సృజనాత్మకత కాదు ప్రతిదీ అనుకరణే
(“You define creativity to comfort yourself”
"Creativity is imitation. What’s new is only what breaks free of all models—and even that cannot be repeated. True creativity ends where it begins.” U.G.Krishnamurti)
—----’----------------------------------
యు.జి. కృష్ణమూర్తి ఆలోచనలు సృజనాత్మకత అనే భావనను లోతుగా ప్రశ్నిస్తాయి. ఆయన దృష్టిలో, “సృజనాత్మకత అనేది కేవలం అనుకరణ మాత్రమే—అది గత అనుభవాలు, శిక్షణ, మార్కెట్ అవసరాలు, శైలుల కలయిక. నిజమైన కొత్తదనం అంటే ఎలాంటి మోడల్‌ను అనుసరించకుండా పుట్టినది మాత్రమే, కానీ అలాంటిది దాదాపు అసాధ్యం.
మీకు మీరు ఓదార్చుకోవడానికి సృజనాత్మకతను నిర్వచిస్తారు. కొత్తదనం అనేది అన్ని నమూనాల నుంచి విముక్తి పొందినది మాత్రమే – అది కూడా పునరావృతం కాదు. నిజమైన సృష్టి (సృజనాత్మకత) ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది”అంటారు
—-------------------
*‘క్రియేటివిటీ’ అనేది ఒక మానవ నిర్మిత భ్రమ
*కళాకారులు కూడా కార్పెంటర్లు, తాపీ పని వాళ్లలా శిల్పులు, నిపుణులు
*నైపుణ్యాన్ని అమ్ముకునే వ్యాపారులు
—---------------
-కళాకారులు మేధావులు కారు. వారు శిక్షణ పొందిన కార్మికులు. వారికి మర్కెట్ ఉంటే మాస్టర్స్, లేకపోతే మిగతావాళ్లే.”
-ప్రతి కళాకృతిలో కొత్తదనం కనిపించినా… అది వేరే ఎక్కడో మొదలైన అనుకరణే!”
-దేన్ని స్వతంత్రంగా సృష్టించం. మనం విన్నదాన్ని, చూసినదాన్ని, మన ఊహల కరచాలనాలతో మళ్ళీ తయారు చేస్తాం.
-మీరు సృష్టించారా, లేక గతం మీ ద్వారా మరోసారి రూపం దాల్చిందా?”
-"నిజంగా మీరు కలను సృష్టిస్తున్నారా?
లేదా మీ చదువు, పరిసరాల అనుకరణలో ఇంకో కల నెరవేరుస్తున్నారా?”
-ప్రకృతిలో ఏదీ నమూనా ఆధారంగా తయారవదు. ప్రతి దాంట్లోనూ ప్రత్యేకత ఉంది. మనం మాత్రం అంతా ఓ మూసలో పొదుగుతాం. దాన్నే కళ అని చెప్పుకుంటాం!”
-మనలో అసంతృప్తి, ఒత్తిడి, ఒంటరితనం – ఇవన్నీ కలిస్తే బయటికి వస్తుంది ఓ పాట, ఓ శిల్పం, ఓ నవల.
మనం భావించే సృజనాత్మకత కూడా. కళ అనేది ఒక విచిత్ర ఆత్మరక్షణ చర్య.
-మన కళ్ళకు కనబడే కళ, మనసుకు నచ్చే సంగీతం – ఇవన్నీ మనకు నేర్పించిన అభిరుచుల ఫలితం.
“ఒక పద్యం మీ మనసును తాకిందంటే, అది మీ శిక్షణ తాకింది. మీ మనసు కాదు.”
"మీరు నిజంగా సృష్టిస్తున్నారా?"
—---------
మీరు గీసిన బొమ్మ, మీరు పాడిన పాట, మీరు రాసిన పద్యం — అవి నిజంగా మీ సృష్టియేనా? లేకపోతే అవి ఎప్పుడో ఎక్కడో విన్న, చూసిన, నేర్చుకున్న అనుభవాల సమ్మేళనమేనా? సృజన అనేది కొత్తదనమా? లేక శైలుల, భావాల అనుభవాల కలయకేనా? ఇది కళా ప్రపంచాన్ని కదిలించే ప్రశ్న.
