Saturday, 28 July 2012

Real problem is solution

పరిష్కారమే నిజమైన సమస్య . అందువల్లే నీ సమస్యలన్నీ కొనసాగుతుంటాయి. ఎందుకంటే తప్పుడు పరిష్కారాలను నీవు కనుగొన్నావు . అక్కడ సమాధానాలు లేకపోతే ప్రశ్నలే ఉండవు .అవి ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ప్రశ్నలు, సమాధానాలు కలిసి ప్రయాణిస్తుంటాయి. ఆ సమాధానాలతో సమస్యలకు ముగింపు పలకలనుకొంటున్నావు. అందువల్ల సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి . రాజకీయ నాయకులు, మానసిక శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవాదులు ... వీరంతా మనముందుంచిన పరిష్కారాలు నిజానికి పరిష్కారాలు కాదు. బాగా ధ్యానం చేయాలని, సాధన చేయాలని, బాగా కష్టపడాలని ప్రోత్సహిస్తుంటారు, ప్రేరణ కలిగిస్తుంటారు. ఇదంతా హింస. నీ నెత్తి మీద కూర్చొని పదే,  పదే చేయిస్తుంటారు. నీ ఆశను, భయాన్ని పక్కకు తోసేయగల్గితే, వారిని కేవలం వ్యాపారస్తులుగా చూడగలిగితే వాళ్ళు ఎప్పటికీ ఈ సరుకును నీ దగ్గర దిగుమతి చేయరు.కానీ ఈ ప్రవీణులు ఇచ్చే బోగస్ సరుకును నీవు పదే, పదే కోరుకుంటావు. నిజానికి అక్కడ సమస్యలు లేవు.అక్కడ కేవలం పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏ మాత్రం పని చేయవని చెప్పే ధైర్యం మనకు లేదు. అవి పని చేయవని కనుగొన్నా సెంటిమెంటు రంగం లోకి వస్తుంది. అతనిమీద నమ్మకం, విశ్వాసం వల్ల అతన్ని తోసేయ లేవు. పరిష్కరాలే సమస్య. నిజానికి అక్కడ సమస్యలు లేవు. నిజమైన సమాధానాలుగా మనం అంగీకరించిన పరిష్కారాల నుంచే ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సమాధానాలు ముగిసిపోవడంతోనే   ప్రశ్నలకు ఒక సమాధానం వస్తుంది. ఒక సమాధానంపోతే మిగతా సమాధానాలు వెళ్ళిపోతాయి.

అందం Beauty

అందం అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది?వస్తువులో ఉందా ?చూసే కళ్లల్లో ఉందా ?నీవు చుసే వస్తువు పైకి అందంఫై  నీ కున్న  భావనను ప్రసరింప జేస్తున్నావు. అంతే. అక్కడ సూర్యోదయం అందంగా ఉంది అని నీకు నీవు అనుకున్న క్షణంలో నీవు సన్ సెట్ ను చూడడంలేదని అర్థం . అందం అనేది వస్తువులో లేదు. అది చూసే కళ్ళకు సంబంధించింది కూడా కాదు.ఇదంతా నిన్ను నీవు పూర్తిగా పరిత్యజించడం.అందువల్ల అందం అంటే ఏమిటి ? నిజంగా నీకు తెలియదు.నీవు ఏమి చూస్తున్నావో నీకు తెలియదు. ఆ స్థితిలో నీకు ఏమీ తెలియదు.నీవు అందం అని పిలవవచ్చు.కానీ అది అందం అని దాన్ని నేను ఆనందిస్తున్నానని  ఎవరూ చెప్పలేరు.నిజానికి సూర్యోదయాన్ని చూసే మార్గం లేదు . నీవు దాన్నించి విడిగా లేవు .ఎప్పుడయితే నీవు సూర్యోదయం నుంచి విడిపోయావో ఆ క్షణంలో నీలో కవి బయటకు వస్తాడు. కవులు ,చిత్రకారులు ఇలా విడిపోయి వారికి వారు వ్యక్తీకరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఇదే సంస్కృతి, నాగరికత .

