంటాం. ఆధ్యాత్మికం లేదా ఇతరత్రా మన అనుభవమంతా మన బాధలకు ప్రధాన కారణం . మీకు ఆసక్తి ఉన్న దేనిపైనా శరీరానికి ఆసక్తి ఉండదు. అది నిత్యం జరుగుతున్న యుద్ధం.
         మన మనుగడకు అవసరమని నమ్మిన అన్ని ఊతకర్రలను విసిరేయమని చెప్పేవాడు గురువు. నిజమైన గురువు "వాటిని విసిరివేయండి వాటిని భర్తీ చేయవద్దు. మీరు నడవగలరు, పడిపోతే లేచి, మళ్లీ నడుస్తారు." అని చెపుతాడు. అలాంటి వ్యక్తిని మనం నిజమైన గురువుగా పరిగణిస్తాం. సంప్రదా యం కూడా అలాగే భావిస్తుంది . నేడు మార్కెట్ లో ఆ చెత్త వస్తువులను విక్రయిస్తున్న వారు కాదు. ఇది ఒక వ్యాపారం. ఇది ప్రజలకు పవిత్ర వ్యాపారంగా మారింది.
            మీరు మతాల స్థాపకులు, నాయకులను బహిష్కరించలేరు. మానవాళి రక్షకులు, గురువుల బోధనలు హింసకు మాత్రమే కారణమయ్యాయి. ప్రతి ఒక్కరూ శాంతి, ప్రేమ గురించి మాట్లాడితే వారి అనుయాయులు హింసను సాధనచేశారు.
      గురువులు, మతం గ్రంథాలు చెప్పింది నీవు చాలా తెలివిగా హేతుబద్ధం చేస్తావు. నీ నమ్మకాలు ఫలితమే అధిపత్యాన్ని గుడ్డిగా అంగీకరించడం‌. ఇదంతా రెండో తరగతి జ్ఞానం. నీ నమ్మకాల నుంచి నీవు విడిగా లేవు. నీ విలువైన నమ్మకాలు, భ్రమలు తొలిగితే నీవు మిగలవు.
         ఆధ్యాత్మిక వ్యక్తులు ఏ మాత్రం నిజాయితీ లేని వ్యక్తులు. ఆధ్యాత్మికత మొత్తం తప్పుడు పునాది మీద నిర్మితమైందని నేను ప్రధానంగా చెబుతున్నాను. 
           మీ దేశ అధ్యక్షుడిని చూడటం కంటే ఇతన్ని చూడటం చాలా కష్టం. ఈ 'పవిత్రమైన' వ్యక్తిని చూడటం కంటే ప్రెసిడెంట్ ను చూడడం చాలా సులభం. ఇతను ఏం చెబుతాడో దానికి పూర్తి భిన్నంగా ఉంటాడు.
            మీ చుట్టూ ఉన్న రోజువారీ విషయాలు, సంఘటనలు మీకు పట్టవు. కాలాతీతత్వం, దేవుడు, సత్యం, వాస్తవికత, జ్ఞానోదయం లేదా మరొకటో కనుగొన్నారు. వాటి కోసం వెతుకుతారు.
         మానవాళి రక్షకుల నుంచి మనిషి రక్షింపబడాలి! మతపెద్ద లు .. తమను తాము ఏమార్చుకున్నారు.‌మొత్తం మానవజాతిని మోసగించారు. వారిని బయిటకు తోసేయండి! అదే నిజమైన ధైర్యం.
          నీకు నీవుగా ఉండాలంటే అపసవ్యంగా ఉన్న ఆధ్యాత్మిక జీవితం మూలాలు నాశనం చేయాలి. అంటే మీరు మతోన్మాదిగా లేదా హింసాత్మకంగా మారాలని, దేవాలయాలను తగలబెట్టడం, విగ్రహాలను కూల్చివేయడం, తాగుబోతుల సమూహం వలె 'పవిత్ర' గ్రంథాలను నాశనం చేయడం అని దీని అర్థం కాదు. మీ లోపల అగ్గి రాచుకోవాలి. మొత్తం మానవాళి ఆలోచన, ఆనుభవం అంతా వెళ్ళిపోవాలి.