కళకు అపార గౌరవం ఇచ్చే ఈ యుగంలో, ఒక ప్రత్యేక స్వరం — యూజీ కృష్ణమూర్తి. “సృజనాత్మకత అనే పదానికే అర్థం లేదు! అంటారు. ప్రతి శిల్పం, పాట, బొమ్మ, పద్యం — ఇవన్నీ మనం చూసినదాన్నే మరో రూపంలో మళ్ళీ ప్రతిబింబించడం కాదు? "Creativity is imitation”". ఈ ఒక్క వాక్యం, మన లోలోపల ఓ నిశ్శబ్ద విస్ఫోటంలా కదలికలు రేపుతుంది.
మనది అనుకున్న కల… నిజానికి ఎవరి ప్రతిబింబం?
ఆ ప్రశ్న చిన్న శబ్దం కాదు – మన మౌనాన్ని తడిమే మేధో తరంగం. – "ఇది నా సృష్టి" అనడంలో ఆనందం ఉంది — కానీ అది నిజమా? ప్రశ్నించడం భయాన్ని కలిగిస్తుందేమో... కానీ దాన్లోనే కొత్త చూపు ఉంది. మన దృష్టికి కొత్త కిటికీ తెరుచుకుంటుంది. ఈ వ్యాసం — అలాంటి కిటికీ. ఈ వ్యాసం...ఆ దూరాన్ని తొలిగించే కంటి కాంతి." ఇక సృజనాత్మకతపై యూజీ ఏమంటారంటే…
—------
“ఆర్టిస్ట్ అంటూ ఎవరూ ఉండరు . అతను కేవలం టేక్నీషియన్. అతడు లేదా ఆమె చిత్రకళ చిట్కాలు తేలుసుకుంటారు . కార్పెంటర్లు, తాపీ పని వాళ్ళ కు మల్లే వీరు శిల్పులు, నిపుణులు . క్రాఫ్ట్ కంటే ఉన్నతస్థానాన్ని కళకు ఎందుకు కల్పిస్తారు. కళాకారుడి సృష్టికి మార్కెట్ లేకపొతే అతను ఆ వ్యాపారంలో ఉండదు. ఈ సో కాల్డ్ అర్తిస్టుల నమ్మకాలకు మార్కెట్టే ప్రధాన కారణం.
కళ లేదా సృజనాత్మకత అనేది మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. ఒక కళాకారుడి రచనకు మార్కెట్‌లో గిరాకీ లేకపోతే, అతను తన కళను కొనసాగించలేడు. అందుకే కళాకారులు తమ రచనలను "గొప్పవి"గా, "సృజనాత్మకమైనవి"గా చిత్రీకరిస్తారు. కానీ వాస్తవంలో, ఇది కేవలం వాణిజ్య లావాదేవీ మాత్రమే. కళాకారుడు, శిల్పి, సంగీతకారుడు—వీరంతా ఒక నైపుణ్యాన్ని అమ్ముకునే వ్యాపారులు మాత్రమే. కళకు విలువ కలిగించేది మార్కెట్ మాత్రమే. "కళా భావన", "అలౌకిక సృష్టి" అనే భావాలు అన్నీ మార్కెట్ శక్తులే పెంచిన మోహాలు. పెయింటింగ్ ఎక్కడ ఎగ్జిబిట్ అయ్యింది? ఎన్ని కోట్లు పడ్డాయి? ఎవరు కొనుగోలు చేశారు?
ఈ ప్రశ్నలన్నీ ఆ కళాకృతిని “మూల్యముతో” కొలుస్తాయి. అసలు అది కొత్తదా, అవసరమైనదా అన్న ప్రశ్న మిగిలిపోతుంది.