నైతికత (MORALITY)

 నైతికత అంటే ఏమిటి ? ప్రవర్తనకు సంబంధించిన మార్గదర్శక త్వాలను అనుసరిస్తూ ఆనందించడం  కాదు. హింస, తృష్ణ, కోరిక, ఆశ, కోపం, ద్వేషాన్ని జయించడం కాదు.లేదా భావోద్వేగాలకు అతీతంగా నిలబడటం అనే ప్రశ్న కాదు .నీ చర్యలకు ముందూ వెనుకా ప్రశ్నించడం నుంచి నైతిక సమస్య వస్తుంది. మంచికి ,చెడుకి మధ్య బేధాన్ని తెలిపే బుద్ది ఈ పరిస్థితికి కారణం. నీ చర్ర్యలన్నీ ఈ ప్రభావంతో ఉంటాయి. జీవితమంటే కర్మ.(చర్య ). నీ చర్యలను ప్రశ్నించక పోవడమే నైతికత. నీ చర్యలను ప్రశ్నించడమంటే  జీవి వ్యక్తికరణను ధ్వంసం చేయడమే.ఎవరిలోనైతే ఆలోచన రక్షణ లేకుండా జీవి వ్యక్తీకరణ దానంతట అది వస్తుందో అక్కడ కాపాడటానికి సెల్ఫ్ ఉండదు .అప్పుడు అతనికి అబద్దం చెప్పడం , మోసం చేయడం, లేదా ఇతరులకు హాని చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది.అతని సమాజం  దీన్ని అనైతికతగా భావిస్తోంది. నా దృష్టిలో నైతికత అంటే నీ చర్యలను ముందూ వెనుకా ప్రశ్నించడం.ఇదంతా సామజిక అంశం.సమాజం సజావుగా నడవడానికి ఈ నిబంధన అవసరం . ఈ ఆధ్యాత్మిక వాదులు నీ లోపల ఒక  పొలీస్  మాన్ ను సృష్టించారు. నీవు చేసే పనులకు ముందూ వెనుకా కొన్ని చర్యలు మంచివి కొన్ని చర్యలు చెడ్డవి అని నిర్దేశితమయ్యాయి.  ఇది నీకు ఏ మాత్రం సహాయం చేయదు .ఆలోచిస్తుండడం సమస్యలనుసృష్టిస్తుంది .మనిషి ప్రధాన సమస్య నైతిక సంశయం.నీ చర్యలకు ముందూ వెనుకా ప్రశ్నించాల్సి రావడం .ఇది నాడీ సంబంధమైన సమస్య .నీ నమ్మకాలన్నీ కేవలం మనసికమైనవి కాదు .నాడీ వ్యాధికి సంబంధమైనవి .ఏది మంచిదో నీకు తెలియదు.నీకేది మంచిదో అదే నీకు తెలుసు .దాని మీదే నీ ఆసక్తి అంతా .మొత్తం దీని చుట్టూనే కేంద్రీకృత మై ఉంటుంది. మొత్తం నీ కళాత్మకత,  నీ జ్ఞాన కేంద్రాలన్నీ దీని చుట్టూనే ఉంటాయి


నైతిక మనిషి ఒక కోడి పిల్ల . భయపెట్టే మనిషి . పిరికివాడు.అందువల్లే నైతికతను  సాధన చేస్తుంటాడు. కూర్చొని ఇతరులకు తీర్పులు చెబుతుంటాడు. నిజంగా నైతికత ఉన్న మనిషి ఎప్పుడూ ఎవరికీ నీతులు  చెప్పడు. కూర్చొని ఇతరులకు నైతికతపై  తీర్పులు చెప్పడు. మనిషి ఎప్పుడూ స్వార్థపరుడు. నిస్వర్థాన్ని ఎంతో విలువైనదిగా సాధన చేస్తూ  తిరిగి స్వార్థ పరుడిగా కొనసాగుతుంటాడు.తాత్కాలిక  సంతోషాలకు నీవు అలవాటు పడ్డావు. దానంతటికి నేను వ్యతిరేకం కాదు.