GURUS-HOLY BUSINESS

U.G.krishnamurthi

        The whole religious business is nothing but moral codes of conduct. You must be generous, compas sionate, loving , while all the time you remain greedy and callous. Codes of conduct are set by sociey in its own interests.The religious man puts the priest, the censor inside you. Now the police man has been institutional ised and placed outside you. There is no difference between the policeman and the religious man.
     All gurus are welfare organisations providing petty experiences to their followers.. The guru game is a profitable industry:
 try and make two million dollars a year any other way. These gurus are the worst egotists the world has ever seen.
     They talk very lightly of money as if it has no importance for them, when in fact it is one of the most important things in their lives. These holy men are greedy, jealous, and vindictive bastards, like everybody else. You want to live through your work, and through your children. These people want to live through their religious institutions. What these gurus in the market place do is to sell you some ice packs and provide you with some comforters.
             Messiahs have only messed up the world. They have not only divided the world, they continue to be the source of great conflict and violence in the world.
              There is no such thing as spirituality at all. If you superimpose what you call spirituality on what is called life, you create problems for yourself. Because you see growth and development in the meterial world around you, you are applying that to this so-called spiritual life also. There is only one life... This is meterial life, and that other has relevance. Wanting to change your material life, into that so-called religious pattern given to you, placed before you by these religious people, destroying the possibility of your living in harmony and accepting the reality of this meterial world exactly the way it is.That is responsible for your pain, for your suffering, for your, sorrow.
       our self-denial is to enrich the prists. You deny yourself your basic needs while that man travels in a told Rolls Royce car, eating like a king, and being treated like a potentate. He, and the others in the holy business, thrive on the stupidity and credulity of others. The politicians, similarly, thrive on the gullibility of man.It is the same everywhere.
           Political institutions and ideologies are the warty outgrowth of the religious thinking of the man; in a way responsible for the tragedy of mankind. We are slaves to our ideas and beliefs, and we torture ourselves in the hope of achieving something. All our experience, spiritual or otherwise, is the basic cause of our suffering... The body is not interested in anything "you" are interested in; that is the battle that is going on all the time.
             A guru is one who tells you to through away all the crutches that we have been made to believe are essential for our survival. The tru guru tells you ‘ Throw them away and don’t replace them. You can walk and if you fall you wii raise and walk again.’ Such is the man whom we consider or even tredition considers to be the real guru and not those who are selling those shoddy pieces of goods in the marketplace today. It is a business. It has become a holy business to people.
             You cannot exonerate the founders and leaders of religions. The teachings of all those teachers and saviours of mankind have resulted in only violence. Everybody talked of peace and love, while their followers practised violence.
       You have cleverly rationalized what the gurus and holy books have thought you. Your beliefs are the result of blind acceptance of authority, all second hand stuff. You are not separate from your beliefs and. When your precious beliefs and illusions come to an end, you come to an end.
          The spiritual people are the most dishonest people.I am emphasizing that the foundation upon which the whole of spiritual ity has been built is false. 
         Because you are not interested in the everyday things and happenings around you, you have invented the beyond, timelessness, God, truth, reality, enlightenment or whatever,and search for it.
         Man has to be saved from the saviours of mankind! The religious people, they kidded themselves and fooled the whole of mankind. Through them out! That is real courage.
        To be really on your own, the whole basis of spiritual life, which is erroneous, has to be destro yed. It does not mean that you become fanatical or violent, burning down temples, tearing down the idols, destroying the holy books like a bunch of drunks. It is not that at all.It is bonfire inside of you. Everything that mankind has thought and experienced must go.