ఇతర క్రాఫ్ట్ మెన్ లా కళాకారుడు కూడా ఒక క్రాఫ్ట్ మాన్. తన వ్యక్తీ కరణకు ఆ పనిముట్టునే ఉపయోగిస్తాడు. మొత్తం మానవ సృజనంతా సునిసితత్వం నుంచే సృష్టి అవుతుంది. మొత్తం కళ అంతా ఒక సంతోష క్షణం. అది (సంతోషం) కూడా నీచే సృష్టి ఆవుతుంది. లేకపొతే అందం, ఆర్ట్ గురించి మాట్లాడడానికి, ప్రశంసించడానికి మార్గం లేదు. వాళ్ల సృష్టిని నీవు ప్రశ్నిస్తే వాళ్లు ఫీలవుతారు. నీకు టేస్టు తెలియదనుకుంటారు . వారి కళను ఎలా ప్రశంసించాలో తెలుసుకోవడానికి స్కులుకెల్లి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటారు. సోకాల్డ్ గ్రేట్ పొయిట్ రాసిన పోయంను నీవు ఎంజాయ్ చేయ లేక పోతే ఆ కవితను ప్రశంసించేట్లు నిన్ను బలవంతంగా ఎడ్యుకేట్ చేస్తారు. విద్యా సంస్థల్లో ఇదంతా వాళ్ళు చేస్తుంటారు. అందాన్ని, చిత్రకళను ఎలా ఆస్వాదించాలో మనకు బోధిస్తుంటారు. ఇది కళకే కాదు — రాజకీయాలకు, ఆధ్యాత్మికతకూ వర్తిస్తుంది.. నిజానికి. సృజనాత్మక రాజకీయాలు, సృజనాత్మక భావాలు , సృజనాత్మక కళ ఇలా ప్రతిదాన్ని తాము క్రియేటివుగా ఆలోచిస్తామనుకుంటూ అన్వేషణలో ఓదార్పు పొందుతుంటారు. నిజానికి వారిలో ఏ మాత్రం సృజనాత్మకత ఉండదు. వారు ఎమి చేసినా అందులో ఒరిజినాలిటి, తాజాదనం, స్వేచ్చా ఉండదు. ఆర్టిస్టులు అక్కడో, ఇక్కడో తీసుకుని దాన్ని కలబోసి ఏదో కొత్త అద్బుతాన్ని సృష్టిస్తున్నట్లు భావిస్తుంటారు. ఆల్ రెడీ అక్కడ ఉన్నదాన్ని వాళ్ళందరూ అనుసరిస్తుంటారు.
పాతదాన్ని కొత్త ముసుగులో తిప్పి వినిపిస్తున్నారు. దానికి అలంకారాలు చేర్చి, పేర్లు పెట్టుకుని, దానిని “సృష్టి” అని వర్ణించుకుంటాం. మనం చేసే ప్రతి సృష్టి, ప్రతి ఆలోచన, ప్రతి కళ – ఇవన్నీ గతంలో ఉన్న దాని అనుకరణలు. అనుకరణ, శైలే మనకున్న క్రియేటివిటి. మనం వెళ్ళిన స్కూలు ,మనం నేర్చుకున్న భాష ,మనం చదివిన పుస్తకాలు, ఎదుర్కొన్న పరీక్షలు ...ఈ నేపధ్యం నుంచి మనకొక శైలి ఏర్పడుతుంది. ఇలా శైలి టెక్నిక్ అక్కడ నడుస్తుంటుంది. అందులోనే కళను మల్లెమాలలా మెరుగుపరుచుకుంటారు.
కళాకారుడు కేవలం నైపుణ్యం అమ్మే వ్యాపారి
—-----------------------------------------------
“కళాకారుడంటే ఒక తాపీవాడు, కార్పెంటర్ లాంటివాడే. అతను నేర్చుకున్న నైపుణ్యాన్ని మార్కెట్‌లో అమ్ముతాడు. కళకు గొప్పతనం ఇచ్చేది మనమే—మార్కెట్ దానికి ధర నిర్ణయిస్తుంది. ఒక పెయింటింగ్ కోట్లు పలికింది, ఒక పాట హిట్ అయింది—ఇవన్నీ మార్కెట్ ఆటలే. కళ అనేది మన అసంతృప్తి, ఒంటరితనం, ఒత్తిడి నుంచి పుట్టిన ఒక రక్షణ చర్య. మనం చూసినవి, విన్నవి, నేర్చుకున్నవి—వాటిని కొత్త రూపంలో మళ్లీ చెప్పడమే కళ.”
మన సృజనాత్మకత ఒక భ్రమ
—-----------------
“మీరు ఒక కవిత రాస్తే, అది మీ హృదయం నుంచి వచ్చిందని అనుకుంటారు. కానీ ఆలోచించండి—అది మీరు చదివిన పుస్తకాలు, విన్న కథలు, చూసిన జీవితం నుంచి వచ్చిన రంగుల సమ్మేళనం కాదా? మీరు పాడిన పాట, గీసిన బొమ్మ—ఇవన్నీ మీ శిక్షణ, మీ అభిరుచుల ప్రతిబింబాలే. నిజమైన సృజనాత్మకత అంటే ఏదీ మోడల్ లేకుండా పుట్టినది. అలాంటిది మనం చేయగలమా? లేదు. మనం చేసేది అనుకరణే—కొత్త రూపంలో పాత ఆలోచనలు.”