Saturday, 21 July 2012

Music, Poetry, Artists-2

ఆర్టిస్ట్  అంటూ  ఎవరూ  ఉండరు . అతను కేవలం టేక్నీషియన్.   అతడు లేదా ఆమె  చిత్రకళ చిట్కాలు తేలుసుకుంటారు . కార్పెంటర్లు, తాపీ పని వాళ్ళ కు  మల్లే వీరు శిల్పులు, నిపుణులు . క్రాఫ్ట్ కంటే ఉన్నతస్థానాన్ని కళకు ఎందుకు  కల్పిస్తారు. కళాకారుడి సృష్టికి మార్కెట్  లేకపొతే అతను  ఆ వ్యాపారంలో ఉండదు.ఈ సో కాల్డ్  అర్తిస్స్టు ల నమ్మకాలకు మార్కెట్టే  ప్రధాన కారణం .ఇతర క్రాఫ్ట్ మెన్ లా  కళాకారుడు కూడా ఒక క్రాఫ్ట్ మాన్ .తన వ్యక్తీ కరణకు ఆ  పనిముట్టునే ఉపయోగిస్తాడు . మొత్తం మానవ సృజనంతా సునిసితత్వం నుంచే సృష్టి అవుతుంది.మొత్తం కళ అంతా ఒక సంతోష క్షణం. అది (సంతోషం) కూడా నీచే సృష్టి ఆవుతుంది .లేకపొతే అందం, ఆర్ట్ గురించి మాట్లాడడానికి, ప్రశంసించడానికి మార్గం  లేదు. వాళ్ల సృష్టిని నీవు ప్రశ్నిస్తే వాళ్లు ఫీలవుతారు .నీకు టేస్టు తెలియదనుకుంటారు . వారి కళను ఎలా ప్రశంసించాలో తెలుసుకోవడానికి స్కులుకెల్లి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటారు. సోకాల్డ్ గ్రేట్ పొయిట్ రాసిన పోయంను నీవు ఎంజాయ్ చేయ లేక పోతే ఆ కవితను ప్రశంసించేట్లు నిన్ను బలవంతంగా ఎడ్యుకేట్ చేస్తారు.విద్యా సంస్థల్లో ఇదంతా వాళ్ళు చేస్తుంటారు.అందాన్ని, చిత్రకళను ఎలా ఆస్వాదించాలో మనకు బోధిస్తుంటారు. సృజనాత్మకరాజకీయాలు, సృజనాత్మక   భావాలు , సృజనాత్మక కళ  ఇలా ప్రతిదాన్ని తాము క్రిఏటివుగా ఆలోచిస్తామనుకుంటూ అన్వేషణలో ఓదార్పు పొందుతుంటారు.నిజానికి వారిలో ఏ మాత్రం సృజనాత్మకత ఉండదు.వారు ఎమి  చేసినా అందులో  ఒరిజినాలిటి,తాజాదనం స్వేచ్చా ఉండదు. ఆర్టిస్టులు అక్కడో, ఇక్కడో తీసుకుని దాన్ని కలబోసి ఏదో కొత్త  అద్బుతాన్ని సృష్టిస్తున్నట్లు భావిస్తుంటారు. ఆల్ రెడీ అక్కడ ఉన్నదాన్ని వాళ్ళందరూ అనుసరిస్తుంటారు. అనుకరణ శైలే మనకున్న క్రియేటివిటి. మనం వెళ్ళిన స్కూలు ,మనం నేర్చుకున్న భాష ,మనం చదివిన పుస్తకాలు, ఎదుర్కొన్న పరీక్షలు ...ఈ నేపధ్యం నుంచి మనకొక శైలి ఏర్పడుతుంది. ఇలా శైలి టెక్నిక్ అక్కడ నడుస్తుంటుంది.