దేహం

 

దేహం
        యు.జి కృష్ణమూర్తి

        జీవితం, మరణం, స్వేచ్ఛ గురించి మీరు కల్పించుకున్న మహోన్నత భావాలను తోసేయండి. అప్పుడు ఈ శరీరం యథాస్థితిలో ఉంటుంది, సామరస్యతతో పనిచేస్తుంది. దీనికి నీ సహాయం లేదా నా సహాయం అవసరం లేదు. మీరు ఏమీ చేయొద్దు.
        పునర్జన్మ , శాశ్వతత్వం వంటివి ఈ దేహానికి పట్టవు. స్ట్రగుల్ అంతా ఉనికి కోసమే. శాశ్వితత్వం కోసం పరితపించే ఆలోచనే శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, దృష్టిని చెదరగొడు తుంది.
           ఈ దేహం కంటే మనకు చాలా ఎక్కువ తెలుసనుకుంటాం. శరీరానికి ఏది మంచిదో మనకు తెలుసనుకుంటాం. అందుకే మనం సమస్యలను సృష్టించుకుం టున్నాం. దేహానికి తెలుసు దానికి ఏం కావాలో. ఇది మన నుంచి ఏమీ నేర్చుకోవాలను కోవడం లేదు. ఈ మామూలు సంబంధం మనకు అర్థమైతే దేహం దాని మానాన అది ఉండటానికి ఆమోదిస్తాం.
          జ్ఞానం కోసం, అత్మచైతన్యం కోసం ఎంతో చదివి జీవితాన్ని అంకితం చేసారనే వారి మీద ఆధారపడటం అనివార్యమైంది. వారు చెపుతున్న   తత్వాలన్నీ ఈ దేహానికి సహజంగా ఉండే జ్ఞానంతో పోల్చలేవు. వారు చెప్పే మానసిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ కార్యకలాపాలు, భావాలు అనేవి నిజంగా ఏకోన్ముకంగా సాగుతుంటాయి. . ఈ శరీరం అత్యంత తెలివైనది‌. జీవి నడకకు, మనగడకు నీ శాస్త్రీయమైన, వేదాంతమైన బోధనలు ఏమీ అవసరం లేదు. దానంతటది తాజాగా ఉండటానికి ఈ దేహానికి అత్యద్బుతమైన నడక ఉంది. ఇది తప్పనిసరి. ఎందుకంటే ఇంద్రియాలన్నీ ఎప్పుడూ సజ స్థితిలో సునిసితత్వంతో పని చేస్తుంటాయి. 
        ఈ దేహానికి నీ ధ్యాన చిట్కాలపై ఏ ఆసక్తి లేదు. నిజానికి అవి ఉన్న ప్రశాంతస్థితిని నాశనం చేస్తాయి. ఇది అసాధారణమైన శాంతియుత జీవి. ప్రశాంతంగా ఉండటానికి ఈ దేహానికి ఏమీ అవసరం లేదు. ప్రశాంతమైన మనస్సును పరిచయం చేయడం ద్వారా ఒక విధమైన యుద్ధాన్ని కొనసాగి స్తుంటావు. నీవు శాంతియుతంగా భావించేది వాస్తవానికి యుద్ధంలో అలసిపోయిన మానసిక స్థితి తప్ప మరేమీ కాదు.
         ఇంద్రియ కార్యకలాపాలపై ఈ దేహానికి ఆసక్తి ఉండదు. మనస్సు ఆసక్తి చూపే ఏ అనుభవంపైనా దెహం ఆసక్తి చూపదు. ఆధ్యాత్మిక అనుభవాలుగా పిలిచే, ఆనందం, బ్రహ్మానందం వంటి మతపరమైన అనుభవాలపై కూడా ఆసక్తి ఉండదు. ఆనందం అనేది శరీరానికి ఆసక్తి లేని విషయం. దీన్ని ఎక్కువ కాలం తీసుకోదు. ఆనందం అనేది ఎప్పుడూ తిరస్కరించే విషయాలలో ఒకటి. ఆనందం గురించి ఏమీ తెలుసుకోవాలని ఉండదు. సంతోషం అనేది సంస్కృతి సృష్టి. 
       ఏదైనా సంచలనం, ఎంత అసాధారణ మైనప్పటికీ, ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, శరీరం తిరస్కరిస్తుంది. ఆ అనుభూతిని దాని జీవిత కాలం కంటే ఎక్కువసేపు ఉంచడం ఈ జీవి ఇంద్రియ గ్రహణశీలత సున్నితత్వాన్ని నాశనం చేస్తుంది. అది అక్కడ జరుగుతున్న యుద్ధం. ఆనందం అంటే ఏమిటో మీకు తెలియకపోతే మీరు ఎప్పటికీ సంతోషం లేకుండా ఉండరు.
. `నేను` లేకుండా ఈ దేహాన్ని ఏమని పిలుస్తావు. ఇది కేవలం దేహం. కాని ఇది భిన్నమైన దేహం. దీని పనితీరు భిన్నమైన మార్గంలో ఉంటుంది. భిన్నమైన శక్తిని కలిగివుంటుంది. నైతిక జీవితానికి సంబంధించిన వత్తిళ్ళు పోతాయి. అంటే దీనర్థం నీవు చేసే నైతిక చర్యలు అపసవ్య మైనవో, మరొకటో కాదు. నీకు సమాజంతో ఘర్షణలు ఉండవు. ఎందుకంటే నీ లోపల ఘర్షణ లేదు. ఆలోచిస్తే అటువంటి వ్యక్తి నుంచి ప్రేమ, కరుణ, దయ ప్రవహిస్తుంటాయి.
     దేహం నుంచి మనస్సును వేరు చేయలేవు. మనస్సు కేవలం మానసికమైన కార్యకలాపాలకే పరిమితం కాదు. ప్రతి కణంలో ఆలోచన ఉంది. నీ దేహంలోని ప్రతికణంలో `నేను ` భావం పని చేస్తుంటుంది. వేరు చేయడం అంత సులభం కాదు
          తన సహజ మార్గంలో ఈ దేహం మొత్తం రసాయన చర్యల్లో మార్పులు మొదలౌతాయి. దీని అర్ధం ఏమంటే నాగరికత ద్వారా కలుషితమైన, విషతుల్యమైన మొత్తం ఈ వ్యవస్థ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఈ చైతన్యం , లేదా జీవితం ...నీవు ఏమైనా పిలువు దాని వ్యక్తీకరణ, నడక తనదైన శైలిలో వ్యక్తమౌతుంటుంది.