ఈ సత్యాన్ని అంగీకరించాలి
—---------------------------
ప్రకృతి మాత్రమే నిజమైన సృష్టిని చేస్తుంది. ఎందుకంటే అది ఏ ఒక్క మోడల్‌ను అనుసరించదు. మనం, మానవులుగా, ఈ సత్యాన్ని అంగీకరించాలి. మన సృజనాత్మకత అనేది కేవలం ఒక శైలి, ఒక సాంకేతికత, ఒక అనుకరణ మాత్రమే. ఈ ఆలోచన మనల్ని కొంత అసౌకర్యంగా చేయవచ్చు, కానీ అది మనల్ని మన స్వంత ఆలోచనల గురించి లోతుగా ఆలోచించేలా చేస్తుంది. మనం నిజంగా సృజనాత్మకంగా ఉన్నామా, లేక మనం కేవలం ప్రకృతికి సంబంధించిన గొప్ప సృష్టిని అనుకరిస్తున్నామా? అనే నిశిత దృష్టిని ఇస్తుంది.
ప్రకృతి సృష్టి విభిన్నం, మానవ సృష్టి అనుకరణ!”
—------------------------------------------------
యు.జి. ప్రకృతిని ఒక గొప్ప ఉదాహరణగా చూపిస్తారు. "ప్రకృతి ఏ ఒక్క ఆకృతిని రెండుసార్లు సృష్టించదు. రెండు ముఖాలు, రెండు ఆకులు, రెండు ఇసుక రేణువులు ఎన్నటికీ ఒకేలా ఉండవు," అని ఆయన చెబుతారు. ప్రకృతి ఏ ఒక్క మోడల్‌ను అనుసరించకుండా, ప్రతి సృష్టిని పూర్తిగా విభిన్నంగా, అద్భుతంగా నిర్మిస్తుంది. ప్రకృతి ఏదీ కాపీ చేయదు. కానీ మనం మాత్రం కాపీ చేయడానికే పరిమితమయ్యాం. ఈ విభిన్నతను ఒక సాధారణ ఫ్రేమ్‌లో బిగించి, దానిని "సృజనాత్మకత" అని పిలుస్తాం.
మన కళ మన అసంతృప్తి నుంచి పుట్టింది
—------------------------‐—---------------
“ఒక కళాకృతి పుట్టడం అంటే, మనలోని ఒంటరితనం, ఆవేదన, ఒత్తిడి బయటకు వచ్చే క్షణం. మనం దాన్ని కళ అంటాం, సృజనాత్మకత అంటాం. కానీ నిజంగా అది మనం నేర్చుకున్న శైలి, మనం చూసిన జ్ఞాపకాలు, మనం అనుభవించిన భావాల కలయికే. మీ కవిత మీ మనసును తాకిందంటే, అది మీ శిక్షణను తాకింది—మీ మనసును కాదు.”
ప్రకృతిలోని వైవిధ్యం ఒక సవాలు
—--------------------------------------
ప్రకృతిలోని ఈ వైవిధ్యం మన సృజనాత్మకతకు ఒక సవాలు. మనం సృష్టించే ప్రతి దానిలో ఏదో ఒక గత రూపం, గత ఆలోచన లేదా గత అనుభవం ఉంటుంది. అందుకే, యు.జి. అంటారు, "మీరు ఒక కొత్త ఆలోచనను సృష్టించామని చెప్పినప్పుడు, మీరు దాని మూలాన్ని గుర్తించలేకపోతే, అది మీ సొంతమైనట్లు భావిస్తారు. కానీ అది నిజం కాదు.”నిజమైన సృజనాత్మకత అంటే ప్రకృతిలా ఏ నమూనా లేకుండా పుట్టడం. అలాంటి సృష్టి మనిషికి సాధ్యమా? ఇది ఒక ప్రశ్న, ఒక సవాలు.”
నిజంగా "మీ" సృష్టి అని మీరు భావిస్తారా?
—-----------------------------------------
ఒక క్షణం ఆలోచించండి... మీరు ఒక కొత్త ఆలోచనను సృష్టించినప్పుడు, ఒక అద్భుతమైన చిత్రాన్ని గీసినప్పుడు, లేదా ఒక కవితను రాసినప్పుడు, అది నిజంగా "మీ" సృష్టి అని మీరు భావిస్తారా? లేక, అది ఎక్కడో, ఎప్పుడో మీరు చూసిన, విన్న, అనుభవించిన జ్ఞాపకాల సమ్మేళనమా? సృజనాత్మకత అనేది మనం ఊహించుకున్నట్లు అంత పవిత్రమైనది, అసాధారణమైనది కాదు, అది కేవలం ఒక భ్రమ.
ఒక పాట పుట్టిందంటే, అది గత వేదనలకు శబ్దం కలిగించినప్పుడే…ఒక బొమ్మ వెలిసిందంటే, అది మన జ్ఞాపకాలకు రంగు వేసినట్టే…కళ పుట్టింది అనుకునే ప్రతి క్షణం… పాతదాన్ని మళ్లీ పలికించిన క్షణమే.
కంప్యూటర్లు.. భవిష్యత్తు
—-----------------------
యు.జి. ఒక ఆసక్తికరమైన ఊహను ముందుకు తెస్తారు: "రాబోయే రోజుల్లో, కంప్యూటర్లు మనం ఇప్పటివరకు చూసిన అందరు కళాకారులు, సంగీతకారుల కంటే గొప్ప కళను, సంగీతాన్ని సృష్టిస్తాయి." ఇది ఒక హెచ్చరిక కూడా. మానవ మేధస్సు, ఆలోచనలు, సృజనాత్మకత – ఇవన్నీ కంప్యూటర్‌లతో పోల్చినప్పుడు ఒక యంత్రం లాంటివే. మనం మనల్ని యంత్రాలుగా అంగీకరించడానికి సిద్ధంగా లేం, కానీ సత్యం అదేనని యు.జి. నొక్కి చెబుతారు. కంప్యూటర్లు ఒక రోజు మన "సృజనాత్మకత" మూలాలను బయటపెట్టగలవు. అవి మనం ఎక్కడి నుంచి ఆలోచనలను "కాపీ" చేశామో చూపించగలవు. ఇది మన సృజనాత్మకత భ్రమను ఛేదించే రోజు అవుతుంది.
ఇవన్నీ మానవ భ్రమలే
—-----------------------
మన మనస్సు ప్రతీ కొత్తదానికి ఒక ట్యాగ్ తగిలిస్తుంది – creative writing, creative thinking, creative politics...కానీ నిజంగా కొత్తదేమైనా ఉందా?. మీరు ఒక రచన రాశారు. ఒక పాట పాడారు. ఒక చిత్రాన్ని వేశారు. ఇది మీరు నిజంగా సృష్టించినదేనా?
లేదా ఎక్కడో ఎప్పుడో విన్నదాన్ని, చూసినదాన్ని, మీ ఒత్తిడిని కలిపి రూపొందించిన అనుకరణా? ఒక పాత పాట కొత్త మ్యూజిక్‌లో, ఒక కవిత కొత్త పదాల్లో… కానీ మూలం ఇదే. మనకు కళ అంటే ఎంత గౌరవం! కవిత్వం, సంగీతం, చిత్రకళ, శిల్పం… ఇవన్నీ మనలో భావోద్వేగాలను రేపే సాధనాలే. కానీ యూజీ కృష్ణమూర్తి మాటల్లో, ఇవన్నీ మానవ భ్రమలే. "సృజనాత్మకత అనే పదానికే అర్ధం లేదని చెప్పిన మానసిక విప్లవవేత్త – యూజీ. మనం చేసే ప్రతిదీ ఏదో ఒక మోడల్‌ను అనుకరించడమేనని, అసలైన క్రియేటివిటీ అంటే ఏదీ మోడల్ లేకుండా పుట్టినదే అని స్పష్టం చేస్తారు.
ఒక మానసిక విప్లవం
—----------
మనమంతా సృష్టి అని పిలుచుకునే ప్రతి చర్య, అసలు చూస్తే, అనుభవాల పునరావృతమే. శిల్పం, నృత్యం, సంగీతం, చిత్రం, సాహిత్యం — ఇవన్నీ మానవుని మునుపటి మోడల్స్‌పై ఆధారపడే శిల్పాలే.
ఈ నిజాన్ని అంగీకరించడమే నిజమైన భావవిచారణకు ప్రారంభం. ఈ నిజాన్ని అంగీకరించడమే నిజమైన ఆలోచనకు మొదటి అడుగు.”
జాతీయ, అంతర్జాతీయ కళాకారుల గొంతులోనూ అదే సత్యం. ఈ ప్రశ్న, ఈ ఆవేదన — కేవలం యూజీ దృష్టికే పరిమితమై లేదు.
పెద్దపల్లి యాదగిరిరెడ్డి నుంచి ఇళయరాజా వరకు, మల్లికా సారాభాయ్ నుంచి ఎంఎఫ్ హుస్సేన్ వరకూ, రాజమౌళి నుంచి అమృత షేర్ గిల్ వరకూ,
డేవిడ్ హాక్నీ, అనిష్ కపూర్, జరీనా హష్మి, లియో టాల్ స్టాయ్, ఎలియట్ వంటి ప్రపంచవిఖ్యాత కళాకారుల లోతైన స్వీయానుభవాల్లో కూడా అదే మాట వినిపిస్తుంది:
“మేము సృష్టించలేదు… మేము అనుభవించినదాన్ని మళ్లీ మలిచాం.”ఇదే భావం మనకు కనిపిస్తుంది.
యాదగిరి రెడ్డి (పెద్దపల్లి కళాకారుడు):
"నేను చెక్కే బొమ్మలన్నీ నా ఊర్లోని దేవుడి గోపురాల నుంచి వచ్చిన ప్రభావం. నేను ఏమీ సృష్టించలేను. నేను చెక్కేది ఒక ఫలితమే – నేర్చుకున్న పాఠాలకి.”
—------
వర్ణిక శ్రీ ( చిత్రకారిణి):
"AI నా బొమ్మలన్నిటిని మిమిక్రీ చేస్తోంది. అది నాకు భయం కాదు – గుణపాఠం. నేను అనుకున్న uniqueness అసలు లేదేమో అనిపిస్తోంది.
—--------
రాజమౌళి (సినిమా దర్శకుడు):
"చాలామంది నా సినిమాలపై 'originality' అనే మాట ఉపయోగిస్తారు. కానీ నేను ఎక్కడో చూసిన visual, పాత కథాంశం, పూరాణిక అంశాల ఆధారంగా నిర్మించాను. క్రియేటివిటీ అనేది అడ్డతీగల కలయిక”.
—----------
మల్లికా సారాభాయ్ (నాట్యకారిణి)
"భారతనాట్యం అన్నది నిశ్చితమైన నమూనాలో నడుస్తుంది. దాంట్లో మనం మన భావాలను వ్యక్తీకరించవచ్చు. కానీ కొత్తదేంటీ అనేది మళ్లీ ప్రశ్నించుకోవాల్సిందే.”
—-------
ఇళయరాజా (సంగీత దర్శకుడు)
"ఒక్కో రాగం ఒక ప్రపంచం. నేను దానిలోకి ప్రవేశించి ఆ భావాన్ని మలుస్తాను. రాగం కొత్త కాదు. నా ప్రకటన మాత్రమే కొత్త.”
—-------
గిరీష్ కర్నాడ్ (రచయిత, నటుడు)
"నా నాటకాలకు మూలాలు పురాణాలు, జానపద కథలే. ఆ పాత్రల్లోనే ఆధునికతను అన్వేషిస్తున్నాను”
—---------
రఘువీర్ యాదవ్ (నటుడు, గాయకుడు)
"ప్రతి పాట వెనుక ఒక జానపద మాడ్యులే ఉంది. దాన్ని మామూలు శ్రోతకు చేరేలా పాడుతున్నాం అంతే.
—------------
డేవిడ్ హాక్నీ (పెయింటర్)
"ప్రతి పెయింటింగ్ అనుకరణే. నేను నా తల్లి చిత్రాన్ని వేసినప్పుడు కూడా, అది నా జ్ఞాపకాలలో ఉండే ఆమె ముఖభావాల నకలే!"
—----------
అనిష్ కపూర్ (శిల్ప కళాకారుడు)
"కళ అంటే కొత్తగా ఏదైనా చెప్పడమేం కాదు. అది గతంలో అసంపూర్ణంగా మిగిలిన దాన్ని కొనసాగించడమే.”
—-------
జరీనా హష్మీ (పెయింటర్)
"నేను గీసే గీతలు పర్షియన్ మినియేచర్ కళల నుంచి వచ్చాయి. నేనవన్నీ సృష్టించట్లేదు... అవే నాలోపల నుంచి మళ్ళీ బయటికి వస్తున్నాయి.”
—----------
సుబోద్ గుప్తా (శిల్ప కళాకారుడు)
"నా పనిలో ఎక్కువ భాగం జ్ఞాపకాల నుంచే వస్తుంది – నా ఊరిలోని పాత్రలు, నా గతం. కానీ నేను వాటిని సృష్టించానని చెప్పలేను... నేను కేవలం మళ్లీ నిర్మించాను.”
—--------
మల్లికా సారాభాయి (నృత్యకారిణి)
“శాస్త్రీయ నృత్యం అనేది ఒక నిర్దిష్ట నమూనా – ఇందులో కొత్తదనం అనేది భావప్రకటనతో పరిమితం. నేను నృత్యరూపకాలు రూపొందిస్తాను కానీ ఏదీ కొత్తగా సృష్టించానని నాకు అనిపించదు”
—------
త్యాగరాజ – భక్తి, సంగీతం,
త్యాగరాజ నిత్యము రాముడి స్థుతిని పాటలుగా రాశాడు. అతని సంగీతం చాలా భాగం కర్ణాటక సంగీత పద్ధతులపై ఆధారపడింది. స్వయంగా త్యాగరాజ గారి సంకీర్తనలు కూడా తాను శ్రవించిన కథల, పురాణాల మీద ఆధారపడినవి.
యూజీ దృక్కోణం ప్రకారం
త్యాగరాజ గానం “సృష్టి” కాదు… అది వ్యక్తిగత భక్తి భావనకు రూపం. ఆ భావనలూ ఇతరుల నుంచి వచ్చినవే. అందుకే అది కూడా మానసిక pleasure movement.
—---------
నందలాల్ బోస్ (పెయింటర్)
అజంతా ప్రభావంతో నిర్మిత కళ. నందలాల్ బోస్ 20వ శతాబ్ద భారత కళా ఉద్యమానికి పితామహుడు. ఆయన ఎక్కువగా అజంతా గుహల చిత్రాలు, జాపనీస్ బ్రష్ ఆర్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభావం ఆధారంగా కళా శైలి అభివృద్ధి చేసాడు.
—------
వేమన పద్యాలు
జ్ఞానం, కానీ కొత్తగా ఏమిలేదు. వేమన పద్యాలు సామాజిక విమర్శ, తత్వజ్ఞానం, బౌద్ధ ధర్మం, లోకజ్ఞానం కలయిక. అయితే అతని పద్యాలలోని ధర్మబోధ, జీవన సత్యాలు శతాబ్దాలుగా చెప్పిన విషయాల రూపమే.
—------
రవివర్మ (చిత్రకళ)
పాశ్చాత్య టెక్నిక్‌లో భారతీయ మోథాలజీ
అతడు నూతనత చూపించినట్లు అనిపించినా, పశ్చాత్య న్యూడ్ బాడీ ప్రొపోర్షన్లను మన భారతీయ దేవతలకు అప్లై చేశాడు. ఇది ఒక సాంకేతిక కలయిక, కాకపోతే కొత్త సృష్టి కాదు.
—----------
రవీంద్రనాథ్ ఠాగూర్ (రచయిత, చిత్రకారుడు)
రచనల్లో యూరోపియన్ రొమాంటిసిజం, ఉపనిషత్తుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. చిత్రకళలో modernism + tribal art influence కూడా ఉంది.
యూజీ దృష్టిలో:
ఆత్మవిమర్శగా కనిపించిన టాగోర్ రచన, అసలు సాంప్రదాయ భాషా శైలులకు మరొక రూపమే.
—----
సత్యజిత్ రే: (సినిమా దర్శకుడు)
అతని "Pather Panchali" చిత్రానికి Vittorio De Sica “Bicycle Thieves” ప్రభావం ఉన్నట్లు చెబుతారు. వాస్తవిక సినిమాల శైలి (Italian Neorealism) ఆధారంగా చిత్రీకరణ.
తన సంగీతం, టైటిల్ డిజైన్ కూడా పాశ్చాత్య శిక్షణల ఆధారమే.
—----
అమృత షేర్ గిల్ (చిత్రకారిణి)
ప్యారిస్ లో ఆర్ట్ శిక్షణ, పాశ్చాత్య శరీరాల తీరు, భవనాల నిర్మాణాల్లో Fauvism, Impressionism ప్రభావం. భారతీయ గ్రామీణ జీవితాన్ని చిత్రించినా – పాశ్చాత్య త్రీ-డైమెన్షనల్ ఫ్రేమింగ్ వాడింది.
ఆమె కళ భారతీయ విషయంపై పాశ్చాత్య శైలీ అద్దం. కొత్తగా కనిపించినా, అంతర్గతంగా అనుకరణే.
—-------
రవిశంకర్ (సంగీతకారుడు)
భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసినవాడు. Beatlesతో కలిసి పని చేసాడు. తన సంగీతాన్ని Western classical structure లో అనుసంధానించాడు.
—----
యూజీ దృష్టిలో:
సంగీతం అనేది spontaneous instrument కాదు – అది అభ్యాస, అభిరుచి, శిక్షణ ఆధారిత ప్రదర్శన.
—-----
ఎం.ఎస్ హుస్సేన్ (చిత్రకారుడు)
Picasso ప్రభావం. మార్కెట్ & మీడియా ద్వారా సంచలనంగా మారాయి. శైలిలో స్పష్టమైన Cubism, Expressionism ఉంది. అసలైన “originality” కాక, స్టైల్, వివాదం, మార్కెటింగ్ కలయిక Husain ప్రత్యేకతగా నిలిచింది.
—---
ఎంఎస్ సుబ్బలక్ష్మి(గాయని)
కర్ణాటక సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.
గీతాలు సాంప్రదాయ బజనలే, కానీ ఆమె delivery వల్ల కొత్తతనంగా అనిపించింది. గానం అంటే నోటి స్వరం కాదు – అది శ్వాస, శాస్త్రం, సాధన.
—--------
టైబ్ మెహతా (చిత్రకారుడు)
Partition, వలస బాధలు వంటి అంశాలు తీసుకున్నా, అతని చిత్రం Francis Bacon శైలి ఆధారితంగా ఉంది. minimalist expressionist cubism.
బెంగళూరు ఆర్ట్ మార్కెట్‌లో అతని చిత్రాలు అత్యధిక ధరకు అమ్ముడయ్యాయి. మానవ బాధను చూపించే శైలి కూడా ప్రేరణ ఆధారితమే. “Creative breakthrough” అనేది మార్కెట్ వినియోగంగా మారింది.
—------
రుక్మిణి దేవి అరుండేల్ (భారతనాట్యం పునరుజ్జీవకురాలు)
భారతనాట్యాన్ని బ్రాహ్మణీ సంస్కృతిలోకి తిరిగి చేర్చింది. అసలు ఇది దేవదాసీ సంప్రదాయంగా పుట్టింది.ఆమె "నాట్యం" రూపాన్ని శుద్ధ శైలీకృత నాట్యంగా మార్చింది.
—---------
నీల్ గైమాన్ (ఆంగ్ల రచయిత)
సృష్టి అనేది అనుకరణప్రక్రియలో ఉత్పన్నం
—-----
స్టీఫెన్ కింగ్
"సృష్టికి ముందు అనుకరణ వచ్చేది.” అనుకరణకే ప్రాధాన్యం
—-----
టి.ఎస్. ఎలియట్ (కవి, తాత్వికుడు)
అనుకరణను స్వంతంగా మార్చడం – క్రియేటివిటీ అన్నదీ కాదు
—--------
నీల్ రిచర్డ్ గైమాన్ (ఆంగ్ల రచయిత)
“Life imitates art మన జీవితం కూడా ప్రతిబింబమే, పూర్తిగా స్వతంత్రం కాదు.
నిజమైన మానసిక విప్లవం.
—-------------------------------
యు.జి. కృష్ణమూర్తి ఈ ఆలోచన మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది. సృజనాత్మకత అనేది మనం ఊహించుకున్నట్లు పవిత్రమైనది కాదు—అది మన గతం, శిక్షణ, అనుభవాల సమ్మేళనం. ప్రకృతి లాంటి నిజమైన సృష్టి మనిషికి సాధ్యం కాదు. మనం చేసేది పాతదాన్ని కొత్త రూపంలో చూపడమే. ఈ సత్యాన్ని అంగీకరించడం కష్టమైనా, అది మన ఆలోచనలకు కొత్త కిటికీ తెరుస్తుంది. మన కళ, మన సృజనాత్మకత—అవన్నీ మన భావోద్వేగాలు, జ్ఞాపకాలు, శైలుల ప్రతిబింబాలే. ఈ నిజాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన మానసిక విప్లవం.
యుగప్రవాహాన్ని ప్రశ్నించిన యూజీ కృష్ణమూర్తి
—------------------------------------------------
భారతీయ కళాకారుల్లో ‘కొత్త’ అనిపించిన ప్రతి ప్రయత్నం కూడా పాతదాన్ని కొత్త రేకులలో ప్రదర్శించడమే. దీనికి ఆధారమైనది – అనుభవం, శిక్షణ, మార్కెట్ అవసరం, భావోద్వేగ ప్రదర్శన.
"కళాకారుడు నిజంగా కొత్తదాన్ని సృష్టిస్తాడా?"
"లేక పాత రూపాలకు కొత్త రంగులు వేసే పనిదారుడేనా?” ఈ ప్రశ్నలన్నీ ఏవో తరగతి గదుల్లో పుట్టే తాత్విక సందేహాలు కాదు. ఇవి యుగప్రవాహాన్ని ప్రశ్నించిన యూజీ కృష్ణమూర్తి గారి కోణంలో వచ్చి సందేహాలు.