         BODY : U.G.KRISHNAMURTHI

       Take away all your fancies about life, death' and freedom, and the body remains unscathed, functioning harmoniously. It does not need your or my help.you don't have to do a thing.
         The body does not concerned with the afterlife or any kind of permanency. It struggles to survive and multiply now. Thought's demand for permanenc is choking the body and distorting perception.
         We think we know a lot more than this body. We think that we know what is good for the body and that is why we are creating problems for it . It knows what it wants to know. It doesn`t want to learn anything from us. If we understand this simple relationship that thought and the body have then probably we will allow the body to function and use thought only for functional purposes. Thought is functional in value and it cannot help us to achieve any of th goals we have placed before. us or what th culture has placed before us.
          All their philosophies cannot compare to the native wisdom of the body itself. What they are calling mental activity, spiritual activity, mental activity and feelings are really all one unitary process. This body is highly intelligent and does not need these scientific or theological teachings to survive and procreate.
       The body is not interested in your techniques of meditation which actually are destroying the peace that is already There. It is an extraordinary peace ful organism. It does not have to do anything to be in a peaceful state. By introduc ing this idea of a peaceful mind we set in motion a sort of battle that goes on and on. What you regard as peaceful is in actuality nothing more than a war-weary state of mind.
              The body is not interested in sensual activity. It is not interested in any experience that the mind is interested in and is demanding. It is not even interested in the so-called spiritual experiences, the religious experiences like bliss, beatitude, immensity and happiness. Happiness is something which thevbidy is not interested in. It cannot take it for long. Pleasure is one of the things that is always rejecting. The body does not know and does not even want to know anything about happiness. Happiness is a cultural input. Is there any such thing happens? I would say no.
           So any sensation, however extrordinary, however pleasant it may be, is rejected by the body. keeping that sensation going longer than its duration of life is destroying the sensitivity of the sensory perceptions and sensitivityof this living organism. that is the battle that is going on there. If you do not know what happiness is you will never be unhappy. is a cultural input There Is there vany such thing as happiness? I would say, no.
            The whole chemistry of the body changes so it begins to function in its own natural way. That means everything that is poisoned and contaminated by the culture is thrown out of the system. It is thrown out of your system and then that consciousness or life or whatever you want to call it expresses itself and functions in a very natural way. The whole thing has to be thrown out of your